Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్‌ వీడియో | Mahakumbh 2025: Garland Selling beautiful girl with Amber Eyes and Dusky Skin | Sakshi
Sakshi News home page

Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్‌ వీడియో

Published Sat, Jan 18 2025 3:32 PM | Last Updated on Sat, Jan 18 2025 4:46 PM

Mahakumbh 2025: Garland Selling beautiful girl with Amber Eyes and Dusky Skin

మోనాలిసా ఆఫ్ మహాకుంభ్‌ 

ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతు మహాకుంభమేళా సాగుతోంది, పవిత్ర త్రివేణిసంగమానికి కోట్లదిమంది భక్తులు తరలివస్తున్నారు.  భక్తజన సందోహం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించు కుంటోంది. ఈ మేళాలో ఇప్పటికే దేశానికి చెందిన సాధువులతో పాటు, విదేశాలకుచెందిన సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా  పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నెట్‌ను  ఆకర్షిస్తోంది.

ఇండోర్ నుండి  మహాకుంభమేళాకు వచ్చిన యువతి  నెట్టింట సంచలనంగా మారింది. ఆమె తేనె రంగు కళ్లతో డస్కీ బ్యూటీ వెలిగిపోతోంది. కోటేరు ముక్కు, చంద్రబింబం లాంటి మోము, తేజస్సుతో వెలిగిపోతున్న కళ్లు ‘మోనాలిసా’ ను తలపిస్తోంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వుతో, పొడవాటి, సిల్కీ, జడ జుట్టు అద్బుతమైన ఆమె సౌందర్యానికి మరింత వన్నెతీసుకొచ్చింది.


దీంతో మేళాకు హాజరయ్యే ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, ఆమెతో సెల్ఫీలు , వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు  నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై  ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోనాలిసా ఆఫ్ మహాకుంభ్’,    ‘ఏంజలీనా జోలీ’, ‘‘ఎంత అందమైన కళ్లు’’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ‘‘ఎందుకలా  ఆమె వెంటపడుతున్నారు.. సిగ్గుచేటు" అంటూ మరికొంతమంది కమెంట్‌ చేశారు. (Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్‌ ఎట్రాక్షన్‌, ఎవరీ బాహుబలి)

కాగా ఈ ఏడాది మహాకుంభమేళాలో  ఐఐటీ బాబా,  విదేశీ బాబా,అందమైన సాధ్వి, కండల బాబా ఇలా చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి  హర్యానాకు  చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యాకు చెందిన బాబా  కండలు దీరిన  దేహంతో  మహాకుంభమేళాలో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.

 

 

పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా  ఈ ఏడాది జనవరి 13 సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది తరలి వస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement