indian restaurant
-
మన చాయ్ పానీ ముందు..పిజ్జా, బర్గర్లు జుజుబీ అనాల్సిందే!
సంస్కృతి, సాంప్రదాయాలకు భారత్ నిదర్శనం. అలాంటి మన దేశ రుచులు ఎల్లలు దాటుతున్నాయి. పిజ్జాలు, బర్గర్లు తినే అమెరికన్లు సైతం ఆహా ఏమిరుచి తినరా మైమరిచి అంటూ మన వంటకాల్ని లొట్టలేసుకుంటూ ఆవురావురుమంటూ తింటున్నారు. తమ దేశంలోనూ స్ట్రీట్ ఫుడ్లను అందించడంలో భారత్ రెస్టారెంట్లే బాగున్నాయంటూ కొనియాడుతున్నారు. మెహెర్ వాన్ ఇరానీ భారతీయ వంటకాలన్నీ అమెరికన్లకు రుచి చూపించేందుకు 2009లో అమెరికా నార్త్ కరోలినా యాష్‌లో 'చాయ్ పానీ' పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కేవలం 8 డాలర్ల నుంచి 17డాలర్ల మధ్య ధరలతో చాట్‌ను అందించడంతో ఆ రెస్టారెంట్‌కు భారత్, అమెరికన్లకే కాదు వివిధ దేశాలకు చెందిన ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంది. ముఖ్యంగా మనదేశంలో విరివిరిగా లభ్యమయ్యే మసాలల్ని దట్టించిన చాట్లలో షడ్రుచులు తోడవవ్వడం అమెరికాలో 1946 నుంచి సంప్రాదాయ వంటకాల్ని అందించే బ్రెన్నాన్స్ వంటి హోటల్స్ ను చాయ్ పానీ వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ధర తక్కువ, రుచికరమైన వంటకాల్ని అందించడంతో చాయ్ పానీ ఫుడ్ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో 40 ఏళ్లలో ఎన్నుడూ చెల్లించిన విధంగా అమెరికన్లు ఆహరం కోసం ఈ ఏడాది అత్యధికంగా చెల్లిస్తున్నారు. అదే సమయంలో రీజనబుల్ ప్రైస్‌లో చాయ్ పానీ వంటకాలు లభ్యం కావడంతో అమెరికాలో బెస్ట్ రెస్టారెంట్‌గా ప్రసిద్దికెక్కింది. జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డ్స్ సొంతం చేసుకొని ప్రథమ స్థానంలో నిలిచింది. చదవండి👉పెట్రోల్‌పై డిస్కౌంట్! యూఎస్‌లో ఆకట్టుకుంటున్న భారతీయుడు -
మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్ రెస్టారెంట్ మూసివేత
తరాలు మారుతున్న ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు వివక్షలను ఎదుర్కుంటున్నారు. తాజాగా ముసుగు ధరించి వచ్చిన ఒక మహిళను ఇండియన్ రెస్టారెంట్ సిబ్బంది లోనికి అనమతించలేదు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ రెస్టారెంట్‌ని మూసివేశారు. ఈ ఘటన బహ్రెయిన్‌లోని అడ్లియాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అడ్లియాలో ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌ను 1987 నుంచి నిర్వహిస్తున్నారు. ఇటీవల ఒక మహిళ కస్టమర్ ముసుగు ధరించి రెస్టారెంట్‌లోనికి వెళ్తోంది. ఇది గమనించిన రెస్టారెంట్ సిబ్బంది ముసుగు ధరించిన కారణంగా ఆమెను లోనికి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (బీటీఈఏ) ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తుకు ఆదేశించింది. ప్రజల పట్ల వివక్ష చూపే ఏ చర్యలైనా తాము అంగీకరించమని, ముఖ్యంగా వారి జాతి వివక్షలాంటివి అసలు సహించమని బీటీఈఏ హెచ్చరించింది. చదవండి: Breast Milk Jewellery: తల్లి పాలతో అలా.. ఏడాది సంపాదన ఏకంగా 15 కోట్ల రూపాయలు!! దర్యాప్తు అనంతరం నిబంధనలు ఉల్లంఘించిందని తేలడంతో ఆ రెస్టారెంట్‌ను అధికారులు మూసివేశారు. రెస్టారెంట్ యాజమాన్యం దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. క్షమాపణ చెప్పడంతో పాటు ఘటనపై విచారం కూడా వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైన రెస్టారెంట్ డ్యూటీ మేనేజర్‌ను కూడా తొలగించింది. ఈ అందమైన రాజ్యంలోని అన్ని దేశాలకు చెందిన తమ కస్టమర్లకు 35 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. -
ఒకటి రెండూ కాదు.. వందేళ్లకు పైబడ్డ చరిత్ర, మరెన్నో విశేషాలు!
మార్పు అనేది ఓ కొత్త సంస్కృతికి ఆహ్వానం పలుకుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే హోటల్ రంగంలో కూడా ఆ మార్పు మొదలైంది. మనిషి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. వివిధ పనులపై వెళ్లే క్రమంలో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండాల్సి వచ్చింది. దీంతో చిన్న చిన్న హోటల్స్ నుంచి ఫైవ్, సెవెన్ స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు వచ్చేశాయి. అయితే ఎన్ని మార్పులు వచ్చినా గడిచిన కాలాన్ని అంత తొందరగా మరచిపోనివ్వదు చరిత్ర. అలాగే కొన్ని భారతీయ హోటల్స్‌కు ఓ వందేళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది. వాటి వివరాల ఏంటో ఓ సారి చూద్దాం.. పర్వతాలను చూస్తూ.. ఓ పట్టు పట్టొచ్చు! పశ్చిమ బెంగాల్‌లోని గ్లెనరీ అనే రెస్టారెంట్ డార్జిలింగ్‌లోని కొండ పట్టణ ప్రాంతాల్లో అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటి. దీనికి 130 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి భోజనం అద్భుతంగా ఉంటుదని వినికిడి. విందు ఏర్పాటు కోసం ఓ ప్రత్యేకమైన స్థలాన్ని కూడా కేటాయించారు. అంతేకాకుండా గ్లెనరీలో బేకరీ కూడా ఉంది. కొండ ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్లో పర్వతాలను చూస్తూ విందు ఆరగించడానికి ప్రత్యేక సీట్లను కూడా ఏర్పాటు చేశారు. 150 సంవత్సరాల చరిత్ర ముంబైలోని లియోపోల్డ్ కేఫ్ రెస్టారెంట్, బార్‌కు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగ్రవాదులు 2008 వ సంవత్సరంలో జరిపిన ముంబై దాడుల లిస్టులో ఈ రెస్టారెంట్ ఉండటంలో దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆ భయంకరమైన దాడులకు సంబంధించి భద్రపరిచిన బుల్లెట్ గుర్తులను రెస్టారెంట్లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రదేశం పర్యాటకులకు, స్థానికులకు ఎంతో ఇష్టమైనది. ప్రసిద్థ వ్యక్తులు చేతుల మీదుగా.. కోల్‌కతాలోని ఈ ఇండియన్ కాఫీ హౌస్‌ను ప్రసిద్థ వ్యక్తులు సత్యజిత్ రే, మృణాల్ సేన్, అమెరికన్ కవి అలెన్ గిన్స్బర్గ్ 1876లో స్థాపించారు. అయితే ఆల్బర్ట్ హాల్ అనే పేరు గల ఈ రెస్టారెంట్‌ను 1947 తర్వాత కాఫీ హౌస్‌గా పేరు మార్చారు. కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ టుండే కబాబీ తినుబండాగారానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ టుండే కబాబీ 115 సంవత్సరాల పురాతనమైనది. దీన్ని 1905లో ప్రారంభించారు. ఇక్క 125 రకాల వంటకాలు దొరుకుతాయని చెబుతారు. ఇక్కడి కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయని ప్రతీతి. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం.. -
మీ దేశానికి వెళ్లిపోండి: రెస్టారెంట్ ధ్వంసం
వాషింగ్టన్: అమెరికాలోని భారతీయ హోటల్‌ను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. అనంతరం విద్వేషపూరిత వ్యాఖ్యలతో హోటల్ గోడలను నింపేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది. న్యూ మెక్సికోలోని సాంటే ఫె సిటీలో బల్జీత్ సింగ్ అనే సిక్కు వ్యక్తి భారతీయ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉన్నట్టుండి కొందరు దుండగులు హోటల్లోకి చొచ్చుకు వచ్చి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. దేవుళ్ల విగ్రహాలను కిందపడేశారు. వంటగదిని సర్వనాశనం చేశారు. గోడలపై 'వైట్ పవర్', 'ట్రంప్ 2020', 'స్వదేశానికి వెళ్లిపో' అంటూ బెదిరింపు వ్యాఖ్యలను రాశారు. (సియాటిల్‌లో ఆందోళనలకు భారతీయురాలి సారథ్యం) అనంతరం కంప్యూటర్లను దొంగిలించారు. ఈ దాడి వల్ల రెస్టారెంట్ యజమానికి లక్ష డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ చర్యను సిక్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్(ఎస్ఏఎల్డిఈఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింస ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో అమెరికా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. స్పానిష్ వలసవాదుల విగ్రహాలను తొలగించడంతో ఈ ఆందోళనలు మరింత భగ్గుమన్నాయి. (ఒంటి కాలితో గెంతుకుంటూ వెళ్లమన్నారు) (ప్రజాగ్రహం: భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు) -
ప్రజాగ్రహం: భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు
వాషింగ్టన్: కరోనాతో అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు నల్లజాతీయులు నిరసనతో కూడా అట్టుడుకుతోంది. మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు.. చివరికి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. దీనిపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆందోళనల్లో భాగంగా మిన్నియాపోలీస్‌లోని ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్ ‘గాంధీ మహల్’కు నిరసనకారులు నిప్పు పెట్టారు. హఫ్సా ఇస్లాం కుటుంబం ఈ రెస్టారెంట్‌ను చాలా ఏళ్లుగా సౌత్ మిన్నియాపోలిస్‌లో నడుపుతున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి రెస్టారెంట్ యజమాని కుమార్తె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (విడాకులకు దారి తీసిన జార్జ్ మృతి) ‘రెస్టారెంట్ మంటల్లో తగలబడిపోయినందుకు బాధగా ఉంది. అయితే మా నాన్న గారు నాతో ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు. రెస్టారెంట్ తగులబడితే తగులబడని. కానీ జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలి. ఆ అధికారులను జైళ్లో పెట్టాలి అని అన్నారు. మా రెస్టారెంట్‌ను కాపాడానికి చుట్టుపక్కల వారు చాలా ప్రయత్నించారు. మళ్లీ మేం మా రెస్టారెంట్‌ను తిరిగి నిర్మించుకోగలమనే నమ్మకం ఉంది’ అని ఆమె పోస్ట్ చేశారు. హఫ్సా కుటుంబం ఎన్నో ఏళ్లుగా నల్లజాతీయుల నిరసనలకు అండగా నిలబడుతూ వస్తోంది. ఈ విషయంలో కూడా జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలని హఫ్సా కుటుంబం కోరుకుంటుంది.(ఊపిరాడటం లేదు: అమ్మా! అమ్మా!) Powerful words from the family that owns Gandhi Mahal, hours after the restaurant burned down.#Minneapolis #wcco #GeorgeFloyd pic.twitter.com/AgGng0gsEP — Christiane Cordero (@ChristianeWCCO) May 29, 2020 ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ మెడపై పోలీసులు మోకాలుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికి పోలీసు అధికారి మాత్రం కనికరం చూపకుండా ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచాడు. దీంతో ప్రాణం పోతుందంటూ గిలగిల కొట్టుకున్న జార్జ్ పోలీసు మోకాలి కిందనే ప్రాణాలు వదిలాడు. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. -
భారత రెస్టారెంట్‌పై బాంబుదాడి
టొరంటో: కెనడాలోని ఓ భారతీయ రెస్టారెంట్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బాంబుదాడికి పాల్పడ్డారు. ఒంటారియో ప్రావిన్సులోని మిస్సిస్వాగాలో ‘బాంబే భేల్’ రెస్టారెంట్లో శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ దాడిలో ముగ్గురు భారత సంతతి కెనడియన్లుసహా 15 మందికి గాయాలయ్యాయి. ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు పెయింట్ క్యాన్ లేదా బకెట్ పరిమాణంలో ఉన్న ఐఈడీ బాంబుతో రెస్టారెంట్లోకి వచ్చారు. అనంతరం దాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారన్నారు. వీరువెళ్లిన కొద్దిసేపటికే శక్తిమంతమైన పేలుడు సంభవించింది. దుండగుల కోసం పోలీసులు భారీస్థాయిలో గాలింపు చేపట్టారు. ఇది ఉగ్రదాడా? లేక విద్వేషపూరిత దాడా? అన్నది ఇప్పుడే ఏం చెప్పలేమని పోలీసులు అన్నారు. కెనడాలో ఆరో అతిపెద్ద నగరమైన మిస్సిస్వాగాలో 7 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో భారత్ నుంచి వలసవెళ్లినవారి సంఖ్య గణనీయంగా ఉంది. టొరంటోలోని భారత కాన్సుల్‌తో పాటు కెనడాలోని భారత హైకమిషనర్ నుంచి ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. అధికారులు అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉన్నారన్నారు. -
కెనడా భారతీయ రెస్టారెంట్లో పేలుడు
-
ఇండియన్ రెస్టారెంట్లో పేలుడు కలకలం!
టొరంటో : ప్రవాస భారతీయులకు చెందిన రెస్టారెంట్లో పేలుడు సంభవించడం కలకలం రేపింది. కెనడా, ఒంటారియోలోని బాంటే భేల్ రెస్టారెంట్లో జరిగిన ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం రాత్రి 10:30 గంటలకు రెస్టారెంట్లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పలువురు భారతీయులు హోటల్లో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే జరిగని ఘటన ఉగ్రవాదుల చర్య అని అప్పుడే చెప్పలేమన్నారు కెనడా పోలీసులు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామని వివరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. గత నెలలో టొరంటోలో ఓ డ్రైవర్ వ్యాన్ అద్దెకు తీసుకుని దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృత్యువాత పడగా, మరో 15 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. స్పందించిన సుష్మా స్వరాజ్ రెస్టారెంట్లో పేలుడు ఘటనపై విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. కెనడాలో భారత హైకమిషనర్‌తో, టొరంటో కాన్సుల్ జనరల్‌తో విషయం అడిగి తెలుసుకున్నాం. తగిన సహాయం అందేలా చూస్తామని ఆమె చెప్పారు. ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్.. +1-647-668-4108 అని ట్వీట్ చేశారు. There is a blast in Indian restaurant Bombay Bhel in Mississauga, Ontario, Canada. I am in constant touch with our Consul General in Toronto and Indian High Commissioner in Canada. Our missions will work round the clock. The Emergency number is : +1-647-668-4108. Please RT — Sushma Swaraj (@SushmaSwaraj) 25 May 2018 -
చికెన్ కుర్మాలో శెనగలు.. భారీ ఫైన్
లండన్: చికెన్ కుర్మాలో శెనగలు వేసి వండిన భారతీయ రెస్టారెంట్ షెఫ్‌కు అధికారులు భారీ జరిమానా విధించారు. తూర్పు ఇంగ్లండ్ ప్రాంతం గ్రిమ్స్బీలో 'మసాలా' ఇండియన్ రెస్టారెంట్లో బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ ఉద్దీన్ షెఫ్‌గా పనిచేస్తున్నాడు. మసాలా రెస్టారెంట్ లో తయారు చేసిన చికెన్ కుర్మాను ఆహార శాఖ అధికారులు 2016 లో తనిఖీ చేశారు. కుర్మాలో 6.8 మిల్లీగ్రాముల శెనగలు ఉన్నట్లు కనుగొన్నారు. మరోసారి తనిఖీ చేసినప్పుడు కూడా అటువంటి కల్తీనే గుర్తించారు. దీనిపై సంబంధిత షెఫ్‌ను అధికారులు విచారించగా... కుర్మాలో శెనగలు ఎలా కలిశాయో తనకు తెలియదని, తాను వాటిని కలుపలేదని షెఫ్ మహ్మదుద్దీన్ అధికారులకు తెలిపారు. అయితే, శెనగలు లేకుండానే చికెన్ కుర్మా చేస్తున్నట్లు మెనూలో పేర్కొని, వాటిని కలపటం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. అంతే కాకుండా, కొందరు 5 మిల్లీ గ్రాములకు మించి శెనగలు ఆహారంలో ఉంటే అలెర్జీతో ఇబ్బందులు పడతారని, అవేమీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వాటిని కలిపి ఆహార పదార్థాలు వండారని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు గాను షెఫ్ మహ్మదుద్దీన్కు 2,300 పౌండ్ల జరిమానా విధించారు. ( గ్రిమ్స్బీలోని 'మసాలా' ఇండియన్ రెస్టారెంట్ ) -
వంటను ప్రశ్నిస్తే చెఫ్ కారం కుమ్మరించాడు
-
వంటను ప్రశ్నిస్తే చెఫ్ కారం కుమ్మరించాడు
లండన్: వీకెండ్ అంటే యువతకు పార్టీలు షరా మాములే.. ఇలాంటి పార్టీలే భార్యభర్తలు కూడా చేసుకుంటుంటారు. కాకపోతే పబ్బులు వంటివికాదుగానీ మంచి భోజనం పెట్టే రెస్టారెంట్లకు వెళ్లి తమకు నచ్చినది తింటుంటారు. బ్రిటన్‌లోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో ఇలాగే తమకు నచ్చిన ఆహారం తినేసి వద్దామనుకొని శనివారం సాయంత్రం వెళ్లిన ఓ భార్యభర్తలు విషాదాన్ని ఎదుర్కోవల్సి వచ్చింది. అది కూడా చీఫ్ చెఫ్ రూపంలో. వంట భాగలేదని చెప్పినందుకు ఆ షెఫ్ హోటల్‌కు వచ్చిన వ్యక్తి భార్యను తిట్టడమే కాకుండా ప్రశ్నించిన భర్త ముఖంపై మంచి ఘాటైన కారాన్ని కుమ్మరించాడు. దీంతో అతడి కళ్లు దాదాపు పోయిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. డేవిడ్ ఇవాన్స్(46), మిషెల్లీ(47) భార్యాభర్తలు. ఇద్దరు భోదనా రంగంలో పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం హ్యపీగా భోజనం చేసేందుకు ఓ రెస్టారెంటుకు వెళ్లారు. తొలుత స్టార్టర్స్‌తో ప్రారంభించి అవి అంతభాగలేకపోయినా ఏదో కానిచ్చేశారు. ఆ తర్వాత మాంసంతో కూడిన ఆహారం వచ్చాక కూడా అది సరిగా లేకపోవడంతో అది మాత్రం పక్కకు పెట్టి మిగితా భాగం తినేశారు. పూర్తయ్యాక ఫుడ్ ఎలా ఉందని వెయిటర్ ప్రశ్నించగా మాంసం సరిగా బాయిల్ అవ్వలేదని, రబ్బరు మాదిరిగాఉందని, స్ట్రార్టర్స్ కూడా బాగా లేవని చెప్పారు. అదే విషయాన్ని చెఫ్‌కు చెప్పాడు. దీంతో అతడు వారిని తిట్టాడు. తమనెందుకు తిడుతున్నావని క్షమాపణలు చెప్పాలని డేవిడ్ ఇవాన్స్ చెఫ్‌ను అడిగాడు. ఇందుకు తిరస్కరించిన చెఫ్ వెంటనే డేవిడ్ ముఖంపై కారం కుమ్మరించాడు. దాంతో అతడి కళ్లు పోయే పరిస్థితి ఏర్పడింది. -
వేస్ట్ ఫెలోస్
బాధ్యత అవసరం కంటే ఎక్కువ పెట్టుకోవడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ వడ్డించడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ తినడం వేస్ట్ కాదా! ఆ తర్వాత అజీర్తికనీ, షుగర్ అనీ, సకల జబ్బులకు సర్వం ధారపోయడం వేస్ట్ కాదా! రైతు కష్టాన్ని గౌరవించకపోవడం వేస్ట్ కాదా! పేదవాడి కడుపుకొట్టడం వేస్ట్ కాదా! పంచుకోవాల్సింది పారేయడం వేస్ట్ కాదా! పిల్లలకు వేస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచేవాళ్లు వేస్ట్‌ఫెలోస్ కాదా! కాదా!? అన్నం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ అంటే సృష్టి. సృష్టి అంటే శక్తి. ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే శక్తిని, మన ఉత్పాదకతను వృథా చేస్తున్నామనే అర్థం. ఈ పాఠం రతన్‌టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజానికి జర్మనీకి వెళితే కాని అర్థం కాలేదు. చాలా ఏళ్ల కిందట రతన్ టాటా ఏదో పని మీద జర్మనీ వెళ్లారు. అప్పటి వరకు ఆయన జర్మనీ చాలా ధనిక దేశమని, అక్కడి ప్రజలంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆయన స్నేహితుడితో కలిసి హేమ్బర్గ్కి వెళ్లాడు. లంచ్ టైమ్ అయింది. ‘ఆకలి దంచేస్తోంది. ముందు ఏదైనా రెస్టారెంట్‌కి వెళదాం.. తర్వాతే ఇంకో పని’ అన్నాడు స్నేహితుడితో. ఆ స్నేహితుడు అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడు. మూలన ఒక యువజంట, ఇంకో చోట యాభైఏళ్లు పైబడిన ఓ మహిళల గుంపు మినహా రెస్టారెంట్ అంతా ఖాళీగానే ఉంది. ‘ఇదేం హోటల్‌రా బాబూ.. అంతా ఖాళీగా ఉంది.. మంచి ఫుడ్ ఉంటుందా?’ సందేహం వెలిబుచ్చుతూ లోపలంతా పరికించి చూడసాగాడు. మూలన కుర్చున్న యువజంట ముందు ఓ రెండు కూరలతో మాత్రమే భోజనం ఉంది. ‘ఇంత సాధారణ భోజనంతో రొమాంటిక్ లంచా? గర్ల్‌ఫ్రెండ్‌కి మంచి లంచ్ కూడా ఆర్డర్ చేయని ఆ పిసినారి బాయ్‌ఫ్రెండ్‌ని ఆ పిల్ల ఎంతోకాలం భరించదు’ అనుకుంటూ నవ్వుకున్నారు రతన్‌టాటా. యాభై పైబడిన ఆడాళ్ల బృందమేమో ఆర్డర్ చేసుకొన్న డిష్‌ను కొసరి కొసరి వడ్డించుకుంటున్నారు. ప్లేట్లలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ మిగల్చకుండా తినేస్తున్నారు. వాళ్లను చూసి అంత కక్కుర్తి ఏమిటా అనుకున్నారాయన. ఇప్పుడు ఆర్డర్ చేయడం వీళ్ల వంతైంది. ఉన్నది ఇద్దరే అయినా చాలా రకరాల వెరైటీలను ఆర్డర్ చేశారు రతన్‌టాటా. తినగలిగినంత తిని మిగిలినది ప్లేట్లలో వదిలేశారు. అది చూసి పక్కనే ఉన్న బృందంలోని మహిళ... ‘మిస్టర్.. భోజనాన్ని అలా వదిలేశారెందుకు?’ అంటూ కోప్పడింది. ఆ మాటకు రతన్‌టాటా స్నేహితుడికి చిర్రెత్తింది. ‘మా డబ్బు.. మా భోజనం.. మా ఇష్టం. తింటాం.. వదిలేస్తాం.. మీకెందుకు?’ అంతే కోపంగా సమాధానమిచ్చాడు. ఆ జవాబుకి కనుబొమలు ముడివేసిన ఆ మహిళ వెంటనే రిసెప్షన్‌లోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి వచ్చింది. కొద్ది క్షణాల్లోనే అక్కడి సోషల్ సెక్యురిటీ యూనిఫామ్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. ఈ మిత్రుల టేబుల్ దగ్గరకు వచ్చి ‘ప్లేట్లలో వదిలేసిన ఆహారానికి యాభై యూరోలు ఫైన్ కట్టండి’ అంటూ ఓ రిసీట్ ఇచ్చారు. తెల్లబోయారిద్దరూ. ‘అదేంటి? ఈ ఫుడ్ మేం డబ్బుకట్టి ఆర్డర్ చేసిందే’ అన్నాడు రతన్‌టాటా స్నేహితుడు. ‘డబ్బు మీదే కాని వనరులు మీవి కావు. మీవి కాని రీసోసెర్సెస్ను వేస్ట్ చేసే హక్కు మీకు లేదు. దానికే ఈ ఫైన్’ అని వాళ్ల దగ్గర యాభై యూరోలు తీసుకొని వెళ్లిపోయారు. అప్పటిదాకా ఆ ధనిక దేశమ్మీద రతన్‌టాటాకు ఉన్న అపోహలు తొలగిపోయాయి. అంత సంపద ఉన్న దేశమే ప్రకృతి సంపదను ఎంతో జాగ్రత్తగా వాడుకుంటుంటే అతి తక్కువ వనరులన్న మన దేశం ఎంతెంత ఆహారాన్ని వృథా చేస్తోంది ...అని చింత పడ్డారు. అప్పటినుంచి ఒక్క ఆహారపు గింజను కూడా వృథా చేయనని ఒట్టేసుకోవడమే కాదు, చిత్తశుద్ధితో ఆచరించడమూ మొదలెట్టారట. మన ఇళ్లల్లో.. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లల్లో, మన హోటళ్లల్లో కనిపించవు. కానీ తిన్నంత తిని వదిలేసినంత వదిలేసే అలవాట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇద్దరున్న ఇంట్లో నలుగురి వంట; నలుగురు ఉన్న ఇంట్లో ఆరుగురి వంట; ఇక పదిమంది ఉన్న ఇంట్లో పదిహేను మంది వంట చెత్తకుండీల్లోకి చేరుతుంది. అదే చెత్తకుండీ పక్కన అన్నమో రామచంద్రా అంటూ డొక్కలు అతుక్కుపోయిన అన్నార్తులూ కనిపిస్తుంటారు. ఒక ఇంట్లో అతివృష్టి... ఒకడి ఒంట్లో అనావృష్టి. అయినా ఆహారం విలువ తెలియదు. దానికి ఉదాహరణ మన దగ్గర జరిగే అట్టహాసపు ఆర్భాటపు పెళ్లిళ్లు, పెరంటాళ్లే! ఈ వేడుకల్లో టన్నుల కొద్దీ ఆహారం వృథాపాలవుతోంది. ఇలా వృథా చేస్తున్న ఏ ఒక్కరికైనా దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు గుర్తొస్తున్నాయా? చెత్తలో కలుపుతున్న ఈ ఆహారధాన్యాలను పండించడానికి రైతు తన సర్వస్వం ధారపోస్తున్నాడు. తాను నమ్ముకున్న నేల కోసం ఇంటినీ, భార్య ఒంటి మీది నగలను తాకట్టు పెట్టి పంటకు పెట్టుబడి తెస్తున్నాడు. అయినా అనుకున్న రాబడి రాక అప్పులు మిగిలి తన ప్రాణాల్నే తీసుకుంటున్నాడు. అతని కుటుంబం ఈ గింజలే కరువై రోడ్డున పడుతోంది. మన ఒక్క ఇంట్లో ఒక ముద్దే కదా వృథా అవుతోంది అనుకుంటాం... అలా కొన్ని వందల ఇళ్లల్లో వందల ముద్దలు వృథా అయి కొన్ని వందల మంది నోటి దగ్గరి ముద్దలను లాక్కున్న వాళ్లమవుతున్నాం. అంటే అన్ని వందలమంది అన్నార్తులను సృష్టించిన నేరస్తులమవుతున్నాం. ఎంతోమంది రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాం. వాళ్ల కుటుంబాలను రోడ్డున పడేసిన పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. బహుశా ఇలాంటి బాధను అనుభవించే కావచ్చు.. లేదా రతన్‌టాటాకు ఎదురైన అనుభవాన్ని తెలుసుకొని కావచ్చు.. దుబాయ్‌లో.. బర్‌దుబాయ్‌లోని అల్ కరామా ప్రాంతంలో అజంతా అనే హోటల్ ఉంది. ఆ హోటల్ యజమాని తన దగ్గరకి వచ్చే కస్టమర్స్‌కి 20 ధిరహామ్లకు కావల్సినంత భోజనం పెడ్తాడు. మళ్లీ మళ్లీ పెట్టించుకుంటూ కడుపునిండా తినొచ్చు. కానీ ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. మిగిలిందో, 13 ధిరహామ్స్ ఫైన్ కట్టి వెళ్లాలి. అంటే కావల్సినదానికల్లా ఎక్కువ పెట్టుకొని వదిలేస్తే భోజనం ఖరీదు 20 ధిర్హామ్స్తో పాటు అదనంగా 13 ధిర్‌హామ్స్ మొత్తం ముప్పైమూడు ధిర్‌హామ్స్ చెల్లించి వెళ్లాలి. ఒక్క ధిర్హామ్ విలువ 20 రూపాయలు. 33 ధిర్‌హామ్స్ ఇండియన్ కరెన్సీలో 660 రూపాయలు. ఎందుకీ ప్రాక్టీస్ అంటే ‘పాతికేళ్ల కిందట ఒకసారి నా హోటల్‌కి ఓ నలుగురు యువకులు వచ్చి నచ్చినవాటిని నచ్చినంత ఆర్డర్ చేశారు. కనీసం అందులో పావు భాగమైనా తినకుండా పారేసి వెళ్లిపోయారు. అప్పట్లో నేను రోజుకి యాభై మందికి మీల్స్ సర్వ్ చేసేవాడిని. ఈ నలుగురు వచ్చి వెళ్లాక వారిలో ఏడుగురికి భోజనం పెట్టలేకపోయాను. అంటే ఈ నలుగురు ఏడుగురి భోజనాన్ని వృథా చేసి వెళ్లారు. పాపం ఆ ఏడుగురూ లేబర్స్. నా రెగ్యులర్ కస్టమర్స్. ఆకలితో వెనుదిరిగి వెళ్లిపోయారు. అప్పట్లో అల్కరామాలో ఉన్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ ఇదే. వాళ్లకు ఆ పూటకు తిండే దొరకలేదు. నీకు పట్టినంత నువ్ తిను.. కాని ఇతరులు తినాల్సినదాన్ని నువ్వు వృథా చేసే హక్కు నీకు లేదు అని చెప్పడానికే ఈ రూల్ పెట్టాను ’ అని చెప్పాడు. ఇదీ కథ.. కథలాంటి నిజం. ఆహారాన్ని వృథా చేయడం ఎంత నేరమో చెప్పే గొప్ప అనుభవం. నోటి దగ్గరకు ముద్ద వెళ్లినప్పుడల్లా ప్రతి ఒక్కరికీ గుర్తుకు రావాల్సిన పాఠం. - సరస్వతి రమ -
ఇండియన్ రెస్టారెంట్‌పై కాల్పులు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ భారతీయ రెస్టారెంట్లో దుండగుడు తెగబడ్డాడు. రెస్టారెంట్ పలువురు కస్టమర్లతో రద్దీగా ఉన్న సమయంలో కిటికీలో నుంచి కాల్పులు జరిపి కలకలం సృష్టించాడు. గడిచిన కొద్ది రోజుల్లో ఇది రెండో ఘటన. పశ్చిమ సిడ్నిలోని విగ్రామ్ వీధిలో బిల్లు ఇండియన్ ఈటర్ యాన్ అనే రెస్టారెంట్ ఉంది. ఇది నిత్యం రద్దీగా ఉంటుంది. బ్లూ దుస్తులు ధరించి వచ్చిన ఓ అఘంతకుడు అనూహ్యంగా అంతా బిజిబిజీగా ఉన్న సమయంలో కాల్పులు జరిపాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ ఎవరికి తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నాడు. కాల్పులు జరిపిన దుండగుడు పారిపోయాడు. -
ఇంగ్లండ్‌లో భారతీయ రెస్టారెంట్‌కు అవార్టు
లండన్: ఇంగ్లండ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌కు జాతీయ అవార్డు దక్కింది. లండన్‌లోని జింఖానా 'నేషనల్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపికైంది. ఈ అవార్డు గెల్చుకున్న తొలి భారతీయ రెస్టారెంట్ ఇదే కావడం విశేషం. ఇంగ్లండ్‌లో భారతీయ వంటకాలకు ఈ రెస్టారెంట్ ప్రసిద్ధిగాంచింది. భోజనప్రియులకు భారతీయ వంటకాలను బ్రిటీష్ స్టైల్లో అందిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో జింఖానా రెస్టారెంట్‌ను ఆరంభించారు. అయితే తక్కువ కాలంలో వెరైటీ రుచుల వంటకాలతో మంచి పేరు తెచ్చుకుంది.