హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌.. ఉచితంగా క్రెడిట్‌ కార్డులు | HDFC Bank offers credit cards without annual fee | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌.. ఉచితంగా క్రెడిట్‌ కార్డులు

Published Fri, Nov 1 2024 5:23 PM | Last Updated on Fri, Nov 1 2024 6:04 PM

HDFC Bank offers credit cards without annual fee

పండుగ సీజన్‌ నేపథ్యంలో హోచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వార్షిక రుసుము లేదా ఇతర ఛార్జీలు లేకుండా కొన్ని క్రెడిట్ కార్డ్‌లు అందిస్తోంది. స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూ ప్లస్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, టాటా న్యూఇన్ఫినిటీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఇందులో ఉన్నాయి. ఈ ఆఫర్‌ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

అయితే వీటికి వార్షిక/జాయినింగ్ రుసుము మాత్రమే ఉచితం. ఇతర చార్జీలు ఉండకూడదంటే అది మీరు చేసే ఖర్చుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆఫర్‌ను పొందే ముందు నిబంధనలు, షరతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. పేర్కొన్న మొత్తాన్ని ఏటా ఖర్చు చేయకపోతే రెన్యూవల్‌ ఫీజుతోపాటు ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

వార్షిక రుసుము ఎంత?
వార్షిక రుసుము అనేది కార్డు జారీ చేసే బ్యాంకులు విధించే అతి ముఖ్యమైన ఛార్జీలలో ఒకటి. పేరు సూచించినట్లుగా ప్రతి సంవత్సరం చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక్కో కార్డుకు ఒక్కో రకంగా ఉంటుంది. టాటా న్యూ ప్లస్‌ వార్షిక రుసుము  రూ.499. అదే టాటా న్యూ ఇన్ఫినిటీ కోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. ఇ‍క స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ.500 ఉంది. ప్రస్తుత ఆఫర్‌లో వీటిని ఎటువంటి ఫీజులు లేకుండానే పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement