న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ చైర్‌పర్సన్ ఈషా అంబానీ తాజాగా జెన్‌నెక్ట్స్ ఎంట్రప్రెన్యూర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డులు 2023 కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. ఆమెతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు కూడా పురస్కారాలు అందుకున్నారు.
వీరిలో టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ ’సీఈవో ఆఫ్ ది ఇయర్’, మ్యాక్స్ హెల్త్‌కేర్ సీఎండీ అభయ్ సోయి ’ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను దక్కించుకున్నారు. ఈషా అంబానీ 2008లో ఫోర్బ్స్ రూపొందించిన యువ బిలియనీర్ వారసురాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిల్చారు. యేల్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదివారు.
Comments
Please login to add a commentAdd a comment