Twitter India head
-
Twitter Layoffs: భారత ఉద్యోగులపై ఎలన్ మస్క్ దెబ్బ
భారతీయ ఉద్యోగులకు ట్విటర్ భారీ షాక్ ఇచ్చింది. కమ్యూనికేషన్, మార్కెటింగ్ టీంపై వేటు వేసింది. ఇప్పటికే ట్విటర్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన ఎలన్ మస్క్ ఇప్పుడు భారత ఉద్యోగుల్ని తొలగించే పనిలో పడ్డారు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్..ఖర్చు తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరల్డ్ వైడ్‌గా ట్విటర్ ఉద్యోగుల్ని తొలగిస్తుండగా.. భారత ఉద్యోగులను తొలగించింది. గత వారం ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్ ఎగ్జిక్యూటీవ్ విజయ గద్దెలపై మస్క్ వేటు వేశారు. తాజాగా భారత్‌కు చెందిన ఇతర ఉద్యోగుల్ని ట్విటర్ తొలగించింది. ‘లే ఆఫ్ ప్రారంభమైంది. నాతో పాటు మిగిలిన నా సహచర ఉద్యోగులకు దీనికి సంబంధించిన ఇమెయిల్స్ వెళ్లాయి అని పేరు చెప్పేందుకు ఇష్టపడని భారత ట్విటర్ ఉద్యోగి తెలిపారు. చదవండి👉 ట్విటర్లో ఉద్యోగుల తొలగింపు, కీరోల్ ప్లే చేస్తున్న భారతీయుడు? ప్రతి ఒక్కరికి మెయిల్స్ ట్విటర్ అంతకుముందు ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పంపింది. ఆ మెయిల్స్‌లో.. ట్విటర్‌ను ఆరోగ్యకరమైన వాతావరణంలో కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా శుక్రవారం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తాం. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఇమెయిల్‌ను స్వీకరిస్తారు అని పేర్కొంది. ఉద్యోగుల తొలగింపుతో పాటు ట్విటర్ సిస్టమ్‌లు, కస్టమర్ డేటా కోసం నిర్వహిస్తున్న సంస్థకు చెందిన అన్నీ కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసివేస్తుంది. ‘మీరు ఆఫీస్‌లో ఉన్నా.. లేదంటే ఆఫీస్‌కు బయలుదేరుతున్నా’ దయచేసి ఇంటికి వెళ్లండి అని ట్విటర్ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో తెలిపింది. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
మా గొంతు నొక్కేస్తున్నారు!
న్యూఢిల్లీ: భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడంలో ట్విట్టర్ తెలియకుండానే భాగస్వామిగా మారుతోందని, తన ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్‌ను తగ్గిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఇండియాకు లేఖ రాశారు. భారత విధ్వంసంలో ట్విట్టర్ పావుగా మారకూడదని, కోట్లాది భారతీయుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. డిసెంబర్ 27న రాసిన ఈ లేఖ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. అయితే రాహుల్ అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య కచ్ఛితమైనది, సరైనదేనని ట్విట్టర్ వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఆరోగ్యకరమైన చర్చలను కోరుకుంటున్నామని తెలిపింది. భిన్న అభిప్రాయాలను తాము గౌరవిస్తామని ట్విట్టర్ వైస్ ప్రెసిడెంట్ సైనియడ్ మెక్‌స్వీనీ తెలిపారు. తాము ఎలాంటి రాజకీయపరమైన సెన్సారింగ్ చేయడం లేదన్నారు. దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత తనపై ఉందని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. భారత్‌లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేసేందుకు ట్విట్టర్ వంటి మాధ్యమాలు తమకు కీలకంగా మారాయని, కానీ గత కొన్ని రోజులుగా తన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ వస్తోందని వివరించారు. తన ఫాలోయర్ల సంఖ్య రోజుకు పదివేల చొప్పున పెరిగేదని, కానీ కొన్ని రోజులుగా ఈ సంఖ్య మారడం లేదని చెప్పారు. కేంద్రమే కారణం తన గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం నుంచి ట్విట్టర్ ఇండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని తెలిసిందని రాహుల్ ఆరోపించారు. తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని తమ వేదికపై అంగీకరించమని, అలాంటివాటిపై మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటుమని ట్విట్టర్ ప్రతినిధి చెప్పారు. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చని, విధానాల ఉల్లంఘనకు ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ప్రభుత్వం అణచివేయకూడదన్నదే తమ నాయకుడు రాహుల్‌గాంధీ అభిప్రాయమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. ఈ వారం నుంచి రాహుల్ ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు చాలా రోజుల పాటు ఆయన ఫాలోయర్ల సంఖ్య 1.95 కోట్ల వద్ద స్థిరంగా ఉండిపోయింది. ఈ వారం మాత్రం ఈ సంఖ్య 1.96 కోట్లకు చేరింది. -
ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్ మహేశ్వరి బదిలీ
-
ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ.!
ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి తొలగిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా హెడ్ నియమితులైన మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ చేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్ నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను అనుసరించి ఇండియా హెడ్‌గా మనీశ్ మహేశ్వరి నియమితులయ్యారు. గత ఏడాది కాలంగా ఇండియాలో ట్విట్టర్‌కి కలిసి రావడం లేదు. కొత్త ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కొంత కాలం గళం విప్పింది ట్విటర్. గ్రీవెన్స్ అధికారిగా ఇండియన్నే నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు మీన మేషాలు లెక్కించింది. దీంతో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. చివరకు భారతీయుడినే గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. తాజాగా రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల ఖాతాలను ట్విటర్ నిలిపివేసింది. -
దిగొచ్చిన ట్విట్టర్ : ఆర్‌జీఓగా వినయ్ ప్రకాశ్
-
జూమ్ గీమ్ జాన్తా నయ్.. పీఎస్‌కి రావాల్సిందే!
కొత్త ఐటీ పాలసీ, రూల్స్ పాటించాలన్న విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, మైక్రో బ్లాంగిగ్ సైట్ ట్విటర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే ట్విటర్‌కు మధ్యవర్తిత్వ హోదా కేంద్రం తొలగించగా.. ఘజియాబాద్ వృద్ధుడి దాడి ఘటనలో యూపీ పోలీసుల నోటీసులతో ఇరకాటంలో పడింది. తాజాగా ఈ కేసులో ట్విటర్ ఎండీ మనీశ్ మహేశ్వరిని తమ ఎదుట హాజరుకావాలని ఘజియాబాద్ పోలీసులు నోటీసులు కూడా పంపారు. అయితే తాను వర్చువల్ విచారణకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో యూపీ పోలీసులు సున్నితంగా హెచ్చరించారు. లక్నో: యూపీ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీన స్వయంగా లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. జూమ్‌లో విచారణ కుదరదని, స్వయంగా హాజరు కావాలని తేల్చి చెప్పింది యూపీ పోలీస్ శాఖ. లేని పక్షంలో కేసు విచారణకు సహకరించడం లేదని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. చట్ట బద్ధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ఈ వ్యవహారంలో 26 సార్లు నోటీసులు పంపినప్పటికీ మనీష్ స్పందించలేదని ఘజియాబాద్ పోలీసులు ఆరోపిస్తున్నారు. కాగా, ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడి మీద జరిగిన దాడి ఘటనకు మతం రంగు పులమాలని కొందరు ప్రయత్నిస్తే.. ట్విటర్ ద్వారా ఆ వీడియోలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. దీంతో ట్విటర్ నిర్లక్ష్యం వహించిందనేది యూపీ పోలీసుల ఆరోపణ. ఈ మేరకు ట్విటర్‌పై ఫిర్యాదులు కూడా నమోదు కావడంతో ఎండీ మనీష్ మహేశ్వరికి నోటీసులు పంపారు. కాగా, ఇటువంటి వివాదాలతో తనకు సంబంధం లేదని, వీటిని తాన్ డీల్ చేయనని మనీష్ ఇదివరకే పోలీసులకు బదులు కూడా ఇచ్చాడు. అయినప్పటికీ ఆ వివరణపై సంతృప్తి చెందని ఘజియాబాద్ పోలీసులు.. ఫేస్ టు ఫేస్ విచారణను ఎదుర్కొవాల్సిందేనని తేల్చిబాధ్యత చెప్పారు. చదవండి: బాధ్యత ఉండక్కర్లా? -
ఘజియాబాద్ వీడియో: ట్విటర్ ఎండీకి లీగల్ నోటీసులు.. వారం గడువు
న్యూఢిల్లీ: యూపీ ఘజియాబాద్‌లో వృద్ధుడిపై దాడి ఘటన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆ వృద్ధుడి ఫిర్యాదుపై భిన్న వాదనలు వినిపిస్తుండగా.. తాజాగా ఈ వీడియోకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా ఎండీకి నోటీసులు జారీచేశారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరికి నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోగా లోని పోలీస్ స్టేషన్‌కొచ్చి.. వివరణ ఇచ్చుకోవాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కాగా, మత విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ఆ వీడియోను వైరల్ చేసిందంటూ ట్విటర్‌పై అభియోగాల్ని యూపీ పోలీసులు నమోదుచేశారు. ‘‘ట్విటర్ మాధ్యమాన్ని ఉపయోగించి కొందరు ఆ వీడియోల్ని వైరల్ చేశారు. కానీ, ట్విటర్ మాత్రం ఆ అకౌంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సంఘ విద్రోహ శక్తుల సందేశాల్ని అలా ఎలా జనాలకు చేరవేస్తారు? అంటూ ఆనోటీసుల్లో పోలీసులు ట్విటర్ ఎండీని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరు జర్నలిస్టులకు, కాంగ్రెస్ లీడర్ల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయగా, నటి స్వరభాస్కర్‌పై కూడా ఫిర్యాదు అందింది. మరోవైపు తాయెత్తులు అమ్మే సూఫీ అబ్దుల్ సమద్‌పై ఆ వ్యవహారంలోనే కక్షకట్టి దాడి చేశారని, ఇందులో మత కోణం లేదని పోలీసులు చెప్తుండగా.. మరోవైపు సమద్ కుటుంబం మాత్రం అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన దాడేనని చెబుతోంది. Ghaziabad Police sent legal notice to Managing Director of Twitter India over viral video of an elderly man in Loni being assaulted with the intent of "provoking communal unrest" The MD has been asked to come to the Police Station Loni Border & record the statement within 7 days pic.twitter.com/u5Ct8Omq6l — ANI UP (@ANINewsUP) June 18, 2021 టైం కావాలి ఇక కాంగ్రెస్ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఇవాళ ట్విట్టర్ ప్రతినిధులు హాజరయ్యారు. సామాజిక మాధ్యమ వేదికలు దుర్వినియోగం కాకుండా, పౌరహక్కులకు భంగం కలగకుండా.. ప్రత్యేకంగా మహిళల భద్రతపరంగా ఏవిధమైన నివారణ చర్యలు తీసుకోవాలనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ట్విటర్ ఉన్నతాధికారులను కమిటీ ఇదివరకే ఆదేశించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ట్విటర్ అధికారుల అభిప్రాయాల్ని తీసుకుంది. కొవిడ్ కారణంగా పూర్తి చర్యలు చేపట్టేందుకు కొంచెం సమయం కావాలని ట్విటర్ కోరినట్లు తెలుస్తోంది. చదవండి: ఏం రాహుల్.. విషం నింపుతున్నావా? -
స్వరా భాస్కర్, ట్విటర్ ఇండియా హెడ్‌పై ఫిర్యాదు.. కారణం?
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్‌తోపాటు ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరిపై ఢిల్లీలో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన వీడియోపై అనుచిత ట్వీట్లు చేసినందుకు వీరిద్దరిపై ఫిర్యాదు అందింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనప్పటికీ ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ఘజియాబాద్‌లో సూఫీ అబ్దుల్ సమద్ అనే వృద్ధుడిపై కొంతమంది దాడి చేసి తన గడ్డం కత్తిరించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. అతనితో వందే మాతరం, జై శ్రీ రామ్ అనాలని బలవంతం చేశారని ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు, జర్నలిస్టులు తమ ట్విటర్లలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే నటి స్వరా భాస్కర్, పాత్రికేయురాలు ఆర్ఫా కన్నుమ్ శర్వాణి, ఆసిఫ్ ఖాన్ దాడి వీడియోను తమ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఓ న్యాయవాది తన ఫిర్యాదుతో బుధవారం ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. మత పరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వీడియోను వీరంతా షేర్ చేసి... శాంతికి విఘాతం కల్పించడంతో పాటు పౌరుల మధ్య మత కల్లోలాలను సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పందిస్తూ ఇందులో మతతత్వానికి సంబంధించిన విషయం ఏం లేదని స్పష్టం చేశారు. అదృష్టం పేరుతో మోసగించినందుకు అతనిపై కోపంతో హిందువులు, ముస్లింలు మొత్తం ఆరుగురు దాడి చేశారని పేర్కొన్నారు.ఇక ఇదే వీడియోపై ట్విట్టర్, ట్విట్టర్ కమ్యూనికేషన్ ఇండియా, ద వైర్ జర్నలిస్టులు మహ్మద్ జుబైర్, రానా అయూబ్, కాంగ్రెస్ నేతలు శర్మ మహ్మద్, సల్మాన్ నిజామీ, మస్కూర్ ఉస్మానీ, రచయిత సభా నఖ్వీలపై ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. -
ట్విట్టర్ ఇండియా హెడ్ గుడ్ బై
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్ భారత్ విభాగం చీఫ్ రుషి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన రాజీనామా విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు. గత నాలుగేళ్లుగా ట్విట్టర్ అభివృద్దికి కృషి చేశానని, కొత్త అవకాశాలు చూసుకోనున్నట్టు తెలిపారు. దేశంలో ట్విట్టర్ ఆపరేషన్లలో రుషి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ట్విట్టర్ ఆసియా పసిఫిక్, మధ్య ఈశాన్య ఆఫ్రికా బిజినెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ నెల చివర్లో ఆయన బాధ్యతల నుంచి వైదొలుగుతారు. అప్పటికి నాలుగేళ్ల సర్వీసు పూర్తవుతుంది. కాగా తర్వాత ఏ బాధ్యతలు చేపడుతారన్న విషయాన్ని రుషి వెల్లడించలేదు. ట్విట్టర్ అభివృద్దికి రుషి ఎంతో కృషిచేశారంటూ కంపెనీ ప్రతినిధి ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.