జగన్ నేతృత్వంలోనే ముస్లింలకు న్యాయం
Published Thu, Oct 17 2013 12:30 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
మహేశ్వరం, న్యూస్‌లైన్: త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని వైఎస్సార్ సీపీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త దేప భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం, సరూర్‌నగర్, ఆర్‌కేపూరంలో ఉన్న మసీదుల్లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకుంటారన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. దేశంలో మెట్టమొదటగా ముస్లింలకు ప్రత్యేకంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు.
ముస్లింలను హజ్‌యాత్రకు ఉచితంగా తీసుకెళ్లాడని పేర్కొన్నారు. అలాగే పేద ముస్లింల అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఆయన మరణంతో ముస్లింల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందన్నారు. ముస్లింలకు సరైన న్యాయం జరుగాలంటే యువనేత జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్రానికి సీఎం చేయాలని కోరారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అంతకు ముందు ముస్లింలతో కలిసి ఆయన పేదలకు మాంసం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement