రతన్ టాటా సాధించిన అతిపెద్ద విజయాలు ఇవే! | Ratan Tata Birth Anniversary Special Story, Here's The List Of Biggest Achievements In His Life | Sakshi
Sakshi News home page

రతన్ టాటా సాధించిన అతిపెద్ద విజయాలు ఇవే!

Dec 28 2024 12:23 PM | Updated on Dec 28 2024 1:43 PM

Ratan Tata Birth Anniversary Special: Here's Biggest Achievements

అందరూ పుడతారు.. కానీ కొందరే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి యుగ పురుషుడు, భరతమాత ముద్దుబిడ్డ.. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం మన 'రతన్ టాటా' (Ratan Tata). ఈయన ప్రస్తుతం దేహంతో లేకపోయినా.. దేశం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అంతటి గొప్ప మహనీయుడు ఎందరికో ఆదర్శనీయం.. మరెందరికో పూజ్యనీయం. నేడు రతన్ టాటా జయంతి. ఈ కథనంలో ఆయన సాధించిన ఘనతలు, ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

రతన్ టాటా: ఎ విజనరీ లీడర్
1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా..  నాయకత్వానికి, సమగ్రతకు పర్యాయపదం. టాటా సన్స్ మాజీ ఛైర్మన్‌గా, నాణ్యత, సామాజిక బాధ్యత.. నైతిక అభ్యాసాల వంటి విలువలకు కట్టుబడి ఉంటూనే, టాటా గ్రూప్‌ను గ్లోబల్ బిజినెస్ పవర్‌హౌస్‌గా మార్చిన ఘనుడు. తన తల్లితండ్రులు విడిపోయిన తర్వాత, అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన రతన్ టాటా యొక్క ప్రయాణం సంకల్పం & ప్రేరణతో కూడుకున్నది.

టాటా గ్రూప్‌లో తొలి అడుగులు
కార్నెల్ యూనివర్సిటిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌లో జూనియర్ మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన వృత్తిని ప్రారంభించారు. ఆ సమయంలోనే అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన 'ఐబీఎమ్' (IBM) నుంచి జాబ్ వచ్చింది. తన ప్రతిభను వేరొక కంపెనీ వృద్ధికి ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. ఐబీఎమ్ కంపెనీలో వచ్చిన ఆఫర్ వదులుకుని టాటా స్టీల్‌కు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలో కంపెనీ అపారమైన వృద్ధి సాధించగలిగింది.

NELCO డైరెక్టర్
1971లో టాటా అనుబంధ సంస్థ అయిన 'నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్' (NELCO)కి రతన్ టాటా డైరెక్టర్ అయ్యారు. అతని నాయకత్వంలో.. NELCO వ్యాపారాలు గణనీయమైన పురోగతివైపు అడుగులు వేసాయి.

టాటా గ్రూప్‌ చైర్మన్‌
1991లో JRD టాటా తర్వాత 'రతన్ టాటా'.. టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అతని పదవీకాలంలోనే టెట్లీ (2000), కోరస్ స్టీల్ (2007),  జాగ్వార్ ల్యాండ్ రోవర్ (2008)ల కొనుగోళ్ల వంటి వాటితో పాటు ప్రపంచ విస్తరణలు కూడా జరిగాయి.ఈ సమయంలో టాటా గ్రూప్ ఉనికి ప్రపంచ దేశాలకు వ్యాపించింది.

మొదటి స్వదేశీ కారు
రతన్ టాటా 1998లో టాటా ఇండికాను లాంచ్ చేయడం ద్వారా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇది దేశంలో మొట్టమొదటి స్వదేశీ కారు. ఆ తరువాత 2008లో అందరికీ అందుబాటు ధరలో ఓ కారు ఉండాలనే ఉద్దేశ్యంతోనే 'టాటా నానో' ప్రారంభించారు. ఈయన ప్రయత్నాలు వల్ల నాణ్యమైన వాహనాలను ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

పురస్కారాలు & పదవీ విరమణ
రతన్ టాటా 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ వంటి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. అయితే ఈయన 2012లో టాటా సన్స్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement