ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం | Lovers attempt suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

Published Tue, Aug 27 2013 4:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

Lovers attempt suicide

కొత్తపల్లి, న్యూస్‌లైన్: రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న కొత్తపల్లెకు చెందిన హేమలత, కరివేనకు చెందిన హరికృష్ణ సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. హేమలత పట్టణంలోని ఎస్‌ఎన్‌ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా హరికృష్ణ అదే కళాశాలలో ట్యూటర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం కొత్తపల్లి సమీపంలోని జమ్ములమ్మ దేవాలయ పరిసర ప్రాంతంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
 
 హేమలత మెడలో పసుపుకొమ్ము, నుదుటిపై పెళ్లిబొట్టు ఉండడంతో అప్పటికప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.  తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, ఇతర కారణాలతో ఇద్దరు ఆత ్మహత్యకు ప్రయత్నించారు. అయితే ముందుగానే వారి కుటుంబీకులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో వారు కొద్దిసేపటికే ఘటనా స్థలికి వచ్చేశారు. అపస్మారక స్థితిలో పడిఉన్న ఇద్దరినీ ఆత్మకూరు ప్రయివేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement