AI chatbots: బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం శాన్‌డియా గోలో జరిగిన ASU+GSV సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేసిన ఆయన ఏఐ చాట్‌బాట్ ద్వారా పిల్లలు 18 నెలల్లో చదవడం, రైటింగ్ స్కిల్స్‌ను మెరుగు పరచుకోవడంలో సహాయపడతాయన్నారు. ఏ మానవ ట్యూటర్‌గా చేయలేనంతగా, మంచి ట్యూటర్‌గా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు మేథ్స్‌లో పిల్లల సామర్థ్యాల్ని కూడా మెరుగుపరుస్తుందన్నారు.
చాట్‌బాట్ సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు సొంతంగా రాయడం, చదవడంలో వారి నైపుణ్యాలను మెరుగుపరచు కోవడానికి చాలా బాగా తోడ్పడుతుందని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత చాట్‌బాట్‌లు చదవడం,వ్రాయడంలో అద్భుతమైన ప్రతిభను కలిగి ఉన్నాయన్నారు. తొలుత రీడింగ్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత రచనలపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలో ఎలా సహాయపడుతుందో గమనిస్తే ఆశ్చర్యపోతారు అంటూ గేట్స్ చాటాబాట్‌లపై పొగడ్తలు కురిపించారు.
కంప్యూటర్‌కు వ్రాత నైపుణ్యాలను బోధించడం చాలా కష్టమైన పని తేలిపోయింది. డెవలపర్‌లకు కోడ్‌లో ప్రతిరూపం ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత AI చాట్‌బాట్‌కు డైనమిక్‌గా ఉండే మానవుల్లాగానే భాషా మార్పులను గుర్తించి, పునఃసృష్టి చేయగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment