ఘజియాబాద్: తనపై అత్యాచారం జరిపి, అందుకు సంబంధించిన వీడియోను చూపుతూ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ట్యూషన్ మాస్టార్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు షఫీఖ్ అహ్మద్ ఇందిరాపురంలోని ఖోడా ప్రాంతంలో స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. గత నవంబర్‌లో బాధితురాలు అహ్మద్ కోచింగ్ సెంటర్‌లో అడ్మిషన్ తీసుకుంది. ఆ తర్వాత ఓ రోజు ఇంటికి రమ్మని పిలిచిన అహ్మద్ ఆమెపై అత్యాచారం జరిపి, దానికి సంబంధించిన వీడియోను తీశాడు. జరిగిన విషయం గురించి ఎవరికైనా చెబితే వీడియోలను బయటపెడతానంటూ బెదిరించాడు. అలా బెదిరిస్తూ దాదాపు ఆరు నెలలుగా బాధితురాలిని శారీరకంగా వేధిస్తున్నాడు. చివరకు ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. దీని గురించి బాధితురాలికి తెలియడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అహ్మద్‌ను అరెస్టు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. అందుకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
యువతిపై ట్యూటర్ అత్యాచారం
Published Mon, Jul 7 2014 10:27 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM
Advertisement
Advertisement