అరగుండుతో వఖీల్
అలీగఢ్: అమ్మాయిలను వేధిస్తూ వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడన్న ఆరోపణలతో ఓ యువకున్ని చితకబాది, అరగుండు చేసిన ఘటన యూపీలోని సహారాఖుడ్ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. ఈ నెల 5న వఖీల్ అనే యువకున్ని కొందరు స్థానికులు కొట్టి, అరగుండు గీయించి ఊరేగించిన తర్వాత పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అయింది. వఖీల్ కుటుంబ సభ్యులు ఆ వీడియోను తీసుకొని వెళ్లి జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కోరారు. జిల్లా కలెక్టర్ చంద్రభూషణ్ మాట్లాడుతూ.. ‘వీడియోలో ఓ యువకున్ని కొట్టి గుండు గీయించిన సంఘటన ఉందని, దీని గురించి విచారణ చేపట్టాల్సిందిగా ఇన్‌స్పెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామ’ని అన్నారు.
దీనిపై ఇబ్రహీం హుస్సేన్ అనే సామాజిక కార్యకర్త స్పందిస్తూ వఖీల్ అమాయకుడని, ఎవరో అతని ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి ఈ పని చేశారని అన్నారు. కొంతమంది వఖీల్‌ను ఇంట్లో నుంచి కొట్టుకుంటూ ఓ కాలువ దగ్గరకి తీసుకెళ్లారని, నిజానికి అతన్ని అక్కడే చంపాలనుకున్నారని కానీ అదృష్టవశాత్తూ వేరే వారు ఆపడంతో ప్రాణాలతో మిగిలాడన్నారు. దాడి చేసిన అల్లరి మూకలు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే వఖీల్ జైల్‌లో ఉన్నాడన్నారు. అతడికి ఇప్పటికీ ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment