USSD
-
త్వరలో యూఎస్ఎస్డీ కాల్ ఫార్వర్డ్ సదుపాయం రద్దు.. ఎందుకంటే..
కాల్ ఫార్వర్డ్ సేవలు వినియోగించుకుంటున్న యూజర్లు ఇకపై వాటిని వాడుకునేందుకు ఇతర పద్ధతులను పాటించాలని టెలికాం విభాగం తెలిపింది. యూఎస్ఎస్డీ కాల్ ఫార్వర్డింగ్‌లను ఏప్రిల్ 15 నుంచి నిలిపివేయాలని టెలికాం విభాగం (డాట్) టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఆ సేవలను తిరిగి యాక్టివేట్ చేసుకునేలా ఆపరేటర్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ ద్వారా కాల్ ఫార్వర్డింగ్ సదుపాయం అందిస్తున్నారు. దీన్ని ఐఎమ్ఈఐ నంబర్లు, మొబైల్ ఫోన్ బ్యాలెన్స్‌లను తనిఖీ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని *401# సేవలుగా వీటిని పిలుస్తుంటారు. యూఎస్ఎస్డీ కాల్ ఫార్వర్డ్ సదుపాయాన్ని కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తుండడంతో టెలికా విభాగం ఈ చర్యలకు పూనుకుంది. మొబైల్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు టెలికాం విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. యూఎస్ఎస్డీ ఆధారిత కాల్ ఫార్వర్డింగ్ సేవలున్న ప్రస్తుత వినియోగదారులు అందరూ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తిరిగి వీటిని యాక్టివేట్ చేసుకోవాలని డాట్ ప్రకటన జారీ చేసింది. ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్ -
మొబైల్ యూజర్లకు శుభవార్తను అందించిన ట్రాయ్..!
డిజిటల్ చెల్లింపులే లక్ష్యంగా ఫీచర్ ఫోన్లలో యూపీఐ లావాదేవీలను ప్రొత్సహించేందుకుగాను ఆర్బీఐ యూపీఐ123పేను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సేవల్లో భాగంగా..మొబైల్ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికీ అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) సందేశాలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు గురువారం ట్రాయ్ ప్రకటించింది. దీంతో ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం వాడే యూఎస్ఎస్డీ సందేశాలను మొబైల్ యూజర్లు పూర్తి ఉచితంగా పొందవచ్చును. కాగా రెండు సంవత్సరాల తరువాత USSD సేవలకు ఛార్జీల విధింపుపై ట్రాయ్ సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా టెలికాం ఆపరేటర్లు USSD సందేశాలపై గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అసలు ఏంటి యూఎస్ఎస్డీ సందేశాలు..! USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) మెసేజ్‌లను జీఎస్ఎమ్ సెల్ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్. అంటే సాధారణంగా మన మొబైల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికాం సంస్థలు యూఎస్ఎస్డీ నంబర్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. చదవండి: వచ్చేసింది..గూగుల్ పే, ఫోన్ పే యాప్స్‌కు పోటీగా టాటా పే...! -
మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇక వాటిపై ఛార్జీలుండవు..!
మొబైల్ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికీ అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) సందేశాలను ఉచితంగా అందించే ప్రతిపాదనను తెచ్చినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం వాడే యూఎస్ఎస్డీ సందేశాలను పూర్తి ఉచితంగా సేవలను అందించే ప్రతిపాదనను టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. ప్రస్తుతం ఆయా టెలికాం ఆపరేటర్లు గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. చదవండి: క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు..! డిజిటల్ చెల్లింపులే లక్ష్యంగా..! డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను రిజర్వ్ బ్యాంక్ చేసిన సూచనల మేరకు నవంబర్ 24న జరిగిన టెలికామ్టాక్లో మొబైల్ యూజర్లందరికీ USSD సందేశాలను ఉచితంగా అందించాలనే ప్రతిపాదనను ట్రాయ్ పలు టెలికాం ఆపరేటర్లకు తెలియజేసింది. అసలు ఏంటి యూఎస్ఎస్డీ సందేశాలు..! USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) మెసేజ్‌లను జీఎస్ఎమ్ సెల్ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్. అంటే సాధారణంగా మన మొబైల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికాం సంస్థలు యూఎస్ఎస్డీ నంబర్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. చదవండి: మీరు ఈ స్మార్ట్ఫోన్లను వాడుతున్నారా...! అయితే మీ కాల్ డేటా హ్యకర్ల చేతిలోకి..! -
యూఎస్ఎస్డీ చార్జీల తొలగింపుపై ట్రాయ్ దృష్టి
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించే దిశగా మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపు సర్వీసులకు సంబంధించి యూఎస్ఎస్డీ మెసేజీలపై చార్జీలను తొలగించాలని భావిస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్ విషయంలో ఒకో యూఎస్ఎస్డీ సెషన్‌కు టెలికం సంస్థలు విధిస్తున్న టారిఫ్‌లు .. ఒక నిమిషం అవుట్గోయింగ్ వాయిస్ కాల్ లేదా ఎస్ఎంఎస్ సగటు కన్నా అనేక రెట్లు అధికంగా ఉంటున్నాయని ట్రాయ్ పేర్కొంది. ఈ ప్రతిపాదనపై డిసెంబర్ 8లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుందని వివరించింది. ఉదాహరణకు, కాల్ చేసినప్పుడు లేదా ఎస్ఎంఎస్ పంపినప్పుడు మొబైల్ బ్యాలెన్స్ నుంచి ఎంత ఖర్చయ్యింది అన్నది స్క్రీన్‌పై కొంత సేపు చూపించి మాయమయ్యే మెసేజీలను యూఎస్‌ఎస్‌డీగా వ్యవహరిస్తారు. ఇవి ఎస్ఎంఎస్ల తరహాలో ఫోన్లో సేవ్ కావు. ప్రస్తుతం ఒకో యూఎస్ఎస్డీ సెషన్‌కు చార్జీలు గరిష్టంగా 50 పైసలుగా ఉన్నాయి. ట్రాయ్ ప్రతిపాదన ప్రకారం మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపు సేవలకు మాత్రం చార్జీలు ఉండవు, కానీ ఇతర సర్వీసులకు మాత్రం అమల్లోనే ఉంటాయి. చదవండి: శాటిలైట్ ఆపరేటర్ల నిబంధనలు సరళతరం కావాలి -
ఆర్ బీఐ మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ నేపథ్యంలో నగదు కొరత కష్టాలను అధిగమించే చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు మరో వెసులుబాటు కల్పించింది. రూ 1,000 లోపు లావాదేవీల చార్జీలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈమేరకు అన్ని బ్యాంకులకు ఇతర ప్రీ పెయిడ్ సర్వీస్ ఏజెన్సీలకు సమాచారం అందించింది. 2017 జనవరి నుంచి మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వెయ్యి లోపు చెల్లింపులపై తక్షణ చెల్లింపుల సేవ (ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్, ఐఎంపీస్ ) యూఎస్ఎస్డీ ఆధారిత చెల్లింపులు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలపై ఎలాంటి చార్జీలను వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. పెద్ద నోట్లు రద్దు తర్వాత తాత్కాలిక చర్యల్లో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సమాజం లో ఎక్కువ మంది ప్రజల డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ ఆదేశాలుజారీ చేసినట్టు ఆర్ బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. -
‘మొబైల్ బ్యాంకింగ్’పై ట్రాయ్ దృష్టి
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ బ్యాంకింగ్ వినియోగాన్ని పెంచే చర్యలపై ట్రాయ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా యూఎస్ఎస్డీ మెస్సేజీ ఆధారిత బ్యాకింగ్ సేవల టారిఫ్‌తోపాటు, ఈ చార్జీలను ఎవరు చెల్లించాలి...? కస్టమర్లా... లేక బ్యాంకులా? అన్న అంశాలపై ఆగస్ట్ 31లోపు ప్రజలు తమ అభిప్రాయం తెలియజేయాలని ట్రాయ్ కోరింది. దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన0్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు సేవలు అంతగా విస్తరించని ప్రాంతాల్లో యూఎస్ఎస్డీ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సేవలకు మంచి ఆదరణ లభిస్తుందని ట్రాయ్ అంచనా వేస్తోంది.