రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ 2023 సంవత్సరానికి గాను దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని యూఎస్-ఇండియా ఎస్‌పీఎఫ్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ మహిళాసాధికారత, పిల్లల విద్య, భారతీయ కళలు, క్రీడలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ పేర్కొంది. అవార్డు తీసుకున్న సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ..రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు 7 కోట్ల ప్రజలకు సేవ చేశామన్నారు. సీఎస్‌ఆర్ ప్రవేశపెట్టక ముందే రిలయన్స్ సొంతంగా ‘కార్పొరేట్ మోరల్ రెస్పాన్స్‌బిలిటీ’ ద్వారా సేవలందించినట్లు చెప్పారు. దేశ ప్రయోజనం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. భారత్, యూఎస్ మధ్య బంధాలను మరింతగా పెంచడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.
USISPF was proud to honor Mrs. Nita M Ambani, Founder and Chairperson at @ril_foundation with the 2023 Global Leadership Award for Philanthropy and Corporate Social Responsibility. Mrs. Ambani is noted for her work in women's empowerment, education, promoting Indian arts & sports pic.twitter.com/rBuVQgvM97
— US-India Strategic Partnership Forum (@USISPForum) October 29, 2023
Comments
Please login to add a commentAdd a comment