
తమిళ చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లలో అజిత్ కుమార్ ఒకరు. సూపర్‌హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ కింగ్ అయినప్పటికీ, చిత్రపరిశ్రమలో అతను ఎంతో వినయపూర్వకంగా ఉంటూ డౌన్ టు ఎర్త్‌గా పేరు పొందాడు. అయితే, అజిత్ అలాంటివాడేమి కాదంటూ.. నిర్మాత మాణికం నారాయణన్ ఆరోపిస్తున్నాడు. తన వద్ద డబ్బు తీసుకుని ఇప్పటికి కూడా తిరిగి ఇవ్వలేదని, అతనో మోసగాడని ఆరోపించాడు.
(ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?)
నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ అజిత్ కుమార్ తనను మోసం చేశారని మండిపడ్డారు. 'అజిత్ తన తల్లిదండ్రులను సెలవుపై మలేషియాకు పంపాలని చాలా సంవత్సరాల క్రితం నా నుంచి డబ్బు తీసుకున్నాడు. అప్పట్లో అతను నా కోసం ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. రెమ్యునరేషన్‌లో ఆ డబ్బును సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చాడు. అయితే, ఈ రోజు వరకు కూడా అతను డబ్బు తిరిగి ఇవ్వలేదు. అంతే కాకుండా నాకు సినిమా చేయలేదు. ఇన్నేళ్లలో అతను దీని గురించే మాట్లాడటం మానేశాడు. అతను తనను తాను పెద్దమనిషిగా అనకుంటాడు కానీ అది నిజం కాదు.' అని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు అతనొక టాప్ హీరో ప్రతి చిత్రానికి రూ. 50కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు. కాబట్టి తనకు రావాల్సిన డబ్బు చెల్లించవచ్చు కదా అని నిర్మాత మాణికం ఫైర్ అవుతున్నాడు. తనతో పాటు ఏఎమ్ రత్నం వంటి నిర్మాతలు కూడా అజిత్ చిత్రాలను నిర్మించడంతో భారీగా నష్టాలను చవిచూశామని. ఇప్పటి వరకు నష్టపోయిన నిర్మాతలకు సహాయం కూడా చేయలేదని ఆయన పంచుకున్నారు.
గతంలోనే ఆరోపణ
హీరో అజిత్‌కు 1996లో మొదట రూ.6లక్షలు, 1998లో మరోసారి రూ.12 లక్షలు ఇచ్చానని నిర్మాత మాణికం నారాయణన్ గతంలోనే ఆరోపించారు. తాజాగా ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. గతంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. నిర్మాత మాణికం కుతురు పెళ్లికి కొన్ని కారణాల వల్ల అజిత్ రాలేదని అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ప్రస్తుతం అజిత్ తన 60వ ప్రాజెక్ట్ 'వలిమాయి'తో బిజీగా ఉన్నాడు.
(ఇదీ చదవండి: యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..)
Comments
Please login to add a commentAdd a comment