id
-
ఈ ఒక్క ఐడీ చాలు.. ఆధార్ నెంబర్‌తో పనే లేదు!
ఆధార్ కార్డ్ అనేది భారతీయ పౌరులకు అవసరమైన గుర్తింపు పత్రం. దీనిని చాలా సందర్భాల్లో వివిధ పనులకు వినియోగించుకుంటారు. అయితే ప్రతి పనికి ఆధార్ నెంబర్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి బదులు 'వర్చువల్ ఐడీ' (VID) ఉపయోగించవచ్చు. ఇంతకీ ఈ వర్చువల్ ఐడీ అంటే ఏమిటి? దీనివల్ల ఉపయోగాలు ఏమిటనే విషయాలను ఇక్కడా వివరంగా తెలుసుకుందాం.వర్చువల్ ఐడీవర్చువల్ ఐడీ అనేది ఆధార్ కార్డ్‌తో అనుసంధానమైన 16 అంకెల సంఖ్య. దీనిని అసలైన ఆధార్ నెంబర్‌కు బదులుగా ఉపయోగించుకోవడానికి మాత్రమే కాకుండా.. ఈ-కేవైసీ వంటి వాటికోసం కూడా వినియోగించుకోవచ్చు. ఆధార్ నెంబర్ స్థానంలో.. వీఐడీ నెంబర్ ఉపయోగించడం వ్యక్తిగత గోప్యతను నిర్ధారిస్తుంది.ఆధార్ వర్చువల్ ఐడీ ఉపయోగాలు ● బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవడనికి ● ప్రభుత్వ సర్వీసులకు అప్లై చేసుకోవడనికి ● ఈ-కేవైసీ ప్రక్రియ కోసం ● ఆధార్ పీవీసీ కార్డ్ లేదా ఈ-ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి ● ప్రభుత్వ సబ్సిడీలను పొందటానికి ● పాస్‌పోర్టు కోసం అప్లై చేసుకోవడానికి ● కొత్త బీమా పాలసీని కొనుగోలు చేయడానికిఆధార్ వర్చువల్ ఐడీని ఎలా పొందాలి?▸ఆధార్ వర్చువల్ ఐడీ కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI)ను సందర్సించాలి.▸అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత భాషను ఎంచుకోవాలి.▸ఆధార్ సర్వీస్ అనే సెక్షన్లో 'వర్చువల్ ఐడీ జనరేటర్'పైన క్లిక్ చేయాలి. ▸వర్చువల్ ఐడీ జనరేటర్‌పై క్లిక్ చేసిన తరువాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.▸ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత మీకు ఒక 16 అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ కనిపిస్తుంది.▸స్క్రీన్‌పైన వర్చువల్ ఐడీ నెంబర్ కనిపించడమే కాకుండా.. మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ రూపంలో కూడా వస్తుంది.ఇదీ చదవండి: బ్యాంక్ చెక్‌పై 'ఓన్లీ' అని ఎందుకు రాస్తారో తెలుసా? -
ఫేక్ ఐడీలతో టీడీపీ పోస్టింగ్‌లు
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, హైదరాబాద్: తెర వెనుక టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి! కుట్రపూరితంగా పోస్టింగ్‌లు చేస్తూ బురద చల్లేందుకు ఎల్లో గ్యాంగ్ చేసిన యత్నాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల నివాసి వర్రా రాఘవరెడ్డి దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. జనవరి 26వతేదీ నుంచి తన పేరుతో కొందరు ఫేక్ ఐడీ సృష్టించి పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన ఆయన 28న పులివెందుల ఎస్ఐ అరుణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏపీ పీసీపీ చీఫ్ షర్మిలను అసభ్యంగా దూషిస్తూ ఫేక్ ఐడీ ద్వారా పోస్టులు చేస్తున్నారని, ఫేక్ ఐడీని ట్రేస్ చేయాలని రాఘవరెడ్డి కోరారు. ఇదే విషయంపై జనవరి 31న వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని దూషిస్తున్నారని వర్రా రాఘవరెడ్డి పేరుతో ఉన్న ఫేక్ ఐడీ వివరాలను హైదరాబాద్ పోలీసులకు అందచేశారు. తన పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు ఫేస్బుక్లో పోస్టు చేయడం వెనుక ఐ– టీడీపీ శ్రేణులున్నాయని వర్రా రాఘవరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. ఇలాంటి పోస్టులను ముందే పసిగట్టిన తాను ఇప్పటికే ఏపీ పోలీసులను విచారించాలని కోరినట్లు తెలిపారు. బెదిరింపులు పెరిగాయి: సునీత మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తనకు ప్రాణహాని ఉందంటూ శుక్రవారం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఇద్దరినీ చంపేస్తాం..’ అనే అర్థం వచ్చేలా గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్బుక్ ద్వారా పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఈ తరహా బెదిరింపులు ఎక్కువయ్యాయని, పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ శిల్పవల్లి దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మొయిత్రా ఢిల్లీలో ఉంటే.. దుబాయ్‌లో ఆమె లాగిన్ ఐడీని వాడారు
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే పరోక్షంగా మరికొన్ని ఆరోపణలు చేశారు. ఎంపీ మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్‌లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని వెల్లడించారు. ఎంపీ దుబే శనివారం ‘ఎక్స్’లో‘ ..‘కొంత డబ్బు కోసం ఆమె జాతీయ భద్రతను పణంగా పెట్టారు. ఇదే ఎన్ఐసీని ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, వివిధ కేంద్ర విభాగాలు వాడుతుంటాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్షాలు ఇంకా దీనిపై రాజకీయాలు చేయాలా? దీనిపై ఇక ప్రజలే నిర్ణయం తీసుకుంటారు’ అని దూబే పేర్కొన్నారు. కానీ, దర్యాప్తు విభాగం పేరును ఆయన పేర్కొనలేదు. అంతేకాకుండా, ఆమె ఎవరి నుంచి లంచం తీసుకున్నారు? వ్యాపారవేత్త దర్శన్ హిరా నందాని తరఫున అదానీ గ్రూప్, ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్‌సభలో ఆమె ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వంటి విషయాలను దుబే వివరించలేదు. ఎంపీ దుబేకి ఎథిక్స్ కమిటీ పిలుపు అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఎంపీ దుబే ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై లోక్‌సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా, ఈ నెల 26న తమ ముందు హాజరై మౌఖిక సాక్ష్యం ఇవ్వాలని దుబేను కోరింది. అదానీ గ్రూప్ గుజరాత్‌లోని తన కంపెనీకి బదులుగా ఒడిశాలోని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన విభాగంలో ఎల్ఎన్జీ నిల్వ చేసుకునేందుకు అనుమతి పొందిన అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ఎంపీ మహువా పార్లమెంటరీ ఐడీని లాగిన్ చేసినట్లు వివరిస్తూ హిరా నందాని స్వయంగా సంతకం చేసిన ఒక సీల్డు కవర్‌ను ఈ కమిటీకి అందజేశారు. ఈ వివరాలు కూడా బయటకు వెల్లడి కావడం గమనార్హం. ఎంపీ మొయిత్రాపై ఆరోపణల విషయంలో సొంత పార్టీ టీఎంసీ మౌనంగా ఉంటోంది. అయినప్పటికీ మొయిత్రా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అదానీ గ్రూప్‌పైనా, ఎంపీ దుబేపైనా ఆరోపణలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను ఎన్ఐసీ వెల్లడించాలి: మొయిత్రా తను ఢిల్లీలో ఉండగా పార్లమెంటరీ లాగిన్ ఐడీని దుబాయ్‌లో వాడారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన ఆరోపణలపై ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను కూడా ఎన్ఐసీ బహిరంగ పర్చాలని, వారు ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉన్నారో కూడా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. తనకంటే జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరం అదానీ గ్రూపేనని ఆమె ఎదురుదాడికి దిగారు. అదానీ గ్రూప్ కంపెనీ బొగ్గు దిగుమతులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. -
మార్పు మొదలైంది.. నాలుగేళ్లలో గణనీయమైన ప్రగతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు నేషనల్ అసెస్మెంటు అండ్ అక్రిడిటేషన్ (న్యాక్), నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు ఉండాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మూడేళ్లలో న్యాక్, ఎన్బీఏల్లో రెండింటిలో ఏ గ్రేడ్‌లో నిలిచేలా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. గడువులోపల న్యాక్, ఎన్బీఏ గుర్తింపు సాధించలేని కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేయాలని, గుర్తింపు రద్దు వంటి చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించారు. ఈ గుర్తింపు సాధన కోసం ఉన్నత విద్యా మండలిలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఏర్పాటు చేయించి కాలేజీలకు సహకారం అందించారు. ఈ చర్యల ఫలితంగా గత నాలుగేళ్లలో కాలేజీలలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు న్యాక్ అక్రిడిటేషన్ సాధించే కాలేజీల సంఖ్య నామమాత్రంగానే ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యలతో ఏటేటా వాటి సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు 1323 వరకు ఉన్నాయి. 2019లో అక్రిడిటేషన్ సాధించిన కాలేజీలు 43 మాత్రమే. ఆ తరువాత రెండేళ్ల పాటు కరోనా కారణంగా కాలేజీలలో ప్రత్యక్ష బోధన అరకొరగా సాగింది. కరోనా అనంతరం న్యాక్ గుర్తింపు సాధించకుంటే అడ్మిషన్లు నిలిచిపోతాయని హెచ్చరించడంతో అన్ని కాలేజీలు ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా పలు కాలేజీలకు వనరులు, ప్రమాణాలూ ఉన్నా న్యాక్ గుర్తింపు ప్రక్రియలో వెనుకబడ్డాయి. ఇటువంటి కాలేజీలకు క్వాలిటీ అస్యూరెన్సు సెల్ ద్వారా మార్గదర్శనం చేసి, న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేయించారు. చిన్న లోపాలతో గతంలో న్యాక్ గుర్తింపు రాకుండా పోయిన అనేక కాలేజీలు గత రెండేళ్లలో గుర్తింపును పొందేలా ప్రభుత్వం తోడ్పాటునందించింది. 2023 నాటికి మొత్తం 209 కాలేజీలకు న్యాక్ అక్రిడిటేషన్ లభించింది. ఈ ఒక్క ఏడాదిలోనే 81 కాలేజీలకు న్యాక్ అక్రిడిటేషన్ రాగా అందులో 7 ఏ ప్లస్ ప్లస్‌లో నిలిచాయి. -
విడుదలకు ముందే రికార్డ్.. ఏకంగా 37 అవార్డులు!
'గతం' అనే క్రేజీ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కిరణ్ రెడ్డి కొండమడుగుల. ఈ చిత్రాన్ని 2020లో తెరకెక్కించారు. తాజాగా మరోసారి ఐడీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిలీజ్ సిద్ధంగా ఈ చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుకలో సత్తా చాటింది. రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ఏకంగా 37 అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రానికి సాయిచరణ్ పాకాల సంగీతమందించారు. ఈ మూవీని సుభాష్ రావడ, భార్గవ పోలుదాసు నిర్మించారు. భార్గవ పోలుదాసు అద్భుతమైన పాత్రలో నటించారు. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) ఇదిలా ఉండాగా త్వరలో కెనడాలో ఒకేవిల్లే ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఐడీ చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అక్కడ ఈ చిత్రం అవార్డు గెలుచుకుంటే అది తమకి ఆస్కార్‌తో సమానమని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే 600 ఫిలిం ఫెస్టివల్స్‌లో ఇండియాతో పాటు దేశాల్లోనూ ప్రశంసలు దక్కించుకుందని తెలిపారు. (ఇది చదవండి: ఇంతవరకు చేయలేదా?.. ఆశ్చర్యంగా ఉందే.. ఉపాసన పోస్ట్ వైరల్!) -
విమాన టిక్కెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనలు
-
విమాన టిక్కెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేయనుంది. దేశీయ సర్వీసులపై కూడా తప్పనిసరి నిబంధనలను తీసుకురానుంది. ముఖ్యంగా దేశీయ విమాన టికెట్ల బుకింగ్ కోసం ఏదో ఒక ఐడి కార్డు జతచేయడం మాండేటరీ చేయనుంది. దీనికి సంబంధించి నో ఫ్లై లిస్ట్ (ఎన్ఎఫ్ఎల్)ను ఈ శుక్రవారం ప్రకటించనుంది. వచ్చే ఏడాది జులై నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రకటించనున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశీయ విమానం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏదో ఒక గుర్తింపు కార్డు జతచేయాల్సిందే. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటర్ ఐడి లాంటి గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి అని పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. మంగోలియాలో జరిగిన విమానయాన భద్రత సదస్సులో పాల్గొని తిరిగొచ్చిన సందర్భంగా మంత్రి 'నో ఫ్లయ్' జాబితాపై నిబంధనలను రూపొందించినట్లు పేర్కొన్నారు. తుది నియమాలను శుక్రవారం నాడు విడుదల చేయనున్నామని తెలిపారు. ఎన్ఎఫ్ఎల్ అమలు ఖరారైన తరువాత ఈ జాబితాలోని వారు మారు పేర్లతో టికెట్లను కొనుగోలు చేయకుండా చూసేందుకు సాధ్యమైనంత త్వరలో డిజిటల్ బోర్డింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్నామన్నారు. దీని కోసం ఆధార్ కార్డులతో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విమానాల భద్రత, అవాంఛనీయ ఘటనల నివారణ లక్ష్యంగా నో ఫ్లయ్ జాబితా నిబంధనలను తయారు చేసినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చీఫ్ బీఎస్ భుల్లార్ వెల్లడించారు. కాగా ఇప్పటివరకూ అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు పాస్ పోర్టు తప్పనిసరి, కానీ దేశీయ విమానాల టిక్కెట్ బుకింగ్‌కు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదు. అయితే ఇకపై నిబంధనలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. -
రానున్న మూడు నెలలు కీలకం...
ఒకపక్క పండుగలు,మరోపక్క ఉమ్మడి రాజధాని భద్రత అప్రమత్తమైన జంట పోలీసు కమిషనర్లు సాక్షి, సిటీబ్యూరో: రానున్న మూడు నెలలు పోలీసులకు సవాల్‌గా మారనున్నాయి. ఒకపక్క వరుసగా వస్తున్న ఇరువర్గాల పండుగలు.., మరోపక్క ఉమ్మడి రాజధాని భద్రతా చర్యలే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, ఆనంద్ రానున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన రాజేంద్రనగర్, మౌలాలి ఘటనలను దృష్టిలో పెట్టుకున్న వీరు మరింత జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే వీరు అదనపు పోలీసు కమిషనర్లు, సంయుక్త కమిషనర్లు, డీసీపీల నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో వేర్వేరుగా సమీ క్ష సమావేశాలు నిర్వహించారు. నగరంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలు ప్రారంభం కావడంతో పోలీసులపై మరింత పని భారం పెరిగింది. దీంతో పాటు మూడు నెలల్లో రంజాన్, బోనాలు, బక్రీద్, వినాయక ఉత్సవాలు రానున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. రెండు కమిషనరేట్లలో సిబ్బంది సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. వారితోనే ప్రణాళికాబద్ధంగా బందోబస్తు నిర్వహిస్తే మంచి ఫలి తాలు వస్తాయని భావిస్తున్నారు. ఇటీవల మౌలాలిలో జరిగిన మత ఘర్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మ ల్కాజిగిరి ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డిని కమిషనర్ ఆనంద్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘ టనలు పునరావృత్తం కాకుండా ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మతఘర్షణలు జ రిగితే మొదటి వేటుపడేది సంబంధిత స్టేషన్ ఇన్స్పెకర్పైనే అని ‘మల్కాజిగిరి’ ఘటన ద్వారా అందరికీ తె లిసింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లోని ఇన్స్పెక్టర్లు ఉదయం 8 గంటలకే ఠాణాకు వచ్చి కూర్చుంటున్నారు. బస్తీలు, కాలనీలలో జరిగే ప్రతి అం శాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. మైత్రీ కమిటీలపై చూపు.... ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటే ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా సులభంగా పరిష్కరించవచ్చనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు మైత్రీ, శాంతి కమిటీలపై దృష్టి పెట్టారు. ప్రతీ ఠాణాలో ఉన్న ఈ కమిటీలున్నా.. కొన్ని చోట్ల పని చేయడంలేదు. కమిటీలను పునరుద్ధరించి రాబోయే రోజుల్లో ఏదైనా సమస్యలు వస్తే వాటి సహకారంతోనే పరిష్కరించాలని పోలీసు కమిషనర్లు భావిస్తున్నారు. మైత్రీ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే అన్ని ఠాణాల ఇన్స్పెక్టర్లను సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశించారు. దీంతో సైబరాబాద్ పరిధిలో బుధవారం నుంచి మైత్రీ,శాంతి కమిటీలతో పోలీసులు సమావేశాలు ప్రారంభించారు. వారం రోజుల్లో సమావేశాలు పూర్తి చేసి భద్రతపై దృష్టి పెట్టనున్నారు. ఇక నగరంలో మాత్రం మైత్రీ సంఘాల సమావేశాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఇక్కడ కూడా మొదలు కానున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ, దానికి ఆనుకున్న ప్రాంతాలపై పోలీసులు మరింత దృష్టి కేంద్రీకరించారు. సైబరాబాద్లోనైతే మూడు నెలల పాటు ఏకంగా 144 సెక్షన్‌ను విధించారు. సెలవులు కరవే... వరుస పండుగల నేపథ్యంలో పోలీసు సిబ్బందికి రానున్న మూడు నెలల్లో ఎలాంటి సెలవులు లభించే అవకాశంలే దు. సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే... ఇక ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు ఠాణాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురంటున్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల కోసం కేంద్రం నుంచి అదనపు బలగాలు ఇంకా రాకపోవడంతో ప్రస్తుతం ఉన్న బలగాలతోనే బందోబస్తును నెట్టుకొస్తుండటంతో సివిల్ పోలీసులపై అధిక పనిభారం పడింది. -
జిల్లా మొదటి స్థానంలో నిలవాలి
పెద్దబజార్, న్యూస్‌లైన్ :రాష్ట్రంలోనే జిల్లా ఆర్టీసీని మొదటిస్థానంలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఇంజినీరింగ్, ఐటీ ఈడీ గుంటి జయరావు సూ చించారు. బుధవారం జిల్లాలోని ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హా జరై మాట్లాడారు. ఆర్టీసీ ప్రపంచంలోనే పెద్ద సంస్థ అ ని, రాష్ట్రంలో 24వేల బస్సులను నడుపుతోందన్నారు. తాను 1992లో నిజామాబాద్ డిపో -1 మేనేజర్‌గా విధులు నిర్వహించానని, మళ్ళీ ప్రస్తుతం ఈడీగా రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరీంనగర్ జోన్(నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్) అంటే లాభాల బాటగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం నిజామాబాద్-1 రూ. కోటీ 80 లక్షలు, నిజామాబాద్ -2 రూ. కోటీ 32 లక్షల లాభాల్లో ఉన్నాయన్నారు. జిల్లాలోని అందరు కార్మికులు, అధికారులు ఏకతాటిపై నిలిచి మరింత ముందుకు వెళ్ళాలని సూచించారు. ఏదైనా సమస్యలు వస్తే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. కార్మికుల కష్టసుఖాల వెనుక తాము ఉంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు డిపో 1లో మొక్కలను నాటారు. డిపో -2ని సందర్శించి అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా నిలిచిన 28 మందిని ఆయన సన్మానించారు. అంతకుముందు ముఖ్యఅతిథి జయరావుకు ఆయా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన ఉత్తమ ఉద్యోగులు వీరే.. ఎండి.గౌస్, సుబ్బారావ్, దీపక్‌కుమార్, శ్రీహరి, స్వా మి, సంజీవయ్య, సాగర్, రాజేందర్, లింగం, సా యిలు, సాంబయ్య, జె.బి.సింగ్, అశోక్, కె.ఎన్.రావు, నర్సింలు, ముత్తన్న, అనంత్‌రావు, రమణ, నాగేందర్, నారాయణ, వంశీ, ధర్మేందర్, జి.హెచ్.ఎం.రెడ్డి, ఆదినాథ్, మనోహర్, లక్ష్మణ్, రవీందర్, శ్రీనివాస్.