award ceremony
-
భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!
భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మకమైన మిచెలిన్ స్టార్ పురస్కారం లభించింది. ఇది వంటకాలకు సంబంధించి.. పాక ప్రపంచంలో అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు. నిజానికి భారతదేశంలో మిచెలిన్ స్టార్ల లభించిన రెస్టారెంట్లు లేవు విదేశాల్లో ఉన్న భారతీయ రెస్టారెంట్లే ఈ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్నాయి. తాజాగా దోహాలో జరిగిన మిచెలిన్ గైడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారతీయ రెస్టారెంట్ జమావర్ దోహాకి ఈ మిచెలిన్ స్టార్ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో రెండు రెస్టారెంట్లకే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. వాటిలో మన భారతీయ రెస్టారెంట్ కూడా ఉండటం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో తమ రెస్టారెంట్ కూడా భాగమవ్వడం సంతోషంగా ఉందన్నారు వ్యవస్థాపకులు ఈ తండ్రికూతుళ్ల ద్వయం దినేష్ , సంయుక్తలు. ఈ రెస్టారెంట్ పేరుని కాశ్మర్లోని 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శాలువాల పేరుని ఎంచుకున్నారు ఆ తండ్రి కూతుళ్లు. అత్యాధునిక హంగులతో ఉండే ఈ రెస్టారెంట్లో ఢిల్లీ, కేరళకు సంబంధించిన ప్రసిద్ధ వంటకాలతో సహా వివిధ అద్భుత రుచులతో కూడిన వంటకాలను సర్వ్ చేస్తారు . ఈ జమావర్ రెస్టారెంట్‌ని మొదటిసారిగా 2001లో ది లీలా ప్యాలెస్ బెంగళూరులో ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రసిద్ధ ఐదు భారతీయ నగరాల్లో బ్రాంచ్‌లుగా విస్తరించారు. ఆ తర్వాత 2016లో లండన్, 2021లో దోహాలలో కూడా తమ రెస్టారెంట్లను ప్రారంభించారు. అయితే జమావర్ లండన్ కూడా ఈ ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారాన్ని దక్షించుకోవడం విశేషం. కాగా, దోహా జమావర్ రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ ఇన్‌స్టాగ్రాంలో "ఇది తమ టీం సమిష్ట కృషి, అంకిత భావానికి నిదర్శనం. మా కష్టాన్ని గుర్తించి ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించినందుకు మిచెలిన్ గైడ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు". అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు చెఫ్ సురేందర్ . ఇక సంయుక్త నాయర్ కూడా ఇది కేవలం మా జమావర్ దోహకే గర్వకారణం కాదు. ఆ ప్రాంతంలో భారతీయ ఆహారానికి దక్కిన గొప్ప గౌరవం అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. మిచెలిన్ స్టార్ అంటే..అత్యుత్తమ వంటలను అందించే రెస్టారెంట్లకు ఈ పురస్కారాని ఇస్తారు. మొత్తం ఐదు ప్రమాణాలలను పరిగణలోనికి తీసుకుని ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. పదార్థాల నాణ్యత, రుచుల సామరస్యం, సాంకేతికతలలో నైపుణ్యం, వంటకాలను ప్రెజెంట్ చేసే చెఫ్ నైపుణ్యం, ముఖ్యంగా మెనూలో వంటకాల వైవిధ్యం తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫ్రాన్స్‌కి చెందిన మిచెలిన్ గైడ్ ఈ పురస్కారాలను అందజేస్తుంది. ఇలా 1900 సంవత్సరం నుంచి అందజేస్తోంది. View this post on Instagram A post shared by Samyukta Nair (@samyuktanair) (చదవండి: బిడ్డకు తల్లైనా అంతే అందంగా హీరోయిన్! ‘చందమామ’ సీక్రెట్ ఇదే!) -
బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం (ఫొటోలు)
-
ఈషా అంబానీకి ఫోర్బ్స్ అవార్డు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ చైర్పర్సన్ ఈషా అంబానీ తాజాగా జెన్నెక్ట్స్ ఎంట్రప్రెన్యూర్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డులు 2023 కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేశారు. ఆమెతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు కూడా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో టైటాన్ ఎండీ సీకే వెంకటరామన్ ’సీఈవో ఆఫ్ ది ఇయర్’, మ్యాక్స్ హెల్త్‌కేర్ సీఎండీ అభయ్ సోయి ’ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులను దక్కించుకున్నారు. ఈషా అంబానీ 2008లో ఫోర్బ్స్ రూపొందించిన యువ బిలియనీర్ వారసురాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిల్చారు. యేల్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదివారు. -
జయప్రదకు ఎన్టీఆర్ చలనచిత్ర పురస్కారం
ప్రముఖ నటి జయప్రదని ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం వరించింది. హీరో బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27 సాయంత్రం నాజర్‌పేట ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్లో రచయిత సాయిమాధవ్ బుర్రా సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ఈ వేడుకలో జయప్రదకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ అందించనున్నారు. అలాగే ఈ నెల 28న ‘అడవి రాముడు‘ సినిమాను ప్రదర్శించనున్నారు. జయప్రద, రామకృష్ణ, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాను వీక్షించనున్నారు. -
సోషల్ మీడియాకు బందీ కావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి తరాన్ని స్మార్ట్ ఫోన్ నిర్వీర్యం చేస్తోందని.. సోషల్ మీడియా బందీగా మార్చిందని ప్రముఖ కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టే అనిపిస్తుందని.. కానీ ఏమీ తెలియకుండా పోతుందని చెప్పారు. శుక్రవారం ఆయన కాళోజీ నారాయణరావు స్మారక పురస్కరాన్ని అందుకున్నారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నేను ఎనిమిదో తరగతి నుంచి కవిత్వం రాయడం అలవాటు చేసుకున్నా. అది నాలో ఆలోచనా శక్తిని ఉత్తేజపర్చింది. సమాజాన్ని అన్ని కోణాల్లో చూసే తత్వాన్ని కలిగించింది. అన్యాయం జరిగితే ప్రశ్నించడం, బాధితుల పక్షాన నిలదీయటం, ఎదిరించటం అలవాటు చేసింది. ఇప్పటితరంలో ఇది లోపించింది. రాయకున్నా కనీసం చదివే లక్షణమైనా ఉండాలి..’’ అని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. భాషను ముందు తరాలకు అందించాలి తెలంగాణ భాషను రేపటి తరానికి పదిలంగా అందించాల్సిన బాధ్యత మనపై ఉందని.. అది రచనలతోనే ముందుకు సాగుతుందని శ్రీరామోజు హరగోపాల్ అన్నారు. ‘బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని కాళోజీ చెప్తూ చేసి చూపించారని.. ఆ దిశగానే తానూ ముందుకు సాగానని చెప్పారు. తమ రచన సాహితీ కళావేదిక తొలి వార్షికోత్సవానికి కాళోజీ ముఖ్య అతిథిగా వచ్చి ఓ రోజంతా తమతో గడిపారని గుర్తు చేసుకున్నారు. సమాజంలో చోటుచేసుకునే పరిణామాలకు మనం స్పందించగలగాలని.. ఆ తత్వం మనసుకు ఉండాలని చెప్పారు. చాలా మందిలో ఈ తత్వం ఉన్నా దాన్ని గుర్తించరని.. రచనా వ్యాసంగం వైపు మళ్లినప్పుడు అది ఉత్తేజం పొందుతుందని తెలిపారు. సమాజాన్ని గమనించటం, పుస్తకాలు చదవడం మేధస్సుకు పదును పెడుతుందన్నారు. దీనిని నేటి తరం గుర్తించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వైతాళికులను గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాళోజీ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ఆ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ పాల్గొన్నారు. – గన్‌ఫౌండ్రి ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
అంతరిక్షయాత్ర విజయం: రూ.745 కోట్ల అవార్డు ప్రకటించిన బెజోస్
వాషింగ్టన్: జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన న్యూషెపర్డ్ నౌక రోదసియాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. భూమ్మీద ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మామూలే. కానీ భూ ఉపరితలాన్ని దాటి.. మనకు పూర్తిగా పరిచయం లేని మరో లోకంలో విహరించాలంటే ఆసక్తి, అభిమానంతో పాటు ఎంతో ధైర్యం కావాలి. అంతరిక్ష యాత్ర ద్వారా బెజోస్ సాహసం చేశారనే చెప్పవచ్చు. అవును మరి అంతరిక్షంలోకి ప్రయాణించి.. క్షేమంగా భూమ్మిదకు చేరడం అంటే మాటలు కాదు. అందుకే తన అంతరిక్ష యాత్ర విజయానంతరం జెఫ్ బెజోస్ కీలక ప్రకటన చేశారు. భూమ్మీదకు తిరిగి వచ్చిన తర్వాత ఓ భారీ అవార్డును ప్రకటించారు. ధైర్యం, పౌరసత్వం(కరేజ్ అండ్ సివిలిటీ) పేరుతో 100 మిలియన్ డాలర్ల (రూ. 7,46,09,40,000) అవార్డు ప్రకటించాడు. మానవ జాతి ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవటానికి ప్రజలను సమాయత్తం చేసే నాయకులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. తొలి అవార్డు విన్నర్ ఎవరంటే.. బెజోస్ ప్రకటించిన కరేజ్ అండ్ సివిలిటీ అవార్డును తొలుత ఇద్దరికి ప్రదానం చేశారు. వీరిలో ఒకరు అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత వాన్ జోన్స్, మన ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్ ఉన్నారు. వీరిద్దరికి 100 మిలియన్ డాలర్లు అందజేస్తారు. అంతరిక్ష యాత్ర విజయం అనంతరం జెఫ్ బెజోస్ మీడియాతో మాట్లాడారు. ‘‘అవార్డు గెలుచుకున్న వాన్ జోన్స్, జోస్ ఆండ్రెస్ ఈ అవార్డు ద్వారా లభించే మొత్తాన్ని ఏదైనా లాభాపేక్షలేని కార్యక్రమం కోసం కానీ.. చాలామందికి పంచడానికి కానీ వినియోగించవచ్చని’’ తెలిపారు. భవిష్యత్తులో చాలామందికి ఈ అవార్డును ప్రదానం చేస్తామన్నారు. ఎవరీ జోస్ ఆండ్రెస్.. స్సానిష్కు చెందిన ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్ ప్రముఖ మానవతావాదిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లాభాపేక్ష లేకుండా నిర్వహించే ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు జోన్ ఆండ్రెస్. 2010లో ప్రారంభించిన వరల్డ్ సెంట్రల్ కిచెన్ ప్రపంచవ్యాప్తంగా పలు సహాయ సంస్థలతో కలిసి ప్రకృతి విపత్తుల బాధితులకు ఆహారం అందిస్తుంది. ప్రపంచ ఆకలిని తీర్చేందుకు వినూత్న ఆలోచనలను చేయడమే కాక.. స్థానిక చెఫ్‌లను వాటిలో భాగస్వామ్యం చేసేలా చేస్తుంది. వాన్ జోన్స్ ఎవరంటే.. వాన్ జోన్స్ ప్రముఖ టీవీ హోస్ట్, రచయిత, రాజకీయ విశ్లేషకుడు. అంతేకాక వాన్ జోన్స్ షో, సీఎన్ఎన్ రిడెమ్షన్ ప్రాజెక్ట్‌కి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ అథర్గా మూడు సార్లు నిలిచారు. 2009లో బరాక్ ఒబామాకు ప్రత్యేక సలహదారుగా పని చేశారు. క్రిమినల్ జస్టిస్ సంస్కర్తగా ప్రశంసలు పొందిన జోన్స్ అనేక లాభాపేక్షలేని సంస్థలను స్థాపించారు. వాటిలో ముఖ్యమైనది ది డ్రీమ్ కార్ప్స్. డ్రీమ్ కార్ప్స్ అనేది ఇంక్యుబేటర్, ఇది సమాజంలో "అత్యంత హాని కలిగించేవారిని ఉద్ధరించడానికి,శక్తివంతం చేయడానికి" తగిన ఆలోచనలు, ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుంది. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో నలుగురు సభ్యులతో నింగిలోకి వెళ్లింది. సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లింది. వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. -
ఫ్రెంచ్ ఆస్కార్ వేడుకలో నటి నగ్నంగా నిరసన తెలిపింది
-
అవార్డు వేడుకలో వేదికపై పూర్తి నగ్నంగా నటి
పారిస్: 'ఫ్రెంచ్ ఆస్కార్' వేడుకలో అనూహ్య పరిణామం సభికులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో సంస్కృతికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని డిమాండ్ చేస్తూ నటి కోరిన్ మాసిరో (57) నగ్నంగా మారిపోయారు. సీజర్ అవార్డుల వేడుక సందర్బంగా శుక్రవారం ఈ సంచలన నిరసనకు కోరిన్ దిగారు. ఫ్రాన్స్‌లో ఆస్కార్‌తో సమానంగా భావించే వేదికపైకి ఉత్తమ దుస్తులకు అవార్డును అందజేయడానికిమాసిరోను ఆహ్వానించారు. ఈ సమయంలో రక్తంతో తడిసిన గాడిదను పోలిన దుస్తులతో వచ్చారు. వేదికపై మాట్లాడుతూనే పూర్తిగా నగ్నంగా మారిపోతున్నానంటూ ప్రకటించి అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పారిస్ ఒలింపియా కచేరీ హాల్లో "సంస్కృతి లేదు, భవిష్యత్తు లేదు" అనే నినాదంతో ఆమె దర్శనమిచ్చారు. ఇంతకంటే కోల్పోయేది ఏమీ లేదంటూ ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ‘మా కళను మాకు తిరిగి ఇవ్వండి... జీన్’ అంటూ బాడీ అంతా రాసుకొని ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్‌కు విజ్ఞప్తి చేయడం విశేషం. కాగా కరోనా మహమ్మారి సంక్షోభం కారణంగా మూడు నెలలకు పైగా ఫ్రాన్స్‌లో సినిమాలు మూతపడ్డాయి. గత డిసెంబరులో, వందలాది మంది నటులు, థియేటర్ డైరెక్టర్లు, సంగీతకారులు, ఫిల్మ్ టెక్నీషియన్లు, క్రిటిక్స్ అనేక మంది సాంస్కృతిక కేంద్రాల మూతకు వ్యతిరేకంగా పారిస్ , ఇతర నగరాల్లో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
పిలిభిత్ టైగర్ రిజర్వ్‌కు అవార్డు
లక్నో :ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)కు మొట్టమొదటి టీఎక్స్2 అవార్డు లభించింది. తక్కువ సమయంలోనే పులుల సంఖ్య రెండింతలు చేసినందుకుగానూ ఈ అవార్డు లభించింది. వివరాల్లోకెళ్తే.. 2010లో పులులను రక్షించేందుకు, వాటి సంఖ్యను పెంచేందుకు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా టీఎక్స్2 గ్లోబల్ అవార్డును ఏర్పాటు చేశారు. ఇందులో టైగర్ రిజర్వ్‌లు ఉన్న 13 దేశాలు పోటీ పడ్డాయి. 2010లో ఉన్న పులుల సంఖ్యను 2022 నాటికి రెండింతలు చేయాలన్నది ఈ అవార్డు అసలు లక్ష్యం. యూపీలోని పీటీఆర్ 2018 నాటికే ఈ ఘనతను సాధించింది. 2014 లెక్కల ప్రకారం పిలిభిత్‌లో 25 పులులున్నాయి. అవి 2018 నాటికి 65కు చేరుకున్నాయి. దీంతో మొదటి గ్లోబల్ అవార్డు భారత్‌ను వరించింది. పులులను జాగ్రత్తగా పర్యవేక్షించడం, దాడులను తగ్గించడం ద్వారా పులుల సంఖ్యను పెంచినట్లు పీటీఆర్ అధికారులు చెప్పారు. -
ఢిల్లీ క్రైమ్ చిత్రానికి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2012లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'ఢిల్లీ క్రైమ్' చిత్రం 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం ఉత్తమ నాటక ధారావాహిక విభాగంలో అవార్డు అందుకోనుంది. అంతరర్జాతీయ వేదిక వద్ద భారతీయ వెబ్ సిరీస్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను గుర్తించే పోలీస్ డిప్యూటీ కమిషనర్‌గా షెఫాలి షా నటించారు. (‘ప్రాణం’ కమలాకర్ పాట ఏడు భాషల్లో..) ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు రిచీ మెహతా మాట్లాడుతూ... ఎంతో మంది నుంచి వేధింపులు, హింసను భరిస్తూ... అలాంటి సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్న మహిళలందరికి ఈ అవార్డు అంకితమిస్తున్నా. చివరగా, అలసిపోని తల్లి, ఆమె కుమార్తె గురించి ఆలోచించకుండా ఆరోజు గడిచిపోదు. మనలో ఎవరూ వాళ్ల గురించి మరిచిపోరని నేను నమ్ముతున్నానని అన్నారు. అవార్డులు.. ఉత్తమ నటుడి విభాగంలో (అర్జున్ మాథుర్, మేడ్ ఇన్ హెవెన్), ఉత్తమ కామెడీ సిరీస్ (ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్) లో కూడా భారత్ నామినేషన్లు సాధించింది. ఈ అవార్డులు వరుసగా మరోసారి నటుడు బిల్లీ బారట్, (రెస్పాన్సిబుల్ చైల్డ్), నింగూమ్ టా ఓల్హాండో (నోబడీ లుకింగ్) సొంతం చేసుకున్నారు. ఇతర ప్రధాన విభాగాలలో, గ్లెండా జాక్సన్ (ఎలిజబెత్ ఈజ్ మిస్సింగ్) ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన వెర్టిగే డి లా చుట్ (రెస్సాకా) ఉత్తమ ఆర్ట్స్ ప్రోగ్రామింగ్ అవార్డును గెలుచుకోగా, రెస్పాన్సబుల్ చైల్డ్ ఉత్తమ మినీ-సిరీస్ అవార్డును గెలుచుకుంది. కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా న్యూయార్క్‌లోని ఖాళీ థియేటర్లో ఈ వేడుక జరగగా, రిచర్డ్ కైండ్ విజేతలకు అవార్డులను అందించారు. విజేతల జాబితా.. ఉత్తమ డ్రామా సిరీస్: ఢిల్లీ క్రైమ్ (ఇండియా) ఉత్తమ కామెడీ సిరీస్: నింగుమ్ టా ఓల్హాండో (నోబడీ లుకింగ్) (బ్రెజిల్) ఉత్తమ టీవీ మూవీ / మినీ-సిరీస్: రెస్పాన్సిబుల్ చైల్డ్ (యునైటెడ్ కింగ్డమ్) ఉత్తమ నటి: గ్లెండా జాక్సన్, ఎలిజబెత్ ఈజ్ మిస్సింగ్ (యునైటెడ్ కింగ్డమ్) ఉత్తమ నటుడు: బిల్లీ బారట్, రెస్పాన్సిబుల్ చైల్డ్ (యునైటెడ్ కింగ్డమ్) View this post on Instagram A post shared by Shefali Shah (@shefalishahofficial) -
నా సేవలు కొనసాగిస్తా
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌తో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019’ అవార్డు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును అల్లు అరవింద్‌కి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు. 40ఏళ్ల ప్రయాణంలో సేద తీర్చుకోవడానికి అవార్డులు ఉపయోగపడతాయి. నా సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్త దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా. భవిష్యత్తులో సమాజం కోసం నా సేవలు కొనసాగిస్తా’’ అన్నారు. -
‘బాలమురళీకృష్ణగారి దారిలోనే మేమందరం పయనిస్తున్నాం’
సాక్షి, విజయవాడ : బాలమురళీకృష్ణగారి దారిలోనే మేమంతా పయనిస్తున్నామని, రాబోయే తరం విద్యార్ధులకు ఆయన ఒక మార్గదర్శకమని ఈ ఏడాది మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కార గ్రహిత బాంబే జయశ్రీ పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని తీసుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మంగంళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కార ప్రదానోత్సవం శనివారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది కర్ణాటక సంగీత విద్వాంసురాలు బాంబే జయశ్రీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. మంత్రి అవంతి శ్రీనివస్ మాట్లాడుతూ.. పర్యాటక శాఖకు ఈ సంవత్సరానికి 72 కోట్లు కేటాయించాయని అన్నారు. 1981లో భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటయిందన్నారు. బాలమురళీకృష్ణ ఫ్రెంచ్ భాషలో కూడా పాటలు పాడారని, వీరు పద్మవిభూషణ్ బిరుదాంకితులని గుర్తు చేసుకున్నారు. సమకాలీన సంగీత ప్రపంచంలో వెలుగొందుతున్న బాంబే జయశ్రీగారికి ఈ పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషమని, జయశ్రీ బహుభాషలలో సినిమా పాటలు పాడారని పేర్కొన్నారు. ప్రతి కళాకారుడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విజయవాడ వేదికగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషమని, విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్‌గా మంగళంపల్లి పనిచేశారని తెలిపారు. విజయవాడలో మొదటి సంగీతయాత్ర మంగళంపల్లి ప్రారంభించారని, ఈ ప్రాంత ప్రజలే మురళీకృష్ణగారిని బాలమురళీకృష్ణగా సత్కరించారని ప్రభుత్వ కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనియాడారు. సంగీత ప్రపంచంలో జయశ్రీ ఒక ఆణిముత్యమని కీర్తించారు. -
పొదుపులో మేటి..చిట్యాల ఐకేపీ
చిట్యాల : పొదుపు బాటలో మండలకేంద్రంలోని ఐకేపీ ముందంజలో నిలిచింది. మూతపడే దశకు చేరిన ఐకేపీని పొదుపు పరంగా తీర్చిదిద్ది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిందేలా చేశారు అధికారులు. ఐకేపీ ఏపీఎంగా పనిచేస్తున్న పసరగొండ మంజుల ప్రజల్లో పొదుపుపై అవగాహన కల్పించి పొదుపు సంఘాలను ఎంతో బలోపేతం చేశారు. ఈ మేరకు ఏపీఎం మంజుల నాలుగేళ్ల సేవలకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ చేతుల మీదుగా మంజల జిల్లా ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు అందుకున్నారు. బాసటగా నిలిచిన ఏపీఎం మంజుల.. 2015 ఆగస్టు 13న చిట్యాల ఐకేపీ ఏపీఎంగా మంజులనియమితులయ్యారు. ఐకేపీ కార్యాలయంలోని పొదుపు సంఘాల పరిస్థితి అధ్వాన్నంగా ఉండి ఒక దశలో లోబడ్జెట్తో మూసివేసే స్థితిలో ఉండగా మంజుల గ్రామాలలో విస్త్ర ృత సమావేశాలు నిర్వహించారు. శ్రీనిధి, బ్యాంకు లింకేజీపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. గుడుంబా తయారీ ఎక్కువగా జరిగే గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు. ఐకేపీ పరిధిలో 796 పొదుపు సంఘాలను బలోపేతం చేసి చిట్యాల ఐకేపీని రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిపారు. దీంతో మండల సమాఖ్యకు రాష్ట్ర స్థాయిలో అవార్డు దక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐకేపీని ప్రథమ స్థానంలో నిలిపిన మంజుల సేవలకు అవార్డు రావడంపై మండల సమాఖ్య అధ్యక్షురాలు విజయ, మాజీ అధ్యక్షురాలు దర్గా, పొదుపుసంఘాల మహిళలు, సీసీలు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మండల సభలో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు మంజులను సన్మానించారు. -
ఎక్సలెంట్ కలెక్టర్
సిద్దిపేటటౌన్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అందించే రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఐఏఎస్ అధికారుల కేటగిరీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గోల్కొండ కోటలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో అవార్డుతో పాటు రూ.5 లక్షల క్యాష్ సర్టిఫికెట్ అందుకోనున్నారు. జిల్లాలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం, హరితహారం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలలో మంచి పనితీరు కనబర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించనుంది. అవార్డు లభించిన సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని జేసీ, డీఆర్వో, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల అధికారుల, రెవెన్యూ సిబ్బంది, జిల్లా అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే తనికీ అవార్డు లభించిందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అభివృద్ధి పథంలో నడిచేలా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, అభివృద్ధిలో తనను భాగస్వామ్యం చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
డాక్టర్ హరికృష్ణకు వైద్యరత్న అవార్డు
నిజామాబాద్‌అర్బన్ : ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు హరికృష్ణకు వైద్యరత్న, సేవ రత్న అవార్డు లభించింది. తెలుగుభాష సాంస్కృతికశాఖ ఆదర్శపౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా హరికృష్ణ ఈ అవార్డును అందుకున్నారు. కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లాలో నవజాత శిశువులకు అత్యవసర వైద్యచికిత్సలు అందించడం, అత్యాధునిక వైద్యసేవలు తీసుకరావడం, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఇఫ్తార్ విందులు, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడంతో డా.హరికృష్ణను ఈ అవార్డుకు ఎంపికచేశారు. శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం వంటి కార్యక్రమాలను అవార్డు కారణమైనట్లు నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా ఉందని, మరింత బాధ్యతయుతంగా వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఉచిత ఆరోగ్యశిబిరాలు, వ్యాధుల నియంత్రణకు పాటుపడుతానన్నారు. తెలంగాణ సాహితీ అకాడమి చైర్మన్ నందనిసిద్దారెడ్డి, ఆదర్శ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కనుమ బోగరాజు, యువ కళావాహిణి అధ్యక్షులు వై.కె.నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన క్రీడానందం
268 మందికి నగదు ప్రోత్సాహకాలు సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చొరవను అభినందించిన ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి ఇకపై రాష్ట్ర స్థాయిలో ప్రోత్సాహకాలు అందజేస్తామన్న చైర్మన్ ముక్కాల నెల్లూరు(బందావనం): జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా నెల్లూరులో సోమవారం సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో క్రీడానందం వెల్లివిరిసింది. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ క్రీడల్లో రాణించిన 268 మంది క్రీడాకారులు నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలు అందుకున్నారు. ఫౌండేషన్ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు. ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రణాళికబద్ధంగా ప్రోత్సహిస్తే మెరికల్లా తయారై అద్భుత ఫలితాలు సాధిస్తారని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. దేశంలో క్రీడాకారుల, ప్రతిభ కొరవలేదని, కొరవడింది ప్రోత్సాహమేనన్నారు. క్రీడారంగానికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగా ఉందన్నారు. ఈ క్రమంలో సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చొరవ ప్రశంసనీయమన్నారు. అభినందనీయం ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే ఎందరో క్రీడాకారులు పుట్టుకొస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలరన్నారు. జిల్లా క్రీడాకారులకు సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు. త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ త్వరలో జిల్లా క్రీడారంగానికి మహర్దశ కలగనుందని డీఎస్డీఓ పీవీ రమణయ్య అన్నారు. ఏసీ స్టేడియంలో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర స్థాయి పురస్కారాలు వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందజేస్తామని సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. క్రీడాపరంగా సింహపురి ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడించాలన్నదే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మొదట మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామమూర్తి,, జిల్లా పోలీస్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు ఎం.ప్రసాద్‌రావు, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.వి. వెంకట్, సభ్యులు సరాబు సుబ్రహ్మణ్యం, శ్రీరాంసురేష్, అమరా వెంకటేశ్వర్లు, వేల్చూరి సురేష్, సత్యకష్ణ, కె.వీరబ్రహ్మం, కార్పొరేటర్ ఓబిలిరవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
29న క్రీడాప్రతిభా పురస్కారాల ప్రదానం
నెల్లూరు(బృందావనం): జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని సింహపురి స్పోర్ట్సు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఉదయం 10 గంటలకు క్రీడాకారులకు ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు ఆ ఫౌండేషన్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. నవాబుపేటలోని ఎస్ఎస్ఎఫ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఆరేళ్ల క్రితం స్పోర్ట్సు ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పట్నుంచి జాతీయ క్రీడాదినోత్సవం నాడు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. క్రీడాప్రతిభా పురస్కారాలకు సంబంధించిన దరఖాస్తులను ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్సు కాంప్లెక్స్‌లోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయం, సింహపురి స్పోర్ట్సు ఫౌండేషన్ కార్యాలయంలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 25లోగా క్రీడాకారులు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. వివరాలకు 92467 77777 నంబరులో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు మద్దిపాటి ప్రసాద్‌రావు, సహాయ కార్యదర్శి సరాబు సుబ్రహ్మణం, కార్యవర్గసభ్యులు అమరా వెంకు పాల్గొన్నారు.