prodatur
-
అజిత్ 'మోసగాడు' అంటూ సీరియస్ అయిన నిర్మాత
తమిళ చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో అజిత్ కుమార్ ఒకరు. సూపర్‌హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ కింగ్ అయినప్పటికీ, చిత్రపరిశ్రమలో అతను ఎంతో వినయపూర్వకంగా ఉంటూ డౌన్ టు ఎర్త్‌గా పేరు పొందాడు. అయితే, అజిత్ అలాంటివాడేమి కాదంటూ.. నిర్మాత మాణికం నారాయణన్ ఆరోపిస్తున్నాడు. తన వద్ద డబ్బు తీసుకుని ఇప్పటికి కూడా తిరిగి ఇవ్వలేదని, అతనో మోసగాడని ఆరోపించాడు. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ అజిత్ కుమార్ తనను మోసం చేశారని మండిపడ్డారు. 'అజిత్ తన తల్లిదండ్రులను సెలవుపై మలేషియాకు పంపాలని చాలా సంవత్సరాల క్రితం నా నుంచి డబ్బు తీసుకున్నాడు. అప్పట్లో అతను నా కోసం ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. రెమ్యునరేషన్లో ఆ డబ్బును సర్దుబాటు చేస్తానని మాట ఇచ్చాడు. అయితే, ఈ రోజు వరకు కూడా అతను డబ్బు తిరిగి ఇవ్వలేదు. అంతే కాకుండా నాకు సినిమా చేయలేదు. ఇన్నేళ్లలో అతను దీని గురించే మాట్లాడటం మానేశాడు. అతను తనను తాను పెద్దమనిషిగా అనకుంటాడు కానీ అది నిజం కాదు.' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అతనొక టాప్ హీరో ప్రతి చిత్రానికి రూ. 50కోట్లకు పైగానే సంపాదిస్తున్నాడు. కాబట్టి తనకు రావాల్సిన డబ్బు చెల్లించవచ్చు కదా అని నిర్మాత మాణికం ఫైర్ అవుతున్నాడు. తనతో పాటు ఏఎమ్ రత్నం వంటి నిర్మాతలు కూడా అజిత్ చిత్రాలను నిర్మించడంతో భారీగా నష్టాలను చవిచూశామని. ఇప్పటి వరకు నష్టపోయిన నిర్మాతలకు సహాయం కూడా చేయలేదని ఆయన పంచుకున్నారు. గతంలోనే ఆరోపణ హీరో అజిత్‌కు 1996లో మొదట రూ.6లక్షలు, 1998లో మరోసారి రూ.12 లక్షలు ఇచ్చానని నిర్మాత మాణికం నారాయణన్ గతంలోనే ఆరోపించారు. తాజాగా ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాడు. గతంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. నిర్మాత మాణికం కుతురు పెళ్లికి కొన్ని కారణాల వల్ల అజిత్ రాలేదని అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ప్రస్తుతం అజిత్ తన 60వ ప్రాజెక్ట్ 'వలిమాయి'తో బిజీగా ఉన్నాడు. (ఇదీ చదవండి: యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..) -
మహిళల హత్య కేసులో.. ఇద్దరి అరెస్ట్
కడప అర్బన్ : ప్రొద్దుటూరు పట్టణంలో 2013లో సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసుల్లో ఇద్దరు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం గ్రామానికి చెందిన పఠాన్ అబ్దుల్ కలాం గతంలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇతని స్నేహితుడైన ప్రొదుటూరు మండలం ఖాదర్‌బాద్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గౌస్‌లాజం, ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన స్వర్ణకారుడు ఇషాక్‌లతో కలిసి ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని వారిని హతమార్చి దోపిడీకి పాల్పడేవారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు పట్టణం శ్రీరాంనగర్‌లో 2013లో నాలుగు నెలల వ్యవధిలో ముగ్గురు మహిళలను నిర్దాక్షిణ్యంగా గొంతు నులిమి చంపి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకుని మృతదేహాలను ఆనవాలు లేకుండా దూరంగా తీసుకుని వెళ్లి కాల్చేశారు. ♦ శ్రీరాంనగర్‌కు చెందిన భీమనపల్లె లక్ష్మిదేవిని 2013 ఫిబ్రవరి 26న దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ఆటోలో తీసుకుని వెళ్లి, ఆర్టీపిపి– సిరిగేపల్లి రోడ్డులో పెట్రోలు పోసి తగులబెట్టారు. ♦ అదే సంవత్సరం ఏప్రిల్ 30న దొరసానిపల్లె రోడ్డులో ఉన్న మేరువ శారదను దారుణంగా హత్య చేసి, బంగారు ఆభరణాలు దోచుకుని గోనెసంచిలో మృతదేహాన్ని మూటగట్టి ఆటోలో కమ్మవారిపల్లె– తాడిపత్రి రోడ్డు వరకు తీసుకుని వెళ్లి, పెట్రోల్ పోసి కాల్చివేశారు. ♦ 2013 జూన్ 2న శ్రీరాంనగర్‌కు చెందిన గొంటిముక్కల సుబ్బరంగమ్మను అదే పద్ధతిలో దారుణంగా హత్య చేసి, దగ్గరలోని మురికి కాల్వలో పడేశారు. వీరు ఇంతేగాక పలు దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడ్డారు. 2008లో కడప నగరం బాలాజీ నగర్‌కు చెందిన మునెమ్మను దారుణంగా హత్య చేసి, బంగారు నగలను కాజేశారు. పెండ్లిమర్రి ఎస్ఐ ఎస్కె రోషన్, కడప అర్బన్ సిఐ దారెడ్డి భాస్కర్ రెడ్డి, కడప డీఎస్పీ షేక్ మాసుంబాషాలు తమ సిబ్బందితో ఏడు నెలల పాటు కష్టపడి దర్యాప్తు చేసి వీరిని అరెస్టు చేశారు. కాగా మరో నిందితుడు ఇషాక్ ఓ చోరీ కేసులో ఇప్పటికే కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ, సిఐ, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. -
పసిడి పరిమళాలు పుస్తకావిష్కరణ
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక కృష్ణాలయంలో ప్రొద్దుటూరుకు చెందిన 25 మంది కవులు రచించిన కవితా సంపుటి ‘పసిడి పరిమళాలు’ పుస్తకాన్ని రచయిత జింకా సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న కవితా ప్రక్రియలతో కవులు రచనలు చేశారని ఆయన తెలిపారు. కవులకు, కళాకారులకు పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణానికి పేరు గుర్తుండేలా పసిడి పరిమళాలు అని పేరు పెట్టినట్లు చెప్పారు. గొంటుముక్కల గోవిందు, కొత్తపల్లి శీను, భుక్యా గోపాల్ నాయక్, డాక్టర్ రాచంరెడ్డి గోపాల్‌రెడ్డి, కాశీవరపు వెంకటసుబ్బయ్య, పవన్ కిశోర్‌రాజు, భాస్కర్‌రాజు, పద్మావతమ్మ, మొగిలిచెండు సురేష్, ఆవుల శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి, చదువుల బాబు, పల్లా కృష్ణా, దుర్గాభవాని, గోపినాథ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.