leadership
-
భలేవాడివి బాసు!
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుంటేనే ప్రతిరోజూ ఆనందం ఉంటుంది. అసలే దూరాభారం ప్రయాణాలు, ట్రాఫిక్ చిక్కులు, టార్గెట్లు వంటి కారణాలతో అలిసిపోవడం సహజం.. అయితే మన రోజువారీ ఆరోగ్య పరిస్థితిని ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అన్నింటి కన్నా మనపై ఉన్న బాస్ ప్రవర్తనను బట్టే మన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. మనం పనిచేసే ప్రాంతం బాగుంటే మానసిక ప్రశాంతత ఉంటుందని మానసిక నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే రోజుకు కనీసం 9 గంటల పాటు ఆఫీస్‌లోనే గడపాల్సి వస్తుంది కాబట్టి.. అక్కడి వాతావరణం బాగుంటేనే మిగతా రోజంతా సులువుగా గడిచిపోతుందని పేర్కొంటున్నారు. పై అధికారి శాడిస్టు అయితే మానసిక ఆరోగ్యంతో పాటు మన పనితనం, భవిష్యత్తు, ఇతరులతో సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘకాలిక ప్రభావం.. ఆఫీస్‌లో బాస్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే.. అది ఉద్యోగిపై స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ నెగెటివిటీతో బాస్ మాట్లాడుతుంటే ఉద్యోగుల సొంత తెలివితేటలపైనే అనుమానం వస్తుంటుంది. వారిని వారే తక్కువ అంచనా వేసుకోవడంతో పనితీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఉద్యోగంపై విరక్తి కలిగి రాజీనామా చేసేంత వరకూ వెళ్తుందని పేర్కొంటున్నారు. మోటివేషన్ ఉండాల్సిందే.. పని చేసే ప్రదేశంతో నెగెటివ్ వాతావరణం కన్నా మోటివేషన్ ఉంటే ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేస్తుంటారని, చేసిన పనికి మెచ్చుకోలు లేకపోయినా కనీసం కించపరిచేలా మాట్లాడటం, అందరి ముందు మందలించడం వంటి పనులు చేస్తే మానసిక వేదనకు గురై.. పని తీరు మందగిస్తుందని పేర్కొంటున్నారు. పనిచేసే ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, స్వతంత్రత, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఉంటే ఉద్యోగులకు మోటివేషన్ వస్తుందని పేర్కొంటున్నారు. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.ఎలా బయటపడాలి..?కర్కశమైన బాస్ కింద పనిచేసిన వారి మానసిక స్థితిని మళ్లీ తిరిగి పొందొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కన్నా అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, పాత ఆఫీస్ జ్ఞాపకాలను మర్చిపోయి.. ఆత్మన్యూనత భావం నుంచి బయటపడటం కాస్త కష్టమైనా కూడా సాధించొచ్చని చెబుతున్నారు. మన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుని, మనం గతంలో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ ఉండాలని పేర్కొంటున్నారు. మన మంచి కోరే సహోద్యోగులతో మనం చేసిన పనిపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉండాలని, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని పూర్తి చేస్తుంటే మళ్లీ మనలో కాని్ఫడెన్స్ పెరుగుతుందంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఆత్మ స్థైర్యం సాధించాలని పేర్కొంటున్నారు. ఆఫీస్‌లో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం.. ‘ఎక్కువ కాలం ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో నేర్చుకునే తత్వం తగ్గిపోతుందని, కొత్త విషయాలు రూపకల్పన చేయడం, సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే డోపమైన్ తగ్గుముఖం పట్టి.. కారి్టసాల్ స్థాయి పెరిగుతుందని ఢిల్లీకి చెందిన సైకోథెరపిస్టు డాక్టర్ చాందినీ చెబుతున్నారు. అద్భుతంగా ఎలా పని చేయాలా..? అని ఆలోచించడం మానేసి.. తన మీదికి రాకుండా ఏం చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తారని ఆమె వివరించారు. ఆఫీస్ వాతావరణం చాలాకాలం పాటు సరిగ్గా లేకుంటే ఉద్యోగులకు వేరే వారితో సంబంధాలు దెబ్బతింటాయని, అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకుంటారని, అలాగే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.లీడర్షిప్ ముఖ్యం.. ఆఫీస్ వాతావరణం చెడిపోడానికి కారణాల్లో ప్రధానమైనది లీడర్షిప్ లేకపోవడం. బాస్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. బాస్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోతే తాను చెప్పాలనుకున్న విషయాలు ఉద్యోగులకు వ్యక్తీకరించలేరు. దీంతో ఉద్యోగులకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకోలేరు. పక్షపాత వైఖరి, అసాధ్యమైన టార్గెట్లు పెట్టడం కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా ఆఫీస్ వాతావరణం పూర్తిగా చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది.అనేక ఆరోగ్య సమస్యలు.. పనిచేసే ప్రదేశంలో బాస్ సపోర్టు ఉంటే ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎదుగుదలకు ఉపయోగపడటమే కాకుండా సంస్థ పనితీరు కూడా బాగుంటుంది. ఏం చేసినా తప్పులు వెతకడం, విమర్శలు చేస్తుండటం వల్ల ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేక, అక్కడే భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరిస్థితులను ఎవరికీ చెప్పుకోలేక నిద్రలేమి, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. బాస్ ప్రవర్తనతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కుదిరితే నేరుగా చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలి. నచ్చిన వారితో కాసేపు ప్రశాతంగా గడిపినా, ఫోన్లో మాట్లాడినా మనసులోని బరువు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. – డాక్టర్ పి.హరీశ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ -
ఇది వరకు కేవలం ప్రధాని అభ్యర్ధి ఎవరనే విషయంలోనే లుక లుకలు బయటపడేవి!
-
నెక్స్బ్రాండ్స్ ఇండియా 2030 లీడర్షిప్ ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, పరోపకారి 'రతన్ టాటా' మరణించిన తరువాత.. థామస్ మాథ్యూ రచించిన 'రతన్ టాటా: ఏ లైఫ్' (Ratan Tata: A Life) అనే పుస్తకం విడుదలైంది. 100 పేజీల కంటే ఎక్కువ ఉన్న ఈ పుస్తకం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ.. ప్రచురణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ బుక్ లాంచ్ చేశారు. దీని ద్వారా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.డిసెంబర్ 2012లో టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుని, రతన్ టాటా పదవీ విరమణ చేసిన తరువాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరన్ మిస్త్రీ పూర్తి బాధ్యతలను అధికారికంగా చేపట్టడానికి ముందే.. ఆ పదవికి మిస్త్రీ అర్హుడేనా అనే ఆలోచన రతన్ టాటాకు వచ్చినట్లు థామస్ మాథ్యూ పుస్తకం ఆధారంగా తెలుస్తోంది.నిజానికి రతన్ టాటా తన చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి ముందే.. ఎంపిక కమిటీ 2011లోనే సైరన్ మిస్త్రీని ఎంపిక చేసింది. ఆ తరువాత మిస్త్రీ సంస్థ నిర్వహణ విషయంలో మెళుకువలను తెలుసుకోవడానికి రతన్ టాటా కింద అప్రెంటిస్‌షిప్‌గా ఉన్నారు. ఈ సమయంలోనే ఏడాది తరువాత కంపెనీ బాధ్యతలను తీసుకోవడానికి మిస్త్రీ సరైన వ్యక్తేనా అని రతన్ టాటా పునరాలోచన చేశారు.2016లో సైరన్ మిస్త్రీని టాటా సన్స్ ఛైర్మన్‌గా తొలగించవలసి వచ్చింది. ఆ సమయంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి రతన్ టాటాకు ఎంతో కష్టంగా అనిపించిందని.. హార్వర్డ్ బిజినినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియా ద్వారా తెలిసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. టాటా సన్స్ డైరెక్టర్‌గా ఉన్న వేణు శ్రీనివాసన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించినట్లు పుస్తకంలో వివరించినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇషా ఆడపడుచు పెద్ద బిజినెస్ ఉమెన్.. తన గురించి ఈ విషయాలు తెలుసా?సైరన్ మిస్త్రీ మీద సంస్థ సంస్థ డైరెక్టర్లకు విశ్వాసం లేదని తెలుసుకున్నప్పుడే చైర్మన్ బాధ్యతల నుంచి స్వయంగా బయటకు వెళ్లి ఉంటే బాగుండేదని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. కానీ రతన్ టాటా అనుకున్నట్లు జరగలేదు. దీంతో బోర్డు సభ్యులందరూ కలిసి సైరన్ మిస్త్రీ తొలగించడం జరిగింది. ఆ తరువాత జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. -
‘రూరల్ విమెన్స్ లీడర్షిప్ ’కార్యక్రమంలో నటి రెజినా (ఫొటోలు)
-
Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
వ్యాపార విభజనతో గోద్రెజ్ కంపెనీ వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గోద్రెజ్ అండ్ బోయ్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆ కంపెనీ ఫ్యూచర్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాండెట్ నైరికా హోల్కర్‌పై ప్రత్యేక దృష్టి పడింది. ‘గోద్రెజ్’లో న్యూ జనరేషన్ ప్రతినిధిగా భావిస్తున్న నైరికా హోల్కర్ లీడర్షిప్ ఫిలాసఫీ గురించి....గోద్రెజ్ కుటుంబంలో నాల్గవ తరానికి చెందిన నైరికా హోల్కర్కు నేర్చుకోవాలనే తపన. ఆఫీసులోని సీనియర్ల నుంచి ఇంట్లో చిన్న పిల్లల వరకు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ పడదు. ‘వినడం వల్ల కలిగే ఉపయోగాలు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ నా కూతురి నుంచి నేర్చుకున్నాను’ అని వినమ్రంగా చెబుతుంది నైరిక. ఐడియా రాగానే ఆ క్షణానికి అది గొప్పగానే ఉంటుంది. అందుకే తొందరపడకుండా తనకు వచ్చిన ఐడియా గురించి అన్నీ కోణాలలో విశ్లేషించి ఒక నిర్ధారణకు వస్తుంది. ‘నా అభి్రపాయమే కరెక్ట్’ అని కాకుండా ఇతరుల కోణంలో కూడా ఆలోచించడం అలవాటు చేసుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో లా చదివిన నైరిక కొలరాడో కాలేజీలో (యూఎస్)లో ఫిలాసఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదువుకుంది. లీగల్ ఫర్మ్ ‘ఏజెడ్‌బీ అండ్ పార్ట్నర్స్’తో కెరీర్ప్రారంభించిన నైరిక మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ కంపెనీలకు సలహాలు ఇవ్వడంలో ప్రత్యేక ప్రతిభ సాధించింది. గోద్రెజ్ అండ్ బోయ్స్ (జీ అండ్ బి)లోకి అడుగు పెట్టి డిజిటల్ స్ట్రాటజీ నుంచి కంపెనీ లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించడం వరకు ఎన్నో విధులు నిర్వహించింది. ఆమె నేతృత్వంలో కంపెనీ ఎన్నో ఇంక్యుబేటెడ్ స్టారప్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా సాధికారతకుప్రాధాన్యత ఇచ్చే నైరిక ‘పవర్’ అనే మాటకు ఇచ్చే నిర్వచనం...‘అర్థవంతమైన మార్గంలో ప్రభావం చూపే సామర్థ్యం’ ‘నాయకత్వ లక్షణాలకు చిన్నా పెద్ద అనే తేడా ఉండదు. చిన్న స్థాయిలో పనిచేసే మహిళలలో కూడా అద్భుతమైన నాయకత్వ సామర్థ్యం ఉండవచ్చు. అలాంటి వారిని గుర్తించి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం నాప్రాధాన్యతలలో ఒకటి’ అంటుంది నైరిక.కోవిడ్ కల్లోల కాలం నుంచి ఎంతోమంది లీడర్స్లాగే నైరిక కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంది.‘మాలాంటి కంపెనీ రాత్రికి రాత్రే డిజిటల్లోకి వచ్చి రిమోట్ వర్కింగ్‌లోకి మారుతుందని చాలామంది ఊహించలేదు’ అంటున్న నైరిక సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. ‘స్ప్రింట్’ ΄ోగ్రాం ద్వారా కొత్త ఐడియాలను ్ర΄ోత్సహించడం నుంచి ప్రయోగాలు చేయడం వరకు ఎన్నో చేసింది. ‘నైరిక ఎవరు చెప్పినా వినడానికి ఇష్టపడుతుంది. ఒకప్రాజెక్ట్లో భాగంగా సమర్ధులైన ఉద్యోగులను ఒకచోట చేర్చే నైపుణ్యం ఆమెలో ఉంది. న్యూ జనరేషన్ స్టైల్ ఆమె పనితీరులో కనిపిస్తుంది’ అంటారు గోద్రెజ్లోని సీనియర్ ఉద్యోగులు.‘గోద్రెజ్ అండ్ బోయ్స్’ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జంషెడ్ గోద్రేజ్ సోదరి స్మితా గోద్రెజ్ కూతురే నైరికా హోల్కర్. ఇండోర్ రాజ కుటుంబానికి చెందిన యశ్వంత్‌రావు హోల్కర్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. దశాబ్ద కాలానికి పైగా ఇంజనీరింగ్–ఫోకస్డ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలో కీలక బాధ్యతలు తీసుకొని రాణించడం అంత తేలికేమీకాదు. ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను తన సామర్థ్యంతో అధిగమించి గోద్రెజ్ మహాసామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది నైరికా హోల్కర్. గ్లోబల్ లీగల్ స్ట్రాటజీ నుంచి స్త్రీ సాధికారతకు పెద్ద పీట వేయడం వరకు కంపెనీలో తనదైన ముద్ర వేసింది. 2030 నాటికి...కోవిడ్ తరువాత కొత్త ప్రాధాన్యత రంగాలను... ఉత్పత్తులు, సేవలను మెరుగు పరిచే అవకాశాలను గుర్తించాం. కార్బన్ తీవ్రతను తగ్గించాలనుకుంటున్నాం. ఎనర్జీప్రాడక్టివిటీని రెట్టింపు చేయాలనుకుంటున్నాం. పర్యావరణ హిత ఉత్పత్తుల నుంచి 32 శాతం ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రాబోయే కాలంలో కంపెనీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది మా లక్ష్యం.– నైరికా హోల్కర్ -
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఆటా ప్రతినిధుల ఆహ్వానం!
ఆటా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆటా కన్వెన్షన్ ఆహ్వానం అందించారు. ఈ ఏడాది జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికాలోని అట్లాంటాలో ఆటా తెలుగు కన్వెన్షన్ భారీ ఎత్తున జరగనుంది. ఈ వేడుకలను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆటా ప్రతినిధులు ఆటా తెలుగు కన్వెన్షన్ అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. అందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికాలో వున్న తెలుగు వాళ్ళను కలవడానికి తప్పకుండా వస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన వారిలో కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ రెడ్డి పాశం, మాజీ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, కో ఆర్డినేటర్ వశిష్ఠ్ రెడ్డి తదితరులు వున్నారు. కాగా, ఆటా సంస్థ సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంది. ఆటా నేతృత్వంలో చాలా మందికి సాయం అందించారు. ఇలాగే గతేడాది ఆటా కన్వెన్షన్ డిసెంబర్ నెలలో 20 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవ కార్యక్రమాలు చేసిన విషయం విదితమే. (చదవండి: సింగపూర్‌లో తమిళ వైభవం..ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!) -
లోక్‌సభ ఎన్నికలు: ఏఐసీసీ కీలక సమావేశం.. వ్యూహాలపై దిశానిర్దేశం
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో కాంగ్రెస్ అధిష్టానం సమావేశమైంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రచారం, పోల్ మేనేజ్మేంట్, ప్రజలతో మమేకం వంటి అంశాలపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మార్గనిర్ధేశం చేశారు. రెండు గ్రూపులుగా సమావేశం నిర్వహించగా, మొదటి సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి.. రెండో సమావేశంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా, అండమాన్ అండ్ నికోబార్ల కోఆర్డినేటర్లతో మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా కో ఆర్డినేటర్లు ప్రయత్నం చేయాలని ఖర్గే అన్నారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికలలో పార్టీ విజయం కోసం అధిష్టానం దిశ నిర్దేశం చేసిందని, తెలంగాణలో అత్యధిక స్థానాలలో గెలవాలని ప్రయత్నం చేస్తామన్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరినట్లు భట్టి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయన్నారు. మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని, మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని ఖర్గే సూచించారన్నారు. అత్యధిక స్థానాలు గెలిపించే బాధ్యత కో ఆర్డినేటర్లపై ఉందని ఖర్గే దిశానిర్దేశం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించి మెజారిటీ స్థానాల్లో గెలవాలని సూచించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని, అధిష్టానం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు. -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్‌లో తీసుకువచ్చింది. విప్రో వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్‌లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
సుందర్ పిచాయ్‌పై గూగుల్ మాజీ ఉద్యోగి ఘాటు వ్యాఖ్యలు
గూగుల్ మాజీ ఉద్యోగి ఒకరు అల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఘాటు విమర్శలు చేయడం చర్చకు తెరతీసింది.. దార్శనిక నాయకత్వం లేకపోవడమే కంపెనీ క్షీణతకు దారి తీసిందని విమర్శించారు. విజనరీ లేని లీడర్షిప్, నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయంటూ అంటూ సుందర్ పిచాయ్‌పై అసంతప్తి వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బంది మధ్య పారదర్శకతను గూగుల్ నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకపుడు సంస్థ కోసం, వినియోగదారుల ప్రయోజనాలకు తీసుకునే నిర్ణయాల కాస్త ఇపుడు ఎవరు నిర్ణయం తీసుకుంటున్నారో వారి ప్రయోజనాలుగా మారిపోయాయంటూ ధ్వజమెత్తారు. గూగుల్ పాతికేళ్ల ప్రస్థానంలో 18 ఏళ్లు పనిచేసిన తాను ఈ నెలలో కంపనీకి రాజీనామా చేసినట్టు ఇయాన్ హిక్సన్ ప్రకటించారు. ఈ సందర్భంగా తన బ్లాగ్‌పోస్ట్‌లో సుందర్ పిచాయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంస్థలో భారీగా ఉద్యోగులు తొలగింపు, నైతిక ప్రమాణాలు, కల్చర్ లాంటి అంశాలను తన పోస్ట్‌లో ప్రస్తావించారు. విజనరీ లేని పిచాయ్ నాయకత్వంలో గూగుల్ సంస్కృతి క్షీణించి పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో చేరిన తొలి రోజులు బావుండేవని, ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని పేర్కొన్నారు. సంస్థలో కీలక ఎగ్జిక్యూటివ్‌లు సిబ్బందితో నిజాయితీగా, పారదర్శకంగా ఉండేవారు. ప్రతిష్టాత్మక ప్రయోగాలకు ప్రోత్సాహమిచ్చేవాంటూ రాసుకొచ్చారు. తొలి తొమ్మిదేళ్లు Googleలో HTMLలోనూ, చివరి తొమ్మిదేళ్లు గూగుల్‌లో యాప్‌లను అభివృద్ధి చేసే ప్లాట్‌ఫారమ్ ఫ్లట్టర్లో పని చేశానంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కానీ ఇపుడు గూగుల్‌లో కంపెనీ విజన్ ఏమిటో వివరించే చెప్పగలిగే వాళ్లెవరైనా ఉన్నారా అనే సందేహాన్ని కూడా ఆయన వెలిబుచ్చారు. నైతికత అంతంత మాత్రంగానే ఉందన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని థెరపిస్ట్‌లతో మాట్లాడితే, వారు తమ Google క్లయిట్లందరూ అసంతృప్తిగా ఉన్నారనే విషయం అర్థమవుందని రాసుకొచ్చారు. ఈ సమస్యంతా పిచాయ్ విజనరీ లేని లీడర్షిప్ కారణంగానే ఉత్పన్నమైందనీ, అసలు ఆయనకు ప్రారంభ గూగుల్ ప్రమాణాలను పాటించడంపై ఏ మాత్రం ఆసక్తి లేదంటూ ధ్వజమెత్తారు. ఇది అసమర్థమైన మిడిల్ మేనేజ్మెంట్ వ్యాప్తికి దారితీసిందన్నారు. ఈ సందర్భంగా ఫ్లట్టర్, డార్ట్, ఫైర్‌బేస్ వంటి ప్రాజెక్టులను కవర్ చేసే విభాగాన్ని నిర్వహిస్తున్న జీనైన్ బ్యాంక్స్‌పై మండిపడ్డారు. అయినా కంపెనీ వృద్ధిపై ఆశాభావాన్ని వ్యక్తం చేసిన హిక్సన్, నాయకత్వ స్థాయిలో కొంత 'షేక్-అప్' అవసరమని సూచించారు. దీర్ఘకాలిక, స్పష్టమైన వైఖరితో ఉన్న వారికి అధికారాన్ని అప్పగిస్తే, కంపెనీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుదని వ్యాఖ్యానించారు. అయితే హిక్సన్ వ్యాఖ్యలపై గూగుల్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయ లేదు. -
మార్పులతో బీజేపీ ఐదో జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున బీజేపీ అధిష్టానం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల ఐదో జాబితా గందరగోళానికి దారితీసింది. తీవ్ర కసరత్తు అనంతరం శుక్రవారం 14 మంది అభ్యర్థులతో చివరి జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. ఇందులో 11 మంది కొత్తవారు కాగా.. మిగతా నలుగురు మార్పులతో టికెట్ దక్కించుకున్నవారు. కానీ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఐదో జాబితాలోని మూడు చోట్ల అభ్యర్థులను మార్చడం గందరగోళానికి తెరలేపింది. ఇటీవల వేములవాడ నుంచి తుల ఉమ పేరును ప్రకటించిన బీజేపీ అధిష్టానం అనూహ్యంగా బీఫాంను చెన్నమనేని వికాస్‌రావుకి ఇచ్చింది. సంగారెడ్డి నుంచి దేశ్‌పాండే రాజేశ్వర్‌రావు పేరును ఐదో జాబితాలో ప్రకటించినా.. అక్కడ పులిమామిడి రాజుకు బీఫాం అందింది. బెల్లంపల్లి (ఎస్సీ) నుంచి తొలి జాబితాలో సీటు పొందిన అమరాజుల శ్రీదేవిని మారుస్తూ.. కొయ్యల ఏమాజీ పేరు ప్రకటించారు. కాసేపటికే మళ్లీ అమరాజుల శ్రీదేవినే బరిలో ఉంటారని ప్రకటించి బీఫామ్ ఇచ్చారు. ఐదో జాబితాలో అలంపూర్ నుంచి మారెమ్మ బరిలో ఉంటారని చెప్పినా.. సాయంత్రానికి మార్చేసి, రాజగోపాల్ పేరు ప్రకటించారు. చాంద్రాయణగుట్టలో సత్యనారాయణ ముదిరాజ్‌కు బదులు కె.మహేందర్‌ను ఎంపిక చేశారు. మూడో జాబితాలో వనపర్తికి అశ్వత్థామరెడ్డి పేరు ప్రకటించగా.. తాజా జాబితాలో అనుజ్ఞారెడ్డిని అక్కడ బరిలో దింపారు. ఐదు జాబితాల్లో కలిపి మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. 111 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పొత్తులో భాగంగా మిగతా 8 స్థానాల్లో జనసేన బరిలో ఉంది. -
గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్న నీతాఅంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్-ఇండియా ఎస్పీఎఫ్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్పర్సన్ నీతా అంబానీ మహిళాసాధికారత, పిల్లల విద్య, భారతీయ కళలు, క్రీడలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూఎస్ఐఎస్పీఎఫ్ పేర్కొంది. అవార్డు తీసుకున్న సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ..రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు 7 కోట్ల ప్రజలకు సేవ చేశామన్నారు. సీఎస్ఆర్ ప్రవేశపెట్టక ముందే రిలయన్స్ సొంతంగా ‘కార్పొరేట్ మోరల్ రెస్పాన్స్‌బిలిటీ’ ద్వారా సేవలందించినట్లు చెప్పారు. దేశ ప్రయోజనం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. భారత్, యూఎస్ మధ్య బంధాలను మరింతగా పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. USISPF was proud to honor Mrs. Nita M Ambani, Founder and Chairperson at @ril_foundation with the 2023 Global Leadership Award for Philanthropy and Corporate Social Responsibility. Mrs. Ambani is noted for her work in women's empowerment, education, promoting Indian arts & sports pic.twitter.com/rBuVQgvM97 — US-India Strategic Partnership Forum (@USISPForum) October 29, 2023 -
Priya Nair: అమ్మ చూపిన దారిలో అపూర్వ విజయాలతో...
అమ్మ నుంచి చందమామ కథలే కాదు స్ఫూర్తిదాయక విజయాలు ఎన్నో విన్నది ప్రియా నాయర్. మేనేజ్మెంట్ ట్రైనీగా దిగ్గజ కంపెనీలోకి అడుగు పెట్టిన ప్రియా నాయర్ తన కృషితో ఉన్నతస్థాయికి ఎదిగింది, కార్పొరేట్ ప్రపంచంలో విశేషమైన పేరు తెచ్చుకుంది. తాజాగా... బ్రిటిష్ మల్టీనేషనల్ కంపెనీ యూనిలీవర్లోని టాప్ టీమ్ యూనిలీవర్ లీడర్షిప్ ఎగ్జిక్యూటివ్ (యుఎల్ఈ)లో ఒకరిగా, ప్రెసిడెంట్ ఆఫ్ ‘బ్యూటీ అండ్ వెల్బీయింగ్’గా ప్రియా నాయర్ నియామకం జరిగింది. ‘మీ రోల్ మోడల్ ఎవరు?’ అంటే మరో మాటకు తావు లేకుండా ప్రియా నాయర్ టక్కున చెప్పే మాట...‘మా అమ్మ’ డెబ్బై ఏడేళ్ల వయసులోనూ ముంబైలో వైద్యవృత్తిలో బిజీ బిజీగా ఉండేది. అట్టడుగు వర్గాల ప్రజలకు ఉచితవైద్యం అందించేది. ఇక కోవిడ్ సమయంలో ఆమె చేసిన వైద్యసేవలు అపారం. దురదృష్టవశాత్తు ఆమె కోవిడ్ బారిన పడింది. అదృష్టవశాత్తు అందులో నుంచి బయటపడింది. ‘పవర్ ఆఫ్ పర్పస్’ అంటే ఏమిటో తల్లి నుంచే నేర్చుకుంది ప్రియ. ‘మన ఉద్దేశం స్వచ్ఛమైనది అయితే అస్థిరత, అనిశ్చితిని అధిగమించే శక్తి దరి చేరుతుందని, ఆశావాదం మనతోనే ఉంటుందని అమ్మ నుంచి నేర్చుకున్నాను. కార్పొరేట్ జీవితంలో ఇది నాకు ఎంతగానో ఉపయోగపడింది’ అంటుంది ప్రియ. తల్లి నుంచి ఆమె నేర్చుకున్న మరో పాఠం... నిరంతరం నేర్చుకోవడం. ప్రియ తల్లి ఎప్పుడూ ఏదో ఒక సెమినార్‌కు హాజరవుతూ ఉండేది. పుస్తకాలు చదువుతూ ఉండేది. వైద్యరంగంలో వస్తున్న సాంకేతికత గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఉండేది. ‘క్షణం తీరిక లేని ఈ ఉరుకుల, పరుగుల కాలంలో నిరంతరం నేర్చుకోవడం అనేది కుదిరేది కాదు అనే అభిప్రాయాన్ని అమ్మ మార్చేసింది. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉండేది’ అంటుంది ప్రియ. తల్లి నుంచి స్ఫూర్తి పొందిన ప్రియా నాయర్ హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్‌కు హాజరైంది. తనకు తిరిగి స్కూల్‌కు వెళ్లినట్లుగా అనిపించింది. ‘కార్పొరేట్ రంగంలో పాతిక సంవత్సరాల అనుభవం ఉన్న నాకు ఇది అవసరం లేదు’ అని అనుకోలేదు ప్రియా నాయర్. అక్కడ నేర్చుకున్న పాఠాలు ఆ తరువాత కాలంలో తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు వినియోగదారుల ఆలోచనలపై దృష్టి పెట్టి మార్కెటింగ్ వ్యూహాలను ఎప్పటికప్పుడూ మారుస్తూ వచ్చింది. ఫలానా ప్రాడక్ట్‌కు మార్కెట్ లేదు... అనుకున్న చోట కూడా తన వ్యూహాలతో మార్కెట్‌ను సృష్టించేది. ప్రచారంలో కూడా ప్రత్యేకత కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందులో సామాజిక సందేశం కూడా కనిపిస్తుంది. మనకు ఓటమి అంటే భయం, చిరాకు, కోపం. పిల్లల ఓటమిని తల్లిదండ్రులు తట్టుకోలేరు. పిల్లలకు విజయం అనేది అతి పెద్ద సవాలు. ‘నువ్వు ఓడిపోతే ప్రళయం ఏమీ రాదు. గెలుపులాగే ఓటమి అనేది సహజమైనది. ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు విలువైనవి’ అనే భావనతో సంస్థ తరఫున క్యాంపెయిన్‌ను నిర్వహించింది ప్రియ. కోవిడ్ సమయంలో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్)లో పెద్ద విభాగమైన ‘బ్యూటీ అండ్ పర్సనల్ కేర్’ బాధ్యతల్లోకి వచ్చింది ప్రియ. కేవలం 30 రోజుల్లోనే తమ హైజీన్ బ్రాండ్‌లో కొత్తగా పదిహేను వేరియేషన్స్ తీసుకువచ్చింది. అందులో ఒకటైన హ్యాండ్ శానిటైజర్ మన దేశంలోని ‘లార్జెస్ట్ సెల్లింగ్ హ్యాండ్ శానిటైర్ బ్రాండ్’గా నిలిచింది. మేనేజ్మెంట్ ట్రైనీగా ‘హెచ్‌యుఎల్’లోకి అడుగుపెట్టిన ప్రియా నాయర్ అడుగడుగునా పాఠాలు నేర్చుకుంది. ఎన్నో హోదాల్లో పనిచేసింది. ప్రతి హోదాలో తనదైన ప్రత్యేకత నిలుపుకుంది. ‘ఏ పని అయినా సరే యాంత్రికంగా ఎప్పుడూ చేయవద్దు. మనసు పెట్టి చేయాలి’ అని తన చిన్నప్పుడు ఎప్పుడో ప్రియకు అమ్మ చెప్పింది. అందకే ప్రియా నాయర్ ఏ హోదాలో పని చేసినా మనసు పెట్టి చేసింది. చేసే పనికి ఎప్పటికప్పుడు సృజనాత్మకమైన ఆలోచనలు జోడించింది. ఫలితం వృథా పోలేదని ఆమె విజయప్రస్థానం నిరూపించింది. -
హార్వర్డ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్న సీజేఐ
మసాచుసెట్స్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం అమెరికాలో హార్వర్డ్ లా స్కూల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆయన హార్వర్డ్ లా స్కూల్లోనే 1982–83లో ఎల్ఎల్ఎం డిగ్రీ చేశారు. 1983–86 మధ్య జ్యుడీషియల్ సైన్సెస్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. గత జనవరిలో ఆయనకు ఈ అవార్డును ప్రకటించడం తెలిసిందే. సుప్రీంకోర్టులో టెక్నాలజీ వినియోగం మరింత పెంచడంసహా సీజేఐగా తొలి ఏడాది తాను చేపట్టిన పలు చర్యలను అవార్డ్ అందుకున్న సందర్భంగా ఆయన వివరించారు. లాయర్ల మానసిక ఆరోగ్యం తదితర అంశాలను స్పృశిస్తూ ప్రసంగించారు. -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్‌లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్‌ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్‌గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్‌తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్‌ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
బలమైన ప్రభుత్వం ఓ అపోహే!
ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనేది అపోహ. సంకీర్ణ ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ ఈ అపోహ జనాన్ని నమ్మేలా చేస్తుంది. కానీ చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత లేదా సంకీర్ణ ప్రభుత్వాల మధ్య ఎటువంటి తేడా లేదని చరిత్ర చెబుతోంది. అమెరికాలో మహా మాంద్యం తర్వాత, ‘న్యూ డీల్’(1933)లో భాగంగా సంక్షేమ విధానాలను అమలు చేశారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగింది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. భారత్ వంటి విశాలమైన దేశానికి ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనే అపోహ ఆధారంగా, ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనను తిరిగి ఎన్నుకోవడం అనే ప్రబలమైన కథనం ఆధారపడి ఉంది. ‘బలమైన ప్రభుత్వం’ అనే ఈ అపోహ– బహుళ పార్టీ, సంకీర్ణ ఆధారిత ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ లేదా చట్టాలను ఆమోదించలేవనీ నమ్మేలా చేస్తుంది. అయితే, రాజనీతి శాస్త్ర రంగంలోని పరిశోధనలు మనకు భిన్నమైన చిత్రణను చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రధానంగా మూడు రకాల ప్రజా స్వామ్య ప్రభుత్వాలు ఉనికిలో ఉన్నాయి. అవి: అధ్యక్ష తరహా, పార్ల మెంటరీ, సంఘటిత (కాన్సోషియేషనల్) ప్రభుత్వాలు. ఈ ప్రతి ప్రభుత్వ రూపంలోనూ, బహుళ పార్టీ ప్రభుత్వాలు లేదా సంకీర్ణ ప్రభు త్వాలు స్థిరంగా ఉండటమే కాకుండా పౌరుల సంక్షేమం విషయంలో కూడా మెరుగ్గా ఉన్నాయని సాక్ష్యాధారాలు చూపుతున్నాయి. అమెరికా, అధ్యక్ష వ్యవస్థను అనుసరిస్తుంది. ఈ వ్యవస్థలో అధ్య క్షుడిని నేరుగా కార్యనిర్వాహక అధిపతిగా ఎన్నుకుంటారు. అయితే పన్నులు పెంచడం, డబ్బు ఖర్చు చేయగల సామర్థ్యం అనే ఖజానా అధికారాలను ప్రతినిధుల సభకు కట్టబెట్టారు. డేవిడ్ మేహ్యూ రాసిన ‘డివైడెడ్ వియ్ గవర్న్: పార్టీ కంట్రోల్, లా మేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, 1946–2002’ అనే పుస్తకంలో, ఒకే రాజకీయ పార్టీ అటు అధ్యక్ష పదవినీ, ఇటు కాంగ్రెస్‌నీ నియంత్రించినప్పుడు మాత్రమే అమెరికన్ జాతీయ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే సాధారణ అపోహను తొలగించారు. చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత పార్టీ లేదా వివిధ పార్టీల మధ్య ఎటువంటి తేడా లేదని ఈ పుస్తకం వెల్లడిస్తుంది. నిజానికి, మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) తర్వాత, అంటే 1933లో కొత్త ఒప్పందం (న్యూ డీల్)లో భాగంగా సంక్షేమ ఆధారిత విధానాలు అమలు చేశారు. అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో ఇటీవలే తీసుకొచ్చిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, 2022 వంటి సంక్షేమ ఆధారిత విధానాల్లో భాగంగానే ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడం, మందుల ధరలను తగ్గించడం, క్లీన్ ఎనర్జీకి మద్దతు ఇవ్వడం వంటివాటిని ఆమోదించారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాల హయాంలోనే ఇవి ఆమోదం పొందాయి. దీనికి విరుద్ధంగా, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) లేదా ఒబామా కేర్ చట్టంగా ప్రసిద్ధి చెందిన యాక్ట్‌ను, 2009లో డెమొక్రాటిక్ పార్టీ అటు అధ్యక్ష పదవినీ నిర్వహిస్తూ, ఇటు ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ మెజారిటీని కలిగి ఉన్నప్పుడు ఆమోదించారు. అయినా ఈ చట్టాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు, గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా దానిని రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అటువంటి చట్టంలో భాగం కాలేనప్పుడు, తమ నియోజకవర్గాలకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉంటాయని తెలిసినప్పటికీ, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని ఇది సూచిస్తోంది. పశ్చిమ ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి పార్ల మెంటరీ ప్రజాస్వామ్యాలను ఎక్కువగా వామపక్ష లేదా సంప్రదాయ వాద పార్టీల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తుంటాయి. 1945 నుండి జర్మనీని రైట్ వింగ్ లేదా ఉదారవాద సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ‘క్రిస్టియన్ డెమో క్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ’ మితవాద పక్షానికీ, ‘సోషల్ డెమో క్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ’ మధ్యస్థ–వామపక్ష ప్రభుత్వానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక ‘సంఘటిత’ ప్రభుత్వాలను పార్లమెంటరీ విధానంలోని ఉప విభాగంగా చూడవచ్చు. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలను మాత్రమే కలిగి ఉంటాయి. ఇటలీ, లెబనాన్, ఇథియోపియా వంటి దేశాలలో, వివిధ రకాలైన జాతి, మత, భాషా సమూహాలు సహజీవనం చేయవలసి వస్తోంది. సంఘటిత ప్రభుత్వాలు ఈ సమూహాలలోని అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో ఏర్పడతాయి. వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక సమూహం ఏదైనా విషయంపై మరొకరిని అడ్డుకుంటే,రెండోది ప్రతిగా ఆ సమూహాన్ని నిరోధించే అవకాశం ఉంటుంది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే దేశ అణ్వాయుధ ప్రయోగాల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించారు. 2004 నుండి 2014 వరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనేక పౌరుల, హక్కుల ఆధారిత చట్టాలను రూపొందించింది. వీటిలో 2005లోని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), 2006లోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, 2009లోని విద్యా హక్కు చట్టంతో పాటు, 2013లో తెచ్చిన ఆహార హక్కు చట్టం; భూ సేకరణ, పునరా వాసం, రీసెటిల్మెంట్ (ఎల్ఏఆర్ఆర్) చట్టం ఉన్నాయి. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి... బలహీ నమైన, కీలుబొమ్మ ప్రభుత్వం అనే అపోహను ప్రచారం చేయడంతో అది 2014లో బీజేపీ విజయానికి దారితీసింది. అయితే, 2014 నుండి ‘బలమైన నాయకత్వం’ మనకు ఏమి అందించిందో చూద్దాం. హక్కుల ఆధారిత చట్టాలు వేటినీ ఈ ప్రభుత్వం ఆమోదించలేదు. పాలనా పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించి ఏ ఆధారాలూ లేవు. బదులుగా మోదీ ప్రభుత్వం ప్రజలను జవాబుదారీగా ఉంచాలనుకుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా మీ డబ్బును నాకు చూపించమంది; జీఎస్టీ ద్వారా మీ పన్నులు నాకు చెల్లించమంది. ఇంకా ఆర్టికల్ 370 రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టాన్ని తేవడం వంటివి జరిగాయి. నిరసనల తర్వాత మాత్రమే 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దయినాయి. గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం లేదా స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించడం వంటివి అమలులో ఉన్న సంక్షేమ విధానాలకు పొడిగింపు మాత్రమే. ఏ కొత్త ఆవిష్కరణా లేదా కొత్త దిశనూ ఈ ప్రభుత్వం చూపలేదు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సుమారు 50 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆర్థిక సేవలను అందిస్తుంది. అయితే ఇందులో 4.12 కోట్ల మంది జూలై 2023 నాటికి జీరో బ్యాలెన్స్ కలిగి ఉన్నారు. కాగా, జనవరి 2018 నుండి 6 కోట్ల ఖాతాల్లో ఎటువంటి లావాదేవీలు జరగలేదు. హక్కుల ఆధారిత చట్టాలు ఈ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు తగ్గాయి. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరచడం ద్వారా ప్రభుత్వం తనను సూక్ష్మశోధనకు అతీతంగా ఉంచుకుంది. వివిధ పథకాలు లేదా ప్రభుత్వ వైఖరి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఒక రకమైన భూస్వామ్య పరాధీనతను సృష్టించడంలో భాగమే. అన్ని గ్యాస్ స్టేషన్లపై, మనందరి కోవిడ్ టీకా సర్టిఫికేట్లపై భూస్వామ్య ప్రభువైన ప్రధాని స్వయంగా కనిపిస్తుంటారు. ఏకవ్యక్తి ప్రభుత్వం వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం గురించి చరిత్ర పొడవునా సమీక్షించినప్పుడు, బలమైన నాయకుల అహంకారం వారి ప్రజలకు ఎల్లప్పుడూ మంచిది కాదని మనకు అర్థమవుతుంది. ఇస్లా మిక్ చట్టంలో ఇజ్మా అనే భావన ఉంటుంది. అంటే ఏకాభిప్రాయం. అతి పెద్ద సమాజం తరపున నిర్ణయాలు తీసుకోవడానికి పండితుల సంఘం కలిసి వస్తుందనే అవగాహనపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ రూపంలో మనం ఒక సంభా వ్యతకు సాక్ష్యులుగా ఉన్నాం. భారత దేశంలోని భిన్న సమూహాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం అనేక పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్లకు ఓటర్లు ఒక అవకాశం ఇస్తారని ఆశించవచ్చు. డాక్టర్ రాజ్‌దీప్ పాకనాటి వ్యాసకర్త ‘జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్’ ప్రొఫెసర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ -
అవి డొల్ల కమిటీలేనా?
సాక్షి, హైదరాబాద్: సంస్థాగతంగా పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో బూత్‌ల వారీగా పైచేయి సాధనకు పోలింగ్‌బూత్ కమిటీలే కీలకమని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది. అయితే పార్టీకి పోలింగ్‌బూత్ కమిటీలే బలమనుకుంటే.. చాలా చోట్ల బూత్‌కమిటీ అధ్యక్షులే లేరని, కమిటీ సభ్యుల్లో చాలా మంది చురుకుగా పనిచేయడం లేదని ముఖ్యనేతల పరిశీలనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటించిన సందర్భంగా వారు రూపొందించిన నివేదికల్లోనూ ఇదే విషయం బయట పడిందని వెల్లడైంది. ఈ నివేదికలు, ఇతరత్రా అందిన సమాచారం మేరకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల తీరు గురించి క్రాస్ చెక్ చేసినపుడు కూడా ఇదే విషయం తేలడంతో పార్టీ ముఖ్యనేతలకు కలవరం మొదలైందని సమాచారం. బూత్ కమిటీల్లో చాలాచోట్ల పోలింగ్ బూత్ అధ్యక్షులే లేరని, ఈ జాబితాల్లో పేర్లు ఉన్న వారిలో చాలామంది ప్రస్తుతం చురుకుగా పనిచేయకపోవడం, పలుచోట్ల బూత్ కమిటీ సభ్యులు కూడా మొక్కుబడిగా పనిచేయడం, పార్టీలో లేనివారి పేర్లు కమిటీల్లో చోటుచేసుకోవడం వంటివి బయటపడడంతో అర్జంట్‌గా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు నాయకత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు 450 మంది.. రాష్ట్రంలో బూత్‌కమిటీల నియామకానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 26 నుంచి 19 రోజులపాటు రాష్ట్రంలో మూడుచోట్ల నుంచి బస్సు (రథ)యాత్రలు ప్రారంభించి, అక్టోబర్ 14న హైదరాబాద్‌లో ముగింపు సందర్భంగా ప్రధాని మోదీని ఆహ్వానించి బహిరంగసభ నిర్వహించాలని ముఖ్యనేతలు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా పోలింగ్ బూత్‌కమిటీలు సరిగా లేకపోవడమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. బూత్ కమిటీలు సక్రమంగా లేకుండా బస్సుయాత్రలు ఎలా విజయవంతం అవుతాయని బన్సల్ రాష్ట్రనేతలను నిలదీసినట్టు తెలిసింది. దీనిని సీరియస్ తీసుకున్న బన్సల్.. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 2 దాకా రెండేసి మండలాల చొప్పున పరిశీలించి నివేదికల సమర్పణకు 450 మందిని క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం చేసినట్టు పార్టీవర్గాల సమాచారం. వారికి అప్పగించిన మండలాలలో బూత్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడా, కమిటీలు ఉన్నాయా, శక్తి కేంద్ర ఇన్చార్జి ఉన్నాడా, మండల కమిటీ ఉందా, ఎంత మందితో ఉంది.. వంటి అంశాలను వారు లోతుగా పరిశీలించనున్నారు. రాష్ట్ర పార్టీ సిద్ధం చేసిన నమూనాకు అనుగుణంగా పోలింగ్‌బూత్ అధ్యక్షులు, కమిటీలపై వీరు నివేదికను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలతో మాట్లాడిన బన్సల్.. రాజకీయ కార్యక్రమాలను తగ్గించి సంస్థాగత విషయాలపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని పక్షంలో పార్టీ మండలా«ద్యక్షులను కూడా మార్చాలని, బూత్‌కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. -
ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా?
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘నైపుణ్యాభివృద్ది సంస్థ కుంభకోణం’లో చిక్కి జైలు పాలు కావడంతో.. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమి అవుతుందో అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పార్టీపై ఇప్పటికే పట్టు సడలుతున్న తరుణంలో.. పులిమీద పుట్రలా చంద్రబాబుపై కేసులు రావడం ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఆయన కుమారుడు లోకేష్ కూడా కేసులలో ఉండడం ఆ పార్టీ క్యాడర్‌కు మరింత ఆందోళనకరంగా మారింది. ఇదే టైమ్‌లో పార్టీ ఆఫీస్‌లో చంద్రబాబు వియ్యంకుడు , హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హల్ చల్ చేయడం పార్టీని మరింత గందరగోళంలో పడేసింది. ఇవి చాలవన్నట్లు కొద్ది రోజుల క్రితం తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి.. రంగంలోకి రావాలని, టూర్లు చేయాలని సూచించడం ఆ పార్టీలో ఏర్పడిన అయోమయ స్థితికి దర్పణం పడుతోంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు.. కొన్ని పేర్లతో రాష్ట్రంలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దూషణలు చేస్తూ, కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగాలు సాగించారు. అలాగే యువగళం పాదయాత్ర పేరిట లోకేష్ కార్యకర్తలలో గరళం నూరిపోస్తూ.. హింసకు ప్రేరిపిస్తూ వచ్చారు. వాటి ఫలితంగా పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో కేసుల పాలై జైళ్లలో పడ్డారు. వాళ్లను ఆదుకునే పరిస్థితి టీడీపీ నాయకత్వానికి లేకుండా పోయింది. ఎన్ని ఎక్కువ కేసులు నమోదు అయితే.. ఆ వ్యక్తికి అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తండ్రే రాజమండ్రి జైలులో ఉండవలసి వచ్చింది. దాంతో ఢిల్లీ నుంచి పెద్ద,పెద్ద లాయర్లను ప్రత్యేక విమానాలలో రప్పించి కోర్టులలో వాదనలు చేయిస్తున్నారు. వారేమో అవినీతి జరగలేదని చెప్పలేకపోతున్నారు. కేవలం సాంకేతిక అంశాలపైనే వాదనలు చేస్తుండడంతో పార్టీ క్యాడర్‌కు తమ నేత అవినీతి చేసి దొరికిపోయాడన్న భావన నెలకొంది. అదే టైమ్ లో చంద్రబాబు,లోకేష్‌ల మాట నమ్మి హింసాకాండకు తెగపడ్డ కార్యకర్తలు ,స్థానిక నేతలు దిక్కులేక అల్లాడుతున్నారు. వారిలో ఆర్ధికంగా స్థితిమంతులైనవారు కొద్దిమంది ముందస్తు బెయిల్ పొందినా, తొంభై శాతం మంది జైళ్లలోనే మగ్గవలసి వచ్చింది. దాంతో టీడీపీ క్యాడర్‌కు కనువిప్పు అయింది. ✍️ చంద్రబాబు, లోకేష్‌లు తమ పరపతి ఉపయోగించి.. పెద్ద,పెద్ద లాయర్లను కాకపోయినా, ఓ మోస్తరు లాయర్లను పెట్టి తమను ఎలాగో కేసుల నుంచి బయటవేస్తారని భావించిన కార్యకర్తలకు సీన్ రివర్స్ అవడం జీర్ణం కావడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడే బెయిల్ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ వాతావరణం అంతా టీడీపీకి పెద్ద షాక్‌గా మారింది. వాస్తవ పరిస్థితి అర్ధం అయ్యేసరికి టీడీపీ నాయకత్వం బంద్ కాల్ ఇచ్చినా.. పెద్దగా బయటకు రాకుండా క్యాడర్ జాగ్రత్తపడింది. కొందరు నేతలైతే పోలీసులను అభ్యర్ధించి మరీ హౌస్ అరెస్టు అయ్యారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర లేదని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి ఎంత ప్రచారం చేసినా.. నమ్మలేకపోతున్నారు. దానికి కారణం.. కోర్టు చంద్రబాబును రిమాండ్ విధించి.. రాజమండ్రి జైలుకు పంపడమే!. చంద్రబాబు రిమాండ్ వెనుక.. ప్రాథమిక ఆధారాలు లేకుండా కోర్టు ఇలా చేయరన్న సంగతిని వాళ్లు(టీడీపీ క్యాడర్) అర్ధం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలు కాని, మంత్రులు.. అధికారులు కాని ఆ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను ఆధారసహితంగా చెబుతుండడంతో టీడీపీ క్యాడర్‌కు వాస్తవ పరిస్థితి అర్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడకు తీసుకు వచ్చినా, విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు తీసుకు వెళ్లినా రోడ్ల వెంట నిలబడి ఆయనకు కనీసం సంఘీభావం కూడా తెలపలేదు. ✍️ ఇక చంద్రబాబుకు బెయిల్ కోసం కాకుండా.. ఇతరత్రా పిటిషన్లు ఆయన లాయర్లు వేయడంతో ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఈ కేసులో చంద్రబాబును తప్పించాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేసినా.. అది ఏమవుతుందో తెలియదు. కాని, ఈలోగా చంద్రబాబు జైలులోనే గడపవలసి రావడం పార్టీ క్యాడర్‌ను డీమోరలైజ్ చేస్తోంది. అందుకే పార్టీ నాయకత్వం ఎన్ని రకాలుగా పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందించడం లేదనేది స్పష్టమవుతోంది. మరోవైపు లోకేష్‌పై కూడా కేసుల కత్తి వేలాడుతోంది. తనకు ఏమవుతుందో తెలియక ఆయన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యమంత్రిని, పోలీసులను నోటికి వచ్చినట్లు దూషించినంత తేలికగా కేసులు ఉండవన్న సంగతి అర్దం అయ్యేసరికి లోకేష్ ఊబిలో చిక్కుకుపోయారు. ఆయన కూడా అరెస్టు అయితే పార్టీని నైతికంగా మరింత దెబ్బతీస్తుంది. అసలే ఆయన నాయకత్వంపై ఇంకా నమ్మకం ఏర్పడలేదు. దానికి తోడు ఈ కేసులు రావడంతో వీళ్లతో జట్టుకట్టి ఉంటే ఏమవుతామోనన్న భయం క్యాడర్‌కు పట్టుకుంది. ✍️ మరోవైపు.. చంద్రబాబు, లోకేష్‌లు సంక్షోభంలో ఉండగా.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ కార్యాలయంలో హల్ చల్ చేశారన్న వార్తతో క్యాడర్లో అయోమయం నెలకొంది. తన కుమారుడు బాలకృష్ణ రాజకీయ వారసుడు కావాలని ఎప్పుడో 1986 ప్రాంతంలోనే ఎన్.టి.రామారావు ప్రకటన చేయడం, దానిని విత్ డ్రా చేసుకునే వరకు చంద్రబాబు ప్రయత్నాలు సాగించడం తెలిసిందే. ఇప్పుడు పార్టీ మొత్తం నారా వారి పార్టీగా మారిపోయి.. నందమూరి వంశానికి ప్రాధాన్యత లేకుండా పోయిందన్న అభిప్రాయం బలంగా జనాల్లోనే ఉంది. అందువల్ల బాలకృష్ణ ఏమైనా చొరవ తీసుకునే.. ధైర్యం చేశారా? అనే చర్చ నడిచింది క్యాడర్లో!. ఇంతకాలం చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వం అని భావిస్తుంటే, బాలకృష్ణ వచ్చి చంద్రబాబు సీటులో కూర్చోవడం.. ఆయనకు సంబందించిన వార్తలేవి చంద్రబాబు సన్నిహితంగా ఉండే ఆంధ్రజ్యోతిలో రాకపోవడంతో.. బాలకృష్ణ చేసిన హడావుడి ఆ తండ్రీకొడుకులకు నచ్చలేదా? అనే ప్రశ్న తలెత్తింది కూడా!. ఒకవేళ బాలకృష్ణ తానే నాయకత్వం వహించాలనుకుని ఇలా చేశారా? అనే అనుమానమూ పార్టీ వర్గాలలో ఏర్పడింది. ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో కొద్ది రోజుల కిందట.. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు కూడా రంగంలో దిగాల్సిన సమయం ఆసన్నమైందంటూ కథనం రావడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరచింది. అంటే దీని అర్ధం చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటకు రాలేరనా?.. లేక చంద్రబాబు నాయకత్వ పటిమపై సందేహాలు వచ్చాయా? లేదంటే లోకేష్ కూడా జైలుకు వెళతారనా? లేకుంటే లోకేష్ నాయకత్వం సరిపోదనా?. ఒకవేళ వీరిద్దరూ(భువనేశ్వరి, బ్రహ్మణీలు) రావడం వల్ల జనంలో సానుభూతి వస్తుందనా?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేక క్యాడర్‌ను వేధిస్తున్నాయి. ✍️ గతంలో జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన తల్లి విజయమ్మ, సోదరి విజయమ్మలు పర్యటనలు చేశారు. సభలలో మాట్లాడారు. కాని అప్పుడు అది ఉప ఎన్నికల సమయం కావడంతో.. వారి అవసరం పడింది. అలాగే షర్మిల పాదయాత్ర కూడా చేశారు. ఇప్పుడు కేవలం చంద్రబాబు జైలులో ఉన్నారు కనుక వీరు జనంలోకి వస్తే రిసీవ్ చేసుకుంటారా?. ఒకవేళ చూడడానికి వచ్చినా జనం.. ఆ తర్వాత ఓట్ల వరకు పరిస్థితిని తెస్తారా? అనేది అనుమానమే!. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు ఈ పరిణామాలన్నిటికి జైలులో ఉన్న చంద్రబాబు అంగీకరిస్తారా?.. దానివల్ల తన రాజకీయ అనుభవానికి.. పరువుకి భంగం అనుకునే అవకాశం ఉండదా?.. ఇలా ఎన్నో చిక్కుల నడుమ తెలుగుదేశంలో నిరాశ, నిస్పృహలు అలముకున్నాయి. టీడీపీ క్యాడర్‌ను ఎంత ఉత్తేజపరచాలని చూస్తున్నా.. రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా.. వారిలో ఆ కాక కనిపించడం లేదు. చంద్రబాబు, లోకేష్‌లు ఇన్ని రోజులు రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకున్నారని, ఇప్పుడు వాళ్లే ఇక్కట్లపాలయ్యారని, అందువల్ల అనవసరంగా తాము ఎందుకు రిస్క్ తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు సహజంగానే భావించి ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే.. తెలుగుదేశం పార్టీ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుందనిపిస్తోంది. ‘‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ’’ నినాదం ఇచ్చిన పార్టీలో.. ఇప్పుడు ఆ పిలుపు ఇచ్చిన చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్‌ల భవితవ్యంతో పాటు టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేకుండా పోయిందన్న భావన ఆ పార్టీ క్యాడర్లోనే నెలకొంది!!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ప్రజల మధ్యనే ఉంటూ.. తిరుపతి అభివృద్ధికి శ్రమిస్తూ..
తిరుపతి: టెంపుల్ సిటీగా తిరుపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ విదేశాల్లోనూ తిరుపతి వైపు అందరి చూపు ఉంటుంది. అలాంటి తిరుపతిలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చేస్తున్న అభివృద్ధి అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకునే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా ఎవరో కాదు చెప్పేది, తిరుపతి స్థానికులే చెబుతున్నారు. బుధవారం అభినయ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరమంతా పలు వేడుకలు, అన్న దాన, రక్త దాన, సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్బంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. అభినయ్ ని మరెన్నో ఉన్నత పదవుల్లో చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, గడప గడపకు తిరుగుతూ వారి సమస్యలు పరిష్కరిస్తూ నిరంతర శ్రామికుడిగా పేరు తెచ్చుకుంటున్నారు అని భూమన అభినయ్ ని కొనియాడారు. 'మీ అందరి ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీ ఇంటి బిడ్డగా కష్టాల్లో, సుఖాల్లో ఎప్పటికీ నేను తోడుంటా. ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడా చెడ్డ పేరు రాకుండా మన తిరుపతి గౌరవాన్ని పెంచేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముంఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలోనే సాధ్యం. ఆయన అడుగు జాడల్లో నడుస్తాను, తిరుపతి ప్రజలారా.. మీకు అండగా ఉంటా.. తిరుపతి ఖ్యాతిని పెంచుదాం' అంటూ అభినయ్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఘటన: చేతన్ షార్ట్ టెంపర్.. అందుకే ఈ ఘోరం! -
అందరితో చర్చించాకే పొత్తులపై నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై అందరితో చర్చించాకే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థాగతంగా రాష్ట్రంలో చేయాల్సిన మార్పులపై అధిష్టానానికి నివేదిక అందించారు. పొత్తుల గురించి నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఉందని, ఎన్నికలకు ముందు పొత్తుల గురించి నిర్ణయం ఉంటుందని పురందేశ్వరి భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్‌ను కలిసి ఏపీ ఆర్ధిక పరిస్థితులను వివరించానని పురందేశ్వరి తెలిపారు. ‘నేనేం తప్పులు చెప్పలేదు’ ఇటీవల మీడియా సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి తాను తప్పులు చెప్పలేదని.. 2023 జూలై నాటికి ఏపీకి రూ.10,77,006 కోట్ల అప్పు ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్నారు. కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు అధికారికమా, అనధికారికమా అన్నది ఏపీ ప్రజలకు తెలియాలన్నారు. రాష్ట్రంలో చిన్న సన్నకారు కాంట్రాక్టర్లకు రూ.71 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. 15వ ఆర్థిక సంఘం పంచాయతీ నిధులను అనధికారికంగా వాడటంపై సర్పంచ్‌లకు సమాధానం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. నిధులు దారి మళ్లించి అప్పులు తీసుకువచ్చి ఆ భారాన్ని ప్రజలపై రద్దుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి లేదని.. అప్పులు మాత్రమే ఉన్నాయని పురందేశ్వరి విమర్శించారు. -
లేఆఫ్స్ సెగ: అయ్యయ్యో మార్క్ ఏందయ్యా ఇది!
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు మింగుడు పడని వార్త ఇది. మెటా నిర్వహించిన ఉద్యోగుల సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడైనాయి. కేవలం 26 శాతం మంది సిబ్బంది మాత్రమే మెటా మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక నివేదికలో పేర్కొంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఐదు శాతం పడిపోయిందని తెలిపింది. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!) వాల్ స్ట్రీట్ జనరల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం మెటా ఉద్యోగులలో 74 శాతం మంది అసంతృప్తితో ఉన్నారట. వేలాది మంది ఉద్యోగులను తొలగించిన రెండు నెలల తర్వాత ఏప్రిల్ 26- మే 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో నాలుగింట ఒక వంతు మంది అంటే 26 శాతం మంది మాత్రమే మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారు. ఇది అక్టోబర్‌లో 58 శాతం నుండి 5 శాతం క్షీణించి 43 శాతానికి పడిపోయింది. (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు) ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ బాటపట్టాయి. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సహా గూగుల్, మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి అనేక టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులపై వేటు వేశాయి. ముఖ్యంగా మెటా అనేక దశల్లో 21వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఆకస్మిక తొలగింపులు మెటాలో పనిచేస్తున్న వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రస్తుత , మాజీ ఉద్యోగులు భావిస్తున్నారు. -
నిర్ణయాత్మక శక్తి ఏపీ మహిళ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మహిళలు తిరుగులేని శక్తిగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా వారికే పదవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్ణయాత్మక స్థానాలు, కీలకమైన పదవుల్లో ఏపీ మహిళలది దేశంలోనే అగ్రస్థానం. కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వ శాఖ ‘భారతదేశంలో వివిధ రంగాల్లో మహిళలు, పురుషులు–2022’ అనే నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక ముఖ్యాంశాలు ఇవే.. ♦ సాధారణ హోదా, సీనియర్ అధికారులు, మేనేజర్లు, శాసనసభ్యుల హోదాల్లో నిర్ణయాలు తీసుకోవడంతో దేశ సగటుతో పాటు దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. ♦సీనియర్ అధికారులు, మేనేజర్లు, ఎమ్మెల్యేల వంటి నిర్ణయాత్మక పదవుల్లో రాష్ట్ర మహిళల హవా కొనసాగుతోంది. ♦ శాసనసభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్ల హోదాల్లో మహిళల భాగస్వామ్యం దేశ సగటు 22.2 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది అత్యధికంగా 43.4 శాతం ఉంది. ♦ సీనియర్, మిడిల్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల భాగస్వామ్యం దేశ సగటు 18.1 శాతం ఉండగా ఏపీలో 30.3 శాతం ఉంది. మరే ఇతర పెద్ద రాష్ట్రాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఏపీలో ఉన్నంత స్థాయిలో లేదు. ♦ మొత్తం కార్మికుల్లో మేనేజర్ హోదాలో ఏపీలో 30.4 శాతం మహిళలే ఉండగా ఇదే దేశం మొత్తం చూస్తే కేవలం 18.0 శాతమే. ♦అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీరాజ్ సంస్థల్లో 50 శాతం మంది మహిళలు (78,025 మంది) ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ♦అదే సాధారణ కార్మికులు, నిర్ణయాత్మక హోదాల్లోనూ, శాసనసభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్ల స్థాయిలో మహిళల భాగస్వామ్యం బీహార్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ తదితర రాష్ట్రాల్లో అత్యల్పంగా ఉంది. ♦ సమాజంలో సగభాగమైన మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ♦మంత్రిమండలితో పాటు స్థానిక సంస్థల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా చట్టాలు చేసింది. ♦ అంతేకాక.. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలిస్తే వాటిని మహిళల పేరు మీదే పంపిణీ చేశారు. సాధారణ హోదాలోనూ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువమంది మహిళలున్నారని.. వీరంతా నిర్ణయాలు తీసుకోవడంలో ముందున్నట్లు నివేదిక వెల్లడించింది. -
తెలంగాణలో అధికారంపై ఆశలు సరే! ఆ జిల్లాలో బీజేపీకి నాయకులున్నారా?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా జెండా ఎగరేయాలని కమలం పార్టీ ఆశపడుతోంది. అందుకోసం చాలా కష్టపడుతోంది. కానీ అనేక నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నాయకులే కరువయ్యారు. కొన్ని చోట్ల ఉన్నవారు కూడా యాక్టివ్‌గా లేరు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ నాయకత్వ సమస్యతో సతమతమవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలకు సంబంధించి బీజేపీ నాయకత్వం దూకుడు మీదుంటే.. మెదక్ జిల్లాలో మాత్రం ఆ పార్టీ నాయకులు నామ మాత్రంగా కూడా స్పందించడం లేదు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆందోల్‌లో మాజీ మంత్రి బాబు మోహన్ కమలం పార్టీలో ఉన్నప్పటికీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ నియోజకవర్గానికి చుట్టపు చూపుగానే వచ్చి వెళ్తున్నారు. పార్టీ కేడర్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. కార్యకర్తలను నడిపించడానికి బలమైన నాయకుడు లేకుండా పోయారు. జహీరాబాద్ నియోజకవర్గానిది ఇదే పరిస్థితి. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జంగం గోపిపై సస్పెషన్ వేటు పడింది. దీంతో బీజేపీ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించడానికి నాయకుడే లేకుండా పోయారు. జిల్లా కేంద్ర నియోజకవర్గం సంగారెడ్డిలో బీజేపీకి కొంత పట్టు ఉంది. నియోజకవర్గ ఇంచార్జ్ దేశ్ పాండే పార్టీ కార్యక్రమాలు బాగానే నిర్వహిస్తున్నా.. ఇక్కడ నేతల మధ్య విభేదాలు రగులుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో, విభేదాల కారణంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో నిర్వహించడంలో విఫలం అవుతున్నారు. పఠాన్ చెరులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, గోదావరి అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్ లు ఎవరికీ వారే అన్న చందంగా తయారయ్యారు. నారాయణ ఖేడ్ లో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి కూడా అంతంత మాత్రంగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. చదవండి: కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు..? బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పలు నియోజక వర్గాల నాయకుల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఉన్న కొద్ది మంది నాయకులు అంతర్గత కలహాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా నాయకులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను ఎదుర్కోవడం బీజేపీకి పెద్ద సవాలుగా మారుతుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. నాయకత్వ సమస్యను అధిగమించేందుకు ప్రత్యర్థి పార్టీలోని ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఆపరేషన్ ఆకర్షపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినప్పటికీ జిల్లాలో పెద్దగా స్పందన రావడంలేదు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళి యాదవ్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ బీజేపీలో చేరలేదు. ఇటీవల మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సోదరుడు రాంచందర్ కాషాయ కండువా కప్పుకున్నప్పటికీ ఏ మేరకు ప్రభావం చూపగలరనేది ప్రశ్నార్ధకమే. జిల్లా నాయకత్వం అనుసరిస్తున్న తీరుతోనే పార్టీ అగ్రనేతల కార్యక్రమాలు తరచుగా రద్దవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈషా అంబానీకి ఫోర్బ్స్ అవార్డు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ చైర్పర్సన్ ఈషా అంబానీ తాజాగా జెన్నెక్ట్స్ ఎంట్రప్రెన్యూర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు 2023 కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. ఆమెతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు కూడా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ ’సీఈవో ఆఫ్ ది ఇయర్’, మ్యాక్స్ హెల్త్‌కేర్ సీఎండీ అభయ్ సోయి ’ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను దక్కించుకున్నారు. ఈషా అంబానీ 2008లో ఫోర్బ్స్ రూపొందించిన యువ బిలియనీర్ వారసురాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిల్చారు. యేల్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదివారు. -
అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం
సాక్షి, ఢిల్లీ: అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవలే అన్నాడీఎంకే సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయిన సంగతి తెలిసిందే. పళనిస్వామి ఎన్నిక సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. మద్రాస్ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో అన్నాడీఎంకే తాతాల్కిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు ఈపీఎస్‌కు లైన్ క్లియర్ అయింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం అమలులోకి వచ్చింది. పళనిస్వామి, పన్నీరు సెల్వం ఉమ్మడిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే గత ఏడాది జూలైలో నిర్వహించిన సమావేశంలో ద్వంద్వ నాయకత్వ విధానాన్ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ రద్దు చేసింది. పార్టీ తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామిని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని పన్నీరు సెల్వం హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన లీడర్ వంగవీటి
-
'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం
ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ శనివారం సొంత బోర్డు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శనాస్త్రాలు సంధించాడు. కెప్టెన్ అయ్యే అవకాశం లేకుండా లైఫ్‌టైమ్ బ్యాన్ విధించడంపై అప్పీల్‌కు వెళ్తే కనీస మద్దతు లభించకపోవడం దారుణమని పేర్కొన్నాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఈ అంశం నన్ను మానసిక వేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్(SandpaperGate) వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరున్ బెన్‌క్రాప్ట్‌లు కలిసి బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వారిపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధంతో పాటు కెప్టెన్ కాకుండా లైఫ్‌టైమ్ బ్యాన్ విధించింది. ఇటీవలే వెస్టిండీస్ పర్యటన సందర్భంగా.. రెండో టెస్టుకు ముందు వార్నర్ తన కెప్టెన్సీపై లైఫ్‌టైమ్ బ్యాన్ ఎత్తేయాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు అప్పీల్ చేశాడు. దానిపై అతను బోర్డుతో తీవ్రంగా పోరాడినప్పటికి మద్దతు కరువయిపోయింది. అయితే తన వాదనలను బోర్డు ఎదుట చెప్పేందుకు సిద్ధమని.. కానీ బోర్డు మాత్రం బహిరంగంగా చర్చించాలని పట్టుబట్టింది. ఇదంతా నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే అంశంలా కనిపించింది. అందుకే కెప్టెన్సీ బ్యాన్‌ను ఎత్తేయాలనే అభ్యర్థనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం వార్నర్‌ను మానసిక వేదనకు గురి చేసింది. ఆ ప్రభావం ఆటపై కూడా పడింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 5, 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తాజాగా వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియాపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.'' కొంతమంది పనిగట్టుకొని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంతలా అంటే అది నా ఆటపై తీవ్ర ప్రభావం చూపించింది. కెప్టెన్సీపై లైఫ్‌టైమ్ బ్యాన్ ఎత్తేయాలని అప్పీల్ చేస్తే బోర్డు నుంచి మద్దతు కరువయింది. ఇది నన్ను మానసిక వేదనకు గురి చేసింది. నావైపు నుంచి సమస్యను విన్నవించుకున్నప్పటికి.. క్రికెట్ ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నాకు ఎలాంటి మద్దతు రాలేదు. నా జట్టు సహచరులు, సిబ్బంది నుంచి మంచి సపోర్ట్ ఉన్నప్పటికి క్రికెట్ ఆస్ట్రేలియాకు నేను కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదని స్పష్టంగా అర్థమైంది. ఇది నాకు నిజంగా కష్టకాలంలా ఉంది. దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు ద్వారా డేవిడ్ వార్నర్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకోనున్నాడు. మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ వార్నర్‌కు వందో మ్యాచ్ కానుంది. అయితే జనవరి 2020 నుంచి వార్నర్ బ్యాట్ నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా రాలేదు. ప్రస్తుతం జట్టులో సీనియర్ క్రికెటర్‌గా ఉన్న వార్నర్.. ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు 99 టెస్టులు, 141 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Virat Kohli: శ్రుతి మించిన బంగ్లా ఆటగాళ్ల చర్య.. కోహ్లి ఆగ్రహం షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు -
లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి
ముంబై: మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు మరింత పెద్ద సంఖ్యలో సారథ్య బాధ్యతలను చేపట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో మహిళా లీడర్ల సంఖ్య తగినంత స్థాయిలో లేదని ఆమె పేర్కొన్నారు. నాయకత్వం వహించడానికి తాము అర్హులమేనని మాటిమాటికి నిరూపించుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం మహిళల్లో అంతర్గతంగా పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. దీన్ని అధిగమించి, మరింత మంది స్త్రీలకు అవకాశాలు కల్పించేందుకు మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు మార్గదర్శకులుగా వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ ప్రధాన కార్యాలయంలో జరిగిన మహిళా డైరెక్టర్ల సదస్సులో మంత్రి ప్రసంగించారు. సంఖ్య చాలా తక్కువ.. గణాంకాల ప్రకారం దేశీ కంపెనీల బోర్డుల్లో సగటు మహిళల సంఖ్య 1.03కాగా .. వీరిలో 58 శాతం మంది స్వతంత్ర డైరెక్టర్లేనని సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన 42 శాతం స్వతంత్రేతర డైరక్టర్లుగా తెలియజేశారు. కార్పొరేట్లు తమ బోర్డుల్లో మరింతమంది మహిళలకు అవకాశాలివ్వవలసి ఉన్నట్లు సూచించారు. అంతర్జాతీయంగా బోర్డుల్లో స్త్రీల నాయకత్వం కలిగిన కంపెనీలు అత్యధిక లాభాలు, వృద్ధిని సాధిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా ఇప్పటికీ పలు కంపెనీలు ఒక్క మహిళా డైరక్టరునూ నియమించుకోకపోవడంతో జరిమానాలు కడుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాబోదని, కార్పొరేట్ ప్రపంచమే ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. అయితే మహిళా కార్పొరేట్ లీడర్ల కొరత కారణంగా కొంతమందే పలు కంపెనీలలో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకుల మధ్య అనుసంధానత అవసరం బ్యాంకులు తమ వ్యవస్థల మధ్య సంప్రదింపులకు వీలుగా అనుసంధామై ఉండాలని, అప్పుడే కస్టమర్లకు మెరుగైన మార్గాల్లో సేవలు అందించడం సాధ్య పడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 75వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. చాలా సందర్భాల్లో కస్టమర్లు ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల వద్ద లావాదేవీలు నిర్వహించాల్సి వస్తోందంటూ.. ఇందుకోసం బ్యాంకులు తమ మధ్య సంప్రదింపులకు వీలు కల్పించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బ్యాంకు ఉద్యోగులు స్థానిక బాషలో కస్టమర్లతో సంప్రదింపులు చేసేలా చూడాలని మంత్రి కోరారు. అప్పుడే కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించడం సాధ్యపడు తుందనీ, మోసాలను నివారించేందుకు బ్యాంకులు పెట్టుబడులు పెంచాలన్నారు. ఎంఎస్ఎంఈల బకాయిలను 45 రోజుల్లోగా చెల్లించండి ప్రయివేట్ రంగ కంపెనీలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)ల బకాయిలను 45 రోజుల్లోగా చెల్లించ వలసిందిగా ఆర్థికమంత్రి మరో కార్యక్రమంలో ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ కంపెనీలు సైతం ఎంఎస్ఎంఈలకు చెల్లింపులను సకాలంలో చేపట్టడంలేదంటూ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చిన్న సంస్థలకు సకాలంలో బకాయిల చెల్లింపులపై హామీ లభించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్వోసీకి ఖాతాలు దాఖలు చేశాక 45 రోజుల్లోగా ఎంఎస్ఎంఈ చెల్లింపులను పూర్తి చేయవలసిందిగా ప్రయివేట్ కంపెనీలకు సూచించారు. ఈ బాటలో ప్రభుత్వ శాఖలు, కంపెనీలు 90 రోజుల్లోగా చెల్లింపులు చేపట్టేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోనున్నట్లు లఘు ఉద్యోగ్ భారతీ నిర్వహించిన సదస్సు సందర్భంగా వెల్లడించారు. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తగిన విధంగా స్పందించవలసి ఉన్నట్లు చెప్పారు. -
అమూల్య ప్రతిభ
నల్లమల అడవుల్లో ఓ కుగ్రామం దోమలపెంట. ఆ ఊరిలో పుట్టిన అమ్మాయి ఇమ్మడి అమూల్య. యూఎస్‌లో అడుగుపెట్టబోతోంది... విద్యార్థిగా కాదు! యంగ్ ఉమెన్ లీడర్షిప్ ప్రతినిధిగా...!! యూఎస్ కాన్సులేట్ ఎంపికలో విజేతగా!! ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్ 2022’ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది మన తెలుగుమ్మాయి అమూల్య. ఆమె సొంతూరు మహబూబ్ నగర్ జిల్లాలోని దోమలపెంట. నల్లమల అడవుల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామం అది. ఇప్పుడు హైదరాబాద్‌లోని ‘రాజ బహద్దూర్ వెంకట రామారెడ్డి ఉమెన్స్ కాలేజ్’లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో రెండవ సంవత్సరం చదువుతోంది. కాలేజ్‌లోని ఎన్ఎస్ఎస్, క్విల్స్ క్లబ్, ఐక్యూ ఏస్ క్లబ్, ఎస్‌యూసి క్లబ్‌లలో మెంబర్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలలో చురుగ్గా ఉండేది. నల్గొండలో స్కూల్ రోజుల నుంచి కూడా అమూల్య వక్తృత్వం, వ్యాసరచనలలో ప్రైజ్‌లు అందుకుంది. ఇవన్నీ ఆమెను సామాజికాంశాల మీద నిర్వహించే ర్యాలీల్లో ముందు వరుసలో నిలబెట్టాయి. వీటికి తోడుగా ఆమె తన ఊరి స్కూల్ కోసం, ఆడపిల్లల చదువు గురించి స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా తోడయ్యాయి. అమూల్య తన ఊరి కబుర్లు చెబుతూ నానమ్మ ఇమ్మడి సామ్రాజ్యం గారిని ప్రముఖంగా గుర్తు చేసుకుంది. ‘‘మా దోమలపెంటలో ఆడపిల్లలు చదువుకోవడం ఓ విచిత్రం. అలాంటిది మా నానమ్మ తన ఎనిమిది మంది కొడుకులతోపాటు కూతుర్ని కూడా చదివించింది. తాతయ్య పోవడంతో ఇంటి బాధ్యత పూర్తిగా నానమ్మ మీదనే పడింది. ఆమె బర్రెల పాలు అమ్మి అంతమందినీ చదివించింది. ఆడపిల్లలను బడికి పంపించని ఊరిలో, ఇన్ని ఆర్థిక కష్టాల మధ్య మా అత్తమ్మను చదివించడం అంటేనే ఆడపిల్లలు కూడా చదువుకోవాలని ఆమె ఎంత గట్టిగా నమ్మిందో తెలుస్తోంది. ఆ ప్రభావం మా అందరి మీదా ఉంది. పెద్ద నాన్నల నుంచి మా నాన్న చిన్నాన్నలు అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్లు తమ ఊరికి, స్కూల్‌కి ఏదో ఒకటి చేయాలని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. నేను కూడా ఏటా ఆగస్టు 15వ తేదీ, జనవరి 26న దోమలపెంట స్కూల్‌కి వెళ్లి విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, ఇతర స్టేషనరీ ఇస్తుంటాను. స్కూలు ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అమ్మాయిల ఉన్నత చదువులు ఎంత అవసరం అనే విషయాల మీద మాట్లాడేదాన్ని. నాన్న వాళ్లు మాత్రం ప్రగతిపథం అనే చారిటీతో స్కూల్‌కి వాటర్ ఫిల్టర్, ఫ్యాన్లు ఇచ్చేవాళ్లు. ఇవన్నీ నేను ఇష్టంగా చేస్తుంటాను. కొన్నేళ్ల కిందట మా ఊరిలో వీథి పక్కన పడి ఉన్న ఓ అమ్మాయిని ఓ ముసలావిడ దగ్గరకు తీసి పెంచింది. ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ చదువుతోంది. కరోనా ఆన్లైన్ క్లాసుల సమయంలో తనకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాం. మంచి స్టూడెంట్ అని అప్పుడు తెలిసింది. టెన్త్ తర్వాత ఆ అమ్మాయి కాలేజ్ ఎడ్యుకేషన్ బాధ్యత కూడా మా కుటుంబమే తీసుకుంది. ‘మనం మనకోసం చేసుకున్న పని కంటే సమాజం కోసం చేసిన పనిలో ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది’ అని నమ్ముతాను. యూఎస్ కాన్సులేట్ నన్ను ఎంపిక చేయడానికి ఇవన్నీ దోహదం చేశాయి. దశల వారీగా వడపోత మా కాలేజ్ వాళ్లు కొందరు విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ముగ్గురిని ఎంపిక చేసి ఆ ముగ్గురినీ హైదరాబాద్‌లో ఉన్న యూఎస్ కాన్సులేట్‌కి పంపించారు. వాళ్లను కాన్సులేట్ వాళ్లు మళ్లీ ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ కాన్సులేట్‌లోనే జరుగుతుంది. కానీ కరోనా కారణంగా జూమ్ ఇంటర్వ్యూ చేశారు. దేశంలో అన్ని కాన్సులేట్ల నుంచి ఇంటర్వ్యూ రికార్డులు ఢిల్లీ కాన్సులేట్‌కి పంపిస్తారు. వాళ్లు వాటన్నింటినీ పరిశీలించి ఫైనల్‌గా ముగ్గురిని ఎంపిక చేస్తారు. ‘స్టడీ ఆఫ్ ద యూఎస్ ఇన్స్టిట్యూట్స్(ఎస్యూఎస్ఐ) 2022’కి ఎంపికైన ముగ్గురిలో నాతోపాటు అహ్మదాబాద్ నుంచి ఒకమ్మాయి, చెన్నై నుంచి ఒకమ్మాయి ఉన్నారు. కాన్సులేట్‌కి ఇచ్చిన నివేదికలో ‘నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను’ అనే వివరాలు రాయాలి. అలాగే ఈ ‘ఎస్యూఎస్ఐ ప్రోగ్రామ్‌కి హాజరైన తర్వాత ఆ సమాచారంతో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాను’ అనే విషయాన్ని కూడా చెప్పగలగాలి. అందులో మన భావంతోపాటు ఇంగ్లిష్ ప్రావీణ్యత, లీడర్షిప్ క్వాలిటీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు’’ అంటూ ఎన్నో అమూల్యమైన విషయాలను వివరించింది అమూల్య. ఆమె జూన్‌నెల 23వ తేదీన యూఎస్ విమానం ఎక్కనుంది. 25వ తేదీ నుంచి యూఎస్, కాన్సాస్ రాష్ట్రంలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్’ లో మొదలయ్యే సమావేశాల్లో పాల్గొననుంది. ఆల్ ది బెస్ట్ అమూల్యా! మాకు గర్వకారణం! యూఎస్ కాన్సులేట్‌కు మేము మా విద్యార్థులను నామినేట్ చేసేటప్పుడు ‘ఆ విద్యార్థినే ఎందుకు నామినేట్ చేస్తున్నాం’ అనే అంశాన్ని సమగ్రంగా వివరించాలి. చదువులో చురుగ్గా ఉండడంతోపాటు సమాజానికి తన వంతు కంట్రిబ్యూషన్ ఇస్తున్న వారిని ఎంపిక చేయాలి. ఫౌండేషన్లు, చారిటీలు, ఎన్జీవోలతో కలిసి పని చేయడం వంటివి ప్రధానంగా ఉంటాయి. అమూల్య ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి. ఆడపిల్లల చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపించని మన భారతీయ గ్రామాల్లో అదొకటి. అలాంటి చోట నుంచి వచ్చిన ఈ అమ్మాయి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా తనలాంటి ఆడపిల్లలందరూ ఎదగాలని కోరుకునేది. అందుకోసం గ్రామాలకు వెళ్లి ఆడపిల్లలకు ఉన్నత చదువు పట్ల అవగాహనతోపాటు, ‘ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి’ వంటి విషయాల్లో మెళకువలు చెప్తుంటుంది. ఇన్ని అర్హతలు ఉండడం వల్లనే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది అప్లికేషన్ల నుంచి ఈ అమ్మాయికి అవకాశం వచ్చింది. ఒక చురుకైన అమ్మాయి తన సేవలను మరింత విస్తరింపచేయడంలో మా కాలేజ్ పాత్ర ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది. – సంయుక్త, నోడల్ ఆఫీసర్, ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ – వాకా మంజులారెడ్డి -
సిబ్బందికి మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాం
న్యూఢిల్లీ: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని తీర్చిదిద్దుకోవడంపై ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా దృష్టి సారించింది. ఇందులో భాగంగా లీడర్షిప్, మేనేజ్మెంట్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు మార్కెట్లో ట్రెండ్లపై పట్టు సాధించేలా ఉద్యోగుల కోసం శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గీతం యూనివర్సిటీతో జట్టుకట్టింది. ’ఫోర్ పిల్లర్స్ ఫర్ ఫ్యూచర్ రెడీ మేనేజర్స్’ పేరిట మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 27 మంది ఉద్యోగులకు శిక్షణ కల్పిస్తోంది. వైజాగ్ క్లస్టర్‌లోని మేనేజర్ నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి వరకూ వివిధ హోదాల్లో ఉన్న సిబ్బంది దీని కోసం ఎంపికయ్యారని అరబిందో ఫార్మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) యూఎన్‌బీ రాజు తెలిపారు. నెలకు రెండు శనివారాలు చొప్పున నాలుగు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుందని వివరించారు. భవిష్యత్‌లో కొత్త హోదాలు, బాధ్యతలను నిర్వర్తించేందుకు కావాల్సిన సామర్థ్యాలను సంతరించుకోవడానికి ఉద్యోగులకు ఇది తోడ్పడగలదని రాజు పేర్కొన్నారు. -
ఆకాశంలో సగం.. అవకాశాల్లో ఎక్కడ?
ప్రస్తుతం కంపెనీలు.. పురుషులకు దీటుగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. లీడర్షిప్ హోదాల్లోని మహిళలకు వేతనాలపరంగా సరిగ్గా న్యాయం జరగడం లేదు. కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ 2021 టోటల్ రెమ్యూనరేషన్ సర్వే (టీఆర్ఎస్)లో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లో పురుషుల వేతనాలతో పోలిస్తే మహిళా ఉద్యోగుల జీతభత్యాలు 95–99 శాతం స్థాయిలో ఉంటున్నాయి. కానీ మధ్య, సీనియర్ స్థాయుల్లోకి వచ్చేటప్పటికీ ఈ వ్యత్యాసం గణనీయంగా పెరుగుతోంది. వారి వేతనాలు .. పురుష ఉద్యోగులతో పోలిస్తే 87–95 శాతం స్థాయికే పరిమితం అవుతున్నాయి. కంపెనీ లాభాల్లో కీలక పాత్ర పోషించే హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగా ఉండటం, ఎదిగే అవకాశాలు .. ప్రమోషన్ల ప్రక్రియ నెమ్మదిగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. 900 పైగా కంపెనీలు, 5,700 పైచిలుకు హోదాలు, మొత్తం మీద 14 లక్షల ఉద్యోగుల డేటా ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు. ఎంట్రీ లెవెల్లో ప్రాతినిధ్యం ఓకే.. సాంకేతిక రంగంలో ఎంట్రీ స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం 43 శాతంగా ఉంది. కానీ అదే మేనేజర్ స్థాయికి వచ్చే సరికి 12–17 శాతానికి పడిపోగా.. ఇక ఎగ్జిక్యూటివ్ స్థాయికి వచ్చేసరికి మరింత తగ్గిపోయి 4–8 శాతానికే పరిమితమైంది. ఐటీ, కస్టమర్ సర్వీస్, ఇంజినీరింగ్.. సైన్స్, మానవ వనరులు, డేటా అనలిటిక్స్ .. బిజినెస్ ఇంటెలిజెన్స్ మొదలైన విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంటోంది. మరోవైపు, లీగల్, ఆడిట్.. సేల్స్, మార్కెటింగ్.. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో చాలా తక్కువగా ఉంటోంది. ఉద్యోగుల విషయంలో కంపెనీలు వైవిధ్యానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ .. జవాబుదారీతనం లేకపోవడం వల్ల అంతర్గతంగా దీనికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని మెర్సర్ సీనియర్ ప్రిన్సిపల్ మాన్సీ సింఘాల్ తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళల ఉద్యోగావకాశాలు, భద్రత, జీతభత్యాలను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన కొత్త కార్మిక చట్ట నిబంధనలు స్వాగతించతగ్గవే అయినప్పటికీ కంపెనీలు ఈ దిశగా చురుగ్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంస్థలకు విలువను జోడించే కీలక హోదాల్లో మహిళల పాత్ర పెరిగే కొద్దీ లింగ సమానత్వాన్ని సాధించడం సాధ్యమేనని తెలిపారు. -
యువతరం చేతికి గ్రామ నాయకత్వం
సాక్షి, అమరావతి: రెండున్నరేళ్ల తర్వాత గ్రామాల్లో ఏప్రిల్ నుంచి తిరిగి సర్పంచుల పాలన మొదలైంది. 1,30,966 మంది వార్డు సభ్యులుగా, 13,097 మంది సర్పంచులుగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. ఈ ఏడాదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా.. 9,675 మంది ఎంపీటీసీలు, 650 జెడ్పీటీసీలు బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర మందికి పైగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. వీరిలో 85 శాతం మంది యువ నాయకత్వమే కావడం గమనార్హం. ఇదే సమయంలో గ్రామీణ పాలనలో ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకొచ్చింది. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా గ్రామాల్లో గ్రామ కంఠంగా వర్గీకరించిన ప్రాంతంలో ఇళ్లకు తొలిసారి అధికారిక యాజమాన్య పత్రాల జారీ ప్రక్రియను చేపట్టింది. గ్రామాల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా జిల్లా పరిషత్లలోనూ రెండో డిప్యూటీ చైర్మన్, మండల పరిషత్‌లలో రెండో ఉపాధ్యక్ష పదవులను కొత్తగా సృష్టించి పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఇప్పటికే జెడ్పీలో రెండో డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నికలు ముగియగా.. మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. -
సిద్దిపేట బల్దియాకు లీడర్షిప్ అవార్డు
సిద్దిపేటజోన్: వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛబడి పేరిట ప్రజల్లో చెత్త పునర్వినియోగంపై అవగాహన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ పురస్కారం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో నెట్వర్క్ కలిగి, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖకు అనుబంధంగా పనిచేసే ఎర్త్ డే ఆర్గనైజేషన్, సిద్దిపేట మున్సిపాలిటీ లీడర్షిప్ అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క సిద్దిపేటకే ఈ అవార్డు రావడం విశేషం. సిద్దిపేటతో పాటు కోయంబత్తూరు, భువనేశ్వర్, చండీగఢ్, వాడి, జమ్మూ, రాజ్‌కోట్, బెంగళూరు తదితర పట్టణాలకు సైతం ఈ పురస్కారం లభించింది. సోమవారం సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. -
ఏపీ: ఐఎల్ఈజీ వైస్ ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి సమీర్‌శర్మ
సాక్షి, విజయవాడ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈజీ) వైస్ ఛైర్మన్, మెంబర్ సెక్రటరీగా సమీర్‌శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్‌శర్మ ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. -
టీడీపీలో వికేంద్రీకరణ సెగ
అధినాయకుడికి చెమటలు పడుతున్నాయి.. చంద్రబాబుకు ప్రజల్లోనే కాదు పార్టీలోనూ పరపతి పోయే పరిస్థితి ఎదురవుతోంది.. అమరావతి పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.. మీ స్వార్థం కోసం మా రాజకీయ జీవితాలను బలి ఇస్తారా అని సొంత పార్టీ నేతలే ప్రశి్నస్తున్నారు.. విశాఖ టీడీపీ నేతల బాటలో అధినాయకత్వానికి వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయి.. విశాఖ రాజధాని కావాలని తేల్చి చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పరిపాలన వికేంద్రీకరణను ప్రజలంతా ఆహ్వానిస్తున్నారు. మేధావులు స్వాగతిస్తున్నారు. రైతు, వ్యాపార, ఇతరత్రా వర్గాలన్నీ మద్దతు పలుకుతున్నాయి. కానీ ప్రతిపక్షం టీడీపీ మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకోవడమే కాదు గట్టిగా పట్టుబడుతున్నది. దీన్నిబట్టి వారి స్వార్థమేంటో తేలిపోయిందని ప్రజలే చర్చించుకుంటున్నారు. అమరావతి చుట్టుపక్కల భూములన్నీ టీడీపీ నేతలు కొనుగోలు చేయడంతో పరిపాలన వికేంద్రీకరణ చేస్తే ఎక్కడ తమ భూములకు విలువ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారన్న విషయం ప్రజలకు అర్థమైంది. దీంతో టీడీపీపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇ ప్పుడిప్పుడే ఆ పార్టీ నాయకులు గమనిస్తున్నారు. అధినాయకత్వం అజెండా నుంచి బయటపడుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలమని సంకేతాలు పంపిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ బయటపడగా, మరికొందరు నేతలు త్వరలో ఆయన బాట పట్టనున్నారు. ప్రస్తుతం లోపాయికారీగా మంతనాలు జరుపుతున్నారు. విశాఖపట్నం టీడీపీ నేతలు ఏ విధంగానైతే మద్దతు తెలిపారో, అదేవిధంగా బయటికొచ్చి తమ అభిప్రాయం చేపేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు అజెండాకు విరుద్ధంగా... చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్న కళా వెంకటరావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ తదితర కీలక నేతలు మాత్రమే అమరావతి అజెండాను భుజానికి ఎత్తుకుంటున్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా యాక్ట్ చేస్తున్నారు. అయితే, జిల్లా అంతటిని ఒకే దారికి తీసుకురావడంలో విఫలమయ్యారు. మొన్న జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో అమరావతికి అనుకూలంగా తీర్మానం చేద్దామని గట్టిగా యతి్నంచినా వారి ఆటలు సాగలేదు. మాజీ మంత్రి కోండ్రుతోపాటు మరికొందరు అభ్యంతరం చెప్పడంతో వెనక్కి తగ్గారు. విశాఖను రాజధానిగా ప్రజలు స్వాగతిస్తుంటే మనం వ్యతిరేకించడమేంటని అడ్డుతగలడంతో సమన్వయ కమిటీ సమావేశంలో అమరావతికి అనుకూలంగా తీర్మానం చేయలేకపోయారు. దీంతో పార్టీలో చంద్రబాబు అజెండా నడవదని దాదాపు తేలిపోయింది. ఇంతలో రాష్ట్రంలో పరిణామాలు క్షణంక్షణం మారిపోతున్నాయి. మూడు రాజధానులకు ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. పెయిడ్ ఆరి్టస్టులతో టీడీపీ నేతలు వెనకుండి అమరావతిలో ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నా ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. రాజకీయ భవిష్యత్తుపై బెంగ వికేంద్రీకరణకు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విశాఖను రాజధానిగా చేయవద్దని ఎవరైనా అంటే ప్రజలు తిరగబడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. చంద్రబాబు భజన చేసే నేతలు తప్ప మిగతా వారంతా పునరాలోచన చేస్తున్నారు. లోపాయికారీగా మాట్లాడుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా నేతలు ఏ విధంగానైతే సమావేశమై విశాఖను రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రకటించారో అదే రకంగా ఇక్కడి నేతలు కూడా సమావేశమై తమ అభిప్రాయాన్ని బాహాటంగా చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. కొందరు నేతలు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించనున్నారు. శ్రీకాకుళంలో పలుచోట్ల వికేంద్రీకరణకు అనుకూల సదస్సులను ఏర్పాటు చేయడమే కాకుండా రాజకీయాలకు అతీతంగా ర్యాలీలు కూడా చేయాలని భావిస్తున్నారు. అందుకు తటస్థులుగా ఉన్న వారిని ముందు పెట్టి, వారి ఆధ్వర్యంలో విశాఖకు అనుకూలంగా నినదించాలని చూస్తున్నారు. చాపకింద నీరులా టీడీపీలోని కొందరు నాయకులు ప్రయతి్నస్తున్నారు. ఇదే జరిగితే టీడీపీలో ప్రకంపనలు రేగనున్నాయి. అధిష్టానానికి ధిక్కార స్వరం విని్పంచినట్టే. చంద్రబాబు అజెండాను ఎత్తుకుంటే తమ రాజకీయ భవిష్యత్ పోయినట్టేనని ఆందోళన చెందుతున్నారు. రామ్మోహన్నాయుడు, అచ్చెన్న, కూన, కళా తదితరులు ఎంత నచ్చచెప్పినా వినే పరిస్థితి ఉండదని, అవసరమైతే తిరుగుబాటు తప్పదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
ఆంతర్యంలోని ఆత్మీయతతోనే ఆశీర్వాదాలు...
అమ్మోరీయులనే శాపగ్రస్తుల సంతతికి చెందిన కనాను ప్రజలు గిబియోనీయులు. వాగ్దాన దేశమైన కనానులో యొహోషువా నాయకత్వంలో సాగుతున్న జైత్రయాత్రలో యొరికో, హాయి పట్టణాలు ధ్వంసమైనట్టే, తాము కూడా సంహారమవుతామని గ్రహించి శాంతి ఒప్పందం కోసం ఎక్కడో దూరదేశం నుండి వచ్చామంటూ గిబియోనీయులు కపట నాటకమాడి యొహోషువా శరణు కోరారు. దేవుని వద్ద విచారణ కూడా చెయ్యకుండానే, యొహోషువా వారికి ప్రమాణం చేశాడు. మూడు రోజుల తర్వాత వాస్తవం తెలిసి వారిని నిలదీస్తే, మీ దేవుడు చాలా గొప్పవాడు, మీ పక్షంగా గొప్ప కార్యాలు చేశాడని విని ఆయన శరణులో, మీ నీడలో బతకాలని నిర్ణయించుకున్నామని వారన్నారు. మాటిచ్చిన తర్వాత మడమ తిప్పకూడదన్న దేవుని పద్ధతికి లోబడి ఇశ్రాయేలీయులు తమ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. సంధి ఒప్పందానికి దేవుడు కూడా ఆమోదముద్ర వేశాడు. గిబియోనీయుల ఉదంతం విని ఆ వెంటనే మిగిలిన కనాను రాజులంతా కలిసి గిబియోనీయులతో సమిష్టిగా మహా యుద్ధం చెయ్యగా ఇశ్రాయేలీయులు కూడా వారికి అండగా నిలిచారు. దేవుడైతే ఒక రోజుపాటు సూర్యుణ్ణి ఉన్నచోటే నిలిపి మరీ వారికి ఘనవిజయాన్నిచ్చాడు(యొహో 10:12). ఇశ్రాయేలీయుల మధ్య పనివారుగా ఉండేందుకు అంగీకరించిన గిబియోనీయులకు, ఆలయంలో బలిపీఠం వద్ద కట్టెలు నరికే, నీళ్లు మోసితెచ్చే పనినిచ్చి, దేవుడు తన ఆరాధనా కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యాన్నిచ్చాడు. లేవీయులనే అర్చకులుండే పట్టణాల్లో దేవుడు గిబియోను పట్టణాన్నికూడా చేర్చాడు. దావీదు వద్ద ఉన్న 30 మంది మహా వీరుల్లో ఇష్మాయా అనే గిబియోనీయుడు కూడా ఉన్నాడని బైబిల్ చెబుతోంది. చక్రవర్తిగా సొలొమోను గిబియోనులో బలులర్పించినప్పుడు దేవుడు అక్కడే ప్రత్యక్షమై అతనికి వరాలనిచ్చాడు, బబులోను చెరనుండి తిరిగొచ్చిన వారిలో 95 మంది గిబియోనీయులు కూడా ఉన్నారని నెహెమ్యా రాశాడు. యెరూషలేము ప్రాకారాల పునర్నిర్మాణంలో కూడా గిబియోనీయుల ప్రస్తావన ఉంది. కాలగర్భంలో కలిసిపోవాల్సిన గిబియోనీయులకు దేవుడు ఇలా మహా చరిత్రనిచ్చాడు. కనానీయులంతా సంహారం కాగా. గిబియోనీయులు మాత్రం, దేవునికి తలవంచి, దేవుని ప్రజలతో సఖ్యత కోరుకొని తమ ప్రాణాలే కాదు, తమ ఉనికిని కూడా కాపాడుకున్నారు. పాముల వివేకం, పావురాల నిష్కపటత్వం విశ్వాసికుండాలన్న యేసుప్రభువు బోధకు గిబియోనీయలే ఉదాహరణ.తలుపు చిన్నదైతే తలవంచడమొక్కటే మార్గం. లేకపోతే తల బొప్పికట్టడం ఖాయం.అపకార దష్టితో కాక ప్రాణభీతితోనే గిబియోనీయులు కపట నాటకమాడారని దేవునికి ముందే తెలుసు. పైవేషాలను కాదు, ఆంతర్యంలో తన పట్ల వారికున్న విశ్వాసాన్ని, భయభక్తుల్ని దేవుడు చూశాడు. పైకి నీతిమంతుల్లాగా ఉన్నా ఆంతర్యంలో నిండా దుష్టత్వంతో జీవించేవాళ్లున్నారు. పైకి నాటకాలాడినా ఆంతర్యంలో ఆత్మీయత ఉన్నవాళ్లున్నారు. దేవుడు మాత్రం ఆంతర్యంలోని భక్తి, నీతి, పరిశుద్ధతను బట్టే ప్రతిస్పందిస్తాడు. కత్తితో తలపడటం కన్నా యుక్తితో మెలగడమే మెరుగనుకొని గిబియోనీయులు అలా గొప్ప ఉపద్రవం నుండి తప్పించుకోవడమే కాక, దేవుని ప్రజల్లో భాగమయ్యారు, దేవుని ఆశీర్వాదాలకూ పాత్రులయ్యారు. మనవాడు కదా, ఇలా చేయవచ్చా? అని ఇతరులను నిందించే ముందు, పైకి ఎంతో భక్తిగా, పవిత్రంగా, నీతిమంతుల్లాగా ప్రవర్తించే నా ఆంతర్యంలో లేదా మనవాళ్ళ ఆంతర్యంలో ఇంతటి మురికి కాలువలా? అని ప్రశ్నించుకునేవాడే నిజమైన విశ్వాసి. విశ్వాసి ఆంతర్యంలోని ఆత్మీయత, ఉదాత్తమైన ఆలోచనలను బట్టే దేవుడు అనూహ్యమైన విజయాలు, ఆశీర్వాదాలిస్తాడు, ఆ విశ్వాసినే కోట్లాదిమందికి ఆశీర్వాదంగా మార్చుస్తాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
అమ్మాయ్.. నువ్వు లీడర్వే
‘నాన్నింటి వాళ్లు ఏదో అన్నారని అమ్మ ఒక్కటే చీకటి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటే నువ్వెళ్లి అమ్మ కన్నీళ్లు తుడిచావా?’ అయితే నువ్వు లీడర్వే! ‘నాన్నకు ఒంట్లో బాగోలేనప్పుడు స్కూటీపై కూర్చొబెట్టుకుని నువ్వే ఆసుపత్రికి డ్రైవ్ చేసుకెళ్లావా?’ అయితే నువ్వు లీడర్వే. ‘ఇంటి సంగతులే కాదు, పొరుగింటి బాధలూ పట్టించుకున్నావా? సహాయం చేశావా? సలహా ఇచ్చావా? సమాధాన పరిచావా?’ అయితే నువ్వు లీడర్వే. నీ వయసెంతని కాదు. అమ్మాయ్.. నువ్వు లీడర్వే! గర్ల్ లీడర్! పదమూడేళ్ల అమ్మాయి, పద్నాలుగేళ్ల అమ్మాయి.. పోనీ పదిహేడూ పద్దెనిమిదేళ్ల అమ్మాయి .. ఏ ఉద్యమాన్ని లీడ్ చెయ్యగలదు? ఏ ప్రభుత్వాన్ని దారిలో పెట్టగలదు?గట్టిగా ఒక నినాదం చెయ్యగలదా? పిడికిలిని బిగించి ‘కదలిరండి’ అని ప్రజలకు గట్టిగా ఒక పిలుపును ఇవ్వగలదా? ‘ఎస్.. షి కెన్’ అంటోందేమిటి ఐక్యరాజ్య సమితి (యు.ఎన్). ‘షీ ఓన్లీ కెన్’ అని కూడా! ఏమిటి అంత నమ్మకం గర్ల్ లీడర్షిప్ మీద! ‘త్వరలోనే చూస్తారుగా’ అని యు.ఎన్! ఏం చూడబోతున్నాం మనం! అది తర్వాత. ఐక్యరాజ్యసమితి కాదు కానీ.. ఆంధ్రప్రదేశ్ ఒక గర్ల్ లీడర్ని కళ్లారా చూసింది. ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డి సభ అది. జనం కిక్కిరిసి ఉన్నారు. ఇప్పుడున్న పాలన ఎంత దుర్మార్గంగా ఉందో ఆయన చెబుతున్నారు. రానున్న పాలన ఎంత ధీమా ఇవ్వబోతోందో వివరిస్తున్నారు. ‘‘నేను స్టేజ్ మీదకు రావచ్చా?’.. ఓ గర్ల్ లీడర్! గర్ల్లీడర్కి అనుమతి లభించింది. అప్పటి వరకు ఆమె గర్ల్ మాత్రమే. కష్టాన్ని చెప్పుకోడానికి రాలేదు ఆమె. కష్టాల్ని చెప్పడానికి వచ్చింది! ‘‘మాట్లాడు తల్లీ’’ అన్నారు జగన్. ఆమె మాట్లాడింది. మామూలుగానే మాట్లాడింది! సభ వింది. ఉద్వేగంతో ఊగిపోయింది. చప్పట్లు కొట్టింది. రాష్ట్రంలో ప్రజాసేవలు ఎంత ‘మహత్తరంగా’ ఉన్నాయో ఆమె మాట్లాడుతోంది. ‘‘... ఆరోగ్య పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. మొన్న ఒకావిడ, మా పక్కింటి ఆవిడ.. గౌరీ అనే ఆవిడ నొప్పుల్తో బాధపడుతూ ఉంటే, అరుస్తూ ఉంటే నేను పరుగెట్టుకెళ్లాను. అప్పుడు వాళ్లింట్లో ఎవ్వరూ లేరు. లేకపోతే.. నేను 108కి ఫోన్ చేస్తే.. వాళ్లు చెప్పింది ఏంటి తెలుసా? ఎక్కడుంటారు, ఏమైందీ అని.. వివరాలన్నీ అడిగేసి, అడిగిన తర్వాత.. ‘టైర్ పంక్చర్ అయిందమ్మా. ఇప్పుడు రాలేము. స్టాఫ్ కూడా ఎవ్వరూ లేరు’ అని చెప్పారు. ‘మరి ఏం చెయ్యమంటారు సార్.. ఇక్కడ ఒకావిడ.. పరిస్థితి చాలా విషమంగా ఉంది. చనిపోయే పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు మీ పరిస్థితి గురించి చెబుతున్నారు...’ అని, ఆమెను ఎలా తీసుకెళ్లాలో తెలీక పిల్లల ఆటో వెళుతుంటే.. షేరింగ్ ఆటో.. అందులో ఎక్కించుకుని తీసుకెళుతుంటే.. ఆటో కుదుపులకు ఆమె బ్లీడింగ్ ఎక్కువవుతుంటే.. ఎక్కడికి వెళ్లాలో తెలీక దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళితే.. తీసుకెళ్లిన ఐదు నిముషాలలో ఆమె ప్రసవించింది. మరి తీసుకురాకపోయి ఉంటే ఆమె ఏమయుండేదో ఒక్కసారి ఆలోచించండి. అంటే అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం’’ అని ఆ అమ్మాయి చెబుతున్నప్పుడు జగన్‌కి ఆమె లీడర్‌లానే కనిపించినట్లుంది.. అభినందనగా ఆమె తల నిమిరారు. పంచ్ డైలాగుల్లేవు. పరిణతి చెందిన గొంతు లేదు. వాక్య నిర్మాణం లేదు. ప్రసంగ విధానం లేదు. సింపుల్‌గా తనకు ఎదురైన అనుభవాన్ని చిన్న చిన్న మాటలోల చెప్పింది.. అంతే. ఆ అనుభవంలో ఆవేదన ఉంది. ఆక్రోశం ఉంది. ఆగ్రహం ఉంది. ప్రజల అసహాయత ఉంది. ప్రభుత్వ ఉదాసీనత ఉంది. ఇన్ని ఉన్నాయి. మరి ఆమెలో.. ఆ అమ్మాయిలో.. లీడర్షిప్ ఎక్కడ ఉంది? వ్యవస్థని ప్రశ్నించడంలో ఉంది! ఒక సామాజిక అంశాన్ని ప్రజల దృష్టికి తేవడంలో ఉంది. అందుకే ఆమె గర్ల్ లీడర్. ఇలాంటి గర్ల్ లీడర్ల కోసమే ఐక్యరాజ్య సమితి వెదుకుతోంది.వెదకి ఏం చేస్తుంది? యుద్ధానికి పంపిస్తుందా? అవును యుద్ధానికే. ఆడపిల్లల చదువుల్ని, ఆరోగ్యాన్ని, ఆలోచనల్ని పట్టించుకోని సామాజిక రుగ్మతలపైకి, దురాచారాలపైకి, వివిధ పేదరికాల పైకి యుద్ధానికి పంపిస్తోంది. ఆ యుద్ధ నినాదం ‘గర్ల్ అప్’. ఆ యుద్ధం పేరు గ్లోబల్ 5కె. ఆ యుద్ధం జరగబోతున్నది భారత్‌లో. ఆ యుద్ధానికి సంసిద్ధమౌతున్న సైన్యం కనీసం 2000 మంది ఆడపిల్లలు. ఎవరికోసం జరుగుతున్న యుద్ధమిది? రాజస్థాన్‌లో కనీస సంక్షేమానికి, ఏమాత్రం సంరక్షణకు నోచుకోని ఆడపిల్లల్ని ఆదుకోవడం కోసం జరుగుతోంది. ఒక ఆడపిల్ల కోసం ఇంకో ఆడపిల్ల చేయబోయే యుద్ధం! ∙∙ కరెక్ట్ పనేనా ఆడపిల్లల్ని యుద్ధానికి పంపడం? ఐక్యరాజ్యసమితికి ఎంత బలం ఉంది! ఎంత బలగం ఉంది! ఒక్క ఆదేశం ఇస్తే దేశాలన్నీ లైన్లోకి వచ్చి నిలబడతాయి. ఒక్క ఉత్తర్వుతో ఆ దేశాలన్నీ తమ ప్రభుత్వాల్ని లైన్లో నిలబెడతాయి. ‘ఫలానా చోట ఆడపిల్లలపై వివక్ష ఉంది. కలెక్టర్‌కి చెప్పి కరెక్ట్ చెయ్యి’ అని చెప్పొచ్చు. ‘మీరిలా ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేస్తుంటే మీ ఊరి అభివృద్ధికి ఒక్క పైసా ఇచ్చేది లేదని’ బెదిరించవచ్చు. ‘ఆడపిల్లని బడికి పంపని ఇంట్లోంచి రేషన్ కార్డు తీసేసుకుంటామనీ, ఆడపిల్లను కూలి పనికి పంపుతున్నారని తెలిస్తే ఇంటి పెద్ద చేత ఊరికి ఒక రోజు ఊడిగం చేయిస్తామని’ హెచ్చరించవచ్చు. ఇవన్నీ చేయాలి గానీ, ఆడపిల్ల చేతికే కత్తి ఇచ్చి పంపడం ఏంటి? కత్తి ఇవ్వబోవడం లేదు ఐరాస. కత్తి కంటే పదునైన, కత్తికంటే పవరైన గుడ్డసంచీని చేతికి అందిస్తోంది. అందులో విరాళాలు సేకరించి ఐక్యరాజ్య సమితికి పంపిస్తారు గర్ల్ లీడర్స్. ఇంటింటికీ వెళ్లేమీ సేకరించరు. 5కె రన్ తీస్తారు. తీస్తున్నప్పుడే విరాళాలు సేకరిస్తారు. వాటిని ఆడపిల్లల జీవితాల్ని మెరుగుపరిచే పథకాలకు, ప్రణాళికలకు, పర్యవేక్షణకు సమితి ఖర్చు చేస్తుంది.సంచీ, సేకరణ ఓకే. ఎందుకిలా ఐక్యరాజ్యసమితి గర్ల్స్లోని లీడర్స్‌ని మోటివేట్ చేస్తోంది? ఎందుకిలా ‘రిజిస్టర్ చేసుకుని 5కె రన్లో పాల్గొనండి’ అని ఆన్లైన్లో ఆహ్వానం పలుకుతోంది? ఆడపిల్లల్ని లీడర్స్‌గా మార్చడం కోసం! 5కె రన్లో రన్ ఒక్కటే ఉండదు. ఉత్సాహం కలిగించే విన్నింగ్ స్పిరిట్ ఉంటుంది. ఉత్ప్రేరకంగా పనిచేసే స్పీచ్‌లు ఉంటాయి. ‘నా ముఖం నేనేమి లీడర్ని’ అని ఏ అమ్మాౖయెనా బిడియంగా నవ్వి, వెనక్కి జరిగితే ఊరుకోరు. ముందుకు లాగుతారు. చేత్తో చెయ్యి ఎత్తిపట్టి ఆ పిల్లని ప్రపంచానికి పరిచయం చేస్తారు. ‘నాన్న అమ్మ మీదకు చెయ్యెత్తినప్పుడు నువ్వెప్పుడైనా నాన్న చేతిని అడ్డుకున్నావా?’ అయితే నువ్వు లీడర్వే! నాన్నింటి వాళ్లు ఏదో అన్నారని అమ్మ ఒక్కటే.. చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే నువ్వెళ్లి అమ్మ కన్నీళ్లు తుడిచావా?’ అయితే నువ్వు లీడర్వే. ‘నాన్నకు ఒంట్లో బాగోలేనప్పుడు స్కూటీపై కూర్చొబెట్టుకుని నువ్వే ఆసుపత్రికి డ్రైవ్ చేసుకెళ్లావా?’ అయితే నువ్వు లీడర్వే. ‘బడిలో తమ్ముడిని ఏడిపిస్తున్నవాడి చెంపను నువ్వెళ్లి ఛెళ్లుమనిపించావా?’ అయితే నువ్వు లీడర్వే. ‘క్యూలో కరెంట్ బిల్లు కడుతున్నప్పుడు నీ వెనుక ఉన్నవాళ్లు ముందుకు తోసుకెళుతుంటే.. ‘ఏయ్.. ఆగు’ అని.. క్యూ అంతా అదిరిపడేలా నువ్వు అరిచావా?’ అయితే నువ్వు లీడర్వే. ‘ఇంటి సంగతులే కాదు, పొరుగింటి బాధలూ పట్టించుకున్నావా? సహాయం చేశావా? సలహా ఇచ్చావా? సమాధాన పరిచావా?’ అయితే నువ్వు లీడర్వే. సొంత సైన్యం అక్కర్లేదు. సాయుధురాలివి కానక్కర్లేదు. విప్లవ సాహిత్యం చదివుండనక్కర్లేదు. నీ పనిలో నువ్వుంటావు. పక్కనెవరో బాధలో ఉంటారు. వెళ్లి, ఏమైంది అని అడుగు. అడిగి, ఆ బాధను పోగొట్టేందుకు చేయగలిగింది చెయ్యి. అది చొరవ. అది బాధ్యత. రెండూ కలిసిందే నాయకత్వం.ఏ ఆడపిల్లలో ఉండదు చొరవ, బాధ్యత కలిసిన నాయకత్వం? అందుకే ఐరాస గర్ల్ లీడర్స్‌ని ఎంపిక చేసుకుంది. తను చేసేది చేస్తోంది. వీళ్లు చేయగలరనుకున్న దాన్ని చేయిస్తోంది. ఐరాస దగ్గర డబ్బుల్లేక కాదు. పిల్లల్ని ‘ఇన్వాల్వ్’ చెయ్యాలనుకుంది. ఆడపిల్లల సమస్యల్ని ఆడపిల్లల చేత ఫోకస్ చేయించాలనుకుంది. వీళ్ల 5కె రన్ మే 18న జరుగుతోంది. ‘గర్ల్ అప్’ 2010లో మొదలైంది. తొమ్మిదేళ్లుగా ఆడపిల్లల్లోని లీడర్‌షిప్‌ని పరుగులు పెట్టిస్తోంది. ఈ ఏడాది మన దేశంలో. రాజస్థాన్ కోసం. అక్కడి ఆడపిల్లల కోసం. -
మహిళంటేనే లీడర్షిప్
ఆమెకు చదువుకోవడం ఇష్టం, చదువు చెప్పడం అంతకంటే ఎక్కువ ఇష్టం. ఈ రెండు ఇష్టాలను నెరవేర్చుకోవడంలోనే సాగిపోతోంది ఆమె జీవన ప్రస్థానం. ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్ సైకాలజీ, ఎం.ఫిల్... ఇంతవరకు ఇండియాలో. ఆ తర్వాత సాఫ్ట్ స్కిల్స్‌లో ట్రైనర్‌గా ఉండి, యుఎస్, యూకేల్లో పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. అవన్నీ పూర్తయిన తర్వాత ‘ఐ విల్’ అంటూ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పరిశోధన చేశారు. బెంగళూరు ఐఐఎమ్ ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘ఉమెన్ ఇన్ లీడర్షిప్, ఇండియా’ కోర్సును తన పరిశోధన ద్వారా క్షేత్రస్థాయికి తీసుకెళ్లారామె. ఇవన్నీ కూడా మహిళల సమగ్ర వికాసానికి ప్రోత్సాహాన్ని అందించడానికే అంటున్నారు డాక్టర్ అరిమండ విజయ శారదారెడ్డి. గుంటూరు జిల్లా పల్నాడులోని కొదమగుండ్ల.. విజయశారద సొంతూరు. తండ్రి ఉద్యోగ రీత్యా గుంటూరులో పెరిగారామె. అత్తగారిల్లు తెనాలి దగ్గర కొల్లిపర. భర్త వరప్రసాద్ రెడ్డికి మిధానిలో ఉద్యోగం. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సంతోష్ నగర్లో కాపురం. రోజంతా ఖాళీగా ఉండడం నచ్చని గుణం ఆమె టీచర్‌గా మారడానికి కారణమైంది. ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్‌గా చేరి చదువు చెప్పడంలో ఉండే సంతోషాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఆమె విద్యాభ్యాసం అంతా సిస్టర్స్ కాన్వెంట్లో సాగడంతో, ఇంగ్లిష్ మీద సాధించిన పట్టు విజయశారదను మంచి టీచర్‌గా నిలబెట్టింది. క్రమంగా నలంద, హోలీమేరీ విద్యాసంస్థల స్థాపనకు దారి తీసింది కూడా సిస్టర్స్ కాన్వెంట్లో పడిన పునాది, టీచింగ్ మీదున్న ఇష్టమేనన్నారామె. అయితే అంతటితో తన చదువుకు స్వస్తి చెప్పకపోవడమే ఆమెలోని విలక్షణత. మన శక్తిని మనమే గుర్తించాలి నాయకత్వ లక్షణాలు మగవాళ్లకే పరిమితం కాదు, మహిళల్లోనూ పుష్కలంగా ఉంటాయి. పుట్టుకతో స్వతహాగా వచ్చిన నాయకత్వ లక్షణాలు కూడా మన మహిళల్లో అంతర్లీనమైపోతున్నాయి. అవి అంతర్థానమై పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. ఆ ప్రయత్నంలో భాగమే బెంగళూరు ఐఐఎమ్‌లో విజయశారద చేసిన ‘ఐ విల్’ కోర్సు. ‘‘ఐ విల్ అంటే... ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్. మహిళల్లో అంతర్లీనంగా ఉండిపోతున్న నాయకత్వ లక్షణాలు వెలికి తీయడానికి రూపొందిన కోర్సు అది. విదేశాల్లో మహిళలకు స్వతంత్ర భావాలు, దృఢమైన వ్యక్తిత్వం స్వతహాగా కనిపిస్తాయి. తాము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరొకరి ఆమోదం, అంగీకారం కోసం ఎదురు చూడరు. భర్త మద్దతు ఆశించరు. కష్టమైనా, నష్టమైనా తామే భరిస్తారు. అక్కడి సమాజాలు కూడా అందుకు దోహదం చేస్తాయి. మన దగ్గర ఒక మహిళ సొంతంగా నిర్ణయాలు తీసుకుని వ్యాపారరంగంలో ముందడుగు వేసినా సరే, సమాజం నుంచి ఆమోదం పెద్దగా లభించదు. అదే మహిళ భర్త సహకారంతో వ్యాపారం మొదలు పెడితే ప్రభుత్వపరమైన అనుమతులు రావడం కొంత సులువు అవుతుంది. ఒక మహిళ భర్త సహకారం లేకుండా పరిశ్రమను స్థాపించింది.. అంటే చాలా సందర్భాల్లో ఆమెకు బ్యాంకు రుణాలు కూడా కష్టమవుతుంటాయి. ఈ ధోరణిని తుడిచేయడానికి కంకణం కట్టుకోవాల్సింది మహిళలే’’ అన్నారు విజయ శారద. చట్రం నుంచి బయటికి రావాలి మన మహిళలు అనేక బాలారిష్టాలను ఎదుర్కొని పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. అయితే పరిధిని విస్తరించుకోవడంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ‘‘ప్రపంచదేశాల్లో జరిగే ఎంట్రప్రెన్యూర్ మీట్లలో విదేశీ మహిళల్లో ఎక్కువ మంది ఆటోమొబైల్ ఇండస్ట్రీ నడిపేవాళ్లు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల నిర్వహకులు కనిపిస్తారు. మనవాళ్లు.. ముఖ్యంగా తెలుగు వాళ్లు వంటింటి ఉత్పత్తులు, బ్యూటీ ప్రోడక్ట్స్, ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులు, కుట్లు అల్లికలు, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో వస్తుంటారు. వాటికి అమెరికాలో మంచి మార్కెట్ ఉన్న మాట వాస్తవమే. అవన్నీ క్రియేటివిటీకి ప్రతీకలే. అయితే అవేవీ ఉత్పాదకతను పెంచవు. ఓవరాల్ డెవలప్మెంట్కి దారి తీసే రంగాలు కాదు. అందుకే మనం ఆ చట్రం నుంచి బయటికొచ్చి ఇతర రంగాల్లో నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రపంచంతోపాటు పరుగెత్తగలుగుతాం. మనలో ఉన్న సంప్రదాయమైన స్కిల్స్‌కే పరిమితం కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు కొంత వరకు ముందడుగులో ఉంటున్నాయి’’ అన్నారామె. పాలనా నైపుణ్యమూ ఉండాలి ‘‘పరిశ్రమల రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ మహిళల భాగస్వామ్యం మన దగ్గర చాలా తక్కువ. 33 శాతం రిజర్వేషన్ గురించి చైతన్యవంతం చేయడంతోపాటు, రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకుంటే బూత్ స్థాయి నుంచి కెరీర్‌ని మొదలు పెట్టాలని చెబుతుంది ‘ఐ విల్’ కోర్సు. సింగపూర్‌లో రాజకీయ నాయకులు.. రాజకీయ రంగాన్ని, ఉపాధి రంగాన్ని కలవనివ్వరు. ఉపాధి కోసం ఎవరికి వాళ్లు సొంత వ్యాపారాలు చేసుకుంటూ, సేవాభావంతో రాజకీయ రంగంలోకి వస్తారు. ప్రజలకు సర్వీస్ చేయడానికి మాత్రమే ఉంటుంది రాజకీయరంగం. అందుకే సింగపూర్ పార్లమెంట్... బెస్ట్ పార్లమెంట్‌గా గుర్తింపు పొందింది. కోర్సులో భాగంగా అక్కడికి వెళ్లి అధ్యయనం చేయడం వల్ల నా దృష్టి కోణం విస్తృతమైంది. మన దగ్గర స్థానిక సంస్థల్లో మూడవ వంతు రిజర్వేషన్ కల్పించడం వల్ల కొన్ని తొలి అడుగులు పడుతున్న మాట వాస్తవమే. అయితే అలా ఎన్నికైన మహిళలు చాలామంది ప్రతి చిన్న విషయానికీ భర్త, కుటుంబ సభ్యుల మీద ఆధారపడుతూ, సంతకాలకే పరిమితం అవుతున్నారు. అలా కాకుండా పాలన నైపుణ్యం పెంచుకోవాలి. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లుకు మోక్షం వచ్చినప్పుడు మన మహిళ జీవికలో కొత్త కోణాలు బయటకు వస్తాయి. రిజర్వేషన్ ఉంటే ఆ స్థానంలో తప్పకుండా మహిళ మాత్రమే ఎన్నికవుతుంది... కాబట్టి అసెంబ్లీ, పార్లమెంట్లలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళలు, పిల్లల కోసం చట్టాలు చేయడంలో మగవాళ్ల దృక్పథానికి మహిళ దృష్టికోణం కూడా మమైకమవుతుంది. యుఎన్ఓలో ప్రసంగం విద్యార్థిగా, పారిశ్రామికవేత్తగా ప్రపంచంలో నాలుగు ఖండాల్లో, ముప్పైకి పైగా దేశాల్లో పర్యటించారు విజయ శారద. అన్ని దేశాల్లోనూ మహిళల సామాజిక స్థితిగతులను మనదేశంతో బేరీజు వేసుకుంటూ వచ్చారు. మహిళలకు వేధింపుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశమైనా ఒక్కటేనన్నారామె. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్‌లో భారతీయ సంస్కృతి గొప్పదనం గురించి ప్రసంగించారు. కాలేజ్‌లు నిర్వహణలో ఆమెకొచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి సైకాలజీలో కోర్సు చేశారు. ‘‘వేలాది మంది విద్యార్థులను ఒక తాటి మీదకు తీసుకురావాలంటే చిన్న సంగతి కాదు. వాళ్లకు మనం చెప్పేది మంచి మాటే అయినా, వాళ్లకు నచ్చే రీతిలో చెప్పకపోతే వినరు. అందుకే కౌమారదశలో ఉన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, వాళ్లకు ఎలా తెలియచెప్పాలనే మెళకువలు నేర్చుకోవడానికి సైకాలజీ చదివాను. ఆ తర్వాత నా నిర్వహణ సామర్థ్యం మెరుగుపడిన సంగతి నాకే తెలిసింది. ఒక సంస్థ నిర్వహణకు అవసరమైనట్లు మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్) సదస్సుల్లో కూడా నేను నన్నే ఉదాహరణగా చెబుతుంటాను’’ అన్నారు శారద. ఆమె కోవెలో లైఫ్ మెంబర్ కూడా.మన చుట్టూ ఉన్న వాళ్లలో... ‘అరవై ఏళ్లు నిండాయి, ఇంక చేసేదేముంది’ అని విశ్రాంత జీవనం గడపడానికి సిద్ధమయ్యేవారిని ఎందరినో చూస్తుంటాం. అయితే శారద ఇరవై నాలుగ్గంటలూ ఉపయుక్తమైన వ్యాపకాలతో నిండి ఉంటుంది. అన్ని పనుల నుంచి కొంచెం వెసులుబాటు దొరికి తీరికగా అనిపించినప్పుడు మరేదైనా కోర్సులో చేరదామా అనిపిస్తుందంటారీ నిత్య విద్యార్థి. ఆమె పేరులో సరస్వతీదేవి ఉంది, విజయమూ ఉంది. తన సంకల్పబలంతో వాటిని సార్థకం చేసుకున్నారు. – వాకా మంజులారెడ్డి సాటి మహిళకు సాయం మహిళను రెండవ స్థాయి పౌరురాలిగా అణచి వేసింది సమాజమే, కాబట్టి ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. పిల్లల పెంపకం కూడా సమాజం నిర్దేశించిన చట్రంలోనే సాగుతుంది. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య అంతరం తరతరానికి పెరిగిపోతూ వచ్చింది. దాన్ని తగ్గించడానికి కొన్ని తరాల పాటు పడక తప్పదు. ‘ఐ విల్’ కోర్సు ప్రధానాంశాల్లో జీరో ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ కూడా ఒకటి. మా బ్యాచ్‌లో శిక్షణ తీసుకున్న మహిళలు ఢిల్లీ, అస్సాం, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. విద్యాసంస్థల నిర్వహణలో నెలకు ఐదు వందల మందికి జీతాలివ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యతను పక్కన పెట్టి మరొకటి తలకెత్తుకునే పరిస్థితిలో లేకపోవడంతో నేనటువైపు అడుగు వేయలేదు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టకపోయినప్పటికీ నా దృష్టికి వచ్చిన సామాజిక సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం అందిస్తున్నాను. ముఖ్యంగా స్కూళ్లలో ఆడపిల్లలకు టాయిలెట్లు లేవని తెలిసినప్పుడు ఆర్థిక సహాయం చేయడం, మంచినీళ్లు లేని కాలనీలకు ట్యాంకర్లు పంపించడం వంటివి చేస్తున్నాను. ఓ మహిళగా సాటి మహిళలకు చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు సహకారం అందిస్తున్నాను. – డాక్టర్ ఎ. విజయ శారదారెడ్డి, హోలీమేరీ విద్యాసంస్థల సెక్రటరీ -
హత్యకు దారితీసిన ఆధిపత్య పోరు
సాక్షి, వనపర్తి క్రైం: ఇద్దరి మధ్య కొనసాగిన ఆధిపత్య పోరు చివరికి ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి వనపర్తిలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తిలోని పీర్లగుట్లకు చెందిన బల్రాం కుమారుడు రాఘవేంద్ర అలియాస్ రఘు (28), సాయినగర్కాలనీకి చెందిన అరుణ్‌యాదవ్ గతంలో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. గత ఆరు నెలల నుంచి ఎవరికి వారుగా విడిపోయి.. ఆధిపత్య పోరును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో వేడుకలకు వేర్వేరుగా హాజరయ్యారు. అక్కడ వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో అరుణ్‌యాదవ్‌తోపాటు ఉన్న మరికొందరు రఘుపై దాడిచేశారు. అక్కడి నుంచి బైక్‌పై తీసుకువచ్చి రామాలయం వద్ద పడేశారు. అంతటితో ఆగక పెద్దబండ రాయితో అతని తలపై మోదారు. వెంటనే చుట్టు పక్కల వారు రఘును ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. అపంతనం అరుణ్‌యాదవ్ తనంత తానుగా పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. హత్య సంఘటనలో నిందితుడితోపాటు.. అతని సోదరుడు, మరో నలుగురు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి ఇంట్లో వస్తువుల ధ్వంసం రఘును హత్య చేశాడనే కోపంతో వనపర్తి పట్ట ణం సాయినగర్‌కాలనీలో ఉన్న నిందితుడు అరుణ్‌యాదవ్ ఇంట్లో ఉన్న వస్తువులను మంగళవా రం రాత్రి పలువురు ధ్వంసం చేశారు. ఓ ఇన్నోవా, కారు అద్దాలు పగులగొట్టారు. అనంతరం రఘు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్పత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో డీఎస్పీ సృజన, సీఐ సూర్యానాయక్ అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. బుధవారం రఘు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో అనుమానం ఉన్న పలువురిని పోలీసులు విచారిస్తున్నారు. రఘు తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. లీడర్లుగా ఎదగాలనే ఆశతో.. లీడర్లుగా ఎదగాలనే ఆశతో వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు పెరిగాయి. అది కాస్త హత్యకు దారితీశాయి. ఈ హత్య ప్రమేయంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. 2018 డిసెంబర్ 31న అర్ధరాత్రి పట్టణంలోని సంతబజార్ దగ్గర ఒక యువకుడిని కొందరు హత్య చేశారు. అది మరవక ముందే మరో హత్య సంఘటన జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
మోదీకి ‘ఫిలిప్ కోట్లర్’ అవార్డు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు స్వీకరించారు. ‘ప్రజలు, లాభం, భూమి’అనే అంశాల ప్రాతిపదికన విశేష ప్రతిభ చూపిన దేశాధినేతలకు ఈ అవార్డు ఇస్తారు. విశిష్ట నాయకత్వ లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకుగాను ప్రధానికి ఈ అవార్డు ఇచ్చినట్లు అవార్డు కమిటీ తెలిపింది. ‘ఆయన చేస్తున్న నిస్వార్థ సేవ, అవిశ్రాంత కృషి వల్ల ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భారత్ అభివృద్ధి సాధించింది’అని కమిటీ పేర్కొంది. మోదీ పాలనలో దేశం నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని, తయారీ రంగానికి ప్రాముఖ్యత పెరిగి ఐటీ, ఎకౌంటింగ్, ఫైనాన్స్ వంటి సేవలకు భారత్ గ్లోబల్ హబ్‌గా మారిం దని చెప్పింది. మోదీ నాయకత్వం ఆధార్ వంటి డిజిటల్ విప్లవాలకు నాంది పలికి.. సామాజిక ప్రయోజనాలు చేకూరేందుకు దోహదం చేసిందని తెలిపింది. మోడ్రన్ మార్కెటింగ్ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఫిలిప్ కోట్లర్ ఏటా ఈ అవార్డు అందిస్తారు. ప్రస్తుతం ఫిలిప్ కోట్లర్ (87) అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ వర్సిటీలోని కల్లొజ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. అనారోగ్యంతో కోట్లర్ ఢిల్లీ రాలేకపోయారు. ఆయన తరఫున జార్జియాలోని ఈఎంఓఆర్‌వై వర్సిటీ ప్రొఫెసర్ జగదీశ్ సేత్, కమిటీ ప్రతినిధులు అవార్డు అందించారు. -
లీడర్ ఎవరో తేల్చుకోవాలి..
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏకమయ్యే విపక్షాలు ఎవరి నాయకత్వాన పోరాడుతాయో త్వరగా తేల్చుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ సూచించారు. ఎన్నికల అనంతరం నంబర్ గేమ్, రాయబేరాల చుట్టూ రాజకీయాలు తిరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలకు ముందే విపక్ష పార్టీలు అవగాహనకు రావాలని ఆకాంక్షించారు. ఎన్నికలకు ముందే పొత్తులపై విపక్షాలు అవగాహనకు రావాలని అన్నారు. విపక్ష శిబిరంలో విభేదాలు సృష్టించేందుకు బీజేపీ కుయుక్తులకు పాల్పడే అవకాశం ఉన్నందున తగిన సమయంలో నాయకత్వంపై ఓ నిర్ణయానికి రావాలని విపక్షాలకు సూచించారు. ‘మనందరికీ (విపక్షాలు) మన నాయకుడే కీలకం.. విపక్షాలను ముందుకు నడిపే పార్టీగా కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందువరుసలో ఉంటుంద’ని అన్నారు. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ నాయకత్వ అంశంపై విపక్షాలన్నీ త్వరలో ఓ నిర్ణయానికి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో సంకీర్ణం అవసరమని అభిప్రాయపడ్డారు. సంకీర్ణంపై ఏకాభిప్రాయం ఉంటే..ఆ దిశగా సంకీర్ణ సర్కార్ దిశగా విపక్షాలు అడుగులు వేయాలని పిలుపు ఇచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఉద్వేగభరిత ప్రసంగాలను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు బదులిస్తూ తమకూ మంచి కథలు చెప్పే వక్త కావాలని వ్యాఖ్యానించారు. -
లీడర్ లోటు
భారతీయ జనతా పార్టీకి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సమస్య కొనసాగుతోంది. ఎన్నికలకు ఏడాదే గడువున్న తరుణంలో పార్టీకి బలమైన నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీ బలోపేతానికి ప్రతిబందకంగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ పార్టీకి పలువురు సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వలేకపోయారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ టిక్కెట్టుకు పోటీదారులు, పార్టీ కార్యక్రమాలు కాస్త చురుకుగా సాగుతున్నాయి. సాక్షి, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీకి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వ సమస్య కొ నసాగుతోంది. ఆయా చోట్ల అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులను ఢీకొనే సామ ర్థ్యం కలిగిన నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపలేకపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ పార్టీకి పలువురు సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. వారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో ఒకటీ రెండు నియోజకవర్గల్లో మినహా అన్ని చోట్ల ఈ పరిస్థితే నెలకొంది. ఎన్నికలకు ఏడాదే గడువున్న ఈ తరుణంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీ బలోపేతా.నికి ప్రధాన ప్రతిబందకంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే పార్టీ కార్యక్రమాలను మీదేసుకుని చేసే నాయకులు కూడా కరువయ్యారు. ఒకవైపు అన్ని పార్టీలతో సహా బీజేపీ కూడా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో నాయకత్వ అంశం తెరపైకి వస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలో పెద్దొల్ల గంగారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్ వంటి నాయకులు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆర్మూర్‌లో పల్లెగంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి వంటి పార్టీ సీనియర్ నేతలతో పాటు, డాక్టర్ మధుశేఖర్ ఏడాది క్రితం పార్టీలో చేరారు. ఈ రెండు చోట్ల పార్టీ ఆదేశించిన కార్యక్రమాలను మమ అనిపించడం మినహా, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు పడలేదు. ఈ రెండు చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే స్థాయిలో పార్టీ కార్యకలాపాలేవీ జరగలేదు. 2014 ఎన్నికలో పొత్తులో భాగంగా ఈరెండు స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోవడం కూడా నాయకత్వ లేమికి ఓ కారణమనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. బోధన్ నియోజకవర్గ ఇన్చార్జిగా నర్సింహరెడ్డి కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీకి దీటుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన దాఖలాలేవీ ఇటీవల కనిపించడం లేదు. బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పైడిమల్ లక్ష్మినారాయణ, అర్సపల్లి సాయిరెడ్డి వంటి నాయకులున్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఢీకొనే పరిస్థితుల్లో ఈ నేతలు లేరు. జుక్కల్ నియోజకవర్గంలోనూ ఇదే సమస్య. పార్టీ ఇన్చార్జిగా రేవణ్ కొనసాగుతున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీని ఇచ్చే నాయకులు బీజేపీకి లేరనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు కొంత పోటీని ఇవ్వగలిగారు. ప్రారంభంలో పలు మండలాల్లో బీజేపీ బలోపేతానికి కొంత కసరత్తు చేసినప్పటికీ., ఇటీవల ఆయన పార్టీ కార్యక్రమాలను తగ్గించారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. దీంతో కొన్ని మండలాలకు చెందిన బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ కొంత మేరకు పట్టుంది. కానీ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇట్టెం సిద్దిరాములు ఇటీవల పార్టీని వీడారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కమల దళంలో చేరారు. అర్బన్, రూరల్‌లో కాస్త భిన్నం.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఇందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. మిగితా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య నెలకొనగా., అర్బన్‌లో మాత్రం ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలని పలువురు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టికెట్టు ఆశిస్తున్న వారు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ధన్పాల్ సూర్యనారాయణగుప్తతో పాటు, ఇటీవల పార్టీలో చేరిన బస్వ లక్ష్మినర్సయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరితో పాటు అవసరమైతే మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ కూడా టికెట్ రేసులో ఉంటారనే చర్చ కొనసాగుతోంది. ఈ ముగ్గురు నాయకులు ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. నిజామాబాద్ రూరల్‌లో మాత్రం గడ్డం ఆనంద్‌రెడ్డి గత ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కేవలం పార్టీ ఆదేశించే కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్ర వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
తమ్ముళ్ల కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా అసంతృప్తుల మోత మోగుతోంది. పార్టీ మండల, పట్టణ శాఖ అధ్యక్ష పదవుల కోసం నాయకులు వర్గాలుగా విడిపోయి పోరాటాలకు దిగుతున్నారు. దీంతో చాలాచోట్ల ఎన్నికలను వాయిదా వేయడం, లేకపోతే అధిష్టానానికి నివేదించడం చేస్తున్నారు. తాజాగా బుధవారం భీమవరం నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగత ఎన్నికల వ్యవహారం నాయకుల అలకలు, ఆందోళనలతో ముగిసింది. పార్టీ పట్టణ శాఖ అధ్యక్ష పదవిని పలువురు ఆశించగా.. ఆశావహులు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), ఎంపీ తోట సీతారామలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకుడు మెంటే పార్థసారథి వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు పైచేయి సాధించడానికి ప్రయత్నించారు. ఈ పదవి కోసం కాపు, కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను రాష్ట్రమంత్రి నారా లోకేష్‌కు వదిలివేయాలని కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెరుకూరి రామకృష్ణచౌదరి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత మెంటే పార్థసారథి సీరియస్‌గా తీసుకోవడంతో ఆయన వర్గానికి చెందిన తోట భోగయ్య ఆ పదవిని దక్కిం చుకున్నారు. వీరవాసరం మండల శాఖ అధ్యక్ష పదవిని శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన వీరవల్లి రామకృష్ణ డిమాండ్ చేశా రు. పరిస్థితి అనుకూలించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. భీమవరం మండల అధ్యక్ష పదవి కాపు వర్గానికి ఇవ్వాలంటూ గందరగోళం సృష్టించారు. మధ్యేమార్గంగా అగ్నికుల క్షత్రియ వర్గానికి అధ్యక్ష పదవి కట్ట బెట్టారు. గోపాలపురం నియోజకవర్గంలోని 4 మండలాల్లో మండల శాఖ ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. పార్టీలో అంతర్గత విభేదాల వల్ల పదవులకు పోటీ ఏర్పడింది. దేవరపల్లిలో మంగళవారం రాత్రి నిర్వహించిన పార్టీ మండల సమావేశంలో అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న సుంకర దుర్గారావు, కొయ్యలమూడి చినబాబు వర్గీయులు బాహాబాహీకి దిగారు. రెండువర్గాల వాగ్వి వాదంతో సమావేశం రసాభాసగా జరిగింది. ఎన్నిక జరపకుండానే సమావేశాన్ని ముగించారు. గోపాలపురం మండలంలో ముగ్గురు, ద్వారకాతిరుమల మండలంలో ముగ్గురు నాయకులు పోటీపడటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. గోపాలపురంలో రహస్య ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గ టీడీపీ సమావేశాన్ని కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించారు. ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన 7 మండలాల విస్తృతస్థాయి సమావేశానికి పరిశీలకురాలిగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ తోట సీతారామలక్ష్మి హాజరయ్యారు. ఇక్కడా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. కొయ్యలగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాలకు సంబం ధించి అధ్యక్షుల ఎంపికలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. నాయకులు రెండు ప్రధాన సామాజిక వర్గాలుగా విడిపోగా, ఒక వర్గం ఎంపీ అనుకూలురుగా, మరో వర్గం ఎమ్మెల్యే అనుకూలురుగా పైరవీలు చేసుకున్నారు. ముఖ్యంగా కొయ్యలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పారేపల్లి రామారావు ఏఎంసీ చైర్మన్‌గా వ్యవహరిస్తుండటంతో పార్టీ పదవికి రాజీనామా చేయాలని, మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని కార్యకర్తలు పట్టుబట్టారు. ఈ విషయాన్ని అధిష్టానానికి నివేదిస్తామని ప్రకటించిన సీతారామలక్ష్మి సభను ముగించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోనూ సంస్థాగత ఎన్నికలు గ్రూపు రాజకీయాలకు తెరలేపాయి. చాగల్లు మండల, కొవ్వూరు పట్టణ కమిటీల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పదవుల కోసం పట్టుబడుతున్నారు. నాయకులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో రెండుచోట్ల కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొవ్వూరు పట్టణ కమిటీ అధ్యక్ష పదవి కోసం రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. రెండు గ్రూపుల నాయకులు పోటాపోటీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ నేత జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మెజార్టీ కౌన్సిలర్లు పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు పేరును ప్రతిపాదించారు. మునిసిపల్ మాజీ చైర్మన్ సూరపనేని చిన్ని, రామా సొసైటీ అధ్యక్షుడు కంఠమణి రామకృష్ణ, అర్బన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ తదితరులు దాయిన రామకృష్ణ పేరును తెరపైకి తెచ్చారు. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేదు. పార్టీ పట్టణ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలంటూ బీసీ నాయకులు మంత్రి ఇంటివద్ద ఆందోళనకు దిగారు. చాగల్లు అధ్యక్ష పదవి కోసం నిర్వహించిన సమావేశంలో నాయకులు వాగ్వి వాదానికి దిగడంతో ఆరుపులు, కేకలతో రసాభాసగా సాగింది. కొందరు నాయకులు బొడ్డు రాజు పేరును ప్రతిపాదించగా, మరికొందరు చాగల్లు, నెలటూరు గ్రామాలకు చెందిన వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు. మొత్తంగా టీడీపీ నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు సంస్థాగత ఎన్నికల సందర్భంగా భగ్గుమంటున్నాయి. -
నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలి
- ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ - ఘనంగా సిల్వర్ జూబ్లీ కళాశాల వార్షికోత్సవం కర్నూలు(అర్బన్): విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలని ఎన్సీసీ కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ అన్నారు. సిల్వర్ జూబ్లీ కళాశాల వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో ఒత్తిడి సహజమని దాన్ని అధిగమిస్తే విజయం సొంతమవుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్, కళాశాల పూర్వ విద్యార్థి సుబ్బారెడ్డి, సిల్వర్ జూబ్లీ ఫ్రెటర్నిటీ అధ్యక్షుడు డాక్టర్ జీవీ రమణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖాదర్, వైస్ ప్రిన్సిపాల్ సునీత పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
లీడర్
సెలబ్రేటింగ్ లీడర్షిప్ డే జన్మను దేవుడు నిర్ణయిస్తాడు. బంధాన్ని మనిషి ఏర్పరుచుకుంటాడు. జన్మబంధంగా లీడర్ నిలుస్తాడు. ఆజన్మ బంధువుగా మనలో ఒకరై కలిసిపోతాడు. ఇండియాలోనా? ఇంగ్లండ్‌లోనా? ఎక్కడ పుడతామో మనకు తెలియదు. అంబానీలా? అంబలికైనా లేనివాళ్లా? ఎవరింట్లో పుడతామో తెలియదు. తల్లిదండ్రులను, తోబుట్టువులను ఎంచుకోవడం మన చేతుల్లో లేదు. కానీ... మంచి స్నేహితుణ్ని ఎంచుకోవడంలో... మంచి లీడర్ని ఎంచుకోవడంలో మనదే చాయిస్. పూర్తిగా మనదే! అవును. జన్మను దేవుడే ఇచ్చినా.. బంధాన్ని మానవుడే తెచ్చుకోగలడు. ఆ బంధం... స్వచ్ఛమైనదైతే, నిశ్చలమైనదైతే, నిష్కల్మషమైనదైతే, అణువణువూ సత్యమైనదే అయితే.. అది అనుబంధం అవుతుంది. భవబంధం అవుతుంది. ప్రేమబంధం అవుతుంది. ఒకే తల్లికి పుట్టినంతగా... పేగుబంధం అవుతుంది. అసలు బంధాల్లో గొప్ప బంధం ఏది? కొందరు ప్రేమ బంధం అంటారు. కొందరు స్నేహ బంధం అంటారు. ఇంకా చాలా ఉన్నాయి. అనురాగబంధం, అభిమానబంధం, ఆత్మీయబంధం, అనిర్వచనీయ బంధం! ఈ అన్ని బంధాల్లోకి శిఖర బంధం, శిఖరాగ్ర బంధం... బాధ్యతను తీసుకునే బంధం. బాధ్యతలో ఇవ్వడం మాత్రమే ఉంటుంది. తీసుకోవడం ఉండదు. అందుకే అది శిఖరంపై ఉంటుంది. ఎవరో ఇచ్చేది బాధ్యత కాదు. ఎవరికి వారు తీసుకునేది బాధ్యత. బాధ్యత... తీసుకునే కానుక కాదు. స్వీకరించే కర్తవ్యం. అందుకే బాధ్యత, నాయకత్వం వేర్వేరు కాదు. ఇలాంటి నాయకత్వం అరుదుగా కనిపిస్తుంది. అరుదైనదే కాదు, అందమైనది కూడా. which is rare and beautiful. అదొక అందమైన నాయకత్వం. ఎలాగైతే బాధ్యతను అడక్కుండా తీసుకుంటామో... అలాగే ప్రేమను అడక్కుండా ఇచ్చేవారుంటారు. వారే నాయకులు. వారే లీడర్! అంత గొప్ప బాధ్యతను తీసుకునే లీడర్‌కి అడక్కుండానే ప్రేమ దొరుకుతుంది. ప్రేమ పొందిన నాయకుడు... బాధ్యతను భుజంపై నుంచి దించుకోడు. దించుకోవాలని అనుకోడు. బాధ్యతలను తప్పించుకుంటూ, ప్రేమను పొందుతూ ఉండే బంధం కూడా ఒకటి ఉంటుంది. అది అబద్ధపు బంధం. అశాశ్వత బంధం. ఆ అబద్ధపు బంధం కొద్దిపాటి సమయమే చెల్లుబాటు అవుతుంది. కొన్నాళ్లపాటే ఉంటుంది. మహా అయితే ఐదేళ్లు ఉంటుంది! నిజం.. శాశ్వతం. విశ్వసనీయత.. శాశ్వతం. ఆత్మబంధుత్వం.. శాశ్వతం. నిజం, విశ్వసనీయత, ఆత్మబంధుత్వం కలిసిందే.. లీడర్షిప్. ఇవాళ డిసెంబర్ 21. డిసెంబర్ 21ని ‘సాక్షి’ ఫ్యామిలీ ‘లీడర్షిప్ డే’గా సెలబ్రేట్ చేస్తోంది. ప్రేమను పంచి, ప్రగతి వైపు నడిపించిన, నడిపిస్తున్న.. నిజమైన కొందరి నాయకత్వాలకు సలామ్ చేస్తోంది. జ్యోతిబా పూలే (1827) త్రేతాయుగంలో పరశురాముడు, కలియుగంలో మనువు, అగ్రరాజ్యంలో శ్వేతవర్ణం, అగ్రవర్ణ రాజ్యంలో వేదవాఙ్మయం! జ్యోతిబా పూలే రగిలిపోయాడు. దాస్యపీడనలో, దాష్టీకంలో ఏ యుగానికి ఏ యుగమూ తక్కువ కాదు. మనువు ఏం చేశాడు? మంచిని చేస్తున్నట్లే చేసి మంచిది కాని దాన్ని చేశాడు. దారి వేస్తున్నట్లే వేసి, దారులన్నీ మూసేశాడు. సృష్టి గురించి చెప్పాడు. సృష్టిలోని నికృష్టులెవరో చెప్పాడు! ఇంద్రియ నిగ్రహం అన్నాడు. అగ్రవర్ణ కక్కుర్తి అకృత్యాలకు అడ్డదారులు చూపాడు. స్త్రీల బాధ్యతలన్నాడు. స్త్రీలకు స్వేచ్ఛలేకుండా చేశాడు. రాజధర్మాలు అన్నాడు. ప్రజలను పడి వుండమన్నాడు. కులధర్మాలు నూరి పోశాడు. కడ జాతులు అన్నాడు. న్యాయం లేని నీతుల్ని, రీతుల్ని రచించాడు. ఇదంతా చూసి పూలే కన్నెర్ర చేశారు. కులబలాడ్యులను ఢీకొని, ‘కడ’బలహీనులకు అండగా, చేతికండగా ఉండి మహాత్ములకే పితామహాత్ముడయ్యారు పూలే. లీడర్‌కి కులం ఉండదు. గుణం ఉంటుంది. అల్లూరి (1897) ఉద్యమంలో రక్తాన్ని చిందనివ్వని జాతీయ కథానాయకుడు గాంధీజీ అయితే, మన ఊరి విప్లవ నాయకుడు అల్లూరి! మన్యంలో కొండదళానికి, తెల్లదండుకి మధ్య అరవై రెండు సార్లు కాల్పులు జరిగినా, రక్తపాతం జరక్కుండా సీతారామరాజు నిరోధించాడు. విరోధిని నిలువరించాడు. రామరాజు బాణంలాంటి లీడర్. విరిగి ముక్కలవడానికి, మెలితెరిగి వంకర్లు పోవడానికి, శిరస్సు వంచి నమస్కరించడానికి... వింటిని వదిలి రయ్యిన కంటికందని వేగంతో దూసుకుపోదు ఉద్యమబాణం. ఎక్కడ దిగబడాలో అక్కడ దిగబడేందుకే వెళ్తుంది. గూడెం చెట్టు ఏదో, తెల్లవాడి గుండె ఏదో దానికి తెలుసు.తెల్లవాడు అడవితల్లిని, అడవి బిడ్డల్ని వేరు చేస్తున్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నందుకు బిడ్డలకు పన్ను విధిస్తున్నాడు. తల్లిపాలు తాగనివ్వకుండా కాపలా కాస్తున్నాడు. ఒళ్లారని ఆడ పడుచుల్ని కళ్లారా చిదిమి, మేత మేస్తున్నాడు. అడ్డొచ్చిన అన్నని, తమ్ముడిని, తండ్రిని తలతెగ్గొట్టి ఊరేగిస్తున్నాడు. రామరాజు ఊరుకుంటాడా? అగ్నిజ్వాలై భగభగమన్నాడు. ఉద్యమ దావానలం అయ్యాడు. దాపనపల్లి, అడ్డతీగల, చోడవరం, రామవరం, జోగంపేట, పెద్దగడ్డ పాలెం, లింగాపురాలను రగిలించాడు. అప్పుడొచ్చాడు రూథర్‌ఫర్డ్. రామరాజు... రామరాజు... రామరాజు... ఎవరీ రామరాజు! అన్నాడు. ‘ఇక్కడున్నాడు కాల్చుకొమ్మని’ కొండదళం గుండెలు చూపించింది! రామరాజు ముందుకొచ్చాడు. ‘కాల్చుకోరా కుక్కా..’ అని తన గుండెను చూపించాడు. లీడర్ ముందుకు నడిపిస్తాడు. ముందుకు వచ్చి నిలబడతాడు. బిపిన్ చంద్ర పాల్ (1858) గాంధీజీది ఏ లక్ష్యమో, బిపిన్ చంద్రపాల్దీ అదే లక్ష్యం. దారులే వేరు. ప్రతిఘటనకు పిడిగుద్దులే సమాధానం అన్నారు బిపిన్. గాంధీజీ జాతి పిత అయితే, బిపిన్ ‘ఫాదర్ ఆఫ్ రివల్యూషనరీ థాట్స్’. ‘పూర్ణ స్వరాజ్యం’, ‘స్వదేశీ ఉద్యమం’, ‘విదేశీ వస్తువుల బహిష్కరణ’... పోరాటం ఏదైనా అందులో పాల్ అగ్రెసివ్ లీడర్. అరబిందో అన్నట్లు బిపిన్ ఒక మహాశక్తిమంతుడైన జాతీయవాద ప్రవక్త.ముక్కుసూటి ఉక్కుమనిషి పాల్. విమర్శించాల్సిన చోట మృదువుగా మాట్లాడడం లేదా మౌనం వహించడం ఉద్యమస్ఫూర్తిని దెబ్బతీస్తుందని బిపిన్ చంద్రపాల్ నమ్మారు. చివరి వరకు ఆ నమ్మకం మీదే నిలబడ్డారు. అందుకోసం గాంధీజీనే విభేదించారు. లీడర్ విభేదిస్తాడు. అవసరమైతే విడిపోయి వచ్చేస్తాడు! గాంధీజీ (1869) గాంధీజీ డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్తున్నారు. ఫస్ట్‌క్లాస్ టిక్కెట్ కొని రైలెక్కారు. రైలు మారిట్ట్బర్గ్ స్టేషన్లో ఆగింది. ఒక తెల్ల ప్రయాణికుడు గాంధీజీ ఉన్న కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. గాంధీజీని చూశాడు. ‘నువ్విందులోకి ఎందుకు ఎక్కావ్? దిగిపో’ అన్నాడు. ‘ఎందుకు దిగిపోవాలి?’ అని గాంధీజీ అన్నారు. తెల్ల ప్రయాణికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక పోలీసు వచ్చి గాంధీజీని ప్లాట్‌ఫామ్ మీదికి తోసేశాడు. అది చలికాలం. ఆ రాత్రంతా గాంధీజీ చలికి గజగజమని వణుకుతూ స్టేషన్లోనే గడిపాడు. ఒంటి రంగు కారణంగా తను అవమానానికి గురవడం గాంధీజీలో ఆలోచన రేకెత్తించింది. ఆయనలో అహింసాయుత ప్రతిఘటనకు ఊపిరిపోసింది. అదే సత్యాగ్రహం అయింది. భారత స్వాతంత్య్ర సమరానికి ఆయుధం అయింది. లీడర్.. దీక్షతో, దక్షతతో అనుకున్నది సాధిస్తాడు. అంబేడ్కర్ (1891) అం»ే డ్కర్ అణగారిన వర్గాల నాయకుడు. ధర్మశాస్త్ర పండితుడు. భారత రాజ్యాంగ నిర్మాత. సామాజిక తత్వవేత్త. స్వాతంత్య్రానికి పూర్వం, అనంతరం కూడా దేశ ప్రజల స్థితిగతులపై, దేశ రాజకీయాలపై తన సిద్ధాంతాలతో అత్యంత ప్రభావం చూపిన ప్రయోగశీలి. అవమానాలను, అవరోధాలను, అవాంతరాలను తట్టుకున్న ధీశాలి. కులం వద్దన్నాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలన్నాడు. భిన్నత్వంలో ఏకత్వ విధానాన్ని పాటించాడు. ఐక్యతా స్ఫూర్తితోనే ఫెడరల్ పాలనా విధానాన్ని ప్రతిపాదించాడు. ప్రాథమిక హక్కులనేవి సమానత్వాన్ని, స్వేచ్ఛనూ ప్రసాదించే వరాలుగా ఆయన భావించాడు. సామాజిక న్యాయం గురించి పరితపించాడు. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం కావాలన్నాడు. అస్పృశ్యతను నిషేధించారు. ఒకే వ్యక్తి, ఒకే విలువ అన్నాడు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్. అలాగని రాజ్యాంగం శిలాక్షరం కాదనీ, పరిస్థితుల్ని బట్టి సవరించుకోగలిగే అవకాశం ఉండాలనీ అన్నాడు. దేశ సమైక్యతని పరిరక్షించేందుకు బలమైన పార్లమెంటరీ వ్యవస్థను ఆయన కోరుకున్నాడు. అంబేడ్కర్‌కు బదులు ఏ విదేశీయుడో భారత రాజ్యాంగ రచనకు పూనుకుని ఉంటే బ్రిటిష్ తరహా నియంతృత్వ పాలనలోనే భారత్ మగ్గుతూ ఉండేది. లీడర్ మనకు ఏం కావాలో చేస్తాడు. మనకు ఏం వద్దో చెప్తాడు. కొమురం భీమ్ (1901) చట్టం, న్యాయం.. ప్రభువుల కోసం కాదు. ప్రజల కోసం. నిజాంలు మనుషుల్ని మనుషుల్లా చూడలేదు. అప్పుడొక మనిషి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. న్యాయాన్ని తుంగలో తొక్కిన అసఫ్ జాహిల గొంతుపై కాలుపెట్టాడు. ఆ వీరుడు.. కొమురం భీమ్. గిరిజనోద్యమ నాయకుడు. జల్, జంగిల్, జమీన్.. కొమురం నినాదం. కొండ కోనల్ని, పచ్చటి భూముల్ని దోచుకుని, భూమి పుత్రులపై దౌర్జన్యం చేస్తున్న నిజాం సర్కార్‌ని నిలదీశాడు. ఆయుధం చేతబట్టి సింహస్వప్నం అయ్యాడు. ఆదివాసీల ఆత్మగౌరవం కొమరం భీమ్. నిరంకుశంపై తుపాకీ ఎక్కుపెట్టిన వేగుచుక్క కొమురం భీమ్. అతడొక సెల్ఫ్ స్టెయిల్డ్ లీడర్. పోరాడుదాం రమ్మని పిలుపును ఇవ్వలేదు. పోరాటానికి గొంతు కలుపు చాలు అన్నాడు. మిగతాదంతా తనే చూసుకున్నాడు. లీడర్ సైన్యం కోసం చూడడు. తనే దళపతి, తనే సైన్యం అవుతాడు. మదర్ థెరిసా (1910) ఎనిమిది మంది పిల్లలున్న ఒక హైందవ కుటుంబం ఆకలితో నకనకలాడుతోందని ఒక వ్యక్తి వచ్చి మదర్ థెరిసాకు చెప్పాడు. కొన్ని రోజులుగా వాళ్లు పస్తులుంటున్నారని ఆవేదన చెందాడు. మదర్ వెంటనే బియ్యం మూటతో అక్కడకు వెళ్లారు. పిల్లల కళ్లు ఆకలిని ప్రతిఫలిస్తున్నాయి. ఇంటావిడ ఎంతో కృతజ్ఞతతో బియ్యం తీసుకుని, రెండు సమభాగాలు చేసింది! ఒక భాగాన్ని సంచిలో వేసుకుని బయటికి వెళ్లి వచ్చింది. ‘‘అంత హడావుడిగా ఎక్కడికి వెళ్లావు’’ అని అడిగారు మదర్. ‘‘వాళ్లు కూడా ఆకలితో ఉన్నారు’’ అని సమాధానం! మదర్‌కు అర్థం కాలేదు. ఆమె చెప్తోంది పొరుగున ఉన్న ముస్లిం కుటుంబం గురించి. మదర్ తెచ్చిన బియ్యంలో సగం... వాళ్లకు ఇచ్చి వచ్చింది! ఆ సాయంత్రం మదర్ మళ్లీ బియ్యం తీసుకెళ్లలేదు. పంచుకోవడంలోని ఆనందాన్ని వాళ్లకు మిగలనివ్వడం న్యాయమనిపించింది మదర్‌కు. తల్లి నుంచి ఆహారం రూపంలో లభించిన ప్రేమతో పిల్లలూ గెంతులేస్తున్నారు. ప్రేమ ఇంటి నుంచే మొదలౌతుంది. ఇంటి నుంచి ఇంటికి, మనిషి నుంచి మనిషికి విశ్వవ్యాప్తం అవుతుంది. మదర్ చెప్పింది ఇదే. లీడర్ ప్రేమను పంచుతారు. లీడర్ ఆకలిగొన్న కుటుంబానికి ధాన్యం పంపుతారు. నెల్సన్ మండేలా (1918) నల్లవాళ్లందరూ తక్షణం జోహాన్నెస్బర్గ్ను వదిలి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవాలని హుకుం జారీ అయింది. ఒక వ్యక్తి మండేలా దగ్గరికి వచ్చాడు. ‘‘మమ్మల్ని కాపాడండి. నేను, నా భార్యపిల్లలు ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాం. నా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని వెళ్లిపొమ్మంటున్నారు. నా ఉద్యోగం తీసేశారు. చావడం తప్ప వేరే దారిలేదు. ఏదో ఒకటి చెయ్యండి. నా కుటుంబం కూలిపోకుండా చేతులు అడ్డుపెట్టండి’’ అని మండేలాను వేడుకున్నాడు. వెంటనే అధికారి దగ్గరికి వెళ్లాడు మండేలా. ‘‘చూడండి, కార్యకర్తగా కాదు... ఒక మనిషిగా నేను మీ దగ్గరకు వచ్చాను. నేను మీ ముందుకు తేబోతున్న సమస్య పరిష్కారానికి పూర్తిగా మీ మీదే ఆధారపడి వచ్చాను’’ అన్నాడు. మండేలా మాటతీరులో తనపై కనిపించిన గౌరవభావం ఆ అధికారిని కదిలించింది. ‘‘ఏదైనా ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపొమ్మని చెప్పండి’’ అని నిరభ్యంతర పత్రం రాసిచ్చాడు! జాతి విచక్షణ అమాయక ప్రజల్ని బలి తీసుకుంటుందనీ, విచక్షణను పాటించేవారు కూడా తమ సొంత మనుషులను కోల్పోవలసి వస్తుందని తెల్ల అధికారులకు అర్థమయ్యేలా చెప్పగలిగారు మండేలా. మండేలాను విడుదల చెయ్యాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు పి.డబ్ల్యూ.బోతా ఆయనకొక రాయబారం పంపారు. దేశం వదిలి వెళ్తానంటే వెంటనే విడుదల చేస్తామన్నాడు! మండేలా అంగీకరించలేదు. ‘‘పోనీ, మీ మనుషుల్ని హింస మానేయమని చెప్పండి. మిమ్మల్ని వదిలిపెడతాం’’ అని రెండో రాయబారం పంపాడు. మండేలా వినలేదు. నల్లజాతి ప్రజలకు జైలునుంచే ఒక లేఖను రాసి విడుదల చేశాడు. ‘‘జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేనూ అంతే ప్రేమించాను. స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కు, నా హక్కు వేర్వేరు కాదు. మన హక్కుల్ని విక్రయించేందుకు తెల్లజాతి ప్రభుత్వానికి నేనెలాంటి వాగ్దానం చెయ్యలేను’’ అని తన జాతికి నమ్మకాన్ని, ధీమాను ఇచ్చారు. లీడర్ ఒదిగి ఉంటాడు. మది ఎరిగి ఉంటాడు. మార్టిన్ లూథర్‌కింగ్ (1929) ‘‘ఐ హావ్ ఎ డ్రీమ్’’... అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్. వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్‌లో గుమికూడిన రెండు లక్షల మంది ఆ మాట విన్నారు. ప్రతిస్పందనగా పెద్ద హోరు! ‘‘ఐ హావ్ ఎ డ్రీమ్’’ అన్నాడు మరింత గట్టిగా. మళ్లీ అదే హోరు. ఏమిటి ఆయన కల? ‘‘ఓ రోజు వస్తుంది. ఆ రోజు అమెరికాలో నల్లవారందరికీ స్వేచ్ఛ, తెల్లవారందరితో సమానత్వం అనే నా కల నిజమౌతుంది’’ అన్నాడు మార్టిన్. 1963 ఆగస్టు 28 నాటి ప్రసంగం అది. నెల తిరక్కుండానే ఆ కల నిజమవడానికి తనింకా చాలా కష్టపడాలని మార్టిన్ లూథర్ కింగ్‌కి తెలిసి వచ్చింది. లూథర్ ప్రత్యర్థులు బర్మింగ్‌హామ్ చర్చిలో జరిపిన వర్ణవివక్ష పేలుళ్లలో నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మార్టిన్ మనసు చెదిరింది. కానీ కల చెక్కు చెదరలేదు. పడనివ్వని వారు ఉంటారు. వారితో పడాలి. అడ్డుపడేవారుంటారు. వారిని దాటి వెళ్లాలి. దుష్ప్రచారం చేసేవారుంటారు. తట్టుకుని నిలబడాలి. తను నిలబడి, ప్రజల్ని నడిపించాలి. ప్రజల కలని తను కనాలి. ఆ కలను తనే నిజం చేసి పెట్టాలి. అప్పుడే లీడర్. అతడే లీడర్. మార్టిన్ లూథర్ లీడర్‌గా నిలబడ్డాడు. అతడి స్వప్నం ఫలించింది. నల్లవారికి పౌరహక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. అమెరికన్ ఆఫ్రికన్‌లందరికీ స్వేచ్ఛ, సమానత్వం లభించాయి. అమెరికన్లంతా ఎవరీ నల్లనాయకుడు అని తలతిప్పి చూశారు. కానీ మార్టిన్ తన ని తాను∙నాయకుడు అనుకోలేదు. లీడర్ తనని లీడర్ అని అనుకోడు. కార్యకర్త అని మాత్రమే అనుకుంటాడు. అబ్దుల్ కలామ్ (1931) కలామ్ నవ్వు చూస్తే ధైర్యం వస్తుంది. దగ్గరికెళ్లాలనిస్తుంది. రాష్ట్రపతి ఐతే నాకేంటి? సైంటిస్ట్ అయితే నాకేంటీ.. హి ఈజ్ మై ఫ్రెండ్ అని మనసుకు అనిపిస్తుంది. నవ్వుకు ప్రతినవ్వును ఇవ్వాలనిపిస్తుంది. సెల్యూట్ చెయ్యాలనిపిస్తుంది. కలామ్ సింపుల్ మనిషి. పీపుల్స్ ప్రెసిడెంట్. ‘పెద్ద పెద్ద కలల్ని కనండి. వాటిని నిజం చేసుకోండి’ అని యూత్‌కి స్ఫూర్తిని ఇచ్చారు. ఖురాన్‌ను, భగవద్గీతను, బైబిల్ని అనుసరించారు. వాటి నుంచి మానవతామతాన్ని స్వీకరించారు. గాంధీజీ తన జీవితాన్ని సందేశంగా ఇచ్చి వెళితే, కలామ్ భారతీయ సమాజాన్నే సందేశాత్మకం చేశారు. కలామ్ భారతరత్న. అది సరిపోదు. కలామ్ విశ్వమానవ రత్నం. సహనం, ప్రేమ, ఆలోచన, సాధన, కృతనిశ్చయాలను ప్రబోధించిన మునీశ్వరుడు అబ్దుల్ కలామ్. లీడర్ నవ్వు ప్రశాంతత ఇస్తుంది. ప్రగతివైపు నడిపిస్తుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి (1949) వీళ్లందరిలోని గుణాలు, వీళ్లందరిలోని గొప్పతనాలు ఉన్న మన కాలపు మన లీడర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అసమానుడు, ఆత్మబంధువు, ఆశాజ్యోతి వై.ఎస్! దార్శనికుడు, ప్రజాబంధువు వై.ఎస్! స్నేహశీలి, సేవా తత్పరుడు, రైతు బాంధవుడు అవిశ్రాంత పథకుడు, మహాయాత్రికుడు వై.ఎస్! పొలాలకు జలాలిచ్చాడు. పథకాలకు జవసత్వాలు ఇచ్చాడు. అభివృద్ధికి బాటలు వేశాడు. పేదలకు ధీమా ఇచ్చాడు. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చాడు. చరిత్ర సృష్టించాడు. చెరగని ‘రాజ’ముద్ర వేసి వెళ్లిపోయాడు. ఒక్కమాటలో వై.ఎస్. జనహృదయ నేత. మహానేత. లీడర్ వై.ఎస్లా ఉంటాడు. లీడర్‌షిప్‌కే వారసత్వాన్ని ఇచ్చి వెళతాడు. -
టీ20 భారత మహిళా జట్టుకు మేఘన ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్ : దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న కృష్ణా జిల్లా మహిళా క్రికెటర్ సబ్బినేని మేఘన భారత జట్టుకు ఎంపికైంది. ఈ నెల 16వ తేదీ నుంచి మూలపాడు ట్విన్ గ్రౌండ్స్‌లో వెస్టిండీస్ జట్టుతో జరిగే 3 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లతో పాటు థాయిలాండ్‌లో జరిగే ఏషియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేఘన ప్రాతినిధ్యం వహిస్తుంది. డాషింగ్ బ్యాట్స్ఉమెన్గా పేరున్న ఆమె 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌లో ఆడింది. ఆంధ్ర మహిళా క్రికెట్ నుంచి గతంలో వి.స్నేహదీప్తి, ఆర్.కల్పన భారత జట్టుకు ఆడారు. ఇప్పుడు మేఘన ఎంపికైంది. అండర్–16, అండర్–19, ఆంధ్ర సీనియర్ ఉమెన్ జట్టుల్లో కీలకమైన ప్రధాన బ్యాట్స్ఉమెన్గా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. అన్ని ఏజ్ గ్రూపుల్లో ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ప్రతి ఏడాది జోనల్ క్రికెట్ అకాడమీ, నేషనల్ క్రికెట్ అకాడమీలు నిర్వహించే క్యాంపుల్లో పాల్గొంది. గుంటూరు జేకేసీ కళాశాలలోని ఏసీఏ మహిళా క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. వెస్టిండీస్‌తో జరిగే టి20 మ్యాచ్‌లతో పాటు ఏషియా క్రికెట్ కప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, ఏసీఏ మహిళా క్రికెట్ విభాగం చైర్మన్ జె.మురళీమోహన్ అభినందనలు తెలిపారు. -
వెంకట్రావ్ నాయకత్వంలోనే పనిచేస్తాం
మందమర్రి : సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసమే వెంకట్రావ్ టీబీజీకేఎస్‌లో చేరారని, ఆయన నాయకత్వంలోనే సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ మందమర్రి ఏరియా సంఘం పనిచేస్తోందని ఏరియా ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య స్పష్టం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కార్మిక క్షేత్రంలో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల హక్కు రావాలంటే అది ఒక టీబీజీకేఎస్‌తోనే సాధ్యం అవుతుందని భావించిన వెంకట్రావ్ ఆ సంఘంలో చేరినట్లు ఆయన తెలిపారు. వెంకట్రావ్ నాయకత్వంలో ఎస్‌సీఎల్‌యూ మొత్తం ఆయన వెంట వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తేజావత్ రాంబాబు, మేడ సమ్మయ్య, మడక శశిధర్, ప్రభాకర్ రావు, కడారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇక పదవులు అడగమన్నా..!
‘మా పరిస్థితి కొండకు ఎదురు చూసినట్లు అయ్యింది. ఇవాళ.. రేపు అంటూ రెండేళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. ఎదురు చూపులే మిగిలాయి తప్ప అందివచ్చిన పదవి ఏమీ లేదు. ఇక పదవులు అడగమన్నా..’ అంటూ గులాబీ నేతలు రాజీ పడిపోతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధినేత రేపూ మాపూ అంటూ ఊరించిన పదవులు కొన్నే భర్తీ అయ్యాయి. పార్టీని నమ్ముకున్న.. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన కొందరు సీనియర్లను కదిలిస్తే కళ్ల నుంచి కన్నీళ్లు దునికేలా ఉన్నారు. ఆషాఢం.. శ్రావణం.. దసరా.. సంక్రాంతి అంటూ గడువులు పెట్టిన నాయకత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్న ఆవేదన వారిలో ఉంది. ఒకరికి ఒకరు ఎదురు పడితే బేల చూపులు.. వెర్రి నవ్వులతో పలకరించుకుంటున్నామని తమపై తామే జోకులూ వేసుకుంటున్నారు. ‘ఎప్పుడు కనపడినా.. మీ జిల్లాలో నువ్వే మిగిలావ్.. ఈ సారి అయిపోతుందిలే..’ అన్న హామీలు పొంది పొందీ అలవాటై పోయిందని, పదవి మాత్రం అందని పండుగానే మిగిలిందన్న ఆవేదన వారి మాటల్లో వ్యక్తమవుతోంది. ‘మేము ఎంతో నయం.. ముందు నుంచీ పరిస్థితులకు అలవాటు పడినోళ్లం. ఏదో సంపాదిద్దామని పార్టీలోకి వచ్చిన కొత్తవాళ్ల పరిస్థితే కక్కలేక.. మింగలేక అన్నట్లు అయ్యింది..’ అని ఓ నేత అన్నారు. ఇక ముందూ మిగిలింది ఎదురు చూపులే.. ఇస్తే తీసుకుంటం.. ఇక పదవులు అడగం అన్న నిర్ణయానికి వచ్చినట్లు వారి మాటలు చెప్పకనే చెబుతున్నాయి! -
సారథి ఎవరో?
♦ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం మల్లగుల్లాలు ♦ పగ్గాలు ఆశిస్తున్న నేతల సమర్థతపై మదింపు ♦ 11వ తేదీలోపు బీజేపీకి కొత్త అధ్యక్షుడు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని భారతీయ జనతాపార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నెల 6న గానీ 10వ తేదీన గానీ జిల్లా అధ్యక్ష పదవికి కొత్త సారథిని ఎంపిక చేసేందుకు ప్రాథమికంగా ముహూర్తం ఖరారు చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు అంజన్‌కుమార్ పదవీకాలం కొన్నాళ్ల క్రితమే ముగిసిన ప్పటికీ, శాసనమండలి, గ్రేట ర్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెలలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగేలోపు సంస్థాగత ఎన్నికల పర్వాన్ని పూర్తిచేయాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. దీంతో కొత్త దళపతిని ఎన్నుకునేందుకు ఈనెల 5న ముఖ్యనేతలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం సాధించడం ద్వారా సారథి ఎంపికకు మార్గం సుగమం చేయాలని నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు అధ్యక్ష పదవి నిర్వర్తించిన అంజన్‌కుమార్‌కు మరోసారి చాన్స్లేనందున.. ఈసారి పార్టీ పగ్గాలు చేపట్టడానికి నలుగురు నేతలు అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు, శంకర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి తదితరులు పార్టీ పదవి కోసం తమైదె న శైలిలో పావులు కదుపుతున్నారు. బలహీన సారథ్యం! బీజేపీకి రంగారెడ్డిలో సంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకు, సమర్థంగా పనిచేసే శ్రేణులు ఉన్నప్పటికీ జిల్లా నాయకత్వం పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామీణ జిల్లాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటాలు చేయలేకపోయింది. ఈ క్రమంలో గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. దిగువశ్రేణి నాయకులతో కలుపుగోలుగా వ్యవహరించకపోవడం.. కేవలం కేంద్ర పార్టీ కార్యాల యానికే పరిమితం కావడంతో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయలేకపోయింది. జిల్లాలో బలీయశక్తిగా ఉన్న టీడీపీ దాదాపుగా ఉనికి కోల్పోవడం, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా పోరాట పటిమ ప్రదర్శించలేక చతికిల పడుతున్న సమయాన్ని అందిపుచ్చుకొని ఎదగడానికి పార్టీ నాయకత్వం ప్రయత్నించడంలేదనే వాదన కాషాయశ్రేణుల్లో వినిపిస్తోంది. పీఠాధిపతులెవరో..! పార్టీ కుర్చీపై కన్నేసిన నలుగురూ యువనాయకులే. రాష్ట్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్న బొక్క నర్సింహారెడ్డి పార్టీ పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ అగ్రనాయకుల ఆశీస్సులను నమ్ముకున్న ఆయన తనదైన శైలిలో లాబీయింగ్ నెరుపుతున్నారు. ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతో జిల్లాలోని ఇతర నాయకుల మద్దతు కూడా తనకే దక్కుతుందనే భరోసాతో ఉన్నారు. ఇక బాలాపూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ శంకర్‌రెడ్డి ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ పదవి తనకే ఖరారవుతుందనే విశ్వాసంతో ఉన్నారు. క్రితం సారి చివరి నిమిషంలో పార్టీ పగ్గాలు చేజారాయని, సీనియర్ నేతలు బద్దం బాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరుల ఆశీస్సులతో జిల్లా సారధ్యం దక్కుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక గతంలోనూ జిల్లా కుర్చీని ఆశించి భంగపడిన కరణం ప్రహ్లాదరావు ఈసారి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సీనియర్ నేతగా ఆయనకు అవకాశం కల్పించాలని పార్టీలోని ఒకవర్గం ఒత్తిడి తెస్తోంది. కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డి కూడా రేసులో ముందంజలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి వివిధ పదవులు నిర్వర్తించిన అనుభవం ఉన్నందున.. అధ్యక్ష పదవిపై గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి కూడా సారథ్య బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహుల సమర్థతను మదింపు చేసిన తర్వాత కొత్త సారథిని ఎన్నుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఏదీఏమైనా ఈ నెల 11వ తేదీలోపు నూతన అధ్యక్షుడెవరనేది స్పష్టం కానుంది. -
మన విజయాలపై పరాజయాలదే పైచేయి?
అవలోకనం: మనం ఏ విషయంలోనూ ప్రపంచస్థాయి నేతలం కాము. కాబట్టే క్రికెట్లో కూడా మనం ప్రపంచానికి నాయకత్వం వహించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. మనం ఎందుకింత చెత్తగా ఆడుతుంటాం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండానే కోట్లాది భారతీయులం క్రికెట్‌ను చూస్తూ ఆ క్రీడకు వందల కోట్ల రూపాయలను అప్పనంగా అందిస్తూ ఉంటాం. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రదర్శితమయ్యే భారతీయుల తీవ్ర జాతీయవాదం, ఉత్సాహం మన జట్టు వాస్తవ ఆటతీరులో ప్రతిఫలించకపోవడమే అసలైన విషాదం. మనకాలపు అతి గొప్ప రహస్యాలలో ఇదీ ఒకటి అయి ఉండాలి: భారతీయులు క్రికెట్లో ఎందుకు ఆధిపత్యం చలాయించడంలేదు? అంటే నా ఉద్దేశం అడపాదడపా విజయాలు సాధించలేదని కాదు. మనం అలాంటి విజయాలు పొందుతున్నాం. కాని ఒకప్పుడు వెస్టిండీస్.. తర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించినట్లుగా మనం ఎందుకు క్రికెట్‌పై శాశ్వతంగా ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం అన్నదే ప్రశ్న. ఇంతవరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన క్రికెట్ బోర్డు భారత్‌దే. కాబట్టి మనకు తగిన వనరులు లేవన్నది ప్రశ్నే కాదు. క్రికెట్ లోని ప్రతి ఆర్థిక అంశంపైనా మనం ఎంతగా ఆధిపత్యం చలాయిస్తున్నామంటే, ఇతర దేశాల క్రికెట్ బోర్డులన్నీ ఇండియాకు వంత పాడే స్థాయికి దిగిపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత లాభదాయకమైన ఈవెంట్‌గా మారింది. కానీ భారత పలుకుబడి దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా మోటార్ సైకిళ్లనుంచి పాన్ మసాలా వరకు అమ్మకాలు సాగిస్తూ భారతీయ కంపెనీల ప్రకటనలే కనిపిస్తుం టాయి. అలాంటప్పుడు వాస్తవ క్రీడలో మనం ఎందుకు ఆధిపత్యం చలాయించ లేకపోతున్నాం? మనం గెలిచిన మ్యాచ్‌ల (124) కంటే మనం ఓడిపోయిన మ్యాచ్‌ల (157) సంఖ్యే ఎక్కువ. ఇది ఆశ్చర్యం గొలిపించదు. ఎందుకంటే మనం సొంత గడ్డపైనే బాగా ఆడతాం. మన స్లో వికెట్ పిచ్‌లపై రెండు సార్లు మనల్ని ఔట్ చే యడం ఇతర జట్లకు సాధ్యం కాదు. మరోవైపున మనం ఫాస్ట్ వికెట్ పిచ్‌లపై త్వరత్వరగా అవుట్ అయిపోతుంటాం. కాబట్టి అలాంటి చోట్ల గెలవడం కంటే ఓడిపోవడమే చాలా సులభంగా ఉంటుంది. అయితే ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాలతోనూ మనకు పరాజయ రికార్డే ఎందుకుంది? ఆస్ట్రేలియాపై మనం 24 టెస్టుల్లో గెలుపొందగా, 40 సార్లు ఓడిపోయాం. ఇంగ్లండ్‌పై 21 సార్లు గెలిస్తే, 43 సార్లు ఓడిపోయాం. వెస్టిండీస్‌పై 16 సార్లు గెలిస్తే 30 సార్లు ఓడిపోయాం. చివరకు పాకిస్తాన్‌పై కూడా మనం 9 సార్లు గెలిస్తే, 12 సార్లు ఓడిపోయాం. (పాకిస్తాన్‌తో మనం ఎక్కువ మ్యాచ్‌లు ఆడనందుకు మనల్ని మనం అభినందించుకోవాలి. ఎందుకంటే బలమైన ఉద్వేగాలతో కూడిన ప్రస్తుత వాతావరణంలో పరాజయాన్ని మనం అసలు సహించలేం). గత రెండు దశాబ్దాలకు పైబడి మాత్రమే క్రికెట్ ఆడుతూ వస్తున్న దక్షిణాఫ్రికాపై కూడా మనం 7 విజయాలను నమోదు చేయగా 13 సార్లు ఓటమిపాలయ్యాం. మొత్తంమీద మనం విజయాల రికార్డును అధికంగా నమోదు చేసిన టీమ్‌లు రెండే రెండు. ఒకటి శ్రీలంక (మనకు 16 విజయాలు, 7 ఓటములు) రెండు న్యూజిలాండ్ (మనకు 18 విజయాలు, 10 ఓటములు). ఇక వన్డే ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా విషయాలు ఇంతకంటే ఏమంత భిన్నంగా లేవు. ఈ రంగంలో మరిన్ని గణాంకాలను మీ ముందుంచి విసిగించను, నిస్పృహకు గురిచేయను. నిష్పక్షపాతంగా మనం ఈ సంఖ్యల కేసి చూసినట్లయితే అవి ఒక వింత విషయాన్ని మనకు తెలియబరుస్తాయి. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రదర్శితమయ్యే భారతీయుల తీవ్ర జాతీయవాదం, శ్రద్ధ, ఉత్సాహాలు మన జట్టు వాస్తవ ఆటతీరులో ప్రతిఫలించవు. బాలీవుడ్ భాషలో చెప్పాలంటే మనం షారుక్ ఖాన్ గురించి ఆలోచిస్తూ షాహిద్ కపూర్ క్రికెట్‌ను ఆస్వాదిస్తూంటాం. ఇక్కడ ప్రశ్న ఏదంటే, భారతీయులు నిజంగా ఆసక్తి ప్రదర్శిస్తున్న ఏకైక ఆటలో మనం ఎందుకు ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం? మన జనాభా 120 కోట్లు. మనలో చాలామంది ఏ ఇతర క్రీడనూ తిలకించరు, ఆడరు. ఆస్ట్రేలియా జనాభా రెండున్నర కోట్లకంటే తక్కువ. కాని వారు క్రికెట్‌ను తమ ఏకైక క్రీడగా ఎన్నడూ భావించరు. క్రికెట్ ప్రపంచాన్ని మొత్తంగా కలిపినా భారత జనాభాలో సగానికంటే మించదు. కాబట్టి తగినంత టాలెంట్ లేకపోవడం అనేది ప్రశ్నే కాదు. ఐపీఎల్ విస్తరణలో ఉన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి ఏమిటంటే టీమ్‌లను భ ర్తీ చేయడానికి స్థానిక టాలెంట్ తగినంతగా లేకపోవడమే. అందుకే కొంతమంది గుర్తింపు పొందిన స్థానిక ప్లేయర్లు అంత భారీ వేతనాలు తీసుకుంటున్నారు. ఇది అధిక డిమాండ్ కంటే సరఫరా కొరతనే సూచి స్తుంటుంది. కాని మనకున్న జనాభా సంఖ్యను చూసినట్లయితే, ఆస్ట్రేలియా జట్టు తరహా నాణ్యత కలిగిన 60 జట్లు మనకు ఉండాలి. కాని మనకు ఒక్కటంటే ఒక్క సరైన జట్టు లేదు. మన చరిత్రలోనే ఆస్ట్రేలియా జట్టు లాంటి ఒక్క జట్టును మనం చూడలేం. ఎందుకు? ఇది స్లో, ఫాస్ట్ పిచ్‌కు సంబంధించిన విషయం కాదు. అసలు విషయం అదే అయితే మనం ఫాస్ట్వికెట్లపై శిక్షణ ఎందుకు తీసుకోం? మన జట్లకు సరైన విధంగా శిక్షణ ఇవ్వడానికి మన వద్ద కోరినంత డబ్బు ఉంది కూడా. అయినా మనం అలాంటి శిక్షణ ఎందుకు ఇప్పించడం లేదు? బహుశా శిక్షణ లేకపోవడం, సామగ్రి, సౌకర్యాలు లేకపోవడం నిజమైన సమస్య కాకపోవచ్చు. మీలో చాలామంది ఆలోచిస్తున్నట్లే, దీనికి జవాబు మరోచోట ఉంటుందని నేననుకుంటున్నాను. బహుశా ప్రగాఢవాంఛ, నైపుణ్యంపై ఇది ఆధారపడి ఉండవచ్చు. మనం ఏ విషయంలోనూ ప్రపంచస్థాయి నేతలం కాము. కాబట్టే క్రికెట్లో కూడా మనం ప్రపంచానికి నాయకత్వం వహించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. వ్యక్తులుగా నైపుణ్యంపై మనం పెడుతున్న మదుపు చాలా తక్కువ. మైదానంలో ఉన్న మన క్రికెటర్లను... ఆస్ట్రేలియాతో, వెస్టిండీస్‌తో, ప్రత్యేకించి ప్రస్తుతం భారత్‌లో సందర్శిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లతో పోల్చి చూసినట్లయితే ఏదో తప్పు జరుగుతోందని, చాలా తేడాగా ఉందని మనకు తెలిసిపోతుంటుంది. ఒక పక్షం ఏమో (మన పక్షం కాదు) అథ్లెటిక్స్లాగా పని చేస్తుంటారు. భారత క్రికెటర్లు కాస్త ఉబ్బినట్లుగా, ఫిట్ కానట్లుగా కనిపిస్తుంటారు. కానీ వారు జాతీయ జట్టులోకి ప్రవేశిస్తుంటారు. అత్యంత నైపుణ్యం కంటే ‘ఫర్వాలేదు’ అనేదే మనకు చాలా ముఖ్యమైన లక్షణంగా కనబడుతుంటుంది. క్రికెట్లో మనం ఆధిపత్యం చలాయించలేకపోవడం అనేది మన కాలపు అతి పెద్ద మిస్టరీల్లో ఒకటై ఉండాలని నేను ఈ వ్యాసం మొదట్లోనే రాశాను. అయితే అది మాత్రమే కాదు. మనం ఎందుకింత చెత్తగా ఆడుతుంటాం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండానే కోట్లాది భారతీయులం క్రి కెట్‌ను చూస్తూ ఆ క్రీడకు వందల కోట్ల రూపాయలను అప్పనంగా అందిస్తూ ఉంటాం. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com) -
తెలంగాణ బీజీపీలో అయోమయం
-
సంకల్పబలుడు
భారతదేశంలో ఐక్యత గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు దేశ జాతీయోద్యమంలోను, ఆ తర్వాత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం మాత్రమే మొదటి నిలువెత్తు ప్రతిమలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా... స్వాతంత్య్రానంతరం, మొరాయించిన సంస్థానాలకు ముకుతాడు వేసి మరీ భారతదేశంలో విలీనం చేయడంలోని దృఢ సంకల్పం ఆయనలోని ఉక్కు మనిషిని ప్రపంచానికి చూపింది. మనుషుల్ని, ప్రాంతాలను కలిపి ఉంచడానికి పటేల్ ఈ దేశపు తొలి హోమ్ మంత్రిగా కఠినమైన నిర్ణయాలే తీసుకున్నారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో చెలరేగిన అల్లర్లను కూడా తొలి ఉప ప్రధానిగా ఆయన ఎంతో సమర్థంగా అణచివేయగలిగారు. మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత పటేల్‌కు భారతరత్న లభించి ఉండవచ్చు కానీ, అందుకు సమానమైన గౌరవం ఈ ఏడాది నుంచి ఆయనను చిరస్మరణీయం చేయబోతోంది. పటేల్ జన్మించిన అక్టోబర్ 31 వ తేదీని ఏటా రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతాదినం)గా జరుపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోపక్క మధ్య గుజరాత్‌లోని నర్మదా నది ఆనకట్టకు మూడు కి.మీ. సమీపంలో ఉన్న సాధు ద్వీపంలో 2,989 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తున ఏర్పాటు చేయ తలపెట్టిన పటేల్ ఐక్యతా ప్రతిమ నిర్మాణ పనులను గత సోమవారమే గుజరాత్ ప్రభుత్వం ఎల్ అండ్ టి సంస్థకు అప్పగించింది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’కి రెండింతల ఎత్తు ఉండే ఈ విగ్రహం 2018లో పూర్తయ్యాక, ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా ఎత్తై స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ రికార్డును మించిపోతుంది. పటేల్‌లోని శిఖర సమాన దృఢచిత్తానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ఛాయామాత్రమైన ప్రతిరూపంగా నిలవగలుగుతుంది. 1875లో గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి, తిరిగి ఇండియాకు వచ్చాక క్రియాశీలక ఉద్యమ రాజకీయాల్లో పాల్గొన్నారు. రాజనీతిజ్ఞుడిగా ఎదిగారు. దేశ పౌరుల ప్రథమ విధి తమ దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడమేనని పటేల్ అంటారు. -
పాక్ కాల్పులు నిరసిస్తూ ఏబీవీపీ మానవహారం
చిత్రదుర్గం : భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడటాన్ని నిరసిస్తూ శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేశారు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చారు. అక్కడ మానవహారం నిర్మించి సుమారు పావుగంట సేపు రాస్తారోకో చేసి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఏబీవీపీ రాష్ట్ర సహ కార్యదర్శి పవన్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతూ పాకిస్థాన్ సైనికులు, తీవ్రవాదులు భారత్‌లోకి చొరబడుతున్నారని, దీనిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే పాకిస్థాన్ కాల్పులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కాల్పులకు కేంద్ర ప్రభుత్వం, బీఎస్ఎఫ్ బలగాలు కూడా తగిన సమాధానమిచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా సహ సంచాలకుడు యువరాజ్, నగర ఉపాధ్యక్షుడు బీ.ప్రసాద్, జిల్లా విద్యార్థిని ప్రముఖ్ జయశ్రీ, విద్యార్థులు అక్షయ్, ధరణి, విష్ణు, చంద్రశేఖర్, చం దన, అంబిక, సౌందర్య పాల్గొన్నారు. బళ్లారి అర్బన్ : జమ్ముకాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో భారత పౌరులకు, భద్రతా దళాలకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక మున్సిపల్ కళాశాల నుంచి రాయల్ సర్కిల్ మీదుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ జిల్లా కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారికి వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ దేశ సరిహద్దులో కేంద్ర ప్రభుత్వం మెతక వైఖరి అవలంభించకుండా పాకిస్థాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా సంచాలకుడు మహిపాల్‌రెడ్డి, రవిగౌడ, తాలూకా సంచాలకుడు గోవిందరెడ్డి, కేదార్‌రెడ్డి, అరుణ పాటిల్, మారుతి, రమేశ్, మంజునాథ్, ఉదయ్ పాల్గొన్నారు. -
విద్యా వ్యవస్థలో మార్పులు
ప్రైవేటు విద్యాసంస్థలపై నిఘా నైతిక విలువలపై టీచర్లకు శిక్షణ విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి విశాఖపట్నం: అందరికీ విద్య అందించేందుకు అవసరమైతే ఓ ఉద్యమంలా పటిష్టమైన చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి అన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుకు భవిష్యత్‌లో విద్యా వ్యవ స్థలో పలు మార్పులు తీసుకొస్తామని ఆమె చెప్పారు. స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి ముచ్చటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యావ్యవ స్థలో నైతిక విలువలు కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న పిల్లలకు సులభతరమైన రీతిలో నైతిక విలువలు, సమాజం పట్ల అవగాహన, దేశభక్తి తదితర అంశాల్లో అదనపు తరగతల ద్వారా బోధన అందంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. మన టీవీ ద్వారా ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. రాష్ర్టంలో విద్యార్థులు అత్యధికంగా ఉన్న పాఠశాల్లో మొదటిది మదనపల్లి కాగా, రెండోది విశాఖలోని మధురవాడ హైస్కూల్ అని తెలిపారు. అయినా ఈ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఉత్తమ ఫలితాలను అందిస్తున్న పాఠశాలలకు తల్లితండ్రులు, స్థానికులు సహకరించాలని కోరారు. విద్యావ స్థలో రాజకీయ జోక్యం ఇబ్బందికరంగా మారిందని కాలక్రమేనా ఇది రూపుమాపేందుకు కృషిచేస్తామని తెలిపారు. బట్టీ పద్ధతికి స్వస్తి.. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను రోబోలు లాగా మారిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బట్టిపద్ధతికి స్వస్తిపలికేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ కేలండర్‌ను రూపొందిస్తున్నామని, ఇది ప్రవేటు పాఠశాలలకూ వర్తింపచేయనున్నామని తెలిపారు. విద్యాశాఖ ఆస్తులను రక్షిస్తాం మధురవాడలోని ఎమ్మార్సీ కార్యాలయానికి చెందిన స్థలంలో అనధికారికంగా వెలసిన ఆక్రమణలపై విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి కిందస్థాయి అధికారులపై మండిపడ్డారు. ఎంతో విలువైన స్థలాన్ని ఆక్రమణలకు గురైతే ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. -
లక్ష్యానికి పది సూత్రాలు :సత్య నాదెళ్ల
సత్య నాదెళ్ల... ఈ పేరు తాజాగా ప్రపంచమే స్మరిస్తోంది. కలలు కనడమే కాదు... ఆ కలలను సాకారం చేసుకుని తన జీవన మార్గాన్ని సుసంపన్నం చేసుకున్నారాయన. లక్షలాది యువతకు దిక్సూచిలా నిలిచారు. ఆ.. ఇంజినీరింగే కదా... అని తేలికగా తీసుకుంటున్న సమయంలో అబ్బో.. ఇంజినీరింగా అనే స్థారుుకి తీసుకువెళ్లారు. ఏడాదికి 112 కోట్ల వేతనంతో అగ్రగామిగా నిలిచారు. మనజిల్లాలో 18 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఇందులో నుంచి ఏటా 10 వేల మంది పట్టభద్రులు బయటకు వస్తున్నారు. ఈ అకడమిక్ సంవత్సరంలో 40 వేల మంది ఇంజినీరింగ్ కోర్సు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల జీవితాన్ని ఓ పాఠంగా తీసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలనుకునే విద్యార్థుల కోసం పది సూత్రాలు.. - ఒంగోలు లక్ష్యం దాదాపు 22ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సత్య నాదెళ్ల ఏదో గాలివాటంలా వెళ్లి ఆ సంస్థలో చేరిపోలేదు. అది ఆయన కల. చదువు పూర్తయిన తరువాత ప్రముఖ సంస్థ ‘సన్ మైక్రో సిస్టమ్స్’లో చేరినప్పటికీ మైక్రోసాఫ్ట్ కంపెనీనే ఆయన లక్ష్యం. ఆ కలను నెరవేర్చుకున్నారు. పాఠం : నేటి ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో చాలామంది ఏదో ఉద్యోగం లేదా క్యాంపస్ ఇంటర్య్వూలో ఓ కొలువు దొరికితే చాలు అనుకుని సరిపెట్టుకుంటున్నారు. అలా కాకుండా ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుంటే మనలోనూ ఎందరో సత్య నాదెళ్లలు ఎదుగుతారు. ప్రజాభిమానం సైబర్ ప్రపంచంలో సత్య నాదెళ్ల పేరు మార్మోగిపోతోంది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఆయనను ప్రకటించగానే 50కోట్ల మంది నెటిజన్లు ఆయన గురించి వెతకడం ప్రారంభించారు. ఇక గూగుల్ సెర్చ్‌లో సత్య నాదెళ్ల పేరు టైప్ చేయగానే అర సెకనులో దాదాపు 44 కోట్ల వెబ్ పేజీలు అందబాటులోకి వచ్చాయి. సెర్చ్ రికార్డుల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (65కోట్లు), బిల్‌గేట్స్ (48కోట్లు), తరువాత మూడో వ్యక్తిగా సత్య నిలిచారు. పాఠం : ఉన్నత భవిష్యత్తే ప్రాతిపదికగా చేసుకుంటే ఎంతోమంది నెటిజన్ల కళ్లు మీ కోసం వెదుకుతాయి. శక్తిసామర్థ్యం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎంపికవడం భారతీయ విద్యార్థుల సత్తాకు నిదర్శనం. అమెరికా, చైనాతో సమానంగా కొందరు భారతీయ విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను చూపుతున్నారు. లేదంటే 47 ఏళ్ల సత్యకు మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ సారథ్యం ఎలా లభిస్తుంది. పాఠం: ఆకాశమా నీవెక్కడ... అంటూ ముందే చతికిలపడిపోకూడదు. ఆకాశమే హద్దు అంటూ ఎదిగితే అవకాశం మీదే అని ఆచరణలో చాటి చెప్పారు నాదెళ్ల. ఏటా బయటకు వస్తున్న ఇంజినీర్లను చూసి అమెరికానే నోరెళ్ల పెడుతోంది. ఆత్మస్థైర్యం ‘ప్రపంచమంతా సాఫ్ట్వేర్ శక్తితో మున్ముందుకు దూసుకువెళ్తోంది. మైక్రోసాఫ్ట్ పగ్గాలను అందుకోవడం ద్వారా నవకల్పనలతో నాదైన ముద్రను వేయడానికి వీలవుతుందనే నేను ఈ అత్యున్నత పదవిని అధిష్టించేందుకు ముందుకొచ్చా. అయితే, ఈ అవకాశం వచ్చేముందు ఎందుకు సీఈవో కావాలనుకుంటున్నానని నన్ను నేను ప్రశ్నించుకున్నా. 1.3 లక్షల మంది మానవ మేధస్సులతో నిండిన మైక్రోసాఫ్ట్ వంటి అత్యుత్తమ కంపెనీకి సారథ్యం వహించడం ద్వారా మనమేంటో ప్రపంచానికి చాటి చెప్పగల అద్భుత అవకాశం లభించినట్టే. ఇదే నా అంతరాత్మ నాకు చెప్పింది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా నా సంసిద్ధతను వ్యక్తం చేశా.’ అని సత్య పేర్కొన్నారు. పాఠం : పెద్ద అవకాశాలు కళ్లముందున్నా... ఆ బాధ్యతకు నేను తగను. ఆ స్థాయి నాది కాదు అని చాలామంది అనుకుంటారు. కానీ సత్యం అలా అనుకోలేదు. ఆ పదవికి నేనే అర్హుడిని అనే ఆత్మస్థైర్యాన్ని స్వీకరించారు. ఆ ధైర్యం అందరూ అలవరుచుకోవాలి. నాయకత్వం ‘ఈ సంధి కాలంలో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టడానికి సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి ఎవరూ కనిపించలేదు. ఇంజినీరింగ్ నేపథ్యం, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను కలిసికట్టుగా ఉంచడం వంటి విషయాల్లో సత్య ఒక నాయకుడిగా నిరూపించుకున్నారు. మైక్రోసాఫ్ట్‌కు ఏం కావాలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సత్యకు బాగా తెలుసు.’ అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేర్కొన్నారు. పాఠం: ఎంత అదృష్టం. సత్య నాదెళ్ల కంటే సరైన వ్యక్తి కనిపించలేదంటూ సంస్థ అధినేతే ప్రశంస. ఏ సంస్థలో.. ఏ రంగంలో పనిచేసినా అధినేతల మెప్పును పొందాలంటే ఎంత కృషి... కఠోర శ్రమ కావాలి. ఆ స్ఫూర్తిని ఆయన్నుంచే తీసుకుంటే... విజయాలే మన వెంట. నైపుణ్యం సత్య అద్భుతమైన నాయకుడు. వినూత్న సాంకేతిక నైపుణ్యం ఆయన సొంతం. ఎక్కడ అవకాశాలు ఉన్నాయో కనిపెట్టగలడు. వాటిని మైక్రోసాఫ్ట్ ఎలా అందిపుచ్చుకోవాలో నిర్ణయించగలరు. సత్య నాదెళ్ల గొప్ప సీఈవో అవుతారన్న నమ్మకం నాకుంది. - స్టీవ్ బామర్, వైదొలుగుతున్న మైక్రోసాఫ్ట్ సీఈవో పాఠం : సహజంగా ఆ స్థానాన్ని ఎవరైనా అధిరోహిస్తే అప్పటివరకు ఆ సీట్లో ఉన్నవాళ్లలో అసూయ ఆవహిస్తుంది. కానీ మాజీ సీఈవో బామర్ అలా అనుకోలేదు. ఆ సామర్థ్యం నాదెళ్లకే ఉందంటూ స్వాగ తించడం గొప్ప స్ఫూర్తిమంత్రం. చిన్న ఉద్యోగి నుంచి ఉన్నత వ్యక్తులు కూడా నేర్చుకోవాల్సిన మంచి సూత్రం. నమ్మకం రానున్న పది సంవత్సరాల్లో కంప్యూటింగ్ మరింత విశ్వవ్యాప్తం కానుందని నా నమ్మకం. కొత్త రకాల హార్డ్, సాఫ్ట్వేర్ ప్రాణం పోసుకుని మనం చేస్తున్న అనేక పనుల్లోకి, వ్యాపారాల్లోకి, జీవన శైలుల్లోకి, ఏకమొత్తంగా మనదైన ప్రపంచంలోకి చొచ్చుకు వచ్చి డిజిటైజ్ చేసేస్తాయి. - సత్య నాదెళ్ల పాఠం : ముందు చూపును చెబుతోంది ఈ సూత్రం. ఏ రంగం ఎంచుకున్నా ముందు తరాల్లోకి ఎలా దూసుకుపోతుందో ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరం అని చెబుతోంది. పట్టుదల ‘మనకు అసాధ్యం అన్నది ఉండదన్న విషయాన్ని విశ్వసించాలి. అనుమానాన్ని దరిదాపుల్లోకి రానీయకూడదు. అప్పుడే చేయాల్సిన పనిపై స్పష్టత మొదలవుతుంది. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా మనల్ని నడిపిస్తుంది. వినూత్నతకు ప్రాధాన్యమివ్వాలి. తమ పనికి అర్థాన్ని వెతుక్కోగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రతిభ పునాదిపై నవలోకాన్ని నిర్మిద్దాం.’ - సత్య నాదెళ్ల పాఠం: ఆదిలోనే హంసపాదులు ఎంచే వాళ్లు చాలామంది మనలో ఉన్నారు. చేసేది మంచి పని అయినప్పుడు అనుమానాల్సి దరిచేరనీయవ ద్దని చెబుతోంది ఈ సూత్రం. భయం ఉదయించినపుడే అపజయం వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నేటి తరానికి. స్ఫూర్తి హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివేటప్పుడు ఓసారి క్రికెట్ మ్యాచ్‌లో నేను మామూలుగా బౌలింగ్ చేస్తున్నాను. వికెట్లు పడడం లేదు. ఆ క్షణంలో మా కెప్టెన్ తనే బాల్‌ను తీసుకుని వికెట్లు తీసి ఆ తరువాత మళ్లీ నాకు బౌలింగ్ ఇలా చేయ్ అంటూ బాల్‌ను చేతికిచ్చారు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మరిచిపోలేను. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇదేనా నాయకత్వం లక్షణం. - సత్య నాదెళ్ల పాఠం: ఆటలోనూ సందేశం అందిపుచ్చుకున్నారీయన. అలా కాదు ఇలా అని చెప్పేవాళ్లు మనకూ తారసపడతుంటారు. కానీ అక్కడితో అది మరిచిపోతుంటాం. అందులోంచి స్ఫూర్తి తీసుకోవాలంటున్నారు నాదెళ్ల. విజయం ఏడాదికి రూ.112 కోట్లు, పాత సీఈవో మూల వేతనం కన్నా ఆయనకు 70 శాతం ఎక్కువే. కంపెనీ అందించే మరిన్ని సౌకర్యాలు అదనం. పాఠం : నాదెళ్లవైపు ఇప్పుడు ప్రపంచమే చూస్తోంది. ఆ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తే అంతకాకపోయినా అందులో సగం దూరమైనా వెళ్లొచ్చు. యువతా.. బెస్ట్ ఆఫ్ లక్.. -
రాహుల్ నాయకత్వంలోనే కాంగ్రెస్‌కు అధికారం
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ నాయకులు కొట్టిపారేశారు. కాంగ్రెస్ భావి నాయకుడు రాహులేనని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పాత తరం, యువ నేతల మధ్య అభిప్రాయభేదాలు, రాహుల్ నాయకత్వంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ ప్రతినిధి శోభా ఓజా స్పష్టత ఇచ్చారు. 'రాహుల్ జీ మా నేత. ఆయన నాయకత్వంలోనే పార్టీ పనిచేస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తాం. రాహుల్ నాయకత్వ సామర్థ్యంపై ఎలాంటి సందేహాలు లేవు.' అన ఓజా చెప్పారు. -
కొలువు సాధనకు.. మూడు లక్షణాలు
జాబ్ స్కిల్స్ ఆధునిక ప్రపంచంలో పోటీ నానాటికీ పెరిగిపోతోంది. అభ్యర్థులు తమకు ఇష్టమైన కోర్సులో ప్రవేశించాలన్నా, నచ్చిన కొలువులో చేరాలన్నా ఇతరుల నుంచి పోటీని ఎదుర్కోవాల్సిందే. చదువు పూర్తయిన తర్వాత సంతృప్తికరమైన వేతనం లభించే ఉద్యోగంలో చేరాలనేది అందరి కల. అయితే, ఇంటర్వ్యూలో ఇతర అభ్యర్థుల కంటే మిన్నగా రిక్రూటర్‌ను మెప్పిస్తేనే ఉద్యోగం సొంతమవు తుంది. కాబట్టి ఇంటర్వ్యూలో విజయానికి కావాల్సిన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. రిక్రూటర్ ఆశించేదేమిటి? సంస్థ యాజమాన్యం ఎదుట అభ్యర్థి తన సామర్థ్యాలను, ప్రతిభను ప్రదర్శించేందుకు వీలుకల్పించే వేదిక.. ఇంటర్వ్యూ. మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థి నుంచి రిక్రూటర్ ఏం కోరుకుంటు న్నారో తెలుసుకోవాలి. ఏ ప్రాతిపదికన అభ్యర్థిని అంచనా వేస్తున్నారో గుర్తించాలి. ఎలాంటి లక్షణాలు అభ్యర్థుల్లో ఉండాలని ఆశిస్తున్నారో.. వాటిని పెంపొందించుకుంటే గెలుపు ఖాయం. సాధారణంగా మూడు లక్షణాలను రిక్రూటర్ కోరుకుంటారు. అవి ఇంటెలిజెన్స్, లీడర్షిప్, ఇంటిగ్రిటీ. తెలివితేటలు: అభ్యర్థిలో రిక్రూటర్ ప్రధానంగా ఆశించే లక్షణం.. మంచి తెలివితేటలు. దీంతోపాటు ఉద్యోగానికి అవసరమైన సమయస్ఫూర్తి, సమస్యలను పరిష్కరించే ప్రాక్టికల్ సామర్థ్యం ఉండాలని కోరుకుంటారు. ఈ లక్షణాలు మీలో ఉన్నట్లు ఇంటర్వ్యూలో రిక్రూటర్‌కు తెలియాలంటే.. కొలువుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించాలి. రిక్రూటర్ చెప్పే సమాధానాలను కుతూహలంతో వినాలి. వారు ఏవైనా సమస్యలను ప్రస్తావిస్తే మీరు వాటికి పరిష్కార మార్గాలను సూచించాలి. సదరు ఉద్యోగంపై మీలో ఆసక్తి ఉన్నట్లు రిక్రూటర్ గుర్తిస్తారు. నాయకత్వం లీడర్షిప్ అంటే కొత్త బాధ్యతలను స్వీకరిం చేందుకు సర్వసన్నద్ధంగా ఉండడం. ఉద్యోగం లో జవాబుదారీతనంతో వ్యవహరించడం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడాన్ని, ఊహించని సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడాన్ని, సాకులు చూపకపోవడాన్ని కూడా నాయకత్వ లక్షణంగా భావిస్తారు. నిజాయతీ అభ్యర్థులు సంస్థకు విధేయులుగా ఉండడాన్ని, తమ బలాలతోపాటు బలహీనతలనూ ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించడాన్ని నిజాయతీగా చెప్పుకోవచ్చు. కార్యాలయంలో సహచరులను, బృంద సభ్యులను విమర్శించకపోవడం, పాత యాజమాన్యాన్ని తప్పుపట్టకపోవడం వంటి లక్షణాలు అభ్యర్థుల్లో ఉండాలి. అందుకే ఇంటర్వ్యూలో అభ్యర్థి మనస్తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రశ్నలు వేస్తుంటారు. పాత యాజమాన్యం గురించి ప్రస్తావిస్తుంటారు. అభ్యర్థులు తగిన సమాధానం ఇవ్వాలి. -
దసరా ఏనుగులకు సాదర స్వాగతం
మైసూరు : విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే జంబూ సవారీలో పాల్గొనే ఏనుగులకు శనివారం ఇక్కడ రాజప్రాసాదం వద్ద సాదర స్వాగతం లభించింది. అర్జున నాయకత్వంలోని ఆరు ఏనుగుల బృందం స్థానిక అరణ్య భవన్ నుంచి రాజప్రాసాదానికి చేరుకున్నాయి. జంబూ సవారీలో అంబారీని మోసే అర్జునతో పాటు బృందంలో ఇంకా గజేంద్ర, బలరామ, అభిమన్యు, వరలక్ష్మి, మేరి ఉన్నాయి. జానపద బృందాలు, కలశాలు ఎత్తుకున్న మహిళలు ముందు నడవగా బల్లాల్ సర్కిల్, రామస్వామి సర్కిల్, చామరాజ డబుల్ రోడ్డు, బసవేశ్వర సర్కిల్ మీదుగా ఈ ఏనుగులన్నీ రాజ ఠీవితో రాజప్రాసాదంలోకి ప్రవేశించాయి. స్వాగత కార్యక్రమం మినీ దసరా ఊరేగింపును తలపించింది. దారి పొడవునా ప్రజలు ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించారు. కాగా ఏనుగుల బృందానికి స్వాగత కార్యక్రమంలో ఈసారి మార్పు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. మామూలుగా రాజప్రాసాదంలోని జయమార్తాండ ద్వారం వద్ద దసరా ఏనుగులకు స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే ఈసారి కొన్ని కారణాల వల్ల ఏనుగులు విడిది చేసిన అరణ్య భవన్ వద్దే స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు. జిల్లాలోని హుణసూరు తాలూకా వీరనహొసహళ్లి నుంచి గురువారం బయలుదేరి అశోక్ పురంలోని అరణ్య భవ న్లో విడిది చేసిన ఏనుగులకు స్వాగతం పలికిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాణి ప్రమోదా దేవితో మాట్లాడినప్పుడు, శ్రీకంఠదత్త ఒడయార్ మరణించిన నేపథ్యంలో దసరా సందర్భంగా నిర్వహించే ప్రైవేట్ దర్బార్ సహా అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు చెప్పారని వివ రించారు. అందువల్లే ఏనుగుల బృందానికి రాజప్రాసాదం వద్ద స్వాగతం పలకలేదని చెప్పారు. దసరా ఉత్సవాలకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని రాణి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. సహకార శాఖ మంత్రి హెచ్ఎస్. మహదేవ ప్రసాద్, జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు పుష్పావతి అమరనాథ్, జిల్లా కలెక్టర్ సీ. శిఖా ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో 18 వేల ఉద్యోగాల కోత!
న్యూయార్క్: అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఉద్యోగాల కోతకు తెరతీసింది. వచ్చే ఏడాది వ్యవధిలో 18 వేల మేర సిబ్బందిని తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ, భారత్‌కు చెందిన సత్య నాదెళ్ల గురువారం ప్రకటించారు. ఈ చర్యలు కఠినమైనవే అయినా... కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన నోకియా మొబైల్ డివైస్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌తో అనుసంధానించేందుకు ఇవి తప్పనిసరి అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా రానున్న 12 నెలల్లో పన్ను ముందస్తు చార్జీల రూపంలో 1.6 బిలియన్ డాలర్లను(సుమారు రూ.9,600 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. సత్య నాదెళ్ల ఐదు నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి సిబ్బంది ఉధ్వాసన ప్రకటన కావడం గమనార్హం. అయితే, భారత్ చాలా కీలకమైన మార్కెట్‌గా నిలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాల కోతలు పెద్దగా ఉండకపోవచ్చ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. తమకు భారత్‌లో నోకియా డివెజైస్‌తోసహా 6,500 మంది ఉద్యోగులు ఉన్నారని.. మైక్రోసాఫ్ట్ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ ప్రభావం చాలా చాలా స్పల్పంగానే ఉంటుందని చెప్పారు. కాగా, ఈ 18,000 కోతల్లో సుమారు 12,500 వరకూ నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ బిజినెస్‌కు చెందిన నిపుణలు, ఫ్యాక్టరీ సిబ్బందివే ఉంటాయని సమాచారం. ప్రధానంగా మైక్రోసాఫ్ట్, నోకియా డివెజైస్‌ల మధ్య సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. తొలి విడతలో భాగంలో 13,000 సిబ్బందిని తగ్గించుకునే చర్యలను ప్రారంభించామని... వచ్చే ఆరు నెలల్లో ఎవరిని తొలగించబోతున్నామనేది ప్రకటిస్తామని నాదెళ్ల వెల్లడించారు. మొత్తానికి 2015 జూన్ నాటికి ఈ మొత్తం సిబ్బంది కోత ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గతేడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో 99,000 పూర్తిస్థాయి(ఫుల్‌టైమ్) సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 58,000 మంది అమెరికాలో, మిగతా 41,000 మంది ప్రపంచవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నోకియా డీల్ తర్వాత కంపెనీలోకి కొత్తగా వచ్చిచేరిన ఉద్యోగులు ఇందులో లేరు. 7.2 బిలియన్ డాలర్ల మొత్తానికి నోకియా మైబైల్ హ్యాండ్సెట్ల తయారీ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రధానంగా 2009లో మైక్రోసాఫ్ట్ సుమారు 5,800 మంది ఉద్యోగులను తొలిగించిన తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో కోతలను ప్రకటించడం ఇదే తొలిసారి. -
పదవి రాగానే పాగా..!
అక్రమార్కులకు టీడీపీ నేతల అండదండలు ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో బుద్దాలపాలెం తవ్వకాలు తవ్వకం వైపు చూడొద్దంటూ ఆ ప్రజాప్రతినిధి ‘సింహ’గర్జన పట్టించుకోని రెవెన్యూ అధికారులు కోనేరుసెంటర్ (బుద్దాలపాలెం) : బందరు మండలం, బుద్దాలపాలెంలో అనుమతి లేకుండా చేపల చెరువుల తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఈ చెరువుల తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అధికారులు పట్టించుకోకపోవడం, టీడీపీ నేతల అండదండలు మెండుగా ఉండటంతో గ్రామానికి చెందిన ఆ ప్రజాప్రతినిధి చెరువుల తవ్వకాలకు నాయకత్వం వహిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని తాళ్లపాలెం కాలువ గట్టు వెంబడి ఇరవై రోజులుగా చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నిన్నటి వరకూ పచ్చగా కళకళలాడిన పంటపొలాలు నేడు చేపల చెరువులుగా మారుతున్నాయి. అక్రమంగా చెరువు తవ్వకాలకు పాల్పడే వారు అధికారుల కళ్లు గప్పి గుట్టుచప్పుడు కాకుండా పనులు పూర్తి చేస్తుంటారు. కానీ ఈ ప్రజాప్రతినిధి మాత్రం జంకూబొంకు లేకుండా అందరికీ తెలిసేలా దగ్గరుండి మరీ తవ్వకాలు జరిపిస్తున్నాడు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ‘ప్రభుత్వమే మాది. మంత్రి మా మనిషి. ఎవరేం చేస్తారు’ అంటూ ‘సింహ’గర్జన చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొం టున్నారు. పంట పొలాల మధ్య చెరువుల తవ్వకాల కారణంగా తమ పొలాలకు ఊట నీరు దిగటంతో తీరని నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులపై నేతల ఒత్తిడి గ్రామంలో చెరువు తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారి ఒకరు ఇటీవల సదరు ప్రజాప్రతినిధిని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఆ ప్రజాప్రతి నిధి టీడీపీ ముఖ్య నేతలను కలిసి రెవెన్యూ అధికారులు చెరువు తవ్వకాలను అడ్డుకోకుండా చూడాలని కోరారని తెలిసింది. దీంతో ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు సంబంధిత రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి ‘వాళ్లు మావాళ్లే చూసీ చూడనట్లు ఊరుకోండి’ అని ఆదేశించారని, దీంతో సదరు రెవెన్యూ సిబ్బంది చేసేదేమీ లేక ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ సిబ్బంది చెరువు తవ్వకాల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తుండగా ఆ ప్రజాప్రతినిధి గ్రామంలోని తన అనుచరులైన కొంత మందితో ఆ ప్రాంతంలో చెరువు తవ్వుకోవడం వలన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పించి వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. -
సేవకుడు నాయకుడు..!
‘‘ఈ ప్రపంచాన్ని మార్చగలిగేవి రెండే రెండు.. ఒకటి నాయకత్వం, రెండు సృజనాత్మకత...’’తిమోతీ వాంగ్ అనే ఆ యువకుడి అభిప్రాయం ఇది. మరి ఈ అభిప్రాయాన్ని ప్రపంచానికి దిశానిర్దేశం చేసేందుకు చెప్పలేదతను. తను నమ్మి, పాటించి ఒక స్థాయికి ఎదిగి.. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొన్నాక చెబుతున్నాడు. దీంతో ఈ మాటలకు విలువ పెరుగుతోంది. వాంగ్ 22 ఏళ్ల యువకుడే... అయితే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో దేశ సమకాలీన రాజకీయాల గురించి చర్చించేంత స్థాయి అతడిది. అంత చిన్న వయసులో అంత స్థాయికి ఎలా ఎదిగాడు? అనే సందేహం వస్తుందెవరికైనా! మరి నాయకత్వం, సృజనాత్మకతలు ఈ ప్రపంచాన్నే మార్చేస్తాయని అంటున్నాడు ఈ యువకుడు. ఆ రెండూ పుష్కలంగా ఉన్న ఇతడి జీవితాన్ని అవి ఆ స్థాయికి తీసుకెళ్లడం పెద్ద విచిత్రం ఏమీ కాదు కదా! యువత రాజకీయం... అనేది మాట్లాడటానికి చాలా పెద్ద అంశం. ఒకవైపు రాజకీయ నేతలేమో యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తారు. అయితే సగటు యువత ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలవైపు అడుగువేయడం అనేది చాలా పెద్ద సాహసమే అవుతుంది. ఇండియాలోనే కాదు.. అమెరికాలోనైనా అది అంతే. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది సాహసవంతులు కనిపిస్తూ ఉంటారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమిస్తూ ఉంటారు. అంటే రాజకీయ పార్టీలతో కలిసి కాదు, అసలు వీళ్లకు రాజకీయమే తెలియదు. వీళ్లు నాయకులు అంతే.. తమ సమస్యల విషయంలో, తమపై ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాల విషయంలో తమ గళాన్ని వినిపిస్తున్నప్పుడు వీళ్లలోని నాయకత్వ లక్షణాలు ఆవిష్కృతం అవుతాయి. అలా విద్యార్థి దశ నుంచి నేతగా వచ్చి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితో రాజకీయ విధానాల గురించి చర్చించేంత స్థాయికి చేరుకొన్న యువనేత తిమోతీ వాంగ్. అంతే కాదు ఒకవైపు యువత హక్కుల గురించి పోరాడుతూనే, పెద్ద ఎంటర్‌ప్రెన్యూరర్‌గా కూడా రాణించడం ఇతడి ప్రత్యేకత. నేషనల్ యూత్ అసోసియేషన్(ఎన్‌వైఏ) అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు వాంగ్. యువజన పక్షపాతిగా వాషింగ్టన్ డీసీ స్థాయిలో వాళ్ల హక్కుల కోసం పోరాడే సంస్థగా దీనికి పేరుంది. 22 వేల మంది సభ్యులతో, ప్రతి ఏటా దాదాపు ఏడులక్షలా యాభైవేల మంది విద్యార్థులకు అండగా నిలుస్తోంది ఎన్వైసీ. ప్రభుత్వం విద్యకు కేటాయించే బడ్జెట్ విషయం దగ్గర నుంచి విద్యార్థుల హక్కుల పరిరక్షణ వరకూ అనేక అంశాల విషయంలో ఈ యూత్ ఆర్గనైజేషన్ పోరాడుతూ ఉంటుంది. రాజకీయ నేతలేమో... యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది, వారే దేశ భవిష్యత్తును ప్రభావితం చేయగలరు, తీర్చిదిద్దగలరని చెబుతూ ఉంటారు. మరి అలాంటి భవిష్యత్తును పరిరక్షించుకొందాం రండి, ప్రశ్నిద్దాం రండి అంటూ ఎన్వైసీ పిలుపునిస్తుంది. దీని నాయకుడిగా వాంగ్ అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్లలోని లెజిస్లేటర్లతో కలసి పని చేస్తున్నాడు వాంగ్. 2010లో తన 17 వయేట వాంగ్ ఈ సంస్థను స్థాపించాడు. అంతకు ముందునుంచే ఈ యువకుడు అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాలు పంచుకొన్నాడు. ఒబామా ప్రభుత్వం విద్యాశాఖకు కేటాయించాల్సిన డబ్బులో దాదాపు 140 మిలియన్ డాలర్లను కోత పెట్టడంపై ఎన్వైసీ అధ్యక్షుడిగా వాంగ్ తీవ్రమైన నిరసన తెలిపాడు. వ్యక్తిగతంగా డెమొక్రాటిక్ పార్టీ మద్దతు దారుడే అయినా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాడు. విద్యకు కేటాయింపులను తగ్గించడాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాడు. చివరకు ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. కోతలు ఎత్తివేసి విద్యకు ఇవ్వాల్సిన నిధులను యథావిధిగా అందజేసింది. ఇది వాంగ్ విద్యార్థి ఉద్యమాల్లో ప్రముఖమైన విజయంగా చెప్పవచ్చు. రాజకీయ ప్రస్థానం : వాంగ్‌ది దక్షిణ కొరియా నుంచి వలస వచ్చిన కుటుంబం. కానీ ఇత డు జన్మతః అమెరికన్. . ఇతడికి విద్యార్థుల్లో ఉన్న గుర్తింపును చూసి అమెరికన్లు ‘అమెరికన్లపై ప్రభావం చూపగలుతున్న దక్షిణాసియా నాయకుడు’గా పిలుస్తున్నారు. ఓటరుగా అర్హత సాధించాక వాంగ్ అధికార డెమొక్రాటిక్ పార్టీ సభ్యుడిగా మేరీలాండ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. వ్యాపారవేత్త సలహాదారు: ఇతడు యువజన నాయకుడిగా సక్సెస్ అయ్యాడంటే.. అందుకు వ్యాపార రంగంలో సాధించిన విజయాలు కూడా ఒక కారణం కావచ్చు! ఇంటర్నెట్ ఎంటర్ ప్రెన్యూనరర్ గా వాంగ్‌కు మంచి పేరుంది. తన పదిహేనవ యేటే వ్యాపార రంగంలోకిప్రవేశించాడు అప్పట్లో ఆపరేషన్ఫ్లై.ఐఎన్‌సీ స్థాపించాడు. ఆవిధంగా వ్యాపార రంగంలో సాధించిన ప్రగతికి గానూ గ్రేటర్ వాషింగ్టన్ పరిధిలో ప్రముఖ వ్యాపారవేత్తగానూ గుర్తింపు సంపాదించుకొని అనేక యువ పారిశ్రామికవేత్తగా అవార్డులు కూడా అందుకొన్నాడు. ‘ఫార్చ్యూన్’ 500 జాబితాలోని అనేక కంపెనీల సీఈవోలకు వాంగ్ ఒక సలహాదారుగా ఉన్నాడు. అమెరికన్ ప్రభుత్వం కూడా వివిధ అంశాల్లో వాంగ్ అభిప్రాయాన్ని తీసుకొంటూ ఉంటుంది. వాంగ్ ప్రస్తుత యువత ఎదుర్కొంటున్న పరిస్థితులు, పరిణామాలపై కొన్ని పుస్తకాలను కూడా రచించాడు. -
సీపీఐ నాయకత్వంలో మార్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాఖలకు నూతన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు సీపీఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు పార్టీ రాష్ట్ర సమితి హైదరాబాద్‌లో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో భేటీ కానుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎన్నికల్లో పార్టీ పనితీరు, పార్టీ పునర్నిర్మాణం ఎజెండాగా జరిగే ఈ సమావేశాల్లో ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నారాయణ స్థానంలో ఉభయ రాష్ట్రాలకు కొత్త కార్యదర్శులు ఎన్నికవుతారు. నారాయణ ఇంతకుముందే తనను పదవీ బాధ్యతల నుంచి విముక్తం చేయమని పార్టీ కార్యదర్శివర్గాన్ని కోరినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగే జూన్ 2 వరకు వాయిదా వేశారు. ఈలోపు జరిగిన పరిణామాలు నారాయణను బాగా కలచివేశాయి. ఖమ్మం లోక్‌సభ స్థానంలో తన ఓటమి, రెండు రాష్ట్రాల్లోనూ పేలవమైన పార్టీ పనితీరుతో కలత చెందిన ఆయన త్వరగా పార్టీ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. కొత్తగా వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీపీఐకి ప్రాతినిధ్యం లేకపోవడం పార్టీ నేతల్ని ఆవేదనకు గురిచేస్తోంది. శాసనమండలిలో మాత్రం ఏకైక సభ్యుడు పీజే చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న పార్టీ రాష్ట్ర సమితి సభ్యుల సమావేశం కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోనుంది. నారాయణతో క్షమాపణ చెప్పించండి: రాఘవులు తనను ఓడించేందుకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి పి.శ్రీనివాసరెడ్డి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారని ఖమ్మం ప్రజలు చెప్పుకుంటున్నారంటూ ఆరోపించిన నారాయణపై చర్య తీసుకోవాల్సిందిగా సీపీఐ జాతీయ నాయకత్వాన్ని సీపీఎం కోరింది. ఈ మేరకు సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డికి లేఖ రాశారు. నిరాధార ఆరోపణ చేసినందుకు నారాయణతో క్షమాపణ చెప్పించి ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని అందులో కోరారు. లేఖ ప్రతిని నారాయణకు, సీపీఎం కేంద్ర కమిటీకి కూడా పంపారు. -
వైఎస్ పాలనలోనే బడుగుల అభ్యున్నతి
జగనన్న నాయకత్వం కోసం ప్రజల ఎదురుచూపు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడు డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గుర్తు చేశారు. తిరుపతి పరిధిలోని గాంధీపురం, దాసరిమఠం, ఎస్బీఐ కాలనీ ప్రాంతాల్లో బుధవారం వైఎస్ఆర్ సీపీ నాయకుడు మణ్యం చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. ప్రజాబాటలో కరుణాకరరెడ్డికి ఆ ప్రాంత ప్రజలు అడుగడుగునా హారతులతో ఘనస్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి దళితుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తండ్రి ఆశయాల కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ధిక్కరించి పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న అధికారంలోకి వస్తేనే తామంతా బాగుపడతామని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే చేసే ఐదు సంతకాలతో పేదల జీవితాల్లో వెలుగులు వెదజల్లుతాయని స్పష్టం చేశారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు శ్రీవారి పవిత్రతను ప్రపంచదేశాలకు చాటిచెప్పానని కరుణాకరరెడ్డి తెలిపారు. దళితుల కోసం దళిత గోవిందం ఏర్పాటు చేశానన్నారు. తుడా చైర్మన్‌గా అనేక మురికివాడల అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఉప ఎన్నికల్లో ఆదరించి గెలిపించిన తిరుపతి నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి ప్రజలంతా ఫ్యాను గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న అధికారంలోకి రాగానే తిరుపతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే. బాబు, పోతిరెడ్డి వెంకటరెడ్డి, నల్లాని బాబు, సుబ్బు, నాగరాజు, మణ్యం మునిరెడ్డి, ఆమోస్‌బాబు, ఉమాపతి, కోటూరు ఆంజనేయులు, కే.అమరనాథరెడ్డి, తాల్లూరి ప్రసాద్, బాకా మణి, శివ, బాబు, రాజ, ప్రశాంత్, మహేష్, శీను, మోహన్, బాలకృష్ణ, గురవయ్య పాల్గొన్నారు. -
‘సంక్షేమం మరచిన పార్టీలకు బుద్ధి చెప్పండి’
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పిలుపునిచ్చా రు. ఆదివారం నగరంలోని భవాని నగర్, గఫూర్ వీధి తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. మహానేత వైఎస్సార్ అందించిన పాలన యువనేతతోనే సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమంపై భరోసా కల్పించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏనాడు ప్రజా శ్రేయస్సు కోరుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రస్తుతం నమ్మశక్యం కాని వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా నేత ఎర్రిస్వామి రెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి, నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా పాల్గొన్నారు. -
కారు.. ఆరు
అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండపై ఇంకా సస్పెన్సే పెండింగులోనే భువనగిరి పొత్తులకు ఇబ్బంది లేకుండా కసరత్తు సాక్షిప్రతినిధి, నల్లగొండ, టీఆర్ఎస్ తొలి జాబితా విడుదలైంది. ఈ ఎన్నికల్లో దాదాపు ఒంటరి పోరాటమే చేసేలా ఉన్న టీఆర్ఎస్ ఎలాంటి ఇబ్బందులు, బహునాయకత్వం లేని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు హుజూర్నగర్ సీటును ఖాయం చేశారు. ముందునుంచీ అంతా ఊహించిన విధంగానే ఆలేరుకు గొంగిడి సునీత, సూర్యాపేటకు గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి పేర్లను ప్రకటించారు. మిర్యాలగూడ - అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, దేవరకొండ - లాలూనాయక్, నకిరేకల్ - వేముల వీరేశం పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలనూ ఖరారు చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో ఏ పార్టీతోనైనా పొత్తులు కుదిరినా, ఇబ్బంది లేదనుకున్న స్థానాలకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా తొలి జాబితాలోని అభ్యర్థులు, ఆ స్థానాలు తమకు అత్యంత ముఖ్యమైనవని ప్రకటించినట్లయింది. టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టారు. నల్లగొండ నియోజకవర్గంలో ఇన్చార్జ్ చకిలం అనిల్‌కుమార్, దుబ్బాక నర్సింహారెడ్డి మధ్య టికెట్ కోసం పోటీ ఉంది. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరిలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, కొనపురి రాములు పోటీ పడుతుండగా, ఇటీవలే పార్టీలో చేరిన పైళ్ల శేఖర్‌రెడ్డి సైతం క్యూలో ఉన్నారు. ఆయన శుక్రవారం భువనగిరిలో నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ కోసం ఏమాత్రం పోటీ లేని కోదాడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్తోనే ఉన్న గొంగిడి సునీతకు గత ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. అంతకుముందు ఎస్సీ రిజర్వుడు స్థానం కావడం వల్ల రేసులో నిలిచే అవకాశమే రాలేదు. కాగా, పునర్విభజనలో భాగంగా ఆలేరు జనరల్ స్థానమైనా గత ఎన్నికల్లో కళ్లెం యాదగిరిరెడ్డికి అవకాశం ఇవ్వడంతో సునితకు టికెట్ రాలే దు. కానీ ఈసారి మాత్రం తొలి జాబితాలోనే ఆమె పే రును ప్రకటించారు. జిల్లాలో టీఆర్ఎస్ గతంలో ప్రాతినిథ్యం వహించిన ఏకైక స్థానమైన ఆలేరు నుంచి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అధినేత కేసీఆర్‌కు సన్నిహితుడైన పార్టీ అధికార ప్రతినిధి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి సూర్యాపేట నుంచి పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన హుజూర్నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి సూర్యాపేటపై మొదటి నుంచి దృష్టి పెట్టి ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పక్కన పెట్టి మరీ నకిరేకల్ ఇన్చార్జిగా అవకాశం ఇచ్చిన వేముల వీరేశానికి టికె ట్ ప్రకటించారు. ఇటీవలే సుధాకర్ పార్టీని వీడారు. ఆ ప్రభావం పార్టీపై పడకుండా ముందు జాగ్రత్తగా తొలి జాబితాలో నకిరేకల్‌ను చేర్చారు. గత ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆయన మిరాల్యగూడ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. కాగా, తొలి జాబితాలో అవకాశం దక్కించుకున్నారు.కొద్దిరోజుల కిందటి దాకా ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన లాలూ నాయక్ ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఆయనకు దేవరకొండ టికెట్‌ను ప్రకటించారు. గతంలో లాలూనాయక్ భార్య టీడీపీ తరపున దేవరకొండ ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. టీఆర్ఎస్లో చేరిన వారి కుటుంబం ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్‌ను దక్కించుకుంది. -
నరహంతకుల ముఠా లీడర్ ఓ సిపాయి !
అత్యాధునిక తుపాకీ,యూఎస్ఏ కత్తుల వినియోగ ం రెండు వందలకుపైగా నేరాలు కానిస్టేబుల్, హోంగార్డు హత్యకేసులో వెలుగుచూస్తున్న అంశాలు పలమనేరు, న్యూస్‌లైన్ : సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షించాల్సిన ఓ సిపాయి నరహంతకుల ముఠాకు నాయకుడయ్యాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు ఇలా లెక్కలేనన్ని నేరాలు చేస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అతని నాయకత్వంలోని ముఠా మూడేళ్లుగా మూడు రాష్ట్రాల్లో రెండు వందలకుపైగా నేరాలకు పాల్పడింది. పలమనేరులో కానిస్టేబుల్, హోంగార్డు హత్యకేసులో అరెస్టయిన ముఠా సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.. తమిళనాడులోని సేలం జిల్లా సంగగిరికి చెందిన వెల్లయన్ మణికంఠ అలియాస్ సంపత్ (27) చిన్నతనం నుంచే దొంగతనాలు, దోపిడీలకు పాల్పడేవాడు. ఇప్పటికే పదేళ్లపాటు జైల్లో గడిపాడు. ఇతనికి జైలులో ధర్మపురి జిల్లా ఆరూరుకు చెందిన కృష్ణ పరిచయమయ్యాడు. ఇతను చిన్నాన్నను హత్య చేసిన కేసులో జైలుకొచ్చాడు. పలు నేరాలకు పాల్పడిన ప్రేమ్ జైలులో వీరికి జత అయ్యాడు. కృష్ణను బెయిల్పైకి తీసుకువచ్చాడు అన్న గోవిందస్వామి. తర్వాత సంపత్, ప్రేమ్‌లను జైలు నుంచి బయటకు తీసుకువచ్చాడు. వీరిని కృష్ణ తన సొంతూరులో ఉంచాడు. తమ్ముడు కృష్ణ సర్టిఫికెట్లతో మిలటరీలో ఉద్యోగం పొందాడు గోవిందస్వామి.అప్పటికే అతను పలు నేరాలు, మోసాల్లో ఆరితేరి ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన సంపత్, ప్రేమ్, తమ్ముడు కృష్ణతో పాటు మరికొంత మందితో కలసి ఓ ముఠాను తయారుచేయాలని భావించాడు. అరక్కోణానికి చెందిన సతీష్, ఇతని భార్య బొమ్మి అలియాస్ లక్ష్మి, కరా్ణాటక రాష్ట్రం కేజీఎఫ్‌కు చెందిన శీను (కైగల్ ప్రేమికుల హత్య కేసులో ప్రధాన నిందితుడు), అన్నయ్య, మోహన్‌లను కలిపి గ్యాంగ్‌ను తయారు చేశాడు. అలాగే సేలానికి చెందిన పెరుమాల్‌ను ముఠాలో చేర్చాడు. జమ్ముకాశ్మీర్ నుంచి తుపాకులు ఈ గ్యాంగ్‌ను మరింత పదును పెట్టే ఉద్దేశంతో మిలటరీ గోవిందస్వామి జమ్ముకాశ్మీర్ నుంచి రెండు అత్యాధునిక తుపాకులను తెచ్చాడు. అందులో ఒక దానిని బెంగళూరులో విక్రయించాడు. మరో తుపాకీని ముఠా సభ్యులకు ఇచ్చాడు. హత్యలు, దోపిడీలు కొత్త పద్ధతుల్లో ఎలా చేయాలో శిక్షణ ఇచ్చాడు. ఇలా మూడు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని నేరాలకు ఈ ముఠా పాల్పడింది. అనుమానం వస్తే ఎవరినీ వదలరు గ్యాంగ్‌లో ఎవరిపైన అయినా అనుమానం కలిగితే వారిని మట్టుపెట్టడం సంపత్ నైజం. ముఠాలోని పెరుమాల్, సతీష్‌లపై అనుమానం రావడంతో వారిని అంతమొందించాడు. పెరుమాల్‌ను బండరాయిలతో కొట్టి హత్య చేశాడు. అలాగే చౌడేపల్లె మండలం బోయకొండ వద్ద సతీష్‌ను హత్య చేశా డు. తర్వాత సతీష్ భార్య లక్ష్మిని గ్యాంగ్‌లో చేర్చుకున్నాడు. కేటిల్‌ఫామ్‌లో కాపురం ఈ గ్యాంగ్‌లోని సతీష్ హత్యకు గురికాకముందు పలమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్‌లో నివాసముండేవాడు. రైల్వే ఉద్యోగి అయిన ఇతను రైస్‌పుల్లింగ్, దొంగనోట్లు, నకిలీ వజ్రాలు తదితర మోసాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే ఇతనికి స్థానికులైన నక్కపల్లె రామిరెడ్డి, కడతట్లపల్లెకు చెందిన రాజేంద్ర, కేటిల్ఫామ్నకే చెందిన విజయకుమార్ పరిచయమయ్యారు. సతీష్ వద్ద దొంగనోట్ల వ్యవహారంలో మోసానికి గురైన తవణంపల్లె మండలం రామాపురానికి చెందిన ప్రతాప్ వీరికి జతకలిశాడు. వీరందరూ సతీష్ ద్వారా సంపత్ గ్యాంగ్‌లో ఉంటూ నేరాలకు పాల్పడ్డారు. లవర్స్స్పాట్లలో ఇన్ఫార్మర్లు.. జిల్లాలోని కైగల్ జలపాతం, మొగిలి ఘాట్, గాంధీనగర్, జగమర్ల అటవీ ప్రాంతాలు, ముసలిమడుగు, బోయకొండ, బంగారుపాళెం సమీపంలోని వజ్రాల గంగమ్మ ఆలయ అటవీ ప్రాంతం, చంద్రగిరి కోట, భాకరాపేట అటవీ ప్రాంతం, చిత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతం, పెనుమూరు, గంగాధరనెల్లూరులతో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన ప్రేమజంటలు వెళ్లే ఏకాంత ప్రదేశాలను వీరు టార్గెట్ చేశారు. ఈ ప్రదేశాల్లో ఇన్ఫార్మర్లను పెట్టుకుని వారి ద్వారా అక్కడకు వెళ్లి అత్యాచారాలకు పాల్పడేవారు. హంతకులను పట్టించిన సిమ్‌కార్డు ఈ కరుడుగట్టిన గ్యాంగ్‌ను ఓ సిమ్‌కార్డు పట్టించింది. గతేడాది డిసెంబర్ రెండో వారంలో బంగారుపాళెం సమీపంలోని వజ్రాలపురం అటవీప్రాంతంలో ఓ ప్రేమజంటపై దాడి జరిగింది. ప్రియుడు ఈ గ్యాంగ్ సభ్యులపై ఎదురు తిరగడం అదే సమయానికి స్థానికులు రావడంతో వారు ఓ బైక్‌ను, జెర్కిన్, కత్తులను వదిలి పారిపోయారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ జెర్కిన్లోని సిమ్‌కార్డును గుర్తించి విచారణ చేపట్టారు. ఆ సిమ్‌కార్డు గంగాధర నెల్లూరు ప్రాంతానికి చెందిన ఓ యువతిగా తేలింది. తీగలాగితే డొంకంతా కదిలింది. అక్కడి నుంచి పలమనేరుకే చెందిన ఓ యువతి సైతం వీరి బారిన పడిందని తేలింది. ఆమెను పోలీసులు విచారించగా తవణంపల్లె ప్రతాప్ పేరు బయటకొచ్చింది. ప్రతాప్ ద్వారా గ్యాంగ్ బండారం బయటపడింది. వీరు ఉపయోగించే అత్యాధునిక కత్తులు యూఎస్ఏలో తయారైనవిగా పోలీసులు గుర్తించారు. -
మంత్రి అనుచరుల్లో ఆధిపత్యపోరు
గోదావరిఖని, న్యూస్‌లైన్ : మంత్రి శ్రీధర్‌బాబు అనుచరుల ఆధిపత్యపోరు స్థానిక స్వర్ణకారులు, బెంగాలీ స్వర్ణకారుల మధ్య చిచ్చు పెట్టింది. బెంగాలీ నుంచి వచ్చిన స్వర్ణకారుల వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని, వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానిక స్వర్ణకారులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి అనుచరుల్లో ఒకరు బెంగాలీలకు, మరొకరు స్థానిక స్వర్ణకారులకు నాయకత్వం వహిస్తున్నారు. బెంగాలీలకు మద్దతుగా నిలిచిన నేతలకు పెద్దమొత్తంలో డబ్బులు అందినట్లు ఖనిలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక స్వర్ణకారులు బుధవారం గోదావరిఖనిలో దుకాణాలు బంద్ చేసి సమావేశమవుతున్నారు. బెంగాలీ స్వర్ణకారులు ఇప్పటికే రెండు రోజులుగా తమ దుకాణాలు మూసి ఉంచుతున్నారు. గోదావరిఖని పట్టణంలో 45 బంగారం, వెండి వర్తక దుకాణాలుండగా... నగలను హైదరాబాద్, బెంగళూర్, కోయంబత్తూర్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించేవారు. సమయం, దూరాభారం, భద్రతా భయాలను ఆలోచించిన ఓ వ్యాపారి 22 ఏళ్ల కిత్రం పశ్చిమబెంగాల్ నుంచి ఇద్దరు పనివారిని తీసుకువచ్చి స్థానికంగా నగలు తయారు చేయిం చడం మొదలుపెట్టాడు. కాలక్రమంలో వీరి ద్వారా పశ్చిమబెంగాల్లోని హుబ్లీ, మెంతినిపూర్ తదితర జిల్లాలకు చెంది న చాలా మంది నగల తయారీకి గోదావరిఖని వచ్చారు. ప్రస్తుతం వారు 200 మంది వరకు ఉన్నారు. పనితనం బాగుండడంతోపాటు సమయానికి నగలు చేసి ఇస్తుండడంతో స్థానిక వర్తకులే కాకుండా కరీంనగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంథని తదితర ప్రాంతాల వ్యాపారులు కూడా వీరికి ఆర్డర్లు ఇస్తున్నారు. స్థానిక స్వర్ణకారుల పిల్లలు చదువుపై దృష్టి పెట్టడంతో వృత్తిని భర్తీ చేసేవారు కరువయ్యారు. కొందరు ఉన్నా... పాత పద్ధతుల్లోనే నగలు తయారు చేస్తుండడంతో బెంగాలీవారికే ఆర్డర్లు ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో స్థానిక స్వర్ణకారులకు, బెంగాలీ పనివారికి మధ్య అంతర్యుద్దం మొదలై ఎనిమిదేళ్ల క్రితం బెంగాలీలను కిడ్నాప్ చేసే వరకు వెళ్లింది. ఇప్పుడేం జరుగుతోంది? స్థానిక స్వర్ణకారుల సంఘానికి మంత్రి అనుచరుడైన ఓ నాయకుడు నాయకత్వం వహిస్తే... బెంగాలీ పనివారికి మరో అనుచరుడు అండగా నిలిచాడు. ఈ తరుణంలో బెంగాలీలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కొద్ది రోజుల క్రితం స్థానిక స్వర్ణకారులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వివిధ పార్టీల మద్దతు కూడగట్టారు. కొంత మంది బెంగాలీలను పంపించేందుకు జాబితా తయారు చేశారు. బెంగాలీలకు అండగా నిలిచిన నాయకుడు మరో నేతతో కలిసి దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుందని చెప్పడంతో బెంగాలీలను పంపించే కార్యక్రమం నిలిచిపోయింది. ఇందుకుగాను బెంగాలీలు సదరు నాయకులకు పెద్ద మొత్తంలో ‘నజరానా’ ముట్టజెప్పినట్టు ప్రచారం జోరందుకుంది. ఆధిపత్యం చెలాయించేందుకు ఈ ఇద్దరు నాయకులు తమ ప్రతాపాన్ని స్థానిక స్వర్ణకారులు, బెంగాలీ పనివారిపై చూపిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. స్వర్ణకారుల్లో చిచ్చుపెట్టి నేతలు లబ్ధిపొందుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉన్నత లక్ష్యం నిద్రపోనివ్వదు
సాక్షి, హైదరాబాద్: ‘ఉన్నత లక్ష్యం మనిషిని నిద్ర పోనివ్వదు. దాన్ని సాధించేవరకు వెంటాడుతూనే ఉంటుంది’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. నానక్‌రాంగూడ ఐటీజోన్‌లోని మైక్రోసాఫ్ట్ సంస్థలో గురువా రం రాత్రి నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ‘లీడర్షిప్’లో ఆయన ప్రసంగించారు. ఉన్నత లక్ష్యం, సాధించే తపన, మార్గాన్వేషణ, వైఫల్యాన్ని ఎదుర్కొనే ధైర్యం, నిర్ణయాధికారం, పారదర్శకత, పనిపై పరిపూర్ణ అవగాహన, ఉత్తమ నిర్వహణ, ఓర్పు... ఈ తొమ్మిది లక్షణాలున్నవారు ఉత్తమ నాయకులుగా ఎదగడానికి అవకాశముంటుందన్నారు. సమస్యలున్నవారు ప్రపంచమంతా ఉంటారని, కానీ లక్ష్యంతో ముందుకుసాగేవారు కొంతమందే ఉంటారన్నారు. వారే విజయం సాధిస్తారన్నారు. డీఆర్డీఏ, ఇస్రో శాస్త్రవేత్తగా పయనం, భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణ.. ఇవన్నీ యాదృశ్ఛికంగా రాలేదని, వాటి వెనుక ఎన్నో ఎదురు దెబ్బలున్నాయన్నారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ డెవలపర్ డివిజన్ కార్పొరేట్ వైస్‌ప్రెసిడెంట్ ఎస్.సోమసెగర్ పాల్గొన్నారు. అంధత్వ నివారణకు మరింత కృషిచేయాలి బంజారాహిల్స్: శాస్త్రీయ పద్ధతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, గ్రామీణ ప్రాంతాల్లో అంధత్వ నివారణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో ప్రవేశపెట్టిన ‘సృ జన: ఇన్నోవేషన్ ఎల్వీపీఈఐ’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ ఎండోమెంట్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఐ కేర్, ఎంఐటీ మీడియా ల్యాబ్‌ల సహకారంతో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడం అభినందనీయమని కలాం అన్నారు. దీని ద్వారా అంధత్వానికి గురవుతున్న చాలా మందికి లబ్ది చేకూరుతుందన్నారు. నేటి విద్యార్థుల్లోని సృజన వినియోగించుకొని, వారి ఆలోచనలు అమల్లో పెట్టడం ద్వారా మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలను ఆయన పరిశీలించారు. ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ గుళ్లపల్లి ఎన్. రావు మాట్లాడుతూ... ఎంఐటీలోని టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్, హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని, పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఈ వర్క్‌షాప్‌లో భాగస్వాములన్నారు. ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, సృజన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ డాక్టర్ వీరేంద్ర సంగ్వాన్, ఎంఐటీ మీడియా ల్యాబ్ అసోసియేట్ ప్రొఫెసర్ రమేష్ రస్కర్ పాల్గొన్నారు. -
జగన్ నేతృత్వంలోనే ముస్లింలకు న్యాయం
మహేశ్వరం, న్యూస్‌లైన్: త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని వైఎస్సార్ సీపీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త దేప భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం, సరూర్‌నగర్, ఆర్‌కేపూరంలో ఉన్న మసీదుల్లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకుంటారన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. దేశంలో మెట్టమొదటగా ముస్లింలకు ప్రత్యేకంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. ముస్లింలను హజ్‌యాత్రకు ఉచితంగా తీసుకెళ్లాడని పేర్కొన్నారు. అలాగే పేద ముస్లింల అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఆయన మరణంతో ముస్లింల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందన్నారు. ముస్లింలకు సరైన న్యాయం జరుగాలంటే యువనేత జగన్మోహన్రెడ్డిని రాష్ట్రానికి సీఎం చేయాలని కోరారు. అనంతరం జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అంతకు ముందు ముస్లింలతో కలిసి ఆయన పేదలకు మాంసం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.