‘సంక్షేమం మరచిన పార్టీలకు బుద్ధి చెప్పండి’
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పిలుపునిచ్చా రు. ఆదివారం నగరంలోని భవాని నగర్, గఫూర్ వీధి తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
మహానేత వైఎస్సార్ అందించిన పాలన యువనేతతోనే సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమంపై భరోసా కల్పించేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏనాడు ప్రజా శ్రేయస్సు కోరుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రస్తుతం నమ్మశక్యం కాని వాగ్దానాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలను బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా నేత ఎర్రిస్వామి రెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్ రెడ్డి, నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా పాల్గొన్నారు.