25 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ ఆఫీసుకు బిల్‌ గేట్స్‌ | Bill Gates Visits Microsoft IDC In Hyderabad | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ ఆఫీసుకు బిల్‌ గేట్స్‌

Published Wed, Feb 28 2024 2:16 PM | Last Updated on Wed, Feb 28 2024 3:02 PM

Bill Gates Visited Microsoft Idc At Hyderabad - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్‌ గేట్స్‌ బుధవారం సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఐడీసీ కీలక పాత్ర పోషిస్తోంది.

అజూర్‌, విండోస్‌, ఆఫీస్‌, బింగ్‌, కోపిలాట్‌, ఇతర ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) టూల్స్‌ అభివృద్ధి వెనుక ఐడీసీ కీ రోల్‌ ప్లే చేసింది. బిల్‌ గేట్స్‌ పర్యటన సందర్భంగా ఐడీసీ చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో ఏఐ, క్లౌడ్‌, గేమింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో  మైక్రోసాఫ్ట్‌ ఆవిష్కరణలకు ఐడీసీ కేంద్రం కానుందని చెప్పారు. ఐడీసీలో ఇంజినీర్లను ఉద్దేశించి బిల్‌గేట్స్‌ చేసిన ప్రసంగం గొప్పదన్నారు. ఏఐ పవర్డ్‌ ఇండియాపై బిల్‌ గేట్స్‌ మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారని చెప్పారు.  

ఇదీ చదవండి.. ఎనిమిది వేలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement