లక్నో :ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్(పీటీఆర్)కు మొట్టమొదటి టీఎక్స్2 అవార్డు లభించింది. తక్కువ సమయంలోనే పులుల సంఖ్య రెండింతలు చేసినందుకుగానూ ఈ అవార్డు లభించింది. వివరాల్లోకెళ్తే.. 2010లో పులులను రక్షించేందుకు, వాటి సంఖ్యను పెంచేందుకు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా టీఎక్స్2 గ్లోబల్ అవార్డును ఏర్పాటు చేశారు. ఇందులో టైగర్ రిజర్వ్‌లు ఉన్న 13 దేశాలు పోటీ పడ్డాయి. 2010లో ఉన్న పులుల సంఖ్యను 2022 నాటికి రెండింతలు చేయాలన్నది ఈ అవార్డు అసలు లక్ష్యం. యూపీలోని పీటీఆర్ 2018 నాటికే ఈ ఘనతను సాధించింది. 2014 లెక్కల ప్రకారం పిలిభిత్‌లో 25 పులులున్నాయి. అవి 2018 నాటికి 65కు చేరుకున్నాయి. దీంతో మొదటి గ్లోబల్ అవార్డు భారత్‌ను వరించింది. పులులను జాగ్రత్తగా పర్యవేక్షించడం, దాడులను తగ్గించడం ద్వారా పులుల సంఖ్యను పెంచినట్లు పీటీఆర్ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment