
పసిడి పరిమళాలు పుస్తకావిష్కరణ
ప్రొద్దుటూరు కల్చరల్:
స్థానిక కృష్ణాలయంలో ప్రొద్దుటూరుకు చెందిన 25 మంది కవులు రచించిన కవితా సంపుటి ‘పసిడి పరిమళాలు’ పుస్తకాన్ని రచయిత జింకా సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న కవితా ప్రక్రియలతో కవులు రచనలు చేశారని ఆయన తెలిపారు. కవులకు, కళాకారులకు పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణానికి పేరు గుర్తుండేలా పసిడి పరిమళాలు అని పేరు పెట్టినట్లు చెప్పారు. గొంటుముక్కల గోవిందు, కొత్తపల్లి శీను, భుక్యా గోపాల్ నాయక్, డాక్టర్ రాచంరెడ్డి గోపాల్‌రెడ్డి, కాశీవరపు వెంకటసుబ్బయ్య, పవన్ కిశోర్‌రాజు, భాస్కర్‌రాజు, పద్మావతమ్మ, మొగిలిచెండు సురేష్, ఆవుల శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి, చదువుల బాబు, పల్లా కృష్ణా, దుర్గాభవాని, గోపినాథ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.