Gatham Movie Director Latest Movie ID Got 37 Awards - Sakshi
Sakshi News home page

ID Movie: రిలీజ్‌కు ముందే ప్రతిష్ఠాత్మక అవార్డ్ సొంతం..!

Published Sun, May 28 2023 9:48 PM | Last Updated on Mon, May 29 2023 10:37 AM

Gatham Movie Director latest Movie ID Got 37 Awards - Sakshi

'గతం' అనే క్రేజీ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కిరణ్ రెడ్డి కొండమడుగుల. ఈ చిత్రాన్ని 2020లో తెరకెక్కించారు. తాజాగా మరోసారి ఐడీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిలీజ్ సిద్ధంగా ఈ చిత్రం  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుకలో సత్తా చాటింది. రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ఏకంగా 37 అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రానికి సాయిచరణ్ పాకాల సంగీతమందించారు.  ఈ మూవీని సుభాష్ రావడ, భార్గవ పోలుదాసు నిర్మించారు. భార్గవ పోలుదాసు అద్భుతమైన పాత్రలో నటించారు. 

(ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్‌)

ఇదిలా ఉండాగా త్వరలో కెనడాలో ఒకేవిల్లే ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఐడీ చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అక్కడ ఈ చిత్రం అవార్డు గెలుచుకుంటే అది తమకి ఆస్కార్‌తో సమానమని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే 600 ఫిలిం ఫెస్టివ‍ల్స్‌లో ఇండియాతో పాటు దేశాల్లోనూ ప్రశంసలు దక్కించుకుందని తెలిపారు. 

(ఇది చదవండి: ఇంతవరకు చేయలేదా?.. ఆశ్చర్యంగా ఉందే.. ఉపాసన పోస్ట్ వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement