పబ్లిక్ గార్డెన్స్‌లోని లలితకళాతోరణంలో బంగారుతల్లి పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇక రాష్ట్రంలో ఎవరూ ఆడపిల్ల పుట్టిందని బాధపడే పరిస్థితి ఉండదన్నారు. మగ పిల్లలతో పోల్చితే ఆడ పిల్లల శాతం తగ్గుతున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి ఈ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ పథకం ప్రకారం ఆడపిల్ల పుట్టినప్పటి నుండి గ్రాడ్యుయేషన్ అయిపోయేవరకు ప్రభుత్వం నుండి ఆమెకు ప్రభుత్వం తరపు నుండి సహాయం అందుతుంది. ప్రభుత్వం అందరి విద్యార్థులకు చెల్లించే స్కాలర్ షిప్తో సంబంధం లేకుండా అదనంగా ఈ డబ్భును అందించనుంది. ఈ పథకం తెల్ల కార్డులు వున్నవారందరికి మాత్రమే వర్తిస్తుంది. ఆడపిల్ల పుట్టగానే 2500 రూపాయలు, పాపకి 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు సంవత్సరానికి 1500 రూపాయలు, బడిలో చేరినప్పుడు 1000 రూపాయలు ఇస్తారు. 1 తరగతి నుండి 10 తరగతి వరకు సంవత్సరానికి రెండు వేల రూపాయల నుండి 3000 రూపాయల వరకు ఇస్తారు. ఇంటర్ నుండి డిగ్రీ వరకు ఏటా 3 నుండి 4 వేల రూపాయల వరకు ఇస్తారు. డిగ్రీ పూర్తిచేసిన అమ్మాయిలకు లక్ష రూపాయలు, ఇంటర్ తోనే చదువుని ఆపేస్తే వారికి 50 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ ఏడాది మే 1వ తేదీ తరువాత పుట్టిన ఆడ పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
Published Tue, Jul 2 2013 2:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
Advertisement