మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు మింగుడు పడని వార్త ఇది. మెటా నిర్వహించిన ఉద్యోగుల సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడైనాయి. కేవలం 26 శాతం మంది సిబ్బంది మాత్రమే మెటా మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంపై విశ్వాసం కలిగి ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక నివేదికలో పేర్కొంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఐదు శాతం పడిపోయిందని తెలిపింది. (అదరగొట్టిన పోరీలు..ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!)
వాల్ స్ట్రీట్ జనరల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం మెటా ఉద్యోగులలో 74 శాతం మంది అసంతృప్తితో ఉన్నారట. వేలాది మంది ఉద్యోగులను తొలగించిన రెండు నెలల తర్వాత ఏప్రిల్ 26- మే 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో నాలుగింట ఒక వంతు మంది అంటే 26 శాతం మంది మాత్రమే మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారు. ఇది అక్టోబర్‌లో 58 శాతం నుండి 5 శాతం క్షీణించి 43 శాతానికి పడిపోయింది. (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు)
ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ బాటపట్టాయి. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సహా గూగుల్, మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి అనేక టెక్ కంపెనీలు వేలాది ఉద్యోగులపై వేటు వేశాయి. ముఖ్యంగా మెటా అనేక దశల్లో 21వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఆకస్మిక తొలగింపులు మెటాలో పనిచేస్తున్న వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రస్తుత , మాజీ ఉద్యోగులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment