![Uttar Pradesh: Newly Married Woman Refuses To Lift Veil, Villagers Attacked - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/18/Veil-Attack-UP-2.gif.webp?itok=g8RZ42ob)
లక్నో: కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య అధికారులు రాగా ఈ సమయంలో తమ అమ్మాయి ముఖంపై కొంగు తీయమని అడగడంతో వారి బంధువులు దాడి చేశారు. దాడి చేయడంతో వైద్య అధికారులు గాయాలపాలయ్యారు. దీనికంతటికీ కారణం ఆమె నవవధువు. పరీక్ష చేసేందుకు అధికారులను చూసి సిగుపడి తలపై కొంగు తీయకపోవడమే.
వధువు నివాసానికి పరీక్ష కోసం వచ్చిన వైద్య అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లా షాహ్‌నగర్ సరౌలా గ్రామంలో మంగళవారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చారు. ఈ సమయంలో 37 మందికి పరీక్షలు నిర్వహించి మరికొందరికి చేస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయి వచ్చింది. పరీక్ష చేయించుకునేందుకు సిగుపడింది. తలపై కొంగుతోనే అధికారుల వద్దకు వచ్చింది.
కరోనా పరీక్ష చేసేందుకు ఆమెను కొంగు తీసేయమని అధికారులు అడిగారు. అయితే ఆమె సిగ్గుతో అలానే ఉండిపోయింది. దీంతో పక్కనున్న వారిని బయటకు వెళ్లమని అడిగారు. కొంగు తీసేందుకు నిరాకరించడంతో అక్కడ ఉన్న పురుషులను దూరంగా వెళ్లమని చెప్పారు. దీంతో గ్రామస్తులు వైద్య అధికారులపై దాడి చేశారు. వీరి దాడిలో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు..
దాడి అనంతరం విచారణ చేస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment