ఫోటో మార్ఫింగ్ చేసి ట్యూటర్ వేధింపులు:అరెస్ట్ | Tutor held on charge of circulating morphed pic of girl | Sakshi
Sakshi News home page

ఫోటో మార్ఫింగ్ చేసి ట్యూటర్ వేధింపులు:అరెస్ట్

Published Sun, Jul 12 2015 5:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

ఫోటో మార్ఫింగ్ చేసి ట్యూటర్ వేధింపులు:అరెస్ట్

ఫోటో మార్ఫింగ్ చేసి ట్యూటర్ వేధింపులు:అరెస్ట్

బెర్హాంపుర్(ఒడిశా):ఓ యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్యూటర్ ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..  ఒడిశాలోని గంజమ్ జిల్లా బాహదగూడ గ్రామంలో బిజయ్ కుమార్ పాండా(25) అనే వ్యక్తి స్కూళు పిల్లలకు విద్యా శిక్షణ ఇస్తుంటాడు. అయితే తన వద్ద ట్యూషన్ కు చేరిన 10 వ తరగతి అమ్మాయిని ప్రేమ పేరుతో లొంగదీసుకోవాలని చూశాడు. 

 

దీనికి ఓ పథకాన్ని అమలు చేశాడు. అందుకు పిక్ నిక్ ను వేదిక చేసుకున్నాడు. ఇటీవల తన వద్దనున్న విద్యార్థులతో కలిసి వన విహార యాత్రను ఏర్పాటు చేశాడు. దానిలో భాగంగా విద్యార్థులతో ఫోటోలు దిగాడు. అంతవరకూ బాగానే ఉన్నా.. ఓ విద్యార్థిని ఫోటోను మాత్రం మార్ఫింగ్  చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ ఫోటోను చూపించి తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఒకవేళ పెళ్లికి ఒప్పుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఈ వ్యవహారాన్ని తిరస్కరించిన సదరు యువతి తల్లి దండ్రులకు తెలిపింది. దీనిపై ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు అతనికి శిరోముండనం చేసి ఊరేగించారు.


ఓ పెళ్లి వేడుకలో ఇద్దరూ జంటగా కలిసి ఉన్న ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో  పెట్టాడని పోలీస్ ఇన్ స్పెక్టర్ బిశ్వారంజన్ నాయక్ తెలిపారు.ఇటీవల తన కుమార్తె వద్ద పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇన్ స్పెక్టర్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement