kiran reddy
-
హైడ్రా కూల్చివేతలు.. RERA చట్టం ఏం చెబుతోంది..?
-
జనప్రియ వారి సరికొత్త ప్రాజెక్ట్స్ ఇవే...
-
తెలంగాణ కాంగ్రెస్.. మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రం తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఇంకా పెండింగ్‌లో నాలుగు స్థానాలు సీఈసీలో 8 స్థానాలపై చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కేవలం ఆరు స్థానాలపై మాత్రమే చర్చ జరిగింది. పారీ్టలో అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్ అభ్యర్థి ఎవరనేది ప్రస్తావనకు రాలేదు. ఇక ఆరు స్థానాల్లోనూ నాలుగు సీట్లను మాత్రమే ఖరారు చేశారు. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నల పేర్లను పరిశీలించినా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ రెండు స్థానాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఎవరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31న మరోసారి జరగనున్న సీఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తలనొప్పిగా మారిన ఖమ్మం తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్ స్థానం హాట్ సీట్‌గా మారింది. ఎక్కువమంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరిని బరిలో దించాలన్న అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమకు సంబంధించిన అభ్యర్థులకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. భట్టి తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం, తుమ్మల తన కుమారుడు యుగంధర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. వీరితో పాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌లు సైతం తమకు ఖమ్మం సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం అభ్యర్థి ప్రకటన వాయిదా పడుతోందని చెబుతున్నారు. -
విడుదలకు ముందే రికార్డ్.. ఏకంగా 37 అవార్డులు!
'గతం' అనే క్రేజీ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కిరణ్ రెడ్డి కొండమడుగుల. ఈ చిత్రాన్ని 2020లో తెరకెక్కించారు. తాజాగా మరోసారి ఐడీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిలీజ్ సిద్ధంగా ఈ చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుకలో సత్తా చాటింది. రిలీజ్‌కి ముందే ఈ చిత్రం ఏకంగా 37 అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రానికి సాయిచరణ్ పాకాల సంగీతమందించారు. ఈ మూవీని సుభాష్ రావడ, భార్గవ పోలుదాసు నిర్మించారు. భార్గవ పోలుదాసు అద్భుతమైన పాత్రలో నటించారు. (ఇది చదవండి: వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్) ఇదిలా ఉండాగా త్వరలో కెనడాలో ఒకేవిల్లే ఫిలిం ఫెస్టివల్ వేడుకలో ఐడీ చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అక్కడ ఈ చిత్రం అవార్డు గెలుచుకుంటే అది తమకి ఆస్కార్‌తో సమానమని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే 600 ఫిలిం ఫెస్టివల్స్‌లో ఇండియాతో పాటు దేశాల్లోనూ ప్రశంసలు దక్కించుకుందని తెలిపారు. (ఇది చదవండి: ఇంతవరకు చేయలేదా?.. ఆశ్చర్యంగా ఉందే.. ఉపాసన పోస్ట్ వైరల్!) -
డెక్కన్ మాల్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
గ్రామ పంచాయతీ నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది
-
మేం హ్యాపీ..అందరూ హ్యాపీ
‘‘ఏ సినిమా అయినా అనుకున్న బడ్జెట్లోనే చేయడానికి చూస్తాం. స్క్రీన్ మీద బాగా కనబడుతుందంటే ఖర్చుపెట్టడానికి మాత్రం వెనకాడం. సంపాదించుకుందాం అని కాకుండా మంచి సినిమాలు, హానెస్ట్ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. రెస్పాన్సిబుల్‌గా ఉండాలి, నిర్మాణ విలువలు తగ్గకూడదనుకుంటాం’’ అన్నారు ‘ఎం.ఎల్.ఎ’ చిత్ర నిర్మాతలు భరత్ చౌదరి,కిరణ్ రెడ్డి. కల్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎం.ఎల్.ఏ’. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడారు. భరత్ చౌదరి మాట్లాడుతూ – ‘‘కిరణ్, నేను ఫ్రెండ్స్. ఇదివరకు డిస్ట్రిబ్యూషన్లో ఉండేవాణ్ణి. సినిమాల్లో ట్రైల్స్ వేద్దాం అని ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా నిర్మించాం. అనుకున్న ఫలితం దక్కింది. కంగారు పడకుండా సంవత్సరానికి ఒకట్రెండు సినిమాలు చేసినా క్వాలిటీతో చేయాలనుకుంటున్నాం. ఉపేంద్ర మాధవ్ మొదటి నుంచి టచ్‌లోనే ఉన్నాడు. కల్యాణ్ రామ్‌తో ఎప్పటినుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఇలా కుదిరింది. కల్యాణ్ రామ్‌గారు గోల్డ్. ఈ సినిమాలో ఆయన చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు, మేకోవర్ చాలా బావుందని ఫీడ్‌బ్యాక్ వస్తోంది. సినిమా కథలో కచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం. కేవలం డబ్బు పెడితే సరిపోతుంది అనుకోకుండా సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. నెక్ట్స్‘అల్లరి’ నరేష్ – భీమనేని శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్నాం. ఇందులో సునీల్ పుల్ లెంగ్త్ ఫ్రెండ్ రోల్ చేస్తున్నారు’’ అన్నారు. కిరణ్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నేను మైనింగ్ బిజినెస్ చేసేవాణ్ణి. ‘ఎం.ఎల్.ఎ’ సినిమా కొన్న బయర్స్ అందరూ సేఫ్. సోమవారం నుంచి ఓవర్ ఫ్లోస్‌లో ఉన్నాం. రెవెన్యూపరంగా శాటిలైట్ 7 కోట్లు వచ్చింది. తెలుగు రైట్స్ 4.5, హిందీ డబ్బింగ్ రైట్స్ 2.5 కోట్ల బిజినెస్ జరిగింది. రివ్యూలు బాలేకపోయినా ఆడియెన్స్ ఇచ్చిన తీర్పు వేరేలా ఉంది. సినిమాల ద్వారా ఏ నిర్మాతలకైనా కావల్సింది పేరు, డబ్బు. అవి ఈ సినిమాతో వచ్చింది చాలా హ్యాపీ. త్వరలోనే ఉపేంద్ర మాధవ్‌తో మా బ్యానర్లో మరో సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. -
ఎన్నారై పాత్రలో కాజల్..!
2017లో వరుస విజయాలతో సత్తా చాటిన కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం తన తొలి చిత్ర కథనాయకుడు కళ్యాణ్ రామ్ సరసన నటిస్తోంది. దాదాపు 10 ఏళ్ల తరువాత మరోసారి కళ్యాణ్ రామ్ సరసన ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ ఎన్నారై అమ్మాయిగా కనిపించనుందట. ఓ బిలియనీర్ కూతురైన కాజల్ ఇండియాకు ఎందుకు వచ్చింది అన్నదే సినిమాలో మెయిన్ పాయింట్ అన్న ప్రచారం జరుగుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందిస్తున్నారు. -
‘క్రీడలు జీవితంలో భాగం కావాలి’
సాక్షి, హైదరాబాద్: మానసిక ఎదుగుదలకు, వికాసానికి విద్య ఎంత అవసరమో... శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడల ద్వారా లభించే వ్యాయామమూ అంతే అవసరమని జాతీయ మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి.కిరణ్‌రెడ్డి అన్నారు. విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వార్షికోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని కోరారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఆటల ద్వారా చైతన్యవంతం చేస్తే, వారు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుతారన్నారు. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని లక్ష్యసాధన దిశగా అడుగులు వేసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, సినీ గీత రచయిత అనంత శ్రీరామ్, వీజేఐటీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ పద్మజ పాల్గొన్నారు. -
పైసలన్నీ గజ్వేల్‌కేనా..!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మంత్రిగారూ..! వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నిధులన్నీ కడపకే పట్టుకపోతున్నడని మీరు గోలగోలజేస్తిరి, కిరణ్‌రెడ్డి కూడా పీలేరునే అభివృద్ధి జేసుకుంటన్నడని నిలదీస్తిరీ... ఇప్పుడు అదే పరిస్థితి మాకు ఎదురైతంది సార్.. సీఎం కేసీఆర్ సార్ నిధులన్నీ గజ్వేల్కే మళ్లిస్తున్నడు, మా జిల్లా బిడ్డా సీఎం అయ్యాడని మేం అంతా సంతోష పడ్డాం. నిధులన్నీ సొంత నియోజకవర్గానికే కాకుండా మాకూ మంజూరు చేయండి సార్’ అని జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్, మంత్రి హరీష్‌రావును జెడ్పీ సమావేశంలో అడిగారు. గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఇటీవల రూ.25 కోట్లు నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రి నోటి వెంట ఏమని సమాధానం వస్తుందోనని సభ్యులంతా ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ, హరీష్‌రావు మాత్రం దానిపై ఏమీ మాట్లాడకుండా తెలివిగా సభ్యుల దృష్టిని మరో అంశం వైపు మళ్లించారు. ప్రభుత్వశాఖల పరిధుల పునర్విభజన: హరీష్ జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు వీలుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖలు, పోలీసు శాఖల పరిధులను పునర్విభజన చేస్తామని మంత్రి హరీష్ తెలిపారు. శుక్రవారం ‘మనజిల్లా-మన ప్రణాళిక’ పై జెడ్పీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వారం రోజుల్లో అన్నిశాఖల జిల్లా అధికారులు తమ శాఖల పరిధుల పునర్విభజన ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్, పోలీసుశాఖ, విద్యాశాఖ, విద్యుత్ ఇలా పలు శాఖల పరిధులు సరిగా లేవన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే పరిధిలో నలుగురు డీఎస్పీలు ఉంటే, అందోలు నియోజకవర్గం నలుగురు ఇరిగేషన్ డీఈల పరిధిలోకి వస్తుందన్నారు. తద్వారా పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వశాఖ పరిధులు పునర్విభజన చేయనున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్, గజ్వేల్‌లలో డిప్యూటీ డీఈఓ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగును అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు హరీష్‌రావు ప్రకటించారు. పాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో అన్ని నియోజకవర్గాల పరిధిలో సాధ్యమైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు తాను వ్యక్తిగతంగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో ఓ చెరువును ఎంపిక చేసి పూడికతీత పనులు చేపడతామన్నారు. బొడ్మట్‌పల్లి నుంచి బీదర్ వరకు రూ.125 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులతో భూములు కోల్పోయే వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి: డిప్యూటీ స్పీకర్ మెదక్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మనజిల్లా-మనప్రణాళికలో భాగంగా జిల్లాను యూనిట్‌గా తీసుకుని సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. మంబోజిపల్లిలోని ఎన్డీఎస్ఎల్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. నారింజ ప్రాజెక్టు పనులు చేపట్టండి: గీతారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నారింజవాగు, కొత్తూరు ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గీతారెడ్డి కోరారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ పనుల విషయంలో అన్యాయం జరిగిన వాట వాస్తవమేనన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోందని ఈ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. మంబోజపల్లిలోని ఎన్డీఎస్ఎల్ చెరుకు ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో భారీ, మద్యతరహా నీటి ప్రాజెక్టు లేనందున మైనర్ ఇరిగేషన్ పనులకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని కోరారు. నీటిపారుదలలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి హరీష్‌రావును కోరారు. పెద్దశంకరంపేట మండలంలోని బుజరాన్పల్లి పెద్దచెరువు ప నులు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి హ రీష్‌రావు సుముఖత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రామలి ంగారెడ్డి మాట్లాడుతూ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప నుల్లో భాగంగా తొగుట గ్రామంలో ఆరు గ్రామాలు మునిగిపోనున్నాయని, భూ నిర్వాసితులను ఆదుకోవాలని మంత్రి హరీష్‌రావును కోరారు. దీనిపై హరీష్‌రావు స్పందిస్తూ ప్రాణహిత ప్రాజెక్టులో తక్కువ గ్రా మాలకు నష్టం జరుగుతుందని, భూ నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. స మావేశంలో ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఇ న్చార్జి కలెక్టర్ శరత్, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. మాసాయిపేట దుర్ఘటన మృతులకు జెడ్పీ నివాళి మాసాయిపేట వద్ద చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారులకు జెడ్పీ సమావేశంలో ప్రత్యేకంగా నివాళులర్పించారు. మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి హరీష్‌రావు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఇన్చార్జి కలెక్టర్ శరత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
కిరణ్ కొత్త పార్టీ
-
సీఎం చెప్పిన దానిలో కొత్త అంశమేమీ లేదు:దిగ్విజయ్
-
సీఎం కిరణ్‌కు సమైక్యత పై చిత్తశుధిలేదు-నాగేశ్వర్
-
'సీఎంగా ఉండటం దురదృష్టం'
-
'పేదల ఇళ్లల్లో.. మా ఫొటో ఉండేలా పరిపాలిస్తా'
-
రూమర్ విన్నారా...!
-
చివరి బంతి ఎప్పుడో కిరణ్‌కు బాగా తెలుసు
-
సిఎం కిరణ్ సారొస్తారొస్తారా..... సాంగ్
-
నేతలు ఏమన్నారంటే..
హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం అమలు చేస్తారు సీమాంధ్ర ప్రజాప్రతినిధిగా కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదాన్ని విన్పిస్తున్నాడు. అయితే సీఎంగా కచ్చితంగా హైకమాండ్ తీసుకున్న విభజన నిర్ణయాన్ని అమలు చేస్తాడు. అందులో సందేహం లేదు. గతంలో పశ్చిమబెంగాల్లో సుబ్రతోముఖర్జీ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఉంటూనే హోంమంత్రిగా కొనసాగారు. అప్పట్లో కోల్‌కతాలో ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఆయన హోంమంత్రిగా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసేవాడు. ఎన్ఎస్యూఐకి మాత్రం ఆ నాయకుల ద్వారా దరఖాస్తు చేయించి అనుమతించేవాడు. కిరణ్ కూడా అదే పని చేస్తున్నాడు. - పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సీఎం డూప్లికేట్ సమైక్యవాది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డూప్లికేట్ సమైక్యవాది. కాంగ్రెస్ విభజన ఆలోచన చేసినప్పటినుంచి బిల్లు ఆమోదం పొందేవరకు ప్రతి ప్రక్రియ ఆయనకు తెలిసే జరుగుతున్నాయి. అయినా సమైక్యాంధ్రకోసం పోరాడుతున్నట్లు చెప్పుకొనేందుకు సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు. సీఎంకు సమైక్యవాదం వినిపించాలనే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు ఏ దశలోనైనా పదవికి రాజీనామా చేసేవారు. కానీ అదేమీ చేయలేదు. సమైక్యవాదం అంటూనే విభజనకు సహకరిస్తున్నారు. విభజన చరిత్రాత్మక తప్పిదం. అందుకే ైవె ఎస్సార్సీపీ సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతోంది. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ఉండదు కాబట్టే సమైక్య తీర్మానం పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కాంగ్రెస్‌లో ఉంటే డిపాజిట్లూ రావని జేసీకి తెలుసు. ఇతర పార్టీల్లోకి వెళదామా? అనుకుంటే వైఎస్సార్సీపీ ఎప్పుడో తిరస్కరించింది. టీడీపీలోకైనా పోదామనుకుంటే పరిటాల సునీత ఒప్పుకోకపోవడంతో బాబూ వద్దన్నాడు. - వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, గడికోట, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి, బాలరాజు, సుచరిత, ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ నన్ను ముద్దాయిని చేసింది కాంగ్రెస్ పార్టీ నన్ను ముద్దాయిని చేసింది. కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న నాకు అన్యాయం చేసింది. ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగితే నాకు రాజకీయ భవిష్యత్తే ఉండదు. వైఎస్సార్సీపీలోనే చేరతా. - మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం అడ్డుకుంటారనేది అపోహే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుకుంటారన్నది అపోహే. అలాంటి పరిణామాలేవీ చోటుచేసుకోవు. ఉద్రిక్తతలకు తావిచ్చే ఇలాంటి అంశాలపై ప్రచారం జరిగినా మీడియా వాటికి అంత ప్రాధాన్యమివ్వరాదు. - మంత్రి శ్రీధర్‌బాబు త్వరలోనే రెండు పీసీసీలు రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగిసిన వెంటనే రెండు పీసీసీల ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా పీసీసీలను ఏర్పాటుచేసి ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. - మంత్రి పొన్నాల లక్ష్మయ్య విభజన జరిగినా కాంగ్రెస్‌లోనే కొనసాగుతా రాష్ట్ర విభజన జరిగినా నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. పార్టీని వీడేదిలేదు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరిగితే నా నియోజకవర్గ ప్రజల మనోభావాలను వెల్లడిస్తా. సమస్యలను చెబుతా. - మంత్రి మహీధర్‌రెడ్డి బిల్లును అడ్డుకోవాలనే కుట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉండేందుకు సీమాంధ్రులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీలో బిల్లును చర్చకు రాకుండా చేసే ఎత్తుగడకు పాల్పడుతున్నారు. - రాంరె డ్డి దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్ ఎమ్మెల్యే) టి.టీడీపీ నేతలు పార్టీని బహిష్కరించాలి తెలంగాణ వ్యతిరేకతను ప్రతి సందర్భంలోనూ బయటపెట్టుకుంటున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో కొనసాగుతున్న తెలంగాణ ప్రాంత నేతలు వెంటనే పార్టీ వీడాలి. ఆ పార్టీని తెలంగాణలో బహిష్కరించాలి. - కొప్పుల ఈశ్వర్, నల్లాల ఓదెలు (టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు) -
కిరణకు హైకమాండ్ తలంటిందా?!
-
డీజీపీగా దినేష్ రెడ్డి ను కొనసాగించలేము
-
దినేష్ రెడ్డి కొనసాగింపుపై క్యాట్‌లో వాదనలు
-
సీఎం, పీసిసి చీఫ్‌ల జోక్యంతో రాజీనామాలపై రాజీ
-
500 కోట్లతో ప్రభుత్వ పథకాల ప్రచారం
-
ఆడపిల్లల్ని చంపే హక్కు ఎవరిచ్చారు : సిఎం
-
ముందుకు మందు