గజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలోని లోని బోర్డర్ ప్రాంతంలో పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్న 29 ఏళ్ల వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర పనిచేస్తున్న 15 ఏళ్ల మైనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంకుర్ విహార్ ఏరియా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) భాస్కర్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం ఒక జ్యూస్ విక్రేత పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నాడని పలువురు వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆ జ్యూస్ విక్రయిస్తున్న వ్యక్తిని అమీర్ (29)గా గుర్తించినట్లు వర్మ తెలిపారు. అతని జ్యూస్ స్టాల్ నుంచి మూత్రం నింపిన డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీసులు అమీర్‌ను విచారించి, అరెస్టు చేశారన్నారు. అతని దగ్గర పనిచేస్తున్న ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భాస్కర్ వర్మ పేర్కొన్నారు.
కాగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేలోని ఛుత్మల్‌పూర్‌లో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఒక ధాబాలో తాండూర్‌లో రోటీలు కాల్చడానికి ముందు దానిని తయారు చేస్తున్న వ్యక్తి వాటిపై ఉమ్మి వేయడం వీడియోలో కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. తరువాత ఆ ధాబాను మూసివేయించారు.
ఇది కూడా చదవండి: వింత శబ్దాల మిస్టరీ వీడింది
Comments
Please login to add a commentAdd a comment