భారతదేశంలో వాట్సప్.. ఉచితమే!
ఇటీవలి కాలంలో.. వాట్సప్ వాడుకున్నందుకు కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని, అందువల్ల దానికి బదులు ఉచితంగా లభించే కొన్ని రకాల యాప్లను వాడుకోవాలని ప్రచారం జరుగుతోంది. దాన్ని వాట్సప్ తాజాగా ఖండించింది.
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం చాలా తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో వాట్సప్ అప్లికేషన్ ఉపయోగించుకున్నందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. అందువల్ల ఇక మీదట వాట్సప్ వాడకం విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, స్వేచ్ఛగా వాడుకోవచ్చని స్పష్టం అయిపోయింది.