morphed pic of girl
-
మార్ఫింగ్ చేశాడని.. అరగుండు
అలీగఢ్: అమ్మాయిలను వేధిస్తూ వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడన్న ఆరోపణలతో ఓ యువకున్ని చితకబాది, అరగుండు చేసిన ఘటన యూపీలోని సహారాఖుడ్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఈ నెల 5న వఖీల్ అనే యువకున్ని కొందరు స్థానికులు కొట్టి, అరగుండు గీయించి ఊరేగించిన తర్వాత పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అయింది. వఖీల్ కుటుంబ సభ్యులు ఆ వీడియోను తీసుకొని వెళ్లి జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కోరారు. జిల్లా కలెక్టర్ చంద్రభూషణ్ మాట్లాడుతూ.. ‘వీడియోలో ఓ యువకున్ని కొట్టి గుండు గీయించిన సంఘటన ఉందని, దీని గురించి విచారణ చేపట్టాల్సిందిగా ఇన్స్పెక్టర్కు ఆదేశాలు ఇచ్చామ’ని అన్నారు. దీనిపై ఇబ్రహీం హుస్సేన్ అనే సామాజిక కార్యకర్త స్పందిస్తూ వఖీల్ అమాయకుడని, ఎవరో అతని ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి ఈ పని చేశారని అన్నారు. కొంతమంది వఖీల్ను ఇంట్లో నుంచి కొట్టుకుంటూ ఓ కాలువ దగ్గరకి తీసుకెళ్లారని, నిజానికి అతన్ని అక్కడే చంపాలనుకున్నారని కానీ అదృష్టవశాత్తూ వేరే వారు ఆపడంతో ప్రాణాలతో మిగిలాడన్నారు. దాడి చేసిన అల్లరి మూకలు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే వఖీల్ జైల్లో ఉన్నాడన్నారు. అతడికి ఇప్పటికీ ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. -
ఫోటో మార్ఫింగ్ చేసి ట్యూటర్ వేధింపులు:అరెస్ట్
బెర్హాంపుర్(ఒడిశా):ఓ యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్యూటర్ ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని గంజమ్ జిల్లా బాహదగూడ గ్రామంలో బిజయ్ కుమార్ పాండా(25) అనే వ్యక్తి స్కూళు పిల్లలకు విద్యా శిక్షణ ఇస్తుంటాడు. అయితే తన వద్ద ట్యూషన్ కు చేరిన 10 వ తరగతి అమ్మాయిని ప్రేమ పేరుతో లొంగదీసుకోవాలని చూశాడు. దీనికి ఓ పథకాన్ని అమలు చేశాడు. అందుకు పిక్ నిక్ ను వేదిక చేసుకున్నాడు. ఇటీవల తన వద్దనున్న విద్యార్థులతో కలిసి వన విహార యాత్రను ఏర్పాటు చేశాడు. దానిలో భాగంగా విద్యార్థులతో ఫోటోలు దిగాడు. అంతవరకూ బాగానే ఉన్నా.. ఓ విద్యార్థిని ఫోటోను మాత్రం మార్ఫింగ్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ ఫోటోను చూపించి తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఒకవేళ పెళ్లికి ఒప్పుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఈ వ్యవహారాన్ని తిరస్కరించిన సదరు యువతి తల్లి దండ్రులకు తెలిపింది. దీనిపై ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు అతనికి శిరోముండనం చేసి ఊరేగించారు. ఓ పెళ్లి వేడుకలో ఇద్దరూ జంటగా కలిసి ఉన్న ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టాడని పోలీస్ ఇన్ స్పెక్టర్ బిశ్వారంజన్ నాయక్ తెలిపారు.ఇటీవల తన కుమార్తె వద్ద పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇన్ స్పెక్టర్ స్పష్టం చేశారు.