Aligarh district
-
షాకింగ్ వీడియో.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. ఆ తర్వాత..
వానా కాలంలో మ్యాన్‌హోల్స్ తెరిచి ఉండటం అందులో వాహనదారులు పడిపోవడం మనం చూసే ఉంటాము. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఓ పోలీసు దంపతులు నీటి గుంతలో పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. అలీఘఢ్‌లోని కిషన్పూర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా అక్కడి వీధులు, రోడ్డు వరద నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో వరద నీరు వెళ్లిపోయేందుకు అధికారులు మ్యాన్‌హోల్స్ తెరిచిపెట్టారు. అయితే, మ్యాన్‌హెల్స్ వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరికలు పెట్టకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. పోలీసు అధికారి దయానంద్ సింగ్ అత్రి, ఆయన భార్య అంజు అత్రి దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. స్కూటీపై ఆసుపత్రికి వెళ్లిన దంపతులు తమ వాహనాన్ని రోడ్డు పక్కగా పార్క్ చేసేందుకు వెళ్లే క్రమంలో తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో స్కూటీతో పాటు పడిపోయారు. దీంతో వారిద్దరూ మ్యాన్‌హెల్‌లో మునిగిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని కాపాడారు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Visuals from UP's Aligarh. Leaving this here. pic.twitter.com/bOhACL96IW — Piyush Rai (@Benarasiyaa) June 18, 2022 ఇది కూడా చదవండి: పది రూపాయాల నాణేలతో కారు కొనుగోలు...కారణం వింటే ఆశ్చర్యపోతారు! -
కల్తీమద్యం తాగి 15 మంది మృతి
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 15 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చేర్పించారు. కర్సియాలోని ఓ లైసెన్స్డ్ అమ్మకందారుడి దుకాణం నుంచి కొనుగోలు చేసిన కల్తీ మద్యం తాగడం వల్లే వారంతా మరణించినట్లు అధికారులు చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. దోషులుగా తేలిన వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని జిల్లా కలెక్టర్ చంద్ర భూషణ్ సింగ్ స్పష్టం చేశారు. లోథా పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు మరణాలు సంభవించాయి. కర్సియాలో మరో 6 మంది మరణించినట్లు సమాచారం అందింది. వీరంతా ఒకే చోట మద్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు చెప్పారు. మరికొంత మంది సైతం అస్వస్థతకు గురికాగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లిక్కర్ షాపు సీజ్ చేసి శాంపిల్స్‌ను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక ఎక్సైజ్ విభాగం అడిషనల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, హెడ్ కాన్‌స్టేబుల్‌లను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై శాఖాసంబంధిత విచారణ ప్రారంభమైనట్లు తెలిపారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. -
వైరల్: కరోనా టెస్టుకు సిగ్గుపడిన కొత్త పెళ్లి కూతురు
లక్నో: కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య అధికారులు రాగా ఈ సమయంలో తమ అమ్మాయి ముఖంపై కొంగు తీయమని అడగడంతో వారి బంధువులు దాడి చేశారు. దాడి చేయడంతో వైద్య అధికారులు గాయాలపాలయ్యారు. దీనికంతటికీ కారణం ఆమె నవవధువు. పరీక్ష చేసేందుకు అధికారులను చూసి సిగుపడి తలపై కొంగు తీయకపోవడమే. వధువు నివాసానికి పరీక్ష కోసం వచ్చిన వైద్య అధికారులు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లా షాహ్‌నగర్ సరౌలా గ్రామంలో మంగళవారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చారు. ఈ సమయంలో 37 మందికి పరీక్షలు నిర్వహించి మరికొందరికి చేస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయి వచ్చింది. పరీక్ష చేయించుకునేందుకు సిగుపడింది. తలపై కొంగుతోనే అధికారుల వద్దకు వచ్చింది. కరోనా పరీక్ష చేసేందుకు ఆమెను కొంగు తీసేయమని అధికారులు అడిగారు. అయితే ఆమె సిగ్గుతో అలానే ఉండిపోయింది. దీంతో పక్కనున్న వారిని బయటకు వెళ్లమని అడిగారు. కొంగు తీసేందుకు నిరాకరించడంతో అక్కడ ఉన్న పురుషులను దూరంగా వెళ్లమని చెప్పారు. దీంతో గ్రామస్తులు వైద్య అధికారులపై దాడి చేశారు. వీరి దాడిలో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు.. దాడి అనంతరం విచారణ చేస్తున్న పోలీసులు -
10 రోజుల కష్టంతో తండ్రి శవం సాధించిన బాలుడు
లక్నో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో విషాద.. అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా కథలు ఎన్ని చెప్పిన తక్కువే. తాజాగా ఓ ఆస్పత్రి అధికారులు కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం అప్పగించకుండా పది రోజులుగా మార్చురీలోనే పడేశారు. మృతుడికి సంబంధించిన బంధువులు రాలేదంట.. వచ్చిన అతడి కుమారుడు మైనర్ బాలుడు కావడంతో అతడికి మృతదేహం అప్పగించడం కుదరదని అధికారులు చెప్పారు. దీంతో ఆ పిల్లాడు కాళ్లరిగేలా తండ్రి మృతదేహం తీవ్రంగా కష్టపడ్డాడు. చివరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలగజేసుకోవడంతో ఎట్టకేలకు తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఉన్న దీన్‌దయాల్ ఆస్పత్రికి రోజువారీ కూలీ రాజు ఏప్రిల్ 21వ తేదీన వచ్చాడు. ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్ 23వ తేదీన మృతి చెందాడు. దీంతో కొడుకు తన తండ్రి మృతదేహం అప్పగించాలని అధికారులను కోరాడు. అయితే పిల్లాడు మైనర్ కావడంతో అధికారులు శవం అప్పగించడానికి నిరాకరించారు. ఎవరైనా పెద్దవారిని తీసుకురా అని చెప్పాడు. అయితే ఆ బాలుడికి తండ్రి తప్ప నా అనేవారు ఎవరూ లేరు. బంధువులను బతిమిలాడాడు. అయితే కరోనా భయంతో మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో పది రోజులుగా రాజు మృతదేహం ఆస్పత్రి మార్చురీలోనే ఉండిపోయింది. చివరకు స్థానికుడు మహేశ్ స్పందించి ఎమ్మెల్యే అనిల్ పరషార్, ఎమ్మెల్సీ మాన్వేంద్ర ప్రతాప్ సింగ్ సహాయంతో ఆ బాలుడి తండ్రి మృతదేహాన్ని పది రోజుల అనంతరం బయటకు తీసుకువచ్చారు. అయితే తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు బాలుడి వద్ద డబ్బు కూడా లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి అంత్యక్రియలను జరిపించారు. ఈ విధంగా తండ్రి మృతదేహం కోసం ఆ బాలుడు తీవ్రంగా కష్టపడి చివరకు అతికష్టమ్మీద తన తండ్రికి పున్నామ నరకం నుంచి తప్పించాడు. అయితే ఆస్పత్రి అధికారులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలుడి తండ్రి మృతదేహం అప్పగించడంలో నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే -
స్వేచ్ఛ కోసం ఇల్లు వదిలింది.. మృగాడికి బలయ్యింది
లక్నో: ‘‘అసలే రోజులు బాగాలేవు.. ఒంటరిగా బయటకు వెళ్లకూడదు.. స్నేహితులు, షికార్లు అంటూ బయట తిరగడం మంచిది కాదు.. అసలు ఎవర్ని నమ్మేలా లేవు రోజులు’’ అంటూ తల్లిదండ్రులు ఆంక్షలు పెడుతుండటం ఆ యువతికి నచ్చలేదు. ఇల్లు జైలులా కనిపించింది. దాంతో ఇంటి నుంచి బయపటడి.. స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు జీవించాలని ఆశించింది. ఈ క్రమంలో అర్థరాత్రి అందరూ నిద్రిస్తుండగా.. ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆంక్షలున్నప్పటికి ఇంట్లో ఉన్నంత కాలం సురక్షింతగా ఉన్న యువతి బయట అడుగుపెట్టిన మరుక్షణమే మృగాడి చేతికి చిక్కి.. అత్యాచారానికి గురయ్యింది. బాధితురాలిని కాపాడటం కోసం వచ్చిన ఆమె అంకుల్‌పై నిందితుడు కత్తితో దాడి చేశాడు. వివారాలు.. ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన బాధితురాలు ఇంట్లో తనకు ఫ్రీడం ఇవ్వటం లేదని భావించి.. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తుండగా.. కారులో అటుగా వెళ్తోన్న నిందితుడు యువతి దగ్గరకు వచ్చి.. కత్తితో బెదిరించి కారులో తీసుకెళ్లాడు. అరిస్తే చంపేస్తానంటూ హెచ్చరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెని వెతకడం ప్రారంభించారు. వీరిని గమనించిన యువతి సాయం కోసం పెద్దగా ఏడ్వడం ప్రారంభించింది. దాంతో బాధితురాలి అంకుల్ ఆమెని కాపాడటం కోసం.. పరిగెత్తాడు. ఈ క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు. ఈలోపు మిగతా కుటుంబ సభ్యులు అక్కడకు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఛీఛీ ఇదేం పని, 7వ తరగతి పిల్లాడితో ముగ్గురు పిల్లల తల్లి.. -
బాలుడిపై మైనర్ల లైంగికదాడి.. రూ. 20 ఇచ్చి
లక్నో: పదమూడేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు ఇద్దరు మైనర్లు. ఆపై, విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. కానీ ఇంటికి చేరుకున్న బాధితుడి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు అతడిని నిలదీయగా నిజం బయటపడింది. ఈ అమానుషకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. వివరాలు.. అలీఘడ్ జిల్లాలోని లోధా ప్రాంతానికి చెందిన బాలుడిని అతడి తండ్రి స్థానిక మార్కెట్‌కు పంపించాడు. వ్యవసాయ ఉత్పత్తులు కొని తీసుకురమ్మని చెప్పాడు. బాధితుడు ఒంటరిగా వెళ్తున్న విషయాన్ని గమనించిన ఇద్దరు టీనేజర్లు, తనకు తోడుగా ఉంటామంటూ బయల్దేరారు. ఈ క్రమంలో అతడిని సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, రూ. 20 తీసుకుని సైలెంట్‌గా ఉండాలంటూ నోరు మూయించారు. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత ముభావంగా ఉన్న బాలుడిని చూసి తండ్రి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో ఆయన వెంటనే పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితులు ఇద్దరు తమ కుటుంబానికి బాగా తెలిసిన వాళ్లేనని, పిల్లాడి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గురువారం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కూతురి తల నరికిన తండ్రి.. అందుకే చంపానంటూ చిత్ర హింసలు భరించలేను.. చచ్చిపోతున్నా నాన్నా! -
ఆలయాలు, మసీదుల వెలుపల వాటిపై నిషేధం
లక్నో : కొన్ని మత సంస్థలు వీధుల్లో హనుమాన్ చాలీసా చదవడం, మహా హారతి ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే వార్తలు రావడంతో వీధుల్లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని అలీగఢ్ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ముస్లింలు రోడ్లపై నమాజ్ చేస్తుండటంతో అందుకు ప్రతిగా కొన్ని హిందూ సంస్థలు రహదారులపై మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే సమాచారాన్ని అలీగఢ్ జిల్లా మేజిస్ర్టేట్ చంద్ర భూషణ్ సింగ్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. దీంతో ఇరు మతాల పెద్దలతో సమావేశమైన జిల్లా మేజిస్ర్టేట్ రోడ్లపై ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. వీధుల్లో కాకుండా దేవాలయాలు, మసీదుల్లో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలని ఆయా సంస్థలు, సంఘాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలీగఢ్ సమస్యాత్మక ప్రాంతమైనందున ఎలాంటి మతపరమైన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టేముందు నిర్వాహకులు అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. -
చిన్నారి హత్యోదంతం : సిట్ ఏర్పాటు
లక్నో : పది వేల రూపాయల అప్పు తీర్చలేదన్న కోపంతో.. రెండున్నరేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాగ్రహానికి భయపడిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసును త్వరితగతిన విచారణ చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ దారుణం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో పోలీసులు నిందితుల మీద జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తుందని ఎస్ఎస్పీ ఆకాశ్ కుల్హరి తెలిపారు. ఇప్పటికే శాంపిల్స్‌ను ఆగ్రా ఫోరెన్సిక్ లాబ్‌కు పంపించామన్నారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఇప్పటికే ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అంతేకాక చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాహీద్, అస్లాం అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిపై లైంగిక దాడి జరగలేదని.. పోస్ట్ మార్టమ్ రిపోర్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని పోలీసులు తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందుతుల మీద జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ క్రమంలో నిందితుల కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయాల్సిందిగా మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. వారికి తెలియకుండా ఈ హత్య జరిగి ఉండదని అతను ఆరోపిస్తున్నాడు. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని.. వారిని అరెస్ట్ చేయకపోతే.. తనను కూడా చంపేస్తారని బాలిక తండ్రి ఆరోపించాడు. -
మార్ఫింగ్ చేశాడని.. అరగుండు
అలీగఢ్: అమ్మాయిలను వేధిస్తూ వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడన్న ఆరోపణలతో ఓ యువకున్ని చితకబాది, అరగుండు చేసిన ఘటన యూపీలోని సహారాఖుడ్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఈ నెల 5న వఖీల్ అనే యువకున్ని కొందరు స్థానికులు కొట్టి, అరగుండు గీయించి ఊరేగించిన తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అయింది. వఖీల్ కుటుంబ సభ్యులు ఆ వీడియోను తీసుకొని వెళ్లి జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కోరారు. జిల్లా కలెక్టర్ చంద్రభూషణ్ మాట్లాడుతూ.. ‘వీడియోలో ఓ యువకున్ని కొట్టి గుండు గీయించిన సంఘటన ఉందని, దీని గురించి విచారణ చేపట్టాల్సిందిగా ఇన్స్పెక్టర్కు ఆదేశాలు ఇచ్చామ’ని అన్నారు. దీనిపై ఇబ్రహీం హుస్సేన్ అనే సామాజిక కార్యకర్త స్పందిస్తూ వఖీల్ అమాయకుడని, ఎవరో అతని ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి ఈ పని చేశారని అన్నారు. కొంతమంది వఖీల్ను ఇంట్లో నుంచి కొట్టుకుంటూ ఓ కాలువ దగ్గరకి తీసుకెళ్లారని, నిజానికి అతన్ని అక్కడే చంపాలనుకున్నారని కానీ అదృష్టవశాత్తూ వేరే వారు ఆపడంతో ప్రాణాలతో మిగిలాడన్నారు. దాడి చేసిన అల్లరి మూకలు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే వఖీల్ జైల్లో ఉన్నాడన్నారు. అతడికి ఇప్పటికీ ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. -
జిన్నా ఫొటోను కాల్చినా, చించినా లక్ష నజరానా
అలీగఢ్ : మహమ్మద్ అలీ జిన్నా చిత్రపట వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న జిన్నా చిత్రపటాన్ని వెంటనే తొలగించాలని ఆల్ ఇండియా ముస్లిం మహాసంఘ్ అధ్యక్షుడు ఫర్హత్ అలీఖాన్ డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడైనా జిన్నా ఫొటోలను కాల్చినా, చించినా వారికి ఏకంగా రూ. లక్ష బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. దేశాన్ని పాకిస్తాన్, హిందూస్తాన్‌గా విడగొట్టిన వ్యక్తి ఫొటోలను ఎందుకు ఉంచుకోవాలని అన్నారు. పాకిస్తాన్లో ఏ ప్రభుత్వ కార్యాలయంలోగాని, యూనివర్సిటీల్లోగాని అఖండ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మన నాయకులు గాంధీ, నెహ్రుల చిత్రపటాలను ఉంచారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు మనం ఎందుకు జిన్నా చిత్రపటాన్ని ఉంచాలని అన్నారు. దేశంలోని అందరూ జిన్నా ఫొటోను కాల్చినా, చించినా వారికి రూ.లక్ష నగదు పురస్కారం అందిస్తామని వెల్లడించారు. అయితే ఈ వివాదాన్ని మొదట బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ లేవనెత్తిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలోని సూడెంట్స్ యూనియన్ హాల్లో జిన్నా ఫొటోను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో కొంతమంది బీజేపీ కార్యకర్తలు యూనివర్సిటీ ముందు ధర్నాలు కూడా నిర్వహించారు. దీనిపై యూనివర్సిటీ వీసీ వివరణ ఇస్తూ.. యూనివర్సిటీ స్థాపనకు నిధులు దానం చేసిన వారిలో జిన్నా ఒకరని, అందుకే ఆయన చిత్రపటాన్ని ఉంచామని, ఆయనతోపాటు గాంధీ, నెహ్రు లాంటి మహా నాయకుల చిత్రపటాలను కూడా ఉన్నాయని తెలిపారు. -
జిన్హ్నా ఫొటోను కాల్చినా, చించినా భారీ నజరానా
-
బాలుడిపై పైశాచికం
న్యూఢిల్లీ: 14 ఏళ్ల దళిత బాలుడిని కొందరు బట్టలు ఊడదీసి, దుర్భాషలాడుతూ కొట్టడమే కాకుండా అతనిపై మూత్ర విసర్జన చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలోని పిల్ఖానా గ్రామంలో చోటుచేసుకుంది. దళితుల సమస్యలపై మాట్లాడేందుకు రాజ్యసభలో తనను అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ చీఫ్ మాయావతి తన సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాతి రోజే ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. 8 మంది బాలురు తన చేతులను కట్టేసి దుస్తులు తొలగించారని బాధిత బాలుడు ఆరోపించాడు. తనను వదిలిపెట్టమని ఎంతగా ప్రాధేయపడినా వారు కనికరించకుండా కొట్టారని, చివరకు తనపై మూత్ర విసర్జన చేసి విడిచిపెట్టారని గోడు చెప్పుకున్నాడు. తనను దుర్భాషలాడుతూ దళితుడినని పదేపదే హేళన చేశారని, వారిలో ఒకడు ఈ తతంగాన్ని అంతా వీడియో తీశాడని చెప్పాడు. నిందితులందరినీ అరెస్ట్ చేశామని అలీగఢ్ ఎస్పీ రాజేశ్ పాండే తెలిపారు.