tutor
-
హిందీ నేర్పిస్తారా? ఎలాన్ మస్క్ అదిరిపోయే ఆఫర్
ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధస్సు సంస్థ ఎక్స్ఏఐ(xAI).. హిందీ ట్యూటర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థలో ఏఐ ట్యూటర్లుగా పనిచేయడానికి భాషా నిపుణుల కోసం గ్లోబల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, ఫ్రెంచ్, చైనీస్ లేదా అరబిక్ వంటి ఇతర భాషలలో నిపుణులను నియమించుకుంటోంది.తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఏఐ మోడల్స్ భాషా అభ్యాస ప్రక్రియలకు మార్గనిర్దేశం చేయడంలో ద్విభాషా కమ్యూనికేషన్, సాంకేతిక రచన లేదా జర్నలిజంలో నైపుణ్యం అవసరం. "బలమైన పరిశోధనా నైపుణ్యాలు, వివిధ సమాచార వనరులు, డేటాబేస్లు, ఆన్లైన్ వనరులను ఇంగ్లీష్ నుంచి ఇతర భాషలలోకి మార్చగల సామర్థ్యం చాలా అవసరం" అని ఉద్యోగ వివరణ పేర్కొంది.వర్క్ ఫ్రమ్ హోమ్ఎక్స్ఏఐ ప్రకటించిన ఈ ట్యూటర్ ఉద్యోగాలు పూర్తిగా రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. అభ్యర్థులు స్థానిక టైమ్ జోన్లో సోమవారం నుండి శుక్రవారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయవచ్చు. అయితే ఈ ఉద్యోగ కాల పరిమితి ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. దీనికి ఎంపికైనవారికి ప్రామాణిక వైద్య ప్రయోజనాలతో పాటు అర్హతలు, అనుభవాన్ని బట్టి గంటకు 35 నుండి 65 డాలర్లు (రూ. 2,900 నుండి రూ. 5,400) వరకు చెల్లిస్తారు.ఎక్స్ఏఐ గురించి..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ఏఐని 2023లో ఎలాన్ మస్క్ స్థాపించారు. కృత్రిమ మేధస్సు సంక్లిష్టతను తొలగిస్తూ విశ్వం నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోని వివిధ భాషలకు తమ సేవలను విస్తరిస్తోంది. -
దారుణం: విద్యార్థిని ట్యూషన్ టీచర్ ప్రియుడే హతమార్చి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి(17)ని అతని ట్యూషన్ టీచర్ ప్రియుడు హత్య చేశాడు. ఈ ఘాతుకాన్ని కిడ్నాపింగ్గా మార్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను కూడా బాధితుని ఇంటికి పంపించాడని పోలీసులు తెలిపారు. తన ప్రేయసితో పాఠశాల విద్యార్థికి అక్రమ సంబంధం కొనసాగుతోందనే అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. రచిత స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజు సాయంత్రం టీచర్ రచిత వద్దకు ట్యూషన్‌కి వచ్చేవాడు. ఈ క్రమంలో వీరువురి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించిన రచిత ప్రియుడు ప్రభాత్ శుక్లా.. ఆ విద్యార్ధిని హత్య చేయాలని పథకం పన్నాడు. టీచర్ రచిత పిలుస్తుందని విద్యార్థిని పిలుచుకువచ్చిన ప్రబాత్ శుక్లా.. అతన్ని ఓ ఒంటరి గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలోనే హతమార్చాడు. అనంతరం ఈ దారుణాన్ని కిడ్నాప్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశాడు. బాలున్ని సురక్షితంగా ఇంటికి చేర్చడానికి పారితోషికాన్ని కోరుతూ లేఖను బాధితుని ఇంటి ముందు పడేశాడు. అంతేకాకుండా కేసును ఏమార్చడానికి లేఖపై అల్లా.. అక్బర్ అని పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుని మృతదేహాన్ని నిందితుని ఇంటిలో కనుగొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్ రచిత ప్రమేయం కూడా ఉన్నట్లు ఆమె అంగీకరించిందని వెల్లడించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు ఉద్ధృతం.. జాతీయ రహదారుల దిగ్బంధం -
దారుణం: ప్రైవేటు ట్యూటర్‌ను పేపర్ కట్టర్‌తో..
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మైనర్ తన ప్రైవేట్ ట్యూటర్ని పేపర్ కట్టర్‌తో కిరాతకంగా హత్య చేశాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడని అందుకే తాను ఈ ఘటనకు పాల్పడ్డానని మైనర్ తెలిపాడు. దేశ రాజధానిలోని జామియా నగర్లో ఈ ఘటన జరగగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాకిర్ నగర్లో కుటుంబంతో కలిసి ఉంటున్న వసీమ్(28) ఓ ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేస్తున్నారు. పక్కనే జామియా నగర్లో ఉన్న ఓ విద్యార్థికి పాఠాలు బోధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగష్టు 30న వసీమ్‌ను మైనర్ విద్యార్థి పేపర్ కట్టర్‌తో హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వసీమ్‌ను విద్యార్థి తండ్రి గుర్తించి, పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వసీమ్‌ను మైనర్ విద్యార్థే కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు. నేరం అంగీకరించిన విద్యార్థి.. తనను లైంగికంగా పలుమార్లు వేధించాడని, ఆ వీడియోలు తీసి, వాటిని బయటపెడతానని బెదిరించినట్లు ఆరోపించాడు. ఈ ఘటనలో మైనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స.. -
ట్యూటర్లకు షాక్: ఏఐ చాట్‌బాట్‌పై బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
AI chatbots: బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం శాన్డియా గోలో జరిగిన ASU+GSV సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేసిన ఆయన ఏఐ చాట్‌బాట్ ద్వారా పిల్లలు 18 నెలల్లో చదవడం, రైటింగ్ స్కిల్స్‌ను మెరుగు పరచుకోవడంలో సహాయపడతాయన్నారు. ఏ మానవ ట్యూటర్‌గా చేయలేనంతగా, మంచి ట్యూటర్‌గా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు మేథ్స్‌లో పిల్లల సామర్థ్యాల్ని కూడా మెరుగుపరుస్తుందన్నారు. చాట్‌బాట్ సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు సొంతంగా రాయడం, చదవడంలో వారి నైపుణ్యాలను మెరుగుపరచు కోవడానికి చాలా బాగా తోడ్పడుతుందని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత చాట్బాట్లు చదవడం,వ్రాయడంలో అద్భుతమైన ప్రతిభను కలిగి ఉన్నాయన్నారు. తొలుత రీడింగ్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత రచనలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలో ఎలా సహాయపడుతుందో గమనిస్తే ఆశ్చర్యపోతారు అంటూ గేట్స్ చాటాబాట్లపై పొగడ్తలు కురిపించారు. కంప్యూటర్‌కు వ్రాత నైపుణ్యాలను బోధించడం చాలా కష్టమైన పని తేలిపోయింది. డెవలపర్లకు కోడ్‌లో ప్రతిరూపం ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత AI చాట్‌బాట్‌కు డైనమిక్‌గా ఉండే మానవుల్లాగానే భాషా మార్పులను గుర్తించి, పునఃసృష్టి చేయగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
ఇప్పటికే రెండు సార్లు వివాహం.. శిక్షణ కోసం వచ్చిన యువతితో..
తిరువళ్లూరు(చెన్నై): నీట్ శిక్షణ కోసం వచ్చిన 18 ఏళ్ల యువతికి ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన కెమిస్ట్రీ లెక్చరర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరు బైపాస్ రోడ్డులో నీట్ ఎడ్జ్ కోచింగ్ అకాడమి ఉంది. ఇక్కడ కాకలూరుకు చెందిన 18 ఏళ్ల యువతి ఆరు నెలలుగా కోచింగ్ తీసుకుంటోంది. ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్‌గా కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామానికి చెందిన మూర్తి (32) పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం యువతి అదృశ్యమైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తిరుత్తణి వద్ద మూర్తి, యువతిని గుర్తించి విచారణ చేశారు. యువతికి ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. ఇప్పటికే మూర్తికి రెండు సార్లు వివాహాం సైతం జరిగినట్లు గుర్తించారు. దీంతో మూర్తిని రిమాండ్‌కు తరలించి యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. చదవండి: దారుణం.. ‘థ్యాంక్ యూ’ చెప్పలేదని పొడిచి చంపాడు..! -
‘గురుకుల’ పోస్టులపై పిల్.. పార్ట్‌టైమ్ ట్యూటర్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలంటూ ఓ పార్ట్‌టైమ్ ట్యూటర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలంటూ గత ఏప్రిల్‌లో వినతిపత్రం ఇచ్చి కనీసం నాలుగు వారాల సమయం కూడా ఇవ్వకుండా వెంటనే పిల్ దాఖలు చేయడం ఏంటని ప్రశ్నించింది. పార్ట్‌టైమ్ ట్యూటర్‌గా ఉంటూ అధ్యాపకుల నియామకాలు చేయాలని కోరుతూ పిల్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది. గురుకుల పోస్టులకు దరఖాస్తు చేయనంటూ అఫిడవిట్ సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం.మధు ఈ పిల్ దాఖలు చేశారు. -
‘గ్లూకోజ్ వాటర్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది’
న్యూఢిల్లీ: జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్ అంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేసిన ఓ ట్యూటర్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఢిల్లీ మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలో సందీప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బీఏ రెండో సంవత్సరం చదువుతోన్న సందీప్ పాకెట్ మనీ కోసం చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సందీప్ తన దగ్గర జ్ఞాపకశక్తి పెరిగే ఇంజక్షన్ ఉందని.. అది తీసుకుంటే.. విద్యార్థుల మెమరీ పవర్ చాలా బాగా వృద్ధి చెందుతుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన విద్యార్థులు ఆ ఇంజక్షన్‌ను తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి తల్లిదండ్రులకు దీని గురించి తెలిసింది. అసలు జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్ ఏంటి అంటూ వారు సందీప్‌ని ఆరా తీశారు. అతడు సెలైన్ వాటర్‌ని విద్యార్థులకు ఇస్తే.. అది వారి జ్ఞాపకశక్తిని పెంచుతుందని తెలిపాడు. ఈ విషయాన్ని తాను యూట్యూబ్‌లో చూశానని.. అందుకే విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచడానికి తాను సెలైన్‌ని ఇచ్చానని వెల్లడించాడు. దీని గురించి విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సందీప్‌పై కేసు నమోదు చేసి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: అచ్చం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోలా.. -
బాలుడిపై ట్యూటర్ లైంగిక వేధింపులు
అగర్తల: విద్యార్థులకు విద్యాభోదన చేయాల్సిన టీచర్లే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తొమ్మిదేళ్ల బాలుడిపై ఓ ప్రైవేట్ ట్యూటర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన త్రిపురలోని అగర్తలలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన దాదాపు పదిరోజుల తర్వాత ప్రైవేట్ ట్యూటర్‌ను ఇంద్రఘోష్(23)ను గుర్తించామని పోలీసులు బుధవారం తెలిపారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు నవంబర్ 30న కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నామని త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని రామ్ నగర్ అవుట్‌పోస్ట్ ఇన్చార్జి బిస్వాజిత్ దాస్ వెల్లడించారు. నవంబర్ 28న ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరువాత చైల్డ్ లైన్ ప్రతినిధులు బాలుడి ఇంటికి వెళ్లారు. బాలుడు ఓ ప్రైవేటు ట్యూటర్ చేత లైంగిక వేధింపులకు గురయ్యాడని తెలుసుకున్నారు. ఈ విషయం గురించి ఎవరితోనై నా చెబితే తరువాత జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని ట్యూటర్ బెదిరించడంతో, బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇది జరిగిన వారం రోజుల పాటు బాలుడు ట్యూషన్‌కు వెళ్లకపోవడంతో కారణమేమిటని తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పినట్లు చైల్డ్ లైన్ సభ్యులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపులకు శిక్ష), పోక్సో చట్టం సెక్షన్ 5 (ఎమ్)(పీ) కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. -
వైరలవుతోన్న ఓ తండ్రి వెరైటీ ఆలోచన
-
కూతురు హోం వర్క్ కోసం కుక్కకు ట్రైనింగ్
బీజింగ్ : పిల్లలతో హోం వర్క్ చేయించడం తల్లిదండ్రులకు ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క చోట కుదురుగా కూర్చుని.. బుద్ధిగా హోం వర్క్ పూర్తి చేస్తే.. ఆ రోజుకు గండం గడిచినట్లే. కానీ మన చిచ్చరపిడుగులు అలా చేయరు కదా. హోం వర్క్ చేస్తూ.. వేరే పనిలో పడటం.. ఫోన్ చూస్తూ గడపటం వంటివి చేస్తారు. ఇక వారి గోల తట్టుకోలేక ట్యూషన్లకి పంపిస్తుంటారు. కానీ చైనాకు చెందిన ఓ తండ్రి మాత్రం కూతురుతో హోం వర్క్ చేయించే బాధ్యతను ఓ నయా ట్యూటర్‌కి అప్పగించాడు. ఆ ట్యూటర్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే ఆ ట్యూటర్ ఓ కుక్క కాబట్టి. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. జూ లియాంగ్ అనే వ్యక్తి తన కూతురి చేత హోం వర్క్ చేపించే బాధ్యతను పెంపుడు కుక్కకు అప్పగించాడు. ఇందుకోసం దానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. దాంతో జూ కుమార్తె హోం వర్క్ చేసుకునేటప్పుడు.. ఆ కుక్క ఆమెకు ఎదురుగా నిల్చుని పర్యవేక్షిస్తుంటుంది. ఒక వేళ ఆ అమ్మాయి గనక హోం వర్క్ పూర్తి చేయకుండా మధ్యలో ఫోన్‌తో ఆడటంలాంటివి చేస్తే.. మాత్రం ఊరుకోదు. తన యజమానురాలు హోం వర్క్ పూర్తి చేసిందని భావిస్తేనే.. ఫోన్‌ని టచ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ విషయం గురించి జూ లియాంగ్ మాట్లాడుతూ.. ‘తొలుత ఈ కుక్కకు పిల్లి నుంచి ఆహారాన్ని కాపాడుకోవడం ఎలా అనే అంశంపై ట్రైనింగ్ ఇచ్చాను. ఈ క్రమంలో ఓ రోజు నా కుమార్తె హోంవర్క్ పూర్తి చేయకుండా గోల చేయడం చూశాను. దాంతో నా కూతురి చేత హోం వర్క్ చేపించే బాధ్యత నా కుక్కకు ఇవ్వాలనుకున్నాను. అందుకు అనుగుణంగా నా పెంపుడు కుక్కను ట్రైన్ చేశాను. ఇప్పుడది నా కూతురు హోం వర్క్ చేసేటప్పుడు.. తన ఎదురుగా నిల్చుని గమనిస్తుంది. ఒక వేళ నా కూతురు హోం వర్క్ మధ్యలో వదిలేసి ఫోన్‌తో ఆడాలని చూస్తే.. వెంటనే మొరుగుతూ తనను భయపెట్టడానికి ట్రై చేస్తుంద’ని వెల్లడించారు. ఈ విషయం గురించి జూ కూతురు మాట్లాడుతూ.. ‘నా కుక్కతో కలిసి హోం వర్క్ చేయడం చాలా బాగుంది. ఇంతకు ముందు హోం వర్క్ చేయాలంటే చాలా బోర్‌గా ఫీలయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నేను చాలా శ్రద్ధగా హోం వర్క్ పూర్తి చేస్తున్నాను’ అని తెలిపింది. వీడియో: (వైరలవుతోన్న ఓ తండ్రి వెరైటీ ఆలోచన) -
వినయంగా ఉంటోందని.. బాలికపై ట్యూటర్ దారుణం
లక్నో : గురువు పట్ల చూపిన వినయ, విధేయతలే ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆరేళ్ల బాలికపై కన్నేసిన ఓ ట్యూటర్ చిన్నారిని దారుణంగా హత్యచేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్‌కు చెందిన ఫైజల్ ఇస్లామ్ అనే వ్యక్తి చదువుకుంటూనే చిన్నపిల్లలకు ట్యూషన్ చెబుతున్నాడు. అతడి వద్దకు ట్యూషన్‌కు వచ్చే వారిలో చిన్నదైన, మిక్కిలి వినయ, విధేయతలు కలిగిన ఆరేళ్ల బాలికపై అతడు కన్నేశాడు. ఈ నెల 21వ తేదీన పిల్లలందర్ని ఇంటికి పంపేసిన తర్వాత బాలికను అతడి మామ ఇంటికి తీసుకెళ్లాడు. ఇస్లామ్ మామ కుటుంబసభ్యులతో కలిసి పనిమీద రాజస్తాన్ వెళ్లటం అతడికి కలిసొచ్చింది. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి దిగటంతో చిన్నారి ప్రతిఘటించింది. దీంతో అతడు బాలికను హత్య చేశాడు. బాలిక మృతదేహన్ని పరుపులో చుట్టి మసీదు బయట పడవేసి అక్కడినుంచి పరారయ్యాడు. చిన్నారి కుటుంబసభ్యులు ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవటంతో వెతకటం ప్రారంభించారు. ఇస్లామ్ మీద అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి వెతికినా లాభం లేకపోయింది. ఇంటి పక్కవారు బాలిక ఇస్లామ్‌తో వెళ్లటం చూశామని చెప్పటంతో వారు పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని విచారించగా బాలికను హత్య చేసిన సంగతి వెల్లడించాడు. ట్యూషన్లో చిన్నదైన, మిక్కిలి వినయ, విధేయతలు కలిగినదైన కారణంగా తను చెప్పినట్లు విని వెంట వచ్చిందని, ఆపై బాలికపై లైంగిక దాడికి దిగగా ప్రతిఘటించటంతో ఈ దారుణానికి ఒడిగట్టానని తెలిపాడు. -
అలీగఢ్‌లో హోమ్ ట్యూటర్ కర్కశత్వం
-
టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి
కంకిపాడు (కృష్ణా) : టీచర్ కొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని గోడవర్రు గ్రామానికి చెందిన ఇంటూరి. చింటూ అనే బాలుడు 8 వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 9 వ తేదీన ట్యూషన్ మాస్టర్ కొట్టడంతో చింటూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడు హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందాడు. ఆ తర్వాత చికిత్స ఖర్చు భరించే స్థోమత లేక గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు శుక్రవారం మృతి చెందాడు. -
చోరీ చేసిందంటూ చిన్నారిని చితకబాదిన ట్యూటర్
కొడుమూరు (కర్నూలు) : నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినిని ట్యూషన్ టీచర్ చితకబాదగా ఆ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన కర్నూలు జిల్లా కొడమూరు బాలికల బీసీ హాస్టల్లో గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు పనుల కోసం వలస వెళుతూ భార్గవి అనే బాలికను స్థానిక బీసీ హాస్టల్లో చేర్పించారు. కాగా గురువారం ఉదయం హాస్టల్లో 20 రూపాయలు దొంగిలించిందనే నెపంతో ట్యూషన్ టీచర్ భాగ్య ఆ చిన్నారిని వాతలు తేలేటట్లు చితకబాదింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. చిన్నారిని చితకబాదిన ట్యూటర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులు వలస వెళ్లిన ప్రాంతం నుంచి తిరిగి రావాల్సి ఉంది. -
ఫోటో మార్ఫింగ్ చేసి ట్యూటర్ వేధింపులు:అరెస్ట్
బెర్హాంపుర్(ఒడిశా):ఓ యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నట్యూటర్ ను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని గంజమ్ జిల్లా బాహదగూడ గ్రామంలో బిజయ్ కుమార్ పాండా(25) అనే వ్యక్తి స్కూళు పిల్లలకు విద్యా శిక్షణ ఇస్తుంటాడు. అయితే తన వద్ద ట్యూషన్ కు చేరిన 10 వ తరగతి అమ్మాయిని ప్రేమ పేరుతో లొంగదీసుకోవాలని చూశాడు. దీనికి ఓ పథకాన్ని అమలు చేశాడు. అందుకు పిక్ నిక్ ను వేదిక చేసుకున్నాడు. ఇటీవల తన వద్దనున్న విద్యార్థులతో కలిసి వన విహార యాత్రను ఏర్పాటు చేశాడు. దానిలో భాగంగా విద్యార్థులతో ఫోటోలు దిగాడు. అంతవరకూ బాగానే ఉన్నా.. ఓ విద్యార్థిని ఫోటోను మాత్రం మార్ఫింగ్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ ఫోటోను చూపించి తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఒకవేళ పెళ్లికి ఒప్పుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఈ వ్యవహారాన్ని తిరస్కరించిన సదరు యువతి తల్లి దండ్రులకు తెలిపింది. దీనిపై ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు అతనికి శిరోముండనం చేసి ఊరేగించారు. ఓ పెళ్లి వేడుకలో ఇద్దరూ జంటగా కలిసి ఉన్న ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టాడని పోలీస్ ఇన్ స్పెక్టర్ బిశ్వారంజన్ నాయక్ తెలిపారు.ఇటీవల తన కుమార్తె వద్ద పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇన్ స్పెక్టర్ స్పష్టం చేశారు. -
యువతిపై ట్యూటర్ అత్యాచారం
ఘజియాబాద్: తనపై అత్యాచారం జరిపి, అందుకు సంబంధించిన వీడియోను చూపుతూ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ట్యూషన్ మాస్టార్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు షఫీఖ్ అహ్మద్ ఇందిరాపురంలోని ఖోడా ప్రాంతంలో స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. గత నవంబర్‌లో బాధితురాలు అహ్మద్ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకుంది. ఆ తర్వాత ఓ రోజు ఇంటికి రమ్మని పిలిచిన అహ్మద్ ఆమెపై అత్యాచారం జరిపి, దానికి సంబంధించిన వీడియోను తీశాడు. జరిగిన విషయం గురించి ఎవరికైనా చెబితే వీడియోలను బయటపెడతానంటూ బెదిరించాడు. అలా బెదిరిస్తూ దాదాపు ఆరు నెలలుగా బాధితురాలిని శారీరకంగా వేధిస్తున్నాడు. చివరకు ఆ వీడియోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడు. దీని గురించి బాధితురాలికి తెలియడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అహ్మద్‌ను అరెస్టు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. అందుకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
కొత్తపల్లి, న్యూస్‌లైన్: రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న కొత్తపల్లెకు చెందిన హేమలత, కరివేనకు చెందిన హరికృష్ణ సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. హేమలత పట్టణంలోని ఎస్ఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా హరికృష్ణ అదే కళాశాలలో ట్యూటర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం కొత్తపల్లి సమీపంలోని జమ్ములమ్మ దేవాలయ పరిసర ప్రాంతంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. హేమలత మెడలో పసుపుకొమ్ము, నుదుటిపై పెళ్లిబొట్టు ఉండడంతో అప్పటికప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, ఇతర కారణాలతో ఇద్దరు ఆత ్మహత్యకు ప్రయత్నించారు. అయితే ముందుగానే వారి కుటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో వారు కొద్దిసేపటికే ఘటనా స్థలికి వచ్చేశారు. అపస్మారక స్థితిలో పడిఉన్న ఇద్దరినీ ఆత్మకూరు ప్రయివేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.