లోక్‌సభ ఎన్నికలు: ఏఐసీసీ కీలక సమావేశం.. వ్యూహాలపై దిశానిర్దేశం | Congress Leadership Meeting On Preparations For Lok Sabha Elections | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికలు: ఏఐసీసీ కీలక సమావేశం.. వ్యూహాలపై దిశానిర్దేశం

Published Thu, Jan 11 2024 7:56 PM | Last Updated on Thu, Jan 11 2024 9:28 PM

Congress Leadership Meeting On Preparations For Lok Sabha Elections - Sakshi

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు,  పాండిచ్చేరి, కేరళ, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో కాంగ్రెస్‌ అధిష్టానం సమావేశమైంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రచారం, పోల్ మేనేజ్‌మేంట్‌, ప్రజలతో మమేకం వంటి అంశాలపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మార్గనిర్ధేశం చేశారు.

రెండు గ్రూపులుగా సమావేశం నిర్వహించగా, మొదటి సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి.. రెండో సమావేశంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా, అండమాన్ అండ్‌ నికోబార్‌ల కోఆర్డినేటర్లతో మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా కో ఆర్డినేటర్లు ప్రయత్నం చేయాలని ఖర్గే అన్నారు.

సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికలలో పార్టీ విజయం కోసం అధిష్టానం దిశ నిర్దేశం చేసిందని, తెలంగాణలో అత్యధిక స్థానాలలో గెలవాలని ప్రయత్నం చేస్తామన్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరినట్లు భట్టి తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ,  దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయన్నారు.

మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని, మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని ఖర్గే సూచించారన్నారు. అత్యధిక స్థానాలు గెలిపించే బాధ్యత కో ఆర్డినేటర్లపై ఉందని ఖర్గే దిశానిర్దేశం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించి మెజారిటీ స్థానాల్లో గెలవాలని సూచించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని, అధిష్టానం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement