
ట్విట్టర్ ఇండియా హెడ్ గుడ్ బై
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్ భారత్ విభాగం చీఫ్ రుషి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన రాజీనామా విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు. గత నాలుగేళ్లుగా ట్విట్టర్ అభివృద్దికి కృషి చేశానని, కొత్త అవకాశాలు చూసుకోనున్నట్టు తెలిపారు.
దేశంలో ట్విట్టర్ ఆపరేషన్లలో రుషి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ట్విట్టర్ ఆసియా పసిఫిక్, మధ్య ఈశాన్య ఆఫ్రికా బిజినెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ నెల చివర్లో ఆయన బాధ్యతల నుంచి వైదొలుగుతారు. అప్పటికి నాలుగేళ్ల సర్వీసు పూర్తవుతుంది. కాగా తర్వాత ఏ బాధ్యతలు చేపడుతారన్న విషయాన్ని రుషి వెల్లడించలేదు. ట్విట్టర్ అభివృద్దికి రుషి ఎంతో కృషిచేశారంటూ కంపెనీ ప్రతినిధి ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.