మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్‌ రెస్టారెంట్‌ మూసివేత | Indian Restaurant Shuts Down Denying Entry Woman Wearing Veil In Bahrain | Sakshi
Sakshi News home page

మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్‌ రెస్టారెంట్‌ మూసివేత

Published Mon, Mar 28 2022 5:24 PM | Last Updated on Mon, Mar 28 2022 9:10 PM

Indian Restaurant Shuts Down Denying Entry Woman Wearing Veil In Bahrain - Sakshi

తరాలు మారుతున్న ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు వివక్షలను ఎదుర్కుంటున్నారు. తాజాగా ముసుగు ధరించి వచ్చిన ఒక మహిళను ఇండియన్‌ రెస్టారెంట్‌ సిబ్బంది లోనికి అనమతించలేదు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ రెస్టారెంట్‌ని మూసివేశారు. ఈ ఘటన బహ్రెయిన్‌లోని అడ్లియాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అడ్లియాలో ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌ను 1987 నుంచి నిర్వహిస్తున్నారు.

ఇటీవల ఒక మహిళ కస్టమర్‌ ముసుగు ధరించి రెస్టారెంట్‌లోనికి వెళ్తోంది. ఇది గమనించిన రెస్టారెంట్‌ సిబ్బంది ముసుగు ధరించిన కారణంగా ఆమెను లోనికి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (బీటీఈఏ) ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తుకు ఆదేశించింది. ప్రజల పట్ల వివక్ష చూపే ఏ చర్యలైనా తాము అంగీకరించమని, ముఖ్యంగా వారి జాతి వివక్షలాంటివి అసలు సహించమని బీటీఈఏ హెచ్చరించింది. 

చదవండి: Breast Milk Jewellery: తల్లి పాలతో అలా.. ఏడాది సంపాదన ఏకంగా 15 కోట్ల రూపాయలు!!

దర్యాప్తు అనంతరం నిబంధనలు ఉల్లంఘించిందని తేలడంతో ఆ రెస్టారెంట్‌ను అధికారులు మూసివేశారు. రెస్టారెంట్ యాజమాన్యం దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. క్షమాపణ చెప్పడంతో పాటు ఘటనపై విచారం కూడా వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైన రెస్టారెంట్ డ్యూటీ మేనేజర్‌ను కూడా తొలగించింది.  ఈ అందమైన రాజ్యంలోని అన్ని దేశాలకు చెందిన తమ కస్టమర్‌లకు 35 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement