
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలపై ప్రభావం చూపే కొత్త నిబంధనను 2025 ఫిబ్రవరి 1 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అమలు చేయనుంది. తాజా ఆదేశాల ప్రకారం ప్రత్యేక అక్షరాలను(స్పెషల్ క్యారెక్టర్లు) కలిగిన యూపీఐ ఐడీ (@, #, $, %, &, మొదలైనవి)ల ద్వారా చేసే లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ యూపీఐ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
యూపీఐ లావాదేవీ ఐడీల జనరేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడానికి, యూపీఐ టెక్నికల్ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉండేలా చూడటానికి ఎన్‌పీసీఐ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 9, 2025న జారీ చేసిన ఆదేశాల ప్రకారం లావాదేవీ ఐడీలను జనరేట్ చేయడానికి యూపీఐ భాగస్వాములందరూ ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలను (అక్షరాలు, సంఖ్యలు) మాత్రమే ఉపయోగించాలని సలహా ఇచ్చింది. ప్రత్యేక సింబల్స్‌ను వాడకూడదని సూచించింది.
ఇదీ చదవండి: ఆదాయపన్ను కట్టని ఏకైక భారత రాష్ట్రం
ఈ చర్య వల్ల వ్యవస్థ సామర్థ్యాన్ని, భద్రతను పెంచడం, యూపీఐ లావాదేవీల అంతటా ఏకరూపతను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన పేమెంట్ అగ్రిగేటర్లు ఈ ఆదేశాలను ఇప్పటికే పాటించినప్పటికీ, కొంతమంది ఇంకా ఈ నిబంధనలు పాటించలేదు. ఫలితంగా 2025 ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక అక్షరాలతో ఉన్న యూపీఐ ఐడీలకు సంబంధించిన లావాదేవీలను కేంద్ర వ్యవస్థ రద్దు చేయనుంది. కొత్త మార్గదర్శకాలను పాటించని యూపీఐ యాప్‌ల వినియోగదారులపై ఈ ప్రభావం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment