ఆర్ బీఐ మరో కీలక నిర్ణయం | RBI removes any charges on transactions upto Rs 1,000 settled on IMPS, USSD, UPI systems | Sakshi
Sakshi News home page

ఆర్ బీఐ మరో కీలక నిర్ణయం

Published Fri, Dec 16 2016 6:07 PM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM

ఆర్ బీఐ మరో కీలక నిర్ణయం - Sakshi

ఆర్ బీఐ మరో కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నేపథ్యంలో నగదు కొరత కష్టాలను అధిగమించే చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రజలకు మరో వెసులుబాటు కల్పించింది. రూ 1,000 లోపు  లావాదేవీల   చార్జీలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం  ప్రకటించింది.   ఈమేరకు అన్ని బ్యాంకులకు ఇతర ప్రీ పెయిడ్ సర్వీస్ ఏజెన్సీలకు  సమాచారం అందించింది.  2017 జనవరి నుంచి మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని  స్పష్టం చేసింది.  వెయ్యి లోపు చెల్లింపులపై తక్షణ  చెల్లింపుల సేవ (ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్, ఐఎంపీస్ ) యూఎస్ఎస్డీ ఆధారిత చెల్లింపులు, యూనిఫైడ్  పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలపై ఎలాంటి చార్జీలను వసూలు  చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.  
 పెద్ద నోట్లు రద్దు తర్వాత తాత్కాలిక చర్యల్లో భాగంగా  ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సమాజం లో  ఎక్కువ మంది ప్రజల  డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ ఆదేశాలుజారీ చేసినట్టు  ఆర్ బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement