మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..! ఇక వాటిపై ఛార్జీలుండవు..! | TRAI Wants Free USSD Messages For All Users To Encourage Digital Payments | Sakshi
Sakshi News home page

TRAI: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..! ఇక వాటిపై ఛార్జీలుండవు..!

Published Thu, Nov 25 2021 9:21 PM | Last Updated on Thu, Nov 25 2021 10:01 PM

TRAI Wants Free USSD Messages For All Users To Encourage Digital Payments - Sakshi

మొబైల్‌ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా మొబైల్‌ యూజర్లందరికీ అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) సందేశాలను ఉచితంగా అందించే ప్రతిపాదనను తెచ్చినట్లు తెలుస్తోంది.   ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవల కోసం వాడే యూఎస్‌ఎస్‌డీ సందేశాలను పూర్తి ఉచితంగా సేవలను అందించే ప్రతిపాదనను టెలికాం ఆపరేటర్లను ట్రాయ్‌ కోరింది. ప్రస్తుతం ఆయా టెలికాం ఆపరేటర్లు గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. 
చదవండి: క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ సంచలన వ్యాఖ్యలు..!

డిజిటల్‌ చెల్లింపులే లక్ష్యంగా..!
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను రిజర్వ్‌ బ్యాంక్‌ చేసిన సూచనల మేరకు నవంబర్ 24న  జరిగిన టెలికామ్‌టాక్‌లో మొబైల్‌ యూజర్లందరికీ USSD సందేశాలను ఉచితంగా అందించాలనే  ప్రతిపాదనను ట్రాయ్‌ పలు టెలికాం ఆపరేటర్లకు తెలియజేసింది. 

అసలు ఏంటి యూఎస్‌ఎస్‌డీ సందేశాలు..!
USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) మెసేజ్‌లను జీఎస్‌ఎమ్‌ సెల్‌ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్‌లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్. అంటే సాధారణంగా మన మొబైల్‌లో బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్‌. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికాం సంస్థలు యూఎస్‌ఎస్‌డీ నంబర్స్‌ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. 
చదవండి: మీరు ఈ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నారా...! అయితే మీ కాల్‌ డేటా హ్యకర్ల చేతిలోకి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement