Removes
-
గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు..
చట్టబద్ధంగా లేని రుణ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి తొలగించింది. 2022లో ఇలాంటివి ఏకంగా 3,500 యాప్‌లను గూగుల్ తొలగించినట్లు ప్లే ప్రొటెక్ట్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ 2022లో భారతదేశంలో 3,500 కంటే ఎక్కువ లోన్ యాప్‌లపై గూగుల్ చర్య తీసుకుంది. అంటే ఆ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇదీ చదవండి: కొడుకు పెళ్లికి అంబానీ దంపతులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి కొత్త విషయం! భారత్‌లో వ్యక్తిగత రుణాలు, ఆర్థిక సేవల యాప్‌లకు సంబంధించి గూగుల్ తన విధానాన్ని 2021లో అప్డేట్ చేసింది. ఈ విధానం 2021 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. వ్యక్తిగత రుణాలను అందించడానికి ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందినట్లు యాప్ డెవలపర్లు ధ్రువీకరించాలి. అలాగే లైసెన్స్ కాపీని సమర్పించాలి. ఒక వేళ వారికి ఈ లైసెన్స్ లేకపోతే లైసెన్స్ ఉన్న రుణదాతలకు ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే తాము ఉన్నట్లు ధ్రువీకరించాలి. డెవలపర్ ఖాతా పేరు నమోదిత వ్యాపార పేరు ఒక్కటే అయి ఉండాలి. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు! ఈ రుణ యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్ 2022లో మరిన్ని నిబంధనలు చేర్చింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), బ్యాంకులకు ఫెసిలిటేటర్లుగా వ్యక్తిగత రుణాలను అందించే యాప్ డెవలపర్లు మరికొన్ని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ డెవలపర్లు వారి భాగస్వామి NBFC, బ్యాంకుల పేర్లను, వాటికి తాము అధీకృత ఏజెంట్లనే విషయం తెలియజేసే వెబ్సైట్ల లైవ్ లింక్‌ను యాప్ వివరణలో బహిర్గతం చేయాలి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రుణ యాప్‌లకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసిన గూగుల్ ఉల్లంఘించిన యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. -
Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశాడు. సబ్స్క్రిప్షన్ చార్జీలు చెల్లించని యూజర్ల అకౌంట్లన్నింటికీ బ్లూ టిక్‌లు తొలగించింది ట్విటర్. ఇందులో టాప్ సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, హై-ప్రొఫైల్ బిజినెస్మేన్లు ఉన్నారు. నెలవారీ రుసుము 8 డాలర్లు (సుమారు రూ. 660) చెల్లించని హై-ప్రొఫైల్ యూజర్ల ఖాతాలకు సంబంధించిన బ్లూటిక్‌లను ట్విటర్ తొలగించింది. వెరిఫైడ్ బ్లూటిక్ కావాలంటే కచ్చితంగా సబ్స్క్రిప్షన్ చార్జీ చెల్లించాలని లేకుంటే ఏప్రిల్ 20 నుంచి బ్లూటిక్‌లను తొలగిస్తామని గత కొన్ని రోజులుగా ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ హెచ్చరిస్తూనే ఉన్నారు. గడువు తేదీ అయిపోగానే సబ్స్క్రిప్షన్ చార్జీ చెల్లించని అకౌంట్లన్నికీ వెరిఫైడ్ బ్లూటిక్ టిక్‌ను ట్విటర్ తొలగించింది. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ ఇంకా పలువురు బడా వ్యాపారవేత్తలు తమ ట్విటర్ అకౌంట్లకు బ్లూటిక్‌ను కోల్పోయారు. తమ బ్లూ టిక్ అలాగే ఉండాలనుకునేవారు నెలకు సుమారు రూ.660 చొప్పున చెల్లించి ట్విటర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. ఇక వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ఉంచుకోవాలనుకునే సంస్థలు నెలవారీ రుసుము 1,000 డాలర్లు (రూ. 82వేలకు పైగా)తో పాటు 50 డాలర్లు (సుమారు రూ. 4,100) అదనంగా చెల్లించాలి.ట్విటర్ 'వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్' కోసం గోల్డ్ టిక్‌లను, ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలకు గ్రే టిక్‌లను ట్విటర్ అందిస్తుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
మారుతి ఎస్-క్రాస్ ఔట్: వినియోగదారులకు షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన ఫ్టాగ్‌షిప్ కారు మారుతి ఎస్-క్రాస్ కారును నిలిపివేసింది. గ్రాండ్ విటారాకు కంటే ముందు తీసుకొచ్చిన నెక్సా తొలి కారుఎస్-క్రాస్‌ను మారుతి నెక్సా వెబ్సైట్ నుంచి తొలగించింది. అంటే మార్కెట్‌నుంచి నిలివేసింది. 2015లో నెక్సా ఫస్ట్ అండ్ ఫ్లాగ్షిప్ కార్గా దీన్ని లాంచ్ చేసింది. (‘ప్లీజ్..కొనండి’ సేల్స్‌మేన్‌లా ఎలాన్ మస్క్ లేటెస్ట్ ట్వీట్ సంచలనం) కాంపాక్ట్ ఎస్యూవీ గ్రాండ్ విటారా లాంచ్, ధర ప్రకటన తర్వాత మారుతి తన అధికారిక నెక్సా వెబ్సైట్ నుండి ఎస్-క్రాస్‌ను తీసివేసింది. గ్రాండ్ విటారా ఇప్పటికే 60వేల బుకింగ్‌లను పొందింది. దీనికి 28 వారాల కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంది. తాజాగా మారుతి ఎస్-క్రాస్ ప్లేస్‌ను 2022 గ్రాండ్ విటారా ఎస్యూవీ ఆక్రమించింది. 1.6-లీటర్, 1.3-లీటర్ డీజిల్ ఇంజీన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S-క్రాస్ ముందుగా మార్కెట్లోకి వచ్చింది. తర్వాత డీజిల్ వెర్షన్‌ను ఆపేసి, 2020లో పెట్రోల్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ దూసుకుపోవడంతో S-క్రాస్ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. ఈ సంవత్సరం జూలై, ఆగస్టులో ఒక్క కారు కూడా విక్రయించలేకపోయారు. ఈ నేపథ్యంలో భారత్ మార్కెట్లో S-క్రాస్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. గ్రాండ్ విటారాతో మిడ్-సైజ్ ఎస్యూవీ మార్కెట్లో పట్టు నిలుపుకోవాలని మారుతి భావిస్తోంది. క్రెటా, సెల్టోస్‌కు రానున్న రోజుల్లో ఇది గట్టి పోటీ ఇస్తుందని మారుతి అంచనా వేస్తోంది. (క్లిక్ చేయండి: గ్రాండ్ విటారా లాంచ్.. స్టైలిష్ లుక్, మిగతా కంపెనీలకు గట్టి పోటీ గురూ!) -
అణు నిఘాను ఇరాన్ అడ్డుకుంటోంది
వియెన్నా: అణు కేంద్రాల వద్ద ఉన్న నిఘా కెమెరాలను ఇరాన్ తొలగించడంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఈఏ పర్యవేక్షణ కోసం నతాంజ్ భూగర్భ అణు శుద్ధి కేంద్రం వద్ద బిగించిన రెండు కెమెరాలను ఆఫ్ చేసినట్లు బుధవారం ఇరాన్ ప్రకటించింది. యురేనియం శుద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు కూడా ఇరాన్ ఐఏఈఏకి సమాచారం అందించింది. అగ్రరాజ్యాలతో జరుగుతున్న అణు చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో ఒత్తిడి పెంచేందుకే ఇరాన్ ఈ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. దేశంలోని మూడు అప్రటిత ప్రాంతాల్లో కనుగొన్న అణుధార్మిక పదార్ధాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందించడంలో విఫలమైందంటూ ఇరాన్‌ను బుధవారం ఐఏఈఏ తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఐఏఈఏలోని 35 దేశాలకు 30 బలపరిచాయి. తీర్మానాన్ని రష్యా, చైనా వీటో చేయగా లిబియా, పాకిస్తాన్, భారత్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానోవియెన్నాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్ అధికారులు నతాంజ్, ఇస్ఫాహాన్‌ల వద్ద ఉన్న రెండు మాత్రమే కాదు, మొత్తం 40కి పైగా కెమెరాలకు గాను 27 కెమెరాలను మూసేసినట్లు సమాచారం ఉందన్నారు. ఈ చర్యతో ఇరాన్ అణు కార్యక్రమం పురోగతి వివరాలు అంతర్జాతీయ సమాజానికి వెల్లడయ్యే అవకాశం లేదన్నారు. అణుకేంద్రాల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఇరాన్ 2021 నుంచే ఐఏఈఏకి అందించడం మానేసింది. -
అంతర్జాతీయ జూడో సమాఖ్య నుంచి పుతిన్ వెలి
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అంతర్జాతీయ సమాజమంతా గుర్రుగా ఉంది. తాజాగా అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్) పుతిన్‌ను వెలివేసింది. ఆయన ఐజేఎఫ్‌లో గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఇంతకుముందే పుతిన్‌ను సస్పెండ్ చేసిన ఐజేఎఫ్ ఇప్పుడు ఆయనను శాశ్వతంగా తొలగించింది. పుతిన్ సన్నిహితుడు ఆర్కడి రోటెన్‌బర్గ్‌ను సైతం ఐజేఎఫ్ విడిచి పెట్టలేదు. ఐజేఎఫ్ అన్ని హోదాల నుంచి వీరిద్దరిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. -
ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ.!
ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి తొలగిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా హెడ్ నియమితులైన మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ చేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్ నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను అనుసరించి ఇండియా హెడ్‌గా మనీశ్ మహేశ్వరి నియమితులయ్యారు. గత ఏడాది కాలంగా ఇండియాలో ట్విట్టర్‌కి కలిసి రావడం లేదు. కొత్త ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కొంత కాలం గళం విప్పింది ట్విటర్. గ్రీవెన్స్ అధికారిగా ఇండియన్నే నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు మీన మేషాలు లెక్కించింది. దీంతో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. చివరకు భారతీయుడినే గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. తాజాగా రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల ఖాతాలను ట్విటర్ నిలిపివేసింది. -
ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న సూది: విజయవంతంగా శస్త్రచికిత్స
కర్నూలు (హాస్పిటల్): పొరపాటున మింగిన నీడిల్ (సూది) ఊపిరితిత్తుల్లో ఇరుక్కుంది. కర్నూలులోని సత్యసాయి ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు ఆధునిక పరికరాలతో ఆ సూదిని తొలగించి ఆయువు పోశారు. వివరాలను గురువారం ఎన్ఆర్ పేటలోని శ్రీ సత్యసాయి ఈఎన్టీ ఆస్పత్రిలో వైద్యులు డాక్టర్ బి.జయప్రకాశ్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన పరశురాముడు పశువులకు వేసే సూదిమందు ఇచ్చే నీడిల్ (సూదిని) నోటిలో పెట్టుకుని పరధ్యానంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆ సూది పొరపాటున గొంతులోకి వెళ్లింది. దీంతో అతను ఉక్కిరిబికిరి అయ్యాడు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారి విపరీతమైన దగ్గు, గొంతునొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చేరాడు. పరిశీలించిన వైద్యులు అత్యాధునిక వైద్యపరికరాలైన టెలిస్కోపిక్ బ్రాంకోస్కోప్ ద్వారా చాకచక్యంగా ఆ సూదిని బయటకు తీశారు. ఇప్పటివరకు తాను నిర్వహించిన చికిత్సల్లో ఇది ఎంతో క్లిష్టమైందని డాక్టర్ జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
నెటిజన్లకు షాక్, పోస్ట్‌లపై 'కూ' యాప్ కొరడా
ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ యాప్ 'కూ' యూజర్లపై కొరడా ఝుళిపించింది.కేంద్ర ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అకౌంట్లను బ్లాక్ చేసే పనిలో పడింది. దేశ భద్రత దృష్ట్యా కేంద్రం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021కు వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా అకౌంట్లపై ఆయా సోషల్ మీడియా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 'కూ' యాప్ 3,431 సోషల్ మీడియా పోస్టులపై దృష్టిసారించింది. జులై నెలలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ విరుద్దంగా ఉన్న 498 పోస్ట్‌లను డిలీట్ చేసింది. మరో 2,933 పోస్ట్‌లను పర్యవేక్షించనుంది. కూ యాప్ వివరాల ప్రకారం.. 'ప్రో యాక్టీవ్ మోడరేట్'లో భాగంగా మొత్తం 65,280 పోస్ట్ లను దృష్టిసారించగా..వాటిలో 1,887 పోస్ట్‌లను డిలీట్ చేసినట్లు మిగిలిన 63,393 పోస్ట్‌లపై హెచ్చరికలు జారీ చేయడం, బ్లర్ చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అకౌంట్ వెరిఫికేషన్ జులైలో ఐటీ రూల్స్ అనుగుణంగా ఉన్న ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లను బ్లూటిక్ వెరిఫికేషన్‌కు అప్లయ్ చేయాలని సూచించింది. తాజాగా కూ యాప్ సైతం ఎల్లో టిక్ వెరిఫికేషన్‌కు అప్లయ్ చేయాలని కోరింది. కాగా, బ్లూటిక్, ఎల్లో టిక్ వెరిఫికేషన్ అకౌంట్ కావాలంటే ప్రముఖులై ఉండాలి. ఉదాహరణకు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినిమా స్టార్స్, స్పోర్ట్స్ పర్సన్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలా ఆయా రంగాల్లో రాణిస్తున్న వారి సేవలకు గుర్తుగా ఆయా సోషల్ మీడియా సంస్థలు ఈ వెరిఫికేషన్ అకౌంట్లను అందిస్తుంటాయి. -
కాంట్రాక్టు లేదు... వాట్సాప్ గ్రూప్‌లో ఉండేది లేదు
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి కాంట్రాక్టు దక్కని క్రికెటర్లు ఆమిర్, హసన్ అలీ చీఫ్ సెలక్టర్ కమ్ కోచ్ మిస్బా ఉల్ హక్ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలిగారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ఆటగాళ్లకు ఫిట్నెస్, శిక్షణ తదితర తాజా సమాచారాన్ని చేరవేసేందుకు, క్రికెటర్లతో టచ్‌లో ఉండేందుకు ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్ట్ దక్కలేదనే అసంతృప్తితోనే వాళ్లిద్దరు గ్రూప్ నుంచి నిష్క్రమించినట్లు సమాచారం. ఇటీవల పీసీబీ 18 మంది క్రికెటర్లకు కాంట్రాక్టు ఇచ్చింది. అయితే కాంట్రాక్టు జాబితాలో లేని ఆటగాళ్లను కూడా టీమ్ సెలక్షన్‌కు పరిగణిస్తామని చీఫ్ సెలక్టర్ మిస్బా వివరణ ఇచ్చాడు. -
వందలాది యాప్‌లను తొలగించిన గూగుల్
నిబంధనల ఉల్లంఘన, ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడుతున్న యాప్‌లపై శోధన దిగ్గజం గూగుల్ మరోసారి వేటు వేసింది. మొబైల్ ప్రకటన మోసాలను ఎదుర్కునే ప్రయత్నంలో గూగుల్ తన గూగుల్ ప్లే స్టోర్ నుండి వందలాది యాప్‌లకుచెక్ పెట్టింది. ఈ మేరకు గూగుల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ భద్రతా చర్యల్లో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో దాదాపు 600 అనువర్తనాలను గూగుల్ ప్లే స్టోర్ నుండి తీసివేసామని వెల్లడించింది. తమ ప్రకటనల మోనిటైజేషన్ ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్ యాడ్‌మాబ్, గూగుల్ యాడ్ మేనేజర్ నుండి నిషేధించామని ప్రకటించింది. భంగపరిచే ప్రకటనల తీరును తాము అనుమతించమని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో యాడ్ ట్రాఫిక్ క్వాలిటీ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ పెర్ బిజోర్కే తెలిపారు. విఘాతకరమైన ప్రకటనలతో సహా, అనవసర ట్రాఫిక్‌ను సృష్టిస్తున్న యాప్‌లను నిరోధించడంతో పాటు, వినియోగదారులు, ప్రకటనదారులకు భరోసా కల్పించేలా తమ ప్లాట్‌ఫాంపై తగిన విధానాలను అభివృద్ధికి, రూపకల్పనకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులు పెడుతూనే వుంటామన్నారు. యూజర్ బ్రౌజర్లో ఊహించని రీతిలో ఈ ప్రకటనలు పాప్ అప్అవుతూ అంతరాయం కలిగిస్తున్నాయని తెలిపింది. వాస్తవానికి వినియోగదారు యాప్‌లో చురుకుగా లేనప్పుడు కూడా ఒక విధమైన విఘాతకర ప్రకటనలనుహానికరమైన డెవలపర్లు మొబైల్స్‌లో అందిస్తున్నారని గూగుల్ ఆరోపించింది. తొలగించిన యాప్‌లు 4.5 బిలియన్లకు పైగా డౌన్లోడ్ అయినట్టు తెలిపింది. ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్‌లు ఉన్నట్టు తెలిపింది. ఈ యాప్‌ల డెవలపర్లు ప్రధానంగా చైనా, హాంకాంగ్, సింగపూర్, భారతదేశంలో ఉన్నారని వివరించింది. అయితే తొలగించిన అప్లికేషన్ల వివరాలను మాత్రం గూగుల్ వెల్లడించలేదు. -
పీఎన్బీ స్కాం : కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై చీఫ్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఈడీ స్పెషల్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్యుజిటివ్ వ్యాపారవేత్త పీఎన్బీ స్కాం నిందితుడు నీరవ్ మోదీ కేసును పరిశీలిస్తున్న అధికారులను ఆయన అకారణంగా బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వినీత్ అగర్వాల్‌పై ఈ వేటు వేసింది. ఈడీ స్పెషల్ డైరెక్టర్‌గా తొలగించి, తన సొంత కేడర్‌కు బదిలీ చేస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఈడీ జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత కుమార్‌ను నీరవ్ మోదీ కేసు విషయమై లండన్‌లో ఉండగా.. ఆయనను బదిలీ చేస్తూ మార్చి 29న వినీత్ అగర్వాల్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అయితే వెంటనే స్పందించిన ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా, సుత్యబ్రత బదిలీని రద్దు చేశారు. జాయింట్ డైరెక్టర్ విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు స్పెషల్ డైరెక్టర్ వినిత్ అగర్వాల్‌కు ఎలాంటి అధికారాలు లేవని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంతో వినీత్ పదవీకాలం ఇంకా మూడేళ్లు మిగిలి వుండగానే ఆయనకు షాక్ ఇచ్చింది కేంద్రం. కాగా 1994 ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్రకు క్యాడర్‌కు చెందిన అధికారి వినిత్ అగర్వాల్. 2017 జనవరిలో ఆయనను డిప్యుటేషన్ మీద ఈడీ స్పెషల్ డైరెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగాల్సి ఉంది. వినిత్ అగర్వాల్ ముంబై ఈడీ స్పెషల్ డైరెక్టర్ గా పనిచేసిన కాలంలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలను చూసేవారు. -
ఆర్ బీఐ మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నేపథ్యంలో నగదు కొరత కష్టాలను అధిగమించే చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు మరో వెసులుబాటు కల్పించింది. రూ 1,000 లోపు లావాదేవీల చార్జీలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈమేరకు అన్ని బ్యాంకులకు ఇతర ప్రీ పెయిడ్ సర్వీస్ ఏజెన్సీలకు సమాచారం అందించింది. 2017 జనవరి నుంచి మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వెయ్యి లోపు చెల్లింపులపై తక్షణ చెల్లింపుల సేవ (ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్, ఐఎంపీస్ ) యూఎస్ఎస్డీ ఆధారిత చెల్లింపులు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలపై ఎలాంటి చార్జీలను వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. పెద్ద నోట్లు రద్దు తర్వాత తాత్కాలిక చర్యల్లో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సమాజం లో ఎక్కువ మంది ప్రజల డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ ఆదేశాలుజారీ చేసినట్టు ఆర్ బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. -
తుందుర్రులో 144 సెక్షన్ ఎత్తేయాలి: YSRCP
-
న్యాయాధికారులను తొలగించిన గవర్నర్
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆర్.పి.రజ్ఖోవా ఇద్దరు న్యాయాధికారులను తొలగించారు. ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాంజీ థామస్, అదనపు అడ్వకేట్ జనరల్ ఆర్ హెచ్.నబంను విధుల నుంచి తప్పించారు. రాష్ట్రంలో పలు అంశాలకు సంబంధించి సీజ్ చేసిన పత్రాలను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన అనంతరం ఈ ఇద్దరు అధికారులను గవర్నర్ విధుల నుంచి తప్పించడం గమనార్హం. -
ఎఎఫ్ఎస్పీఏ చట్టం ఎత్తివేత
అగర్తలా: సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేస్తూ త్రిపుర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 1997లో ప్రవేశపెట్టిన వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను త్రిపుర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు త్రిపురముఖ్యమంత్రి నేతృత్వంలో బుధవారం జరిగిన మాణిక్ సర్కార్ కేబినెట్ సమావేశం తీర్మానించింది. సమస్యాత్మక ప్రాంతాలలో పరిస్థితిని ఆర్నెల్లకోసారి సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న రాష్ట్ర పోలీసులు, మిగిలిన సెక్యూరిటీ వర్గాల్లో చర్చించి, వారి సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతియుత వాతావరణం ఉందనీ, ఇక ఈ చట్టం అవసరం లేదని భావించామని హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం మాణిక్ ఈ సందర్భంగా మీడియకు వివరించారు. దీనిపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచితనం, మానవత్వం సాధించిన విజయమంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఉగ్రవాదులను అణిచివేసే పేరుతో సాయుధ బలగాలు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టడంపై పలు ఆందోళనలు చెలరేగాయి. ఈ చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతూ మణిపూర్ లో ఇరోం షర్మిల 2000 సం.రం నుంచి పోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు త్రిపుర, మణిపూర్ , జమ్ముకాశ్మీర్ లాంటి ఈశాన్య రాష్ర్టాలలో 18 ఏండ్లుగా ఈ చట్టం అమలవుతోంది.