veil
-
అద్దాల ముస్తాబులో, డ్రీమ్ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ (ఫోటోలు)
-
అద్దాల మిలమిలల్లో పెళ్లికూతురి లుక్ వైరల్
ప్రముఖ స్టైలిస్ట్ ఆకృతి సెజ్పాల్ డ్రీమ్ వెడ్డింగ్ నెట్టింట ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె ధరించిన ముసుగు, లెహంగా అతిథులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా మొత్తం అద్దాలతో తయారు చేసిన లెహెంగాలో వధువు ‘ఆకృతి’ మరింత ఆకర్షణగా నిలిచింది.వధువు ఆకృతి సెజ్పాల్ 3డీ డిజైన్, పూర్తిగా పూలతో చేసిన పెళ్లి కూతురు వేసుకునే మేలి ముసుగులను చూశాం. కానీ పూర్తిగా మిర్రర్ వర్క్‌తో రూపొందించడం విశేషంగా నిలిచింది. లెహెంగాకు తోడుగా ఏమాత్రం క్లాత్ వాడకుండా తయారు చేసిన దుపట్టా కమ్ మేలి ముసుగుతో పెళ్లి కళతో కళకళలాడింది ఆకృతి. ఇంకా స్వీట్హార్ట్-నెక్లైన్ బ్లౌజ్, హెవీ లెహంగా స్కర్ట్, ఓపెన్ హెయిర్‌స్టైల్‌పై పిన్ చేసిన షీర్ దుపట్టాలో అందంగా మెరిసిపోయింది. చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ జుమ్కీలు, పాపిట బిళ్లతో తన లుక్‌ను మరింత అద్భుతంగా ముస్తాబైంది.< View this post on Instagram A post shared by Itrh (@itrhofficial)br> -
మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్ రెస్టారెంట్ మూసివేత
తరాలు మారుతున్న ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రజలు వివక్షలను ఎదుర్కుంటున్నారు. తాజాగా ముసుగు ధరించి వచ్చిన ఒక మహిళను ఇండియన్ రెస్టారెంట్ సిబ్బంది లోనికి అనమతించలేదు. ఇది అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ రెస్టారెంట్‌ని మూసివేశారు. ఈ ఘటన బహ్రెయిన్‌లోని అడ్లియాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అడ్లియాలో ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌ను 1987 నుంచి నిర్వహిస్తున్నారు. ఇటీవల ఒక మహిళ కస్టమర్ ముసుగు ధరించి రెస్టారెంట్‌లోనికి వెళ్తోంది. ఇది గమనించిన రెస్టారెంట్ సిబ్బంది ముసుగు ధరించిన కారణంగా ఆమెను లోనికి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (బీటీఈఏ) ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తుకు ఆదేశించింది. ప్రజల పట్ల వివక్ష చూపే ఏ చర్యలైనా తాము అంగీకరించమని, ముఖ్యంగా వారి జాతి వివక్షలాంటివి అసలు సహించమని బీటీఈఏ హెచ్చరించింది. చదవండి: Breast Milk Jewellery: తల్లి పాలతో అలా.. ఏడాది సంపాదన ఏకంగా 15 కోట్ల రూపాయలు!! దర్యాప్తు అనంతరం నిబంధనలు ఉల్లంఘించిందని తేలడంతో ఆ రెస్టారెంట్‌ను అధికారులు మూసివేశారు. రెస్టారెంట్ యాజమాన్యం దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. క్షమాపణ చెప్పడంతో పాటు ఘటనపై విచారం కూడా వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైన రెస్టారెంట్ డ్యూటీ మేనేజర్‌ను కూడా తొలగించింది. ఈ అందమైన రాజ్యంలోని అన్ని దేశాలకు చెందిన తమ కస్టమర్లకు 35 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. -
వైరల్: కరోనా టెస్టుకు సిగ్గుపడిన కొత్త పెళ్లి కూతురు
లక్నో: కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య అధికారులు రాగా ఈ సమయంలో తమ అమ్మాయి ముఖంపై కొంగు తీయమని అడగడంతో వారి బంధువులు దాడి చేశారు. దాడి చేయడంతో వైద్య అధికారులు గాయాలపాలయ్యారు. దీనికంతటికీ కారణం ఆమె నవవధువు. పరీక్ష చేసేందుకు అధికారులను చూసి సిగుపడి తలపై కొంగు తీయకపోవడమే. వధువు నివాసానికి పరీక్ష కోసం వచ్చిన వైద్య అధికారులు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లా షాహ్‌నగర్ సరౌలా గ్రామంలో మంగళవారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చారు. ఈ సమయంలో 37 మందికి పరీక్షలు నిర్వహించి మరికొందరికి చేస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయి వచ్చింది. పరీక్ష చేయించుకునేందుకు సిగుపడింది. తలపై కొంగుతోనే అధికారుల వద్దకు వచ్చింది. కరోనా పరీక్ష చేసేందుకు ఆమెను కొంగు తీసేయమని అధికారులు అడిగారు. అయితే ఆమె సిగ్గుతో అలానే ఉండిపోయింది. దీంతో పక్కనున్న వారిని బయటకు వెళ్లమని అడిగారు. కొంగు తీసేందుకు నిరాకరించడంతో అక్కడ ఉన్న పురుషులను దూరంగా వెళ్లమని చెప్పారు. దీంతో గ్రామస్తులు వైద్య అధికారులపై దాడి చేశారు. వీరి దాడిలో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు.. దాడి అనంతరం విచారణ చేస్తున్న పోలీసులు -
వామ్మో.. ఇదేం డ్రెస్ తల్లి..!
నికోసియా: వివాహ వేడుకలు కొత్త పోకడలు పోతున్నాయి. పంచ భూతాల సాక్ష్యిగా అన్నట్లు గాలి, నింగి, నీరు, ఆకాశం ఇలా రకరకాల వేదికల మీద పెళ్లిల్లు జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వేలం వెర్రి వేషాలు వేసేవారు బాగా పెరిగారు ఈ మధ్య కాలంలో. ఇక పెళ్లి బట్టల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. స్థాయికి తగ్గట్లు విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఇంత ఖరీదు పెట్టి కొన్న దుస్తులను మళ్లీ వాడతారా అంటే చాలా వరకు లేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే తాజాగా ఓ మహిళ తన పెళ్లి డ్రెస్‌తో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వెయిల్(పాశ్యాత్య వివాహ వేడుకలో పెళ్లి కుమార్తె తల మీద ధరించే వస్త్రాన్ని వెయిల్ అంటారు) ధరించిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ఇది ఎంత పొడవు ఉందంటే..6962.6 మీటర్లు. అంటే ఒకటీ కాదు రెండూ కాదు ఏకంగా 63 ఫుట్‌బాల్ స్టేడియాల పొడవుతో సమానం అన్నమాట. మరి అంత పొడువున్న ఆ వస్త్రాన్ని ఆమె ఎలా ధరించింది అంటే.. రికార్డు కోసం ఆ మాత్రం చేయక తప్పదు కదా అంటుంది. సైప్రస్‌కు చెందిన మరియా పరస్కేవా తన వెడ్డింగ్ డ్రెస్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మరియా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నా కల ఒక్కటే. నా వివాహంలో ప్రపంచంలోనే అతి పెద్ద వెయిల్ ధరించి గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయాలనేది నా కోరిక. ఈ రోజు అది నిజమయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపింది. ఈ వెయిల్ డిజైన్ చేయడం కోసి మరియా 7,100 మీటర్ల క్లాత్ కొనుగోలు చేసింది. గ్రీస్‌కు చెందిన ఓ కంపెనీ దాదాపు మూడు నెలల పాటు కష్టపడి దీన్ని డిజైన్ చేసింది. నిపుణులైన టైలర్లు స్వయంగా చేతులతో ఈ ముక్కలను కలిపి పూర్తి అతిపెద్ద వెయిల్‌ను రూపొందించారు. వివాహం జరిగిన స్టేడియం మొత్తాన్ని ఈ వెయిల్ కప్పేసింది. ఆ వస్త్రాన్ని మైదానంలో అమర్చడానికి 30 మంది వలంటీర్లు 6 గంటల పాటు కష్టపడ్డారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు అన్ని సుఖసంతోషాలతో ఆమె వైవాహిక జీవితం ఇంతే సుదీర్ఘగంగా కొనసాగాలని కోరుకుంటున్నారు. మరి కొందరేమో ఆ వెయిల్ని కాస్త పైకి లేపితే టెంట్లా మారుతుంది. ఎంచక్క ఎండ కొట్టకుండా ఉంటుంది అంటూ జోక్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) చదవండి: హవ్వా!! పిచ్చి పనికి గిన్నిస్ రికార్డా.. -
జర్మనీలో కూడా బురఖా నిషేధం!
బెర్లిన్: పశ్చిమ యూరప్ దేశమైన జర్మనీలో ముస్లిం మహిళలు ధరించే బురఖాను నిషేధించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. జర్మనీ లాంటి ఓపెన్ సొసైటీలో ముఖానికి కళ్లు మాత్రమే కనిపించే బురఖాలెందుకని జర్మనీ హోమ్ శాఖ మంత్రి థామస్ డీ మైజిరి శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు. బురఖా ధరించడంపై నిషేధం విధించేందుకు జర్మనీ రాజ్యాంగం అనుమతిస్తుందా, లేదా అన్న అంశాన్ని అధికారులు తాజాగా పరిశీలిస్తున్నారు. లేదంటే రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ‘మనం సామరస్యపూర్వక సమాజంలో నివసిస్తున్నాం. ముఖాలు ముఖాలు చూసుకొంటూనే పరస్పరం సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాం. అలాంటప్పుడు ఒక్క బురఖానే కాదు, ఏ వస్త్రంతో కూడా ముఖాన్ని మూసుకునేందుకు ప్రయత్నించకూడదు. ప్రతి ఒక్కరు తమ ముఖాలను బహిర్గతం చేయాల్సిందే’ అని మంత్రి థామస్ చేసిన వ్యాఖ్యలు బురఖా నిషేధంవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని సూచిస్తున్నాయి. ప్రదర్శనలు, ఆందోళనల సందర్భంగా నిరసనకారులు ముఖాలు కనిపించకుండా ఎలాంటి ముసుగులు ధరించకూడదనే నిషేధం జర్మనీలో ఇప్పటికే అమల్లో ఉంది. విద్యా సంస్థలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖాలకు బురఖాలు ధరించరాదని ఛాన్సలర్ ఆంజెలా మెర్కెల్ పాలకపక్ష సభ్యులు ఇప్పటికీ ప్రతిపాదనలు చేశారు. జర్మనీ సహా పలు యూరప్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు దాడులు జరిపిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. -
ఆడవాళ్లు అలానే బావుంటారట!
ముంబై: 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' సినిమాతో బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన హీరో ధర్మేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల అందం గోప్యంగా ఉంటేనే బాగుంటుందట. 'టూ మచ్' ఓపెన్‌గా ఉండడం అనేది కొంతకాలం తర్వాత బోర్ కొడుతుందనీ, రహస్యంగా ఉంటేనే బాగుంటుందన్నారు. చక్కగా బొట్టు పెట్టుకుని, నిండా ముసుగు కప్పుకొని ఉంటే ఆడవాళ్ల అందం మరింత ఇనుమడిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకటి తరం హీరోయిన్లు పొడుగు జాకెట్లతో పూర్తిగా శరీరాన్ని కవర్ చేసేలా, నిండుగా ఉండేవారని పేర్కొన్నారు. ఇపుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. అంతమాత్రాన ప్రస్తుత ట్రెండ్‌ను తాను విమర్శించడం లేదని.. తాను ఎవరినీ తప్పుబట్టడం లేదంటూ సమర్థించుకున్నారు. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తన సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకున్న ధర్మేంద్ర ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వగలాడి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా బుక్ చేసే కథాంశంతో రూపొందిన సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ మంచి సినిమా అవుతుందన్నారు. అసభ్యతకు తావు లేకుండా సినిమాను నిర్మించామంటూ చెప్పుకొచ్చారు. హిందీలో అనేక యాక్షన్, థ్రిల్లర్ సినిమాల్లో కథానాయకుడిగా నటించిన ధర్మేంద్ర ... అలనాటి హీరోయిన్ హేమమాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. -
అమ్మాయిలు స్కార్ఫ్ కడితే ఇక జైలుకే!
సత్నా: అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని కనిపించారా ...ఇక వాళ్లు జైలుకి వెళ్లాల్సిందే. అదేంటి స్కార్ఫ్ కడితే జైలుకి పంపిస్తారా అని ఆశ్చర్యపోతున్నారా? మధ్యప్రదేశ్‌లోని సత్నాలో అయితే అంతేమరి. అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని బయట కనపడితే పోలీసులకు అప్పగిస్తామంటూ సాత్నా మేయర్ మమతా పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటి ఆగకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లే అమ్మాయిలెవరైనా ముఖంపై ముసుగుతో కనపడితే సత్నా మున్సిపల్ కార్పొరేషన్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. 'హిందు సంప్రదాయం ప్రకారం మహిళలు తలపై కొంగు, ముస్లిం సంప్రదాయమైతే బురఖా ధరించడం, ఇతర మతాలకు చెందిన స్త్రీలు తమ తల భాగాన్ని ఏదైనా బట్టతో కప్పుకోవడం లాంటివి చేస్తారు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించడం లేదని, సంప్రదాయాలను అమ్మాయిలు మరిచి దొంగల తరహాలో ముఖాన్ని ముసుగుతో కప్పి ఉంచుతున్నారంటూ మేయర్ ... మీడియా సమావేశంలో వివాదాలకు తావిచ్చే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇంకా కొన్ని ఆశ్చర్యకర వ్యాఖ్యలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నానంటూ మీడియాతో మాట్లాడారు. ముసుగు ధరించి నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయని, ఇటువంటి చర్యలను అరికట్టాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందంటూ చెప్పుకొచ్చారు. మహిళలెవరైనా ఎండ నుంచి ఉపశమనం పొందాలని భావిస్తే అటువంటి వారు గొడుగు వెంట తీసుకెళ్లాలని, లేదంటే చిన్న బట్టతో ముఖాన్ని కప్పేలా చూసుకోవాలని సూచించారు. కానీ మహిళ ఎవరన్నది గుర్తించేలా మాత్రమే ప్రత్యామ్నాయం చూసుకోవాలని, సూర్యాస్తమయం తరువాత ముఖాన్ని కప్పిఉంచరాదంటూ మేయర్ ఆజ్ఞలు జారీచేశారు. కాగా మేయర్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జబల్పూర్ హైకోర్టు సీనియర్ లాయర్ మట్లాడుతూ... స్కార్ఫ్ ఉపయోగించడంపై ఆదేశాలు జారీ చేయడానికి మేయర్‌కు ఎటువంటి హక్కులు లేవని అన్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం కేవలం పోలీసులకు మాత్రమే ముసుగు లేదా స్కార్ఫ్ ధరించిన వారి విషయంలో కలుగజేసుకోవడానికి, ఏదైనా చర్య తీసుకోవడానికి అధికారం ఉందని లాయర్ తెలిపారు.