
ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి తొలగిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా హెడ్ నియమితులైన మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ చేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్ నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను అనుసరించి ఇండియా హెడ్‌గా మనీశ్ మహేశ్వరి నియమితులయ్యారు.
గత ఏడాది కాలంగా ఇండియాలో ట్విట్టర్‌కి కలిసి రావడం లేదు. కొత్త ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కొంత కాలం గళం విప్పింది ట్విటర్. గ్రీవెన్స్ అధికారిగా ఇండియన్‌నే నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు మీన మేషాలు లెక్కించింది. దీంతో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. చివరకు భారతీయుడినే గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. తాజాగా రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల ఖాతాలను ట్విటర్ నిలిపివేసింది.