no charges
-
హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులు
పండుగ సీజన్ నేపథ్యంలో హోచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక రుసుము లేదా ఇతర ఛార్జీలు లేకుండా కొన్ని క్రెడిట్ కార్డ్‌లు అందిస్తోంది. స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.అయితే వీటికి వార్షిక/జాయినింగ్ రుసుము మాత్రమే ఉచితం. ఇతర చార్జీలు ఉండకూడదంటే అది మీరు చేసే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆఫర్‌ను పొందే ముందు నిబంధనలు, షరతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. పేర్కొన్న మొత్తాన్ని ఏటా ఖర్చు చేయకపోతే రెన్యూవల్ ఫీజుతోపాటు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.వార్షిక రుసుము ఎంత?వార్షిక రుసుము అనేది కార్డు జారీ చేసే బ్యాంకులు విధించే అతి ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి. పేరు సూచించినట్లుగా ప్రతి సంవత్సరం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక్కో కార్డుకు ఒక్కో రకంగా ఉంటుంది. టాటా న్యూ ప్లస్ వార్షిక రుసుము రూ.499. అదే టాటా న్యూ ఇన్ఫినిటీ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఇక స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.500 ఉంది. ప్రస్తుత ఆఫర్లో వీటిని ఎటువంటి ఫీజులు లేకుండానే పొందవచ్చు. -
సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు..
న్యూఢిల్లీ: ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిపే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండబోవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్ సాధానాల (పీపీఐ) ద్వారా జరిపే మర్చంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్చేంజ్ చార్జీలు వర్తిస్తాయని, వాటికి సంబంధించి కస్టమర్లపై చార్జీల భారం ఉండబోదని ఒక ప్రకటనలో వివరించింది. ఇదీ చదవండి: కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి వాలెట్ల వంటి పీపీఐ సాధనాల ద్వారా రూ. 2,000కు మించి జరిపే చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్చేంజ్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, బ్యాంకులు, ప్రీపెయిడ్ సాధనాలు, వ్యాపారవర్గాలకు మాత్రమే ఇది పరిమితం కానున్నప్పటికీ దీనితో కస్టమర్లపై చార్జీల భారం పడనుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్పీసీఐ తాజా వివరణ ఇచ్చింది. మరోమాటలో చెప్పాలంటే ఒక కంపెనీకి చెందిన వాలెట్ గల కస్టమరు మరో కంపెనీ వాలెట్ ఉన్న వర్తకులకు చెల్లింపులు జరిపినప్పుడు ఈ చార్జీలు వర్తిస్తాయి. రెండు వాలెట్ల మధ్య లావాదేవీలకు సంబంధించిన ఇంటర్చేంజ్ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి ఈ చార్జీలు సహాయపడతాయి. ప్రస్తుతం మొబైల్ వాలెట్ పేమెంట్ మార్కెట్లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివి ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. బ్యాంకు ఖాతా లేదా పీపీఐ/పేటీఎం వాలెట్ ద్వారా చెల్లింపులు జరిపినా ఏ కస్టమరుకూ ఎటువంటి చార్జీలు ఉండవని పేటీఎం తెలిపింది. -
ట్విటర్‌లాగా చార్జీలేమీ విధించం..
న్యూఢిల్లీ: యూజర్ల వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ట్విటర్‌లాగా చార్జీలేమి విధించబోమని, ఇది పూర్తిగా ఉచితమేనని దేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ చెప్పారు. ఆధార్ ఆధారిత స్వీయ ధృవీకరణతో పసుపు రంగు వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ని ఉచితంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. బాట్స్ (రోబో) సమస్యను సృష్టించినది ట్విటరే అని రాధాకృష్ణ ఆరోపించారు. మొదట్లో వాటిని ప్రోత్సహించిన ట్విటర్ ప్రస్తుతం నియంత్రించడానికి నానా తంటాలు పడుతోందని చెప్పారు. తాము సిసలమైన మనుషులమేనని యూజర్లు ధృవీకరించేందుకు, బ్లూ టిక్ పొందేందుకు .. వెరిఫికేషన్ పేరిట చార్జీలు వసూలు చేసే ప్రయత్నాల్లో ఉందని విమర్శించారు. కూ ఈ ఏడాది తొలి నాళ్ల నుండే స్వచ్ఛంద వెరిఫికేషన్‌ను యూజర్లకు చట్టబద్ధమైన హక్కుగా ఉచితంగా అందిస్తోందని రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటివరకూ 1,25,000 మంది భారతీయ యూజర్లు దీన్ని ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు వెరిఫైడ్ బ్యాడ్జ్‌ల కోసం 8 డాలర్ల ఫీజు విధించనుండటం మొదలైనవి వీటిలో ఉన్నాయి. -
యూపీఐ సేవలపై చార్జీలు!.. కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపుల విధానంలో (యూపీఐ) లావాదేవీలపై చార్జీలు విధించే యోచనేదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. యూపీఐ అనేది ప్రజలకు మేలు చేకూర్చేందుకు ఉద్దేశించిన డిజిటల్ ప్రయత్నం మాత్రమేనని పేర్కొంది. సర్వీస్ ప్రొవైడర్లు ఇతరత్రా మార్గాల ద్వారా తమ ఖర్చులను రాబట్టుకోవాల్సి ఉంటుందని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో తెలిపింది. డిజిటల్ చెల్లింపులు, పేమెంట్ ప్లాట్‌ఫాంలను ప్రోత్సహించడం కోసం డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు ప్రభుత్వం గతేడాది ఆర్థిక సహకారం అందించిందని, ఈ ఏడాది కూడా దాన్ని కొనసాగిస్తామని ప్రకటించిందని ఆర్థిక శాఖ వివరించింది. ఐఎంపీఎస్ తరహాలోనే యూపీఐ కూడా నిధుల బదలాయింపు వ్యవస్థ కాబట్టి ఈ విధానంలోనూ చార్జీలను వర్తింపచేసే అంశంపై రిజర్వ్ బ్యాంక్ చర్చాపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. UPI is a digital public good with immense convenience for the public & productivity gains for the economy. There is no consideration in Govt to levy any charges for UPI services. The concerns of the service providers for cost recovery have to be met through other means. (1/2) — Ministry of Finance (@FinMinIndia) August 21, 2022 -
మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇక వాటిపై ఛార్జీలుండవు..!
మొబైల్ యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికీ అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) సందేశాలను ఉచితంగా అందించే ప్రతిపాదనను తెచ్చినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం వాడే యూఎస్ఎస్డీ సందేశాలను పూర్తి ఉచితంగా సేవలను అందించే ప్రతిపాదనను టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. ప్రస్తుతం ఆయా టెలికాం ఆపరేటర్లు గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. చదవండి: క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు..! డిజిటల్ చెల్లింపులే లక్ష్యంగా..! డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను రిజర్వ్ బ్యాంక్ చేసిన సూచనల మేరకు నవంబర్ 24న జరిగిన టెలికామ్టాక్లో మొబైల్ యూజర్లందరికీ USSD సందేశాలను ఉచితంగా అందించాలనే ప్రతిపాదనను ట్రాయ్ పలు టెలికాం ఆపరేటర్లకు తెలియజేసింది. అసలు ఏంటి యూఎస్ఎస్డీ సందేశాలు..! USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) మెసేజ్‌లను జీఎస్ఎమ్ సెల్ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్. అంటే సాధారణంగా మన మొబైల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికాం సంస్థలు యూఎస్ఎస్డీ నంబర్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. చదవండి: మీరు ఈ స్మార్ట్ఫోన్లను వాడుతున్నారా...! అయితే మీ కాల్ డేటా హ్యకర్ల చేతిలోకి..! -
చార్జీలు వసూలు చేయకండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల నుంచి రైళ్లలోగానీ, బస్సుల్లోగానీ చార్జీలు వసూలు చేయరాదని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల ప్రయాణానికి వారి వంతు వచ్చే వరకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో రాష్ట్రాలు వలస కార్మికులకు ఆహారం, నీరు అందించాలనీ, రైళ్లలో రైల్వే శాఖ భోజనం, మంచినీరు సరఫరా చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వేలాది మంది వలస కార్మికులు అష్టకష్టాలు పడుతూ రోడ్లపై నడిచి వెళ్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం.. వలస కార్మికుల సమస్యను మే 26న సుమోటోగా స్వీకరించి, గురువారం విచారణ చేపట్టింది. కాలినడకన వెళుతోన్న వలస కార్మికులకు రవాణా సదుపాయాలను కల్పించాల్సిందిగా రాష్ట్రాలను కోరాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన సూచనలను కోర్టు గుర్తించింది. వలస కార్మికులు ఎందరున్నారు, వారి తరలింపు, వారి రిజిస్ట్రేషన్ విధానం తదితర పూర్తి సమాచారం రికార్డు చేయాలని సూచించింది. పేరు నమోదు చేసుకున్న తర్వాత వారిని ఎన్ని రోజులకు సొంత రాష్ట్రాలకు చేరుస్తామనే విషయంలో నిర్దిష్టత ఉండాలంది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటిదాకా 3,700 రైళ్లలో వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చినట్టు సొలిసిటర్ జనరల్ మెహతా తెలిపారు. -
నెఫ్ట్ చార్జీలపై ఆర్బీఐ శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: సేవింగ్ బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ (నెఫ్ట్) సేవలు 2020 జనవరి నుంచి ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం మేరకు బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఆర్బీఐ కోరింది. సమర్థవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన, సురక్షితమైన పేమెంట్ వ్యవస్థలను స్థాపించడం ఆర్బీఐ లక్ష్యమని, ఈ ప్రయత్నాల ఫలితంగా రిటైల్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 2018-సెప్టెంబర్ 2019 వరకు మొత్తం నగదు రహిత చెల్లింపుల్లో డిజిటల్ చెల్లింపులు 96శాతంగా ఉన్నాయి. అదే సమయంలో నెఫ్ట్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) వ్యవస్థలు సంవత్సరానికి 252 కోట్లు, 874 కోట్ల లావాదేవీలను నమోదు చేశాయి నెఫ్ట్ లావాదేవీలు 20 శాతం యూపీఐ లావాదేవాలు 263శాతం వృద్ధిని సాధించాయని తెలిపింది. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్), నెఫ్ట్ ఆర్బీఐ అందిస్తున్న రియల్ టైం పేమెంట్ వ్యవస్థలు. నెఫ్ట్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు నిధుల బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్ పెద్ద మొత్తంలో నిధులను తక్షణమే బదిలీ చేసుకోవచ్చు. -
మెస్ చార్జీలు లేవు.. బతుకమ్మకు కోట్లా ?
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థులకు రెండేళ్లుగా మెస్ చార్జీలు విడుదల చేయని ప్రభుత్వం..కేసీఆర్ కూతురు కవితకు మాత్రం బంగారు బతుకమ్మ ఆడటానికి కోట్ల రూపాయలు విడదల చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బతుకమ్మ అంటే కవిత అన్నట్లు చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని విర్శించారు. కేంద్రం ప్రకటించిన ఫసల్ బీమాకు రాష్ట్రం చెల్లించాల్సిన డబ్బులు కట్టకుండా రైతులకు పరిహారం రాకుండా చేశారని అన్నారు. రాయితీ ట్రాక్టర్లను కూడా అర్హులైన రైతులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. భారత్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లో జవాన్లు చేసిన ప్రతి దాడి పట్ల జవాన్లకు యావత్ జాతి వందనం చేస్తోందని అన్నారు. ఆయన వెంట నాయకులు తాళ్లపల్లి కుమారస్వామి, కొత్త దశరథం, చదువు రాంచంద్రారెడ్డి, వెంకటేష్ ఉన్నారు. -
తిరుమలలో వివాహ చార్జీలు రద్దు
తిరుమల : టీటీడీ ఉచిత వివాహాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తిరుమలలోని పౌరోహిత సంఘంలోని కల్యాణవేదిక కేంద్రంగా తొలిరోజు సోమవారం మొత్తం 42 వివాహాలు జరిగాయి. ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు పురోహితుడికి రూ.500, మేళం రూ.300, వీడియో తీసుకునేందుకు విద్యుత్ చార్జీలకు వసూలు చేసే రూ.60 లను టీటీడీ రద్దుచేసింది. ఆ మేరకు భక్తుల నుండి ఎలాంటి నగదు తీసుకోకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్న మొత్తం 42 జంటలు వివాహాలు ఉచితంగా నిర్వహించింది. అలాగే మలివిడతలో కొత్త జంటలకు శ్రీవారి కానుకగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు అందజేస్తారు. ఇదే సందర్భంగా రూ.300 టికెట్ల నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొత్త జంటలకు శ్రీవారి బహుమానంగా 25 గ్రాముల పది చిన్న ఉచిత లడ్డూలు అందజేయనున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా త్వరలోనే అమలు చేయనున్నారు. -
భారతదేశంలో వాట్సప్.. ఉచితమే!
ఇటీవలి కాలంలో.. వాట్సప్ వాడుకున్నందుకు కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని, అందువల్ల దానికి బదులు ఉచితంగా లభించే కొన్ని రకాల యాప్‌లను వాడుకోవాలని ప్రచారం జరుగుతోంది. దాన్ని వాట్సప్ తాజాగా ఖండించింది. భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం చాలా తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో వాట్సప్ అప్లికేషన్ ఉపయోగించుకున్నందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. అందువల్ల ఇక మీదట వాట్సప్ వాడకం విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, స్వేచ్ఛగా వాడుకోవచ్చని స్పష్టం అయిపోయింది.