కాల్ ఫార్వర్డ్ సేవలు వినియోగించుకుంటున్న యూజర్లు ఇకపై వాటిని వాడుకునేందుకు ఇతర పద్ధతులను పాటించాలని టెలికాం విభాగం తెలిపింది. యూఎస్‌ఎస్‌డీ కాల్ ఫార్వర్డింగ్‌లను ఏప్రిల్ 15 నుంచి నిలిపివేయాలని టెలికాం విభాగం (డాట్) టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది.
ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఆ సేవలను తిరిగి యాక్టివేట్ చేసుకునేలా ఆపరేటర్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ ద్వారా కాల్ ఫార్వర్డింగ్ సదుపాయం అందిస్తున్నారు. దీన్ని ఐఎమ్‌ఈఐ నంబర్లు, మొబైల్ ఫోన్ బ్యాలెన్స్‌లను తనిఖీ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని *401# సేవలుగా వీటిని పిలుస్తుంటారు.
యూఎస్‌ఎస్‌డీ కాల్ ఫార్వర్డ్ సదుపాయాన్ని కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తుండడంతో టెలికా విభాగం ఈ చర్యలకు పూనుకుంది. మొబైల్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు టెలికాం విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. యూఎస్‌ఎస్‌డీ ఆధారిత కాల్ ఫార్వర్డింగ్ సేవలున్న ప్రస్తుత వినియోగదారులు అందరూ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తిరిగి వీటిని యాక్టివేట్ చేసుకోవాలని డాట్ ప్రకటన జారీ చేసింది.
ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్
Comments
Please login to add a commentAdd a comment