ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి 'రతన్ టాటా' మరణించిన తరువాత.. థామస్ మాథ్యూ రచించిన 'రతన్ టాటా: ఏ లైఫ్' (Ratan Tata: A Life) అనే పుస్తకం విడుదలైంది. 100 పేజీల కంటే ఎక్కువ ఉన్న ఈ పుస్తకం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ.. ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ బుక్ లాంచ్ చేశారు. దీని ద్వారా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని, రతన్ టాటా పదవీ విరమణ చేసిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరన్ మిస్త్రీ పూర్తి బాధ్యతలను అధికారికంగా చేపట్టడానికి ముందే.. ఆ పదవికి మిస్త్రీ అర్హుడేనా అనే ఆలోచన రతన్ టాటాకు వచ్చినట్లు థామస్ మాథ్యూ పుస్తకం ఆధారంగా తెలుస్తోంది.
నిజానికి రతన్ టాటా తన చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి ముందే.. ఎంపిక కమిటీ 2011లోనే సైరన్ మిస్త్రీని ఎంపిక చేసింది. ఆ తరువాత మిస్త్రీ సంస్థ నిర్వహణ విషయంలో మెళుకువలను తెలుసుకోవడానికి రతన్ టాటా కింద అప్రెంటిస్‌షిప్‌గా ఉన్నారు. ఈ సమయంలోనే ఏడాది తరువాత కంపెనీ బాధ్యతలను తీసుకోవడానికి మిస్త్రీ సరైన వ్యక్తేనా అని రతన్ టాటా పునరాలోచన చేశారు.
2016లో సైరన్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్‌గా తొలగించవలసి వచ్చింది. ఆ సమయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి రతన్ టాటాకు ఎంతో కష్టంగా అనిపించిందని.. హార్వర్డ్ బిజినినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా ద్వారా తెలిసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. టాటా సన్స్ డైరెక్టర్‌గా ఉన్న వేణు శ్రీనివాసన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు పుస్తకంలో వివరించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఇషా ఆడపడుచు పెద్ద బిజినెస్ ఉమెన్.. తన గురించి ఈ విషయాలు తెలుసా?
సైరన్ మిస్త్రీ మీద సంస్థ సంస్థ డైరెక్టర్లకు విశ్వాసం లేదని తెలుసుకున్నప్పుడే చైర్మన్ బాధ్యతల నుంచి స్వయంగా బయటకు వెళ్లి ఉంటే బాగుండేదని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. కానీ రతన్ టాటా అనుకున్నట్లు జరగలేదు. దీంతో బోర్డు సభ్యులందరూ కలిసి సైరన్ మిస్త్రీ తొలగించడం జరిగింది. ఆ తరువాత జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment