ఎఎఫ్ఎస్పీఏ చట్టం ఎత్తివేత | Tripura Removes Controversial Armed Forces Special Powers Act | Sakshi
Sakshi News home page

ఎఎఫ్ఎస్పీఏ చట్టం ఎత్తివేత

Published Thu, May 28 2015 1:01 PM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM

ఎఎఫ్ఎస్పీఏ  చట్టం ఎత్తివేత - Sakshi

ఎఎఫ్ఎస్పీఏ చట్టం ఎత్తివేత

అగర్తలా: సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేస్తూ  త్రిపుర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 1997లో ప్రవేశపెట్టిన వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ)ను  త్రిపుర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు త్రిపురముఖ్యమంత్రి  నేతృత్వంలో బుధవారం జరిగిన మాణిక్ సర్కార్  కేబినెట్ సమావేశం తీర్మానించింది.

సమస్యాత్మక ప్రాంతాలలో పరిస్థితిని ఆర్నెల్లకోసారి సమీక్షించిన  తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న  రాష్ట్ర పోలీసులు, మిగిలిన సెక్యూరిటీ వర్గాల్లో చర్చించి, వారి సలహా మేరకు ఈ  నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో  ప్రస్తుతం  శాంతియుత వాతావరణం ఉందనీ, ఇక ఈ చట్టం అవసరం లేదని భావించామని హోం శాఖను కూడా నిర్వహిస్తున్న  సీఎం మాణిక్ ఈ సందర్భంగా మీడియకు వివరించారు.

దీనిపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచితనం, మానవత్వం  సాధించిన విజయమంటూ ఆయన  ట్వీట్ చేశారు. కాగా ఉగ్రవాదులను అణిచివేసే పేరుతో  సాయుధ బలగాలు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టడంపై పలు ఆందోళనలు చెలరేగాయి.  ఈ చట్టాన్ని ఎత్తివేయాలని కోరుతూ  మణిపూర్ లో  ఇరోం షర్మిల  2000 సం.రం నుంచి పోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదుల చొరబాటును నిరోధించేందుకు   త్రిపుర, మణిపూర్ , జమ్ముకాశ్మీర్  లాంటి ఈశాన్య రాష్ర్టాలలో 18 ఏండ్లుగా ఈ చట్టం అమలవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement