![UP Cops Denied Twitter MD Manish Maheshwari Zoom Investigation Request - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/22/Twitter_MD_Zoom_UP_Police.jpg.webp?itok=J6T_49P4)
కొత్త ఐటీ పాలసీ, రూల్స్ పాటించాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, మైక్రో బ్లాంగిగ్ సైట్ ట్విటర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ట్విటర్‌కు మధ్యవర్తిత్వ హోదా కేంద్రం తొలగించగా.. ఘజియాబాద్ వృద్ధుడి దాడి ఘటనలో యూపీ పోలీసుల నోటీసులతో ఇరకాటంలో పడింది. తాజాగా ఈ కేసులో ట్విటర్ ఎండీ మనీశ్ మహేశ్వరిని తమ ఎదుట హాజరుకావాలని ఘజియాబాద్ పోలీసులు నోటీసులు కూడా పంపారు. అయితే తాను వర్చువల్ విచారణకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో యూపీ పోలీసులు సున్నితంగా హెచ్చరించారు.
లక్నో: యూపీ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీన స్వయంగా లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. జూమ్‌లో విచారణ కుదరదని, స్వయంగా హాజరు కావాలని తేల్చి చెప్పింది యూపీ పోలీస్ శాఖ. లేని పక్షంలో కేసు విచారణకు సహకరించడం లేదని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. చట్ట బద్ధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ఈ వ్యవహారంలో 26 సార్లు నోటీసులు పంపినప్పటికీ మనీష్ స్పందించలేదని ఘజియాబాద్ పోలీసులు ఆరోపిస్తున్నారు.
కాగా, ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడి మీద జరిగిన దాడి ఘటనకు మతం రంగు పులమాలని కొందరు ప్రయత్నిస్తే.. ట్విటర్ ద్వారా ఆ వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. దీంతో ట్విటర్ నిర్లక్ష్యం వహించిందనేది యూపీ పోలీసుల ఆరోపణ. ఈ మేరకు ట్విటర్‌పై ఫిర్యాదులు కూడా నమోదు కావడంతో ఎండీ మనీష్ మహేశ్వరికి నోటీసులు పంపారు. కాగా, ఇటువంటి వివాదాలతో తనకు సంబంధం లేదని, వీటిని తాన్ డీల్ చేయనని మనీష్ ఇదివరకే పోలీసులకు బదులు కూడా ఇచ్చాడు. అయినప్పటికీ ఆ వివరణపై సంతృప్తి చెందని ఘజియాబాద్ పోలీసులు.. ఫేస్ టు ఫేస్ విచారణను ఎదుర్కొవాల్సిందేనని తేల్చిబాధ్యత చెప్పారు.
చదవండి: బాధ్యత ఉండక్కర్లా?
Comments
Please login to add a commentAdd a comment