పెద్దబజార్, న్యూస్‌లైన్ :రాష్ట్రంలోనే జిల్లా ఆర్టీసీని మొదటిస్థానంలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఇంజినీరింగ్, ఐటీ ఈడీ గుంటి జయరావు సూ చించారు. బుధవారం జిల్లాలోని ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హా జరై మాట్లాడారు. ఆర్టీసీ ప్రపంచంలోనే పెద్ద సంస్థ అ ని, రాష్ట్రంలో 24వేల బస్సులను నడుపుతోందన్నారు. తాను 1992లో నిజామాబాద్ డిపో -1 మేనేజర్‌గా విధులు నిర్వహించానని, మళ్ళీ ప్రస్తుతం ఈడీగా రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరీంనగర్ జోన్(నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్) అంటే లాభాల బాటగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం నిజామాబాద్-1 రూ. కోటీ 80 లక్షలు, నిజామాబాద్ -2 రూ. కోటీ 32 లక్షల లాభాల్లో ఉన్నాయన్నారు. జిల్లాలోని అందరు కార్మికులు, అధికారులు ఏకతాటిపై నిలిచి మరింత ముందుకు వెళ్ళాలని సూచించారు. ఏదైనా సమస్యలు వస్తే అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. కార్మికుల కష్టసుఖాల వెనుక తాము ఉంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు డిపో 1లో మొక్కలను నాటారు. డిపో -2ని సందర్శించి అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులుగా నిలిచిన 28 మందిని ఆయన సన్మానించారు. అంతకుముందు ముఖ్యఅతిథి జయరావుకు ఆయా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు.
సన్మానం పొందిన ఉత్తమ ఉద్యోగులు వీరే..
ఎండి.గౌస్, సుబ్బారావ్, దీపక్‌కుమార్, శ్రీహరి, స్వా మి, సంజీవయ్య, సాగర్, రాజేందర్, లింగం, సా యిలు, సాంబయ్య, జె.బి.సింగ్, అశోక్, కె.ఎన్.రావు, నర్సింలు, ముత్తన్న, అనంత్‌రావు, రమణ, నాగేందర్, నారాయణ, వంశీ, ధర్మేందర్, జి.హెచ్.ఎం.రెడ్డి, ఆదినాథ్, మనోహర్, లక్ష్మణ్, రవీందర్, శ్రీనివాస్.
జిల్లా మొదటి స్థానంలో నిలవాలి
Published Thu, Sep 26 2013 2:26 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement