భారతీయ రెస్టారెంట్‌కు ప్రతిష్టాత్మకమైన మిచెలిన్ స్టార్ పురస్కారం లభించింది. ఇది వంటకాలకు సంబంధించి.. పాక ప్రపంచంలో అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు. నిజానికి భారతదేశంలో మిచెలిన్ స్టార్‌ల లభించిన రెస్టారెంట్‌లు లేవు విదేశాల్లో ఉన్న భారతీయ రెస్టారెంట్లే ఈ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకున్నాయి.
తాజాగా దోహాలో జరిగిన మిచెలిన్ గైడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారతీయ రెస్టారెంట్ జమావర్ దోహాకి ఈ మిచెలిన్ స్టార్ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో రెండు రెస్టారెంట్లకే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. వాటిలో మన భారతీయ రెస్టారెంట్ కూడా ఉండటం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో తమ రెస్టారెంట్ కూడా భాగమవ్వడం సంతోషంగా ఉందన్నారు వ్యవస్థాపకులు ఈ తండ్రికూతుళ్ల ద్వయం దినేష్ , సంయుక్తలు.
ఈ రెస్టారెంట్ పేరుని కాశ్మర్‌లోని 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శాలువాల పేరుని ఎంచుకున్నారు ఆ తండ్రి కూతుళ్లు. అత్యాధునిక హంగులతో ఉండే ఈ రెస్టారెంట్‌లో ఢిల్లీ, కేరళకు సంబంధించిన ప్రసిద్ధ వంటకాలతో సహా వివిధ అద్భుత రుచులతో కూడిన వంటకాలను సర్వ్ చేస్తారు . ఈ జమావర్ రెస్టారెంట్‌ని మొదటిసారిగా 2001లో ది లీలా ప్యాలెస్ బెంగళూరులో ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రసిద్ధ ఐదు భారతీయ నగరాల్లో బ్రాంచ్‌లుగా విస్తరించారు. ఆ తర్వాత 2016లో లండన్, 2021లో దోహాలలో కూడా తమ రెస్టారెంట్లను ప్రారంభించారు. అయితే జమావర్ లండన్ కూడా ఈ ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారాన్ని దక్షించుకోవడం విశేషం.
కాగా, దోహా జమావర్ రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ ఇన్‌స్టాగ్రాంలో "ఇది తమ టీం సమిష్ట కృషి, అంకిత భావానికి నిదర్శనం. మా కష్టాన్ని గుర్తించి ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించినందుకు మిచెలిన్ గైడ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు". అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు చెఫ్ సురేందర్ . ఇక సంయుక్త నాయర్ కూడా ఇది కేవలం మా జమావర్ దోహకే గర్వకారణం కాదు. ఆ ప్రాంతంలో భారతీయ ఆహారానికి దక్కిన గొప్ప గౌరవం అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
మిచెలిన్ స్టార్ అంటే..
అత్యుత్తమ వంటలను అందించే రెస్టారెంట్లకు ఈ పురస్కారాని ఇస్తారు. మొత్తం ఐదు ప్రమాణాలలను పరిగణలోనికి తీసుకుని ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. పదార్థాల నాణ్యత, రుచుల సామరస్యం, సాంకేతికతలలో నైపుణ్యం, వంటకాలను ప్రెజెంట్ చేసే చెఫ్ నైపుణ్యం, ముఖ్యంగా మెనూలో వంటకాల వైవిధ్యం తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫ్రాన్స్‌కి చెందిన మిచెలిన్ గైడ్ ఈ పురస్కారాలను అందజేస్తుంది. ఇలా 1900 సంవత్సరం నుంచి అందజేస్తోంది.
(చదవండి: బిడ్డకు తల్లైనా అంతే అందంగా హీరోయిన్! ‘చందమామ’ సీక్రెట్ ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment