విద్యా వ్యవస్థలో మార్పులు | Changes in the educational system | Sakshi
Sakshi News home page

విద్యా వ్యవస్థలో మార్పులు

Published Fri, Oct 3 2014 1:09 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Changes in the educational system

  • ప్రైవేటు విద్యాసంస్థలపై నిఘా
  • నైతిక విలువలపై టీచర్లకు శిక్షణ
  • విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి
  • విశాఖపట్నం: అందరికీ విద్య అందించేందుకు అవసరమైతే ఓ ఉద్యమంలా పటిష్టమైన చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి అన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుకు భవిష్యత్‌లో విద్యా వ్యవ స్థలో పలు మార్పులు తీసుకొస్తామని ఆమె చెప్పారు. స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి ముచ్చటించారు.  

    అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం విద్యావ్యవ స్థలో నైతిక విలువలు కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న పిల్లలకు సులభతరమైన రీతిలో నైతిక విలువలు, సమాజం పట్ల అవగాహన, దేశభక్తి తదితర అంశాల్లో అదనపు తరగతల ద్వారా బోధన అందంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. మన టీవీ ద్వారా ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు.

    రాష్ర్టంలో విద్యార్థులు అత్యధికంగా ఉన్న పాఠశాల్లో మొదటిది మదనపల్లి కాగా, రెండోది విశాఖలోని మధురవాడ హైస్కూల్ అని తెలిపారు. అయినా ఈ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఉత్తమ ఫలితాలను అందిస్తున్న పాఠశాలలకు తల్లితండ్రులు, స్థానికులు సహకరించాలని కోరారు. విద్యావ స్థలో రాజకీయ జోక్యం ఇబ్బందికరంగా మారిందని కాలక్రమేనా ఇది  రూపుమాపేందుకు కృషిచేస్తామని తెలిపారు.
     
    బట్టీ పద్ధతికి స్వస్తి.. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను రోబోలు లాగా మారిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బట్టిపద్ధతికి స్వస్తిపలికేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అకడమిక్ కేలండర్‌ను రూపొందిస్తున్నామని, ఇది ప్రవేటు పాఠశాలలకూ వర్తింపచేయనున్నామని తెలిపారు.
     
    విద్యాశాఖ ఆస్తులను రక్షిస్తాం

    మధురవాడలోని ఎమ్మార్సీ కార్యాలయానికి చెందిన స్థలంలో అనధికారికంగా వెలసిన ఆక్రమణలపై విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి కిందస్థాయి అధికారులపై మండిపడ్డారు. ఎంతో విలువైన  స్థలాన్ని ఆక్రమణలకు గురైతే ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement